గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 2 August 2015

‘మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’..‘మీ రక్తాన్ని ధారపోయండి..
మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’..

(స్వతంత్ర భారత్ కీ జై !!!)


నేతాజీగా అందరూ పిలుచుకునే సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్యోద్యమ కాలంలో భారతీయులకు ఇచ్చిన పిలుపు ఇది. స్వాతంత్ర్య సమరయోధుల్లో ఆయన అగ్రగణ్యులు. ఆయన 1897 జనవరి 23న , ఒడిషా లోని కటక్ లో జన్మించారు.. విద్యాభ్యాసం అంతా కటక్లోని రావెన్షా కాలేజియేట్ స్కూల్ లోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజ్ లోను, ఫిట్జ్ విలియమ్ కాలేజ్ లోను, ఆపై కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లోను సాగింది.

1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుంచి బయటకు వచ్చి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనేందుకు నడుంబిగించారు సుభాష్ చంద్రబోస్. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించారు

ఓవైపు గాంధీజీలాంటి నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు.
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా, గాంధీ తో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశారు.

గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన.
ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డారు.

1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించారు. పెషావర్, బెర్లిన్, మాస్కో, జపాన్, సింగపూర్ దేశాలు తిరిగి ఎందరో రాజకీయ నాయకులను కలిసి, అక్కడున్న భారతీయులకు ఆంగ్ల పాలకుల అరాచకం గురించి వివరించి, వారిలో చైతన్యం కలిగించి 1943 అక్టోబర్ 21 నాటికి "ఆజాద్ హింద్" సంస్థను ప్రారంభించారు బోసు.
భారతదేశంలో బ్రిటీష్ వారి ప్రభుత్వాన్ని పడగొట్టి, స్వతంత్రదేశం ఏర్పాటు చేయాలనే కంకణం కట్టుకొని తన జీవితాన్నే పణంగాపెట్టి "అజాద్ హింద్ ఫౌజ్" స్ధాపించి, సైన్యాన్ని తయారుచేసి బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు.

18 ఆగస్టు, 1945 లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదం లో బోసు మరణించారని ప్రకటించినప్పటికి, ఆయన ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళారనే చర్చ చాలారోజులుగా కొనసాగుతూనే ఉంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML