గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 14 August 2015

రాయదుర్గం పట్టణానికి సమీపంలో ఉన్న చదం గ్రామానికి పక్కనే ఉన్న కొండలో వెలసిన శ్రీ పశుపతినాథుని దేవాలయం భారతదేశంలోనే మొట్టమొదటిగా చరిత్రకారులు చెబుతున్నారు

రాయదుర్గం పట్టణానికి సమీపంలో ఉన్న చదం గ్రామానికి పక్కనే ఉన్న కొండలో వెలసిన శ్రీ పశుపతినాథుని దేవాలయం భారతదేశంలోనే మొట్టమొదటిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయంలాంటి దేవాలయం మన దేశంలోనే మరెక్కడా లేదని నేపాల్‌ దేశంలో మాత్రం ఈ దేవాలయంలో ఉన్న లింగాల ప్రతిరూపాన్ని పోలిన విగ్రహం ఉందని చెబుతారు.

సద్యోజాతాయ నమః

వామదేవతాయ నమః

అఘోర దేవాయ నమః

ఈశాన్య దేవతాయ నమః

తత్పురుష దేవతాయ నమః

Sri Pasupathi Natha Swamy

అంటూ ప్రతినిత్యం వేలాది భక్తులు ఈశ్వరున్ని పూజిస్తారు. ఇది పశుపతినాథుని వర్ణన. ఈ పశుపతి నాథునికి లింగాల బండ అను పిలువబడే కొండ పైభాగాన సమతల ప్రాంతంలో పశుపతినాథుని ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో పశుపథినాథునికి ఒక ప్రత్యేకత వుంది. శివలింగానికి నాలుగు వైపులా పాణివాటాలు వుండటం ఇక్కడి విశేషం. శివుడు ఈశాన్యభిముఖుడై ఉండటం విశేషం. ఈ పాణివాటాలకు తూర్పు దిక్కున పార్వతిని చెక్కారు. గర్భగుడిలో 1984 సంవత్సరంలో కర్ణాటక నుండి తెచ్చిన కాశిమాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆలయం బయట చిన్న చిన్న గదులున్నాయి. ఈ ఆలయం దగ్గరలోనే గట్టి యల్లప్ప కొండ వుంది. ఈ ప్రాంతంలో బంగారు నాణేలు కూడా లభించాయి. లింగాల బండలో వున్న నందీశ్వరుని విగ్రహం కొందరు దొంగలు పెకలించి నిధుల కోసం అన్వేశించటానికి ప్రయత్నించినప్పుడు ఒక నాగసర్పం వారిని కాటువేసిందని ప్రతీతి. ద్వారానికి ఎడమవైపున శంకరాచార్యులు, కుడివైపున ఆయన శిష్యుల చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికీ చెక్కుచెదరని శివాలయం ఇదొక్కటేనని చెప్పవచ్చు. ఇటీవల కొండపై ఆలయం వరకు విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎంతో చారిత్రాత్మక, అరుదైన ఆలయం లింగాల బండపై ఉండటం రాయదుర్గం ప్రాంత వాసుల అదృష్టం. ప్రతి రోజు ఎంతో మంది సందర్శించే ఈ అరుదైన ఆలయాన్ని పరీక్షించి అభివృద్ది చేస్తే భావితరాల వారికి ఆదర్శంగా నిలుస్తుంది.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML