గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 14 August 2015

వైభవలక్ష్మీ పూజావిధానమువైభవలక్ష్మీ పూజావిధానము
(ప్రతి శుక్రవారం చేయదగిన వైభవలక్ష్మీ వ్రతం, కథ)
వైభవలక్ష్మీ భక్తులకు విశేషమైన గమనిక
వైభవలక్ష్మీ పూజావిధానం ప్రతిపుస్తకమును ఎనిమిదిమంది ముత్తైదువలకు దానం చేసిన యెడల పుత్రా పాత్ర సంపదవృద్ధి కలుగును.


ప్రవేశిక
శ్రీమన్నారాయణుడు జగన్నాథుడు. జగన్నాథుని శ్రీదేవి శ్రీమహాలక్ష్మీ. మహాలక్ష్మీ కటాక్ష వీక్షణాలు సర్వమానవ కోటికి శ్రీరామరక్ష. ఆమె జగన్మాత. ప్రకృతి స్వరూపిణి. వేదాలలో అతి ప్రాచీనమైనది. ఋగ్వేదం. ఋగ్వేద కాలనిర్ణయం సంక్లిష్ట సమస్య. ఏది ఏవైనా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఋగ్వేదం వెలుగులోనికి వచ్చింది. ఋగ్వేద కాలానికి పూర్వకాలంనుండి శ్రీమహాలక్ష్మీ అనేకులు పూజిస్తూ ధనకనక ధాన్య వస్తు వహానాదులనుపొంది సుఖప్రదమైన జీవితాన్ని గడుపుతూ వచ్చారని చెప్పడానికి ఆధారాలు అనేకం ఉన్నాయి.

ఈ పూజ ఒక ప్రాంతానికి పరిమితం కాదు. ఎవరైనా చేయదగిన అత్యద్భుత పూజ, సర్వులకూ ఆమోదమోగ్య మైనది. ఆచరింపదగినది. ఈ పూజను చేయడంలో స్త్రీ పురుష భేదం లేదు. వయః పరిమితి లేదు. ఈ పూజ సర్వకాలికం. సార్వజనీనం. పురుషుని కంటే స్త్రీ కరుణామయి. జగన్నాటక సూత్రధారియైన శ్రీమన్నారాయణుని మెప్పించి కరుణాకటాక్షలను పొందడం అంత సులభసాధ్యం కాదు. కాని ఆ మహాత్ముని హృదయోల్లాసినీ, జగన్మాతా, కరుణామయీ అయిన శ్రీలక్ష్మీ దేవిని పూజించి, ఆమెను మెప్పించి, దయాదాక్షిణ్యాలను పొంది ధనధాన్యాదులను పొందడం సులభసాధ్యం. ఆమెకు దాసులమై భక్తి ప్రపత్తులతో శరణు వేడినట్లయితే తప్పాకుండా సంపదలు దరిచేరతాయి.

ప్రాచీన పురాణోక్తాలైన పూజావిధానాలను యథాతథంగా అనుసరించి ఆచరించడం కష్ట సాధ్యం. పురాణాలలో నిబంధించిన ఆచార వ్యవహారాలను, పూజాసామగ్రిని, స్థలనిర్దేశాన్ని పాటిస్తూ ఈ ఆధునిక యుగంలో పూజను సల్పడం అసాధ్యం. అందుకొరకే స్వల్పవ్యవధిలో స్వల్పవ్యయంతో, జరిగే పూజ మనకు కావాలి. అదే వైభవలక్ష్మీ పూజావిధానం.

వైభవలక్ష్మీ
లక్ష్మి అవతారాలు ఎనిమిది. ఈ అష్టలక్ష్మీ అవతారాలలో వైభవలక్ష్మి అవతారం ప్రత్యేకత కల్గినది. ఈ మహాలక్ష్మి చతుర్భుజరూపిణి. ఇరువైపులా ఎల్లవేళలా గజేంద్ర ద్వయము మహాలక్ష్మికి అభిషేకం చేస్తూఉంటాయి. భక్తి శ్రద్ధలకియ్యది ప్రతీక. ఊర్ద్వహస్త ద్వయంలో రక్తవర్ణ మృదుల కమలాలు. అధో భాగంలో గల
హస్త ద్వయంలో ఒకటి అభయహస్తం. రెండవది ఐశ్వర్య ప్రదాయకం. వైభవాన్ని కలుగజేసే తల్లి కావుననే వైభవలక్ష్మి అని ఈమె ప్రఖ్యాతి గాంచింది. విభవమనగా ఐశ్వర్యం కదా. ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని భారతదేశంలో అనేక ప్రాంతాలలో కొన్ని వందల సంవత్సరాలనుండి ఆచరిస్తూ ధన వస్తు వాహనాదులను సుఖసంతోషాలను పొందుతున్నారు.

ఈ వ్రత నియమాలలో మంత్ర తంత్రాలు ఏమి లేవు. భక్తి శ్రద్ధలే మంత్ర తంత్రాలు. ఈ వ్రతం మూలంగా మీరు సాధించలేని దంటూ ఏమి ఉండదు. స్వర్ణ, రజత, తామ్రాది లోహాలతో దేనితోనైనా చేసిన ఒక పాత్రను శుభ్రపరచి, చుట్టూ పసుపు రాసి, నాలుగు వైపులా కుంకుమ బొట్టులుపెట్టి, అందులో నీళ్ళుపోసి నాలుగు వైపులా తమలపాకులు ఉంచాలి. ఇదే కలశం. ఈ కలశంలో మీ చెంతనున్న బంగారు, వెండి, వజ్ర, వైడూర్యాలను వేయాలి. ఆభరణాలేమి లేకపోతే కలశంలో మీ చెంతనున్న బంగారు, వెండి, వజ్ర, వైడూర్యాలను వేయాలి. ఆభారనాలేమి లేకపోతే కలశంలో రెండు పసుపుకొమ్ములను వేసి అయినా పూజా చేయవచ్చును. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని సర్వసంపదలను పొంది సుఖప్రదమైన జీవితాన్ని కొనసాగించవలసిందిగా మనవి.

పూజ - కొన్ని ముఖ్య విశేషాలు
1 . పూజను చేయడంలో ఆడా, మగా, చిన్నా, పెద్దా భేదాలు లేవు. అందరూ చేయదగినది.
2 . వివాహితులైన స్త్రీలకు సౌభాగ్య ప్రదమైనది.
3 . అవివాహితలైన స్త్రీలు వైభవలక్ష్మి పూజిస్తే సద్గుణ సంపన్నులు, ధనసంపన్నులు అయిన భర్తలను అతి త్వరలో పొందుతారు.
4 . ఇంటిల్లిపాదీ సామూహికంగా కలశం ముందు కూర్చొని వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇందు మూలాన ఫలితం రెట్టింపౌతుంది.
5 . ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో ఈ వ్రతాన్ని ఆచరించడం సర్వోత్తమం. ఈ సమయం కుదరకపోయినచో సమయానుకూలంగా చేసుకోవచ్చు.
6 . ఇంటి యజమాని చేసినట్లైన ధన, కనక, వస్తు వాహనాదులను పొంది సుఖప్రదమైన వైభవోపేతమైన జీవితాన్ని కొనసాగిస్తాడు.
7 . వైభవలక్ష్మి పటాన్ని కలశానికి వెనుక భాగంలో ఉంచాలి.
8 . లక్ష్మి స్తోత్రాన్ని మాత్రం ప్రతిదినం ప్రాతః కాలంలో పటించడం మంచిది.
9 . ఈ వ్రతాన్ని ఆచరించే సమయంలో వైభవలక్ష్మి పై భక్తి, శ్రద్ధలు తప్ప మరి ఏ ఇతర ఆలోచనలూ ఉండకూడదు. ఆ విధంగా ఆలోచనలుండిన ఫలితం దక్కదు.

ముఖ్యసూచన: వైభవలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించిన అనంతరం నాల్గవ లేక ఆరవ లేక ఎనిమిదవ శుక్రవారం సంధ్యాసమయంలో ఈ గ్రంథప్రతులను పూజించి ఎనిమిది మంది ముత్తైదువులకు యథాశక్తి దక్షిణ, తాంబూలాలను, ఒకొక్కరికి ఎనిమిది గాజులు యిచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. ఇందు మూలాన 64 ముత్తైదువులను పూజించిన ఫలితం లభిస్తుంది.

ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో పటించవలసిన శ్లోకం :
యారక్తాంబుజవాసినీ విలసినీ చండాంశు తేజస్వినీ
ఆరక్తారుధి రాంబరా హరి సఖీ యా శ్రీర్మనో హ్లాదినీ
యా రత్నాకర మంథనాత్ ప్రఘటి తా విష్ణోశ్చ యా గేహినీ
సామం పాతు మనోర రామా భగవతీ లక్ష్మీశ్చ పద్మాలయా
తా: రక్త వర్ణ కమల పుష్పము శోభిల్లుతూ ఆసీసురాలైన వైభవలక్ష్మి, కోటిసూర్య కిరణకాంతులతో ప్రకాశిస్తూ ఎర్రని వర్ణము గలా వస్త్రాలను ధరించిన శ్రీమన్నారాయణుని హృదయనివాసిని, సముద్రాన్ని మథించే సమయంలో ఉద్భవించిన మహావిష్ణువుకు పత్ని అయిన లక్ష్మిదేవి సదా నన్ను రక్షించుగాక.

పూజావిధానం:
శ్రీ గురుభ్యో నమః హరి: ఓం
శ్రీ వైభవలక్ష్మీ నమః లక్ష్మీ నారాయణాభ్యాం నమః (అని చెప్పవలెను)
ఆచమనం:
ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః
(అని మూడు పర్యాయాలు ఉద్ధరిణితో కుడుచేతిలో నీళ్ళు పోసుకొని సేవించాలి.)

నామస్మరణ:
" ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
" విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
" ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
"ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
" ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి
ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .

ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ
మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి ,వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను .

శ్రీ గురుభ్యో నమః శ్రీ మన్మహాగణాధిపతయే నమః కులదేవతాయై నమః ఇష్ట దైవతాభ్యో నమః
అవిఘ్నమస్తు - శ్రీరస్తు - శుభమస్తు - శాంతిరస్తు.
(లక్ష్మీ దేవి మీద, కలశం మీదా అక్షతలు వేసి గంట మ్రోగించాలి)

ప్రార్ధన:
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
నమస్తేస్తు మహామాయే శ్రీపీటే సురపూజితే
శంకచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
(పూలు అక్షతలు వైభవలక్ష్మి పటంమీద, కలశం మీదా వేయాలి)

సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ), కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ), సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిదౌ అస్మిన్ వర్తమానేవ్యావహారిక చాంద్రమానేన .......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే , సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము, దక్షిణాయనము . జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము , జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )...........ఋతు : (వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు ) .......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీవైభవలక్ష్మి ముద్దిశ్య శ్రీ వైభవలక్ష్మి ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య ,నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః ,గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ ,అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకుని ) దేవతా ముద్దిశ్య, శ్రీ.......... దేవతా పీత్యర్ధం సంభవ ద్భిరుపచారై: సంభవతానియమేన సంభవతాప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో ,నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా ,భక్తి శ్రద్దలతో సమర్పించు కుంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే .

గణపతి పూజ
అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం శ్రీ మన్మహాగణపతి పూజాం కరిష్యే
(ముకుళిత హస్తాలతో విఘ్నేశ్వరునకు నమస్కరించాలి)
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా;
(అని చెప్పి అక్షతలుంచ వలెను)
(ప్రతి ఉపచారమునకు ముందు శ్రీమహాగణపతి పతయే నమః అని చెప్పవలెను)

శ్రీ మహాగణాదిపతయే నమః ధ్యాయామి - ఆవాహయామి - నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి; పాదయోపాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి; ముఖే ఆచమనీయం సమర్పయామి; స్నపయామి; వస్త్రయుగ్మం సమర్పయామి; యజ్ఞోపవీతం సమర్పయామి; గంధం పరికల్పయామి; పుష్పాణి పూజయామి; దూపమాఘ్రాప యామి, దీపం దర్శయామి, దూపదీపానంతరం ఆచమమనీయం సమర్పయామి; నైవేద్యం సమర్పయామి; తాంబూలం సమర్పయామి; నీరాజనం దర్శయామి; ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి (అక్షతలు నీళ్ళు చేతిలో పోసుకొని) అనయాధ్యానా వాహనాది షోడశోపచార పూజయా శ్రీమహాగణాదిపతి స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు (అని నీటిని పళ్ళెములో వదలవలెను) శ్రీ మహాగానాధిపతి ప్రసాదం శిరసా గృహ్నామి (అని పూజ చేసిన అక్షతలు పుష్పములు తలపై ధరించ వలెను.)

అథ వైభవలక్ష్మి పూజాం గత్వేన కలశారధానం కరిష్యే |
కలశం గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య - కలశో పరి హస్తం నిధాయ
శ్లో || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతా:
ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే , గోదావరి , సరస్వతి ,నర్మదా సింధు
కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.||
ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ మహా గణపతి (ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను ) పూజార్ధం మమ దురిత క్షయ కారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి ) , ఓం ఆత్మానం సంప్రోక్ష్యా అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని , ఆకుతో గాని చల్లాలి .

శ్రీ వైభవలక్ష్మి పూజా ప్రారంభః
శ్లో || పద్మా సనే పద్మకరే సర్వ లోకైక పూజితా
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా
క్షీరో దార్ణ వసంభూతే కమలే కమలాలయే

సుస్థి రాభ వమే గేహే సురాసుర నమస్క్రతే ||
శ్రీ వైభవలక్ష్మి దేవతాం ధ్యాయామి

శ్లో || సర్వమంగళ మాజ్గల్యే విష్ణువక్ష సధ లాలయే,
ఆవాహయామి దేవీత్యాం సుప్రీతా భవ సర్వదా,
శ్రీ వైభవలక్ష్మి దేవతా ఆవాహయామి

శ్లో || సూర్యాయుత నిభస్పూర్తే స్పురద్రత్న విభూషితే
సింహాసన మిదం దేవీ స్వీయతాం సుర పూజితే
శ్రీ వైభవలక్ష్మి దేవతాయై నమః రత్నసింహీసనం సమర్పయామి.

శ్లో || శుద్దోద కంచ వాత్ర స్థంగన్ద పుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి.
శ్రీ వైభవలక్ష్మి దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి.

శ్లో || సువాసిత జలం రమ్యం సర్వతీర్ధ సముద్భవం,
శ్రీ వైభవలక్ష్మి దేవతాయై నమః పాద్యం సమర్పయామి.

శ్లో || సువర్ణ కలశానీ తం చంద నాగరు సంయుతం
గృహేణాచ మనం దేవీ మయాదత్తం శుభ ప్రదే,
శ్రీ వైభవలక్ష్మి దేవతాయై నమః ఆచ మనీయం సమర్పయామి

శ్లో || పయోదధి ఘ్రతో పేతర శర్కరా మధు సంయుతం
పంచా మృత స్నాన మిదం గృహాణీ కమలాలయే
శ్రీ వైభవలక్ష్మి దేవతాయై నమః పంచా మృత స్నానం సమర్పయామి.

శ్లో || గంగాజలం మయానీతం మహాదేవ శిరః స్థితః
శుద్దో దక స్నాన మిదం గృహాణ విధు సోదరీ,
శ్రీ వైభవలక్ష్మి దేవతాయైనమః స్నానం సమర్పయామి.
శ్రీ వైభవలక్ష్మి దేవతాయైనమః శుద్దో దక స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి.
శ్లో || సురార్చి తాంఘ్రిగ యుగళే దూకూలవ సన ప్రియే
వస్త్ర యుగ్మం ప్రదాస్వామి గృహణ హరివల్ల భె
శ్రీ వైభవలక్ష్మి దేవతా యైనమః వస్త్ర యుగ్మం సమర్పయామి

శ్లో || కేయూర కంకణైర్ధ వ్యైర్షార నూపుర మేఖలాః
విభూషణానద్య మూల్యాని గృహాణ ఋషి పూజితే
శ్రీ వైభవలక్ష్మి దేవతా యైనమః ఆభరణాని సమర్పయామి.

శ్లో || హేతప్త మకృతం దేవీ బ్రహ్మవిష్ణు శివకృతం
ఉపవీత మిదం గృహాణత్వం శుభ ప్రదే
శ్రీ వైభవలక్ష్మి దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి.

శ్లో || కర్పూరాగ రుక స్తూరీ రోచ నాది భిరన్వితం,
గగ ధందాస్యామ్య వాందేవీ ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్
శ్రీ వైభవలక్ష్మి దేవతాయై నమః గంధాన్దార యామి.

శ్లో || అక్ష తాన్ ధవళాన్ ది వ్యాన్ శాలీ యంస్తండులాన్ శుభాన్
హరిద్రా కుంకు మోసేతాన్ గృహాయాబ్ది సుపుత్రికే
శ్రీ వైభవలక్ష్మి దేవతా యైనమః అక్ష తాన్ సమర్పయామి,

శ్లో || మల్లికా జాజికుసు మైశ్చంపకైర్వకుల్తే రపి,
శత పత్రైశ్చజకల్షారై: పూజయామి నారి ప్రియే
శ్రీ వైభవలక్ష్మి దేవతాయై నమః పుష్పాణి పూజయామి.

శ్రీ వైభవలక్ష్మి అష్టోత్తర శతనామావళి:

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహిత ప్రదాయై నమః

ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలాయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మక్ష్యై నమః
ఓం పద్మ సుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమఃఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం సుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్త్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై ది నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుద్ద్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోఖాయై నమఃఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం సుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్త్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై ది నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుద్ద్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోఖాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలాయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మక్ష్యై నమః
ఓం పద్మ సుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం సివకర్త్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయ నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్త్యై నమః
ఓం సిద్ద్యై నమః
ఓం స్త్ర్యైణ సౌమ్యాయై నమః
ఓం సుభప్రదాయై నమః
ఓం నృపవేశ్యగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్యద్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఇతి వైభవలక్ష్మి అష్టోత్తర శతనామ పూజా సమర్పయామి.

ధూపః
వనస్పర్తి రసోద్భూతో గంధాడ్యో గంధ ఉత్తమః
ఆఘ్రేయ స్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్
శ్రీ వైభవలక్ష్మి నమః దూపమాఘ్రాపయామి
(సుగంధ ధూపాన్ని వేయాలి.)

దీపః
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మగళం దీపం త్ర్యైలోక్య తిమిరాపహమ్ ||

శ్రీ వైభవలక్ష్మి నమః దీపం దర్శయామి.

నైవేద్యం
షడ్ర సోపేత రుచిరం దదిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే ||
శ్రీ వైభవలక్ష్మి నమః నైవేద్యం సమర్పయామి.
(చేసినటువంటి వంటకాలపైన ఉద్ధరిణితో కలశోదకాన్ని ప్రోక్షించి ఆహార పదార్ధాలు దేవికి నివేదించాలి).

తాంబూలమ్
పూగీ ఫలైశ్చ కర్పూరై : నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ వైభవలక్ష్మి నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యా మ్యహం దేవి గృహ్యాతాం విష్ణువల్లభే
శ్రీ వైభవలక్ష్మి నమః నీరాజనం దర్శయామి.
(కర్పూర హారతి చేయాలి)

ఆరతి పాట
ఆరతు లివిగో నమ్మ వైభవలక్ష్మి
మమ్మేలు మాతల్లి మంగళ రూపిణీ
పాల సంద్రములోన వెలసిన శ్రీలక్ష్మి
మంజుల భాషిణి శీమన్మహాలక్ష్మి
విద్యాప్రదాయిని విలసిత హృదయాని
దారిద్ర్య దూరిణి ధన ప్రదాయినీ
అజ్ఞాన తిమిర యు నణచేటి ఆదిలక్ష్మి
ఆరతు లివిగో అందుకొనవమ్మా !
ఆది పరాశక్తి అఖిలాండేశ్వరీ
ఆగమరూపిణి అభయ ప్రదాయిని
దానవ శిక్షిణి మానవ రక్షిణి
స్త్రీ జన రక్షిణి శ్రీమహాలక్ష్మి
మము బ్రోవు మమ్మ మహాలక్ష్మి
సిరి సంపదల నొసగనమ్మ శ్రీలక్ష్మి
భోగభాగ్యాల నీయనమ్మ భూలక్ష్మి
మమతల పెంచమమ్మ మమ్మేలు మాలక్ష్మి !

మంత్ర పుష్పం
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్ర్యైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్
శుద్ధ లక్ష్మీ ర్మోక్షలక్ష్మి ర్జయలక్ష్మి: సరస్వతీ
శ్రీలక్ష్మి ర్వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి! నారాయణి నమోస్తుతే ||
శ్రీ వైభవలక్ష్మి నమః మంత్రపుష్పం సమర్పయామి
(అక్షతలను దేవిపాదముల వద్ద ఉంచవలెను.)
(అవసరమైతే పునః పూజ చేసికొనవచ్చును )

పునః పూజా
సరసిజనయనే సరోజహస్తే నళినదళాంశుక గంధ మాల్య సేవే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్
కర్పూర నీరాజనం - ఆచమనం - పునః పూజాం సమర్పయామి.
పూర్ణ ఫలప్రసాదం సమర్పయామి
(కొబ్బరి కాయను పగులగొట్టి దేవికి నైవేద్యం పెట్టవలెను.)

ప్రదక్షిణ నమస్కారాః
యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ

తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం పాపకర్మా హం పాపాత్మా పాప సంభవః
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి !
నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే
పాహి మాం భక్త వరదే శ్రీ వైభవలక్ష్మి ర్నమోనమః
శ్రీ వైభావలక్ష్మై నమః నమస్కారాన్ సమర్పయామి
(అని చెప్పి సాష్టాంగ దండ ప్రణామం కావించాలి).

పూజా సమర్పణమ్
(అరచేతిలో జలం ఉంచుకొని)
యస్త స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాది షు
న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం హరిప్రియే
యత్కృతం తు మాయాదేవి పరిపూర్ణం తదస్తుతే
(అని చెప్పి పళ్ళెంలో నీళ్ళను వదలాలి.)
అనేక యథాశక్తి పూజనేన లక్ష్మీ నారాయణ ప్రసాద
సిద్ధిరస్తు - శ్రీవైభవలక్ష్మి ప్రసాద ప్రాప్తిరస్తు - తుష్టి రస్తు
శాంతిరస్తు - పుష్టి రస్తు - శ్రీరస్తు - శుభమస్తు
పూజావిధానం సంపూర్ణమ్ -

వాయన దానం
దేవి దేహి పరం జ్ఞానం దేహి పరం సుఖం
దానం దేహి యశో దేహి ప్రసీద హరివల్లభే
అని పటిస్తూ ముత్తైదువులకు పసుపు, కుంకుమ, దక్షిణా సమేతంగా పుస్తకం కూడా పళ్ళెంలో పెట్టి దానం చేసిన సిరి సంపదలు చేకూరుతాయి.

వైభవలక్ష్మి వర్ణన:
ప్రకృతి మాతా, జగన్మాత, ఆదిలక్ష్మి, మహామాత, బ్రహ్మాది దేవతలచే పూజింపబడుచున్నది. వికసిత పద్మాసనయై, తన పైరెండు హస్తములలో మనోహరమైన ఎర్రని తామర పుష్పాలను ధరించినది అధో భాగమున రెండు హస్తములలో ఒక హస్తము ధనము, మరో హస్తమున అభయముద్రా కలిగియున్నది. అట్టి వైభవలక్ష్మికి నమస్కరిస్తున్నాను. సర్వలోకరక్షణీ, సర్వజ్ఞాన ప్రదాయినీ, సకల సంపద్బ్రదాయినీ, సద్బద్ది ప్రదాయినీ, మంత్రసిద్ధి ప్రదాయినీ, యోగశక్తి ప్రదాయినీ దయామయీ, విష్ణు వక్షః స్థల స్థాయినీ అయిన వైభవలక్ష్మికి నమస్కరిస్తున్నాను. శ్రీ హరి హృదయనివాసిని, క్షీర సముద్ర రాజతనయా, శ్రీరంగా ధామేశ్వరీ, సహస్రకోటి ద్యుల్లతా సమతేజస్విని, శ్వేతవస్త్రధారిణీ, శ్వేత పుష్పాలంకృత సద్గుణా అయిన భాగ్యలక్ష్మికి శతకోటి వందనాలు అర్పిస్తున్నాను.

వైభవలక్ష్మి పూజాకథ
వైభవలక్ష్మి రామా, విద్యా, హరివల్లభా, లక్ష్మీ, క్షీర సముద్ర రాజతనయా, సంపత్ప్రదాయినీ, శ్రీ చక్ర వాసినీ, యోగినీ, మహాప్రక్రుతి స్వరూపిణీ, జగద్రక్షణీ మున్నుగాగల నామములతో వర్ణింపబడినది. శ్రీ సూక్తమున (శ్రీమన్మహా) వైభవలక్ష్మి హిరణ్య హరిణి, సువర్ణ రజత స్రజా అని పేర్కొనబడినది.

లక్ష్మి స్తోత్రమ్
శ్రీమన్మ హాలక్ష్మ్యై నమః
బ్రాహ్మీంచ వైష్ణవీ భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖాం
త్రినేత్రాం చ త్రిశూలం చ పద్మ చక్ర గదాధరామ్
ప్రథమే త్ర్యంబకాగౌరీ ద్వితీయే వైష్ణవీ తథా
తృతీయే కమలాప్రోక్తా, చతుర్దే లోకసుందరీ
పంచమే విష్ణుపత్నీచ, షష్టే చ వైష్ణవీ తథా
సప్తమే చ వరారోహా అష్టమే వరదాయినీ

లక్ష్మీ అష్టకమ్
నమస్తేస్తు మహామాయే - శ్రీ పీటే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తే - మహాలక్ష్మీ ర్నమోస్తుతే. 1

నమస్తే గరుడా రూషడే - డోలా సుర భయంకరి
సర్వ పాప హరే దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే. 2
సర్వజ్ఞే సర్వ వరదే - సర్వ దుష్ట భయంకరి
సర్వ దుఃఖ హరే దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే. 3

సిద్ది బుద్ధి ప్రదే దేవి -భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్ర మూర్తే సదా దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే. 4

ఆద్యంత రహితే దేవి - ఆది శక్తే మహేశ్వరి
యోగజ్ఞే యోగ సంభూతే - మహాలక్ష్మీ ర్నమోస్తుతే. 5

స్థూల సూక్ష్మే మహా రౌద్రే - మహా శక్తే మహొధరే
మహా పాప హరే దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే. 6

పద్మాసన స్థితే దేవి - పర బ్రహ్మ స్వరూపిణి
పరమేశి జగన్మాతర్ - మహాలక్ష్మీ ర్నమోస్తుతే. 7

శ్వేతాంబర ధరే దేవి - నానాలంకార భూషితే
జగత్స్థితే జగన్మాతర్ - మహాలక్ష్మీ ర్నమోస్తుతే. 8

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం - యః పటే ద్బక్తి మాన్నరః
సర్వ సిద్ధి మావాప్నోతి - రాజ్యం ప్రాప్నోతి సర్వదా. 9

ఏక కాలే పటే న్నిత్యం - మహా పాప వినాశనం
ద్వికాలం యః పటే న్నిత్యం - ధన ధాన్య సమన్వితః 10

త్రికాలం యః పటే న్నిత్యం - మహా శత్రు వినాశనం
మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం - ప్రసన్నా వరదా శుభా. 11
మహాలక్ష్మి ర్భవే న్నిత్యం సర్వదా వరదా శుభా
ఇతి ఇంద్రకృత శ్రీమహాలక్ష్మ్యాష్టక స్తవః సంపూర్ణం
దేవిదేహి ధనందేహి దేవిదేహి యశోమయి
కీర్తిం దేహి సుఖం దేహి ప్రసీద హరివల్లభే

శ్రీలక్ష్మి నారాయణ ప్రసాద సిద్ధిరస్తు
మనోభీష్ట ఫల సిద్ధిరస్తు
శ్రీ వైభవలక్ష్మి ప్రసాద సిద్ధిరస్తు
భద్రం - శుభం - మంగళమ్

శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రమ్
ఆదిలక్ష్మీ
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |
జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ ||

ధాన్యలక్ష్మీ
అయికలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే |
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే ||
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ ||


ధైర్యలక్ష్మీ
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే |
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే ||
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ ||

గజలక్ష్మీ
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే |
రథగజతురగపదాదిసమావృత పరిజనమండిత లోకనుతే ||
హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారిణి పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ ||
విజయలక్ష్మీ
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే |
అనుదినమర్చిత కుంకుమధూసరభూషిత వాసిత వాద్యనుతే ||
కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్య పదే |
జయజయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ ||

విద్యాలక్ష్మీ
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే |
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే ||
నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే |
జయజయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ ||

ధనలక్ష్మీ
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే |
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే ||
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గప్రదర్శయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ ||

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML