
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Saturday, 8 August 2015
గాయత్రీ మంత్ర వైశిష్ట్యం
గాయత్రీ మంత్ర వైశిష్ట్యం
“మననాత్ త్రాయతే ఇతి మంత్ర:” - మననం చేస్తే రక్షించునది మంత్రం. అటువంటి మంత్రాలలో సర్వోత్తమ మంత్రం గాయత్రి మంత్రం గా చెప్పబడుతోంది.
గాయత్రి అనే పదము 'గయ' మరియు 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉన్నది. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీక్ మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీమద్రామాయణము రచించినారు.
“న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్” - గాయత్రిని మించిన దైవం కానీ మంత్రం కానీ లేదని ఋగ్వేదం ఘోషిస్తోంది. శైవమైనా, వైష్ణవమైనా, మరే శన్మతమైనా గయత్రి చేయ్యనిదే ఏ పూజకు, యజ్ఞానికీ అర్హుడు కాదు.
గాయత్రి మంత్రం లో 24 అక్షరాలకు ఒకొక్క నిర్దుష్ట ప్రయోజనం వుంది.
గాయత్రీ మూల మంత్రం:
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపలాంగదాం
శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే
సకల వేద స్వరూపం గాయత్రి దేవి !! ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖములతో , శంఖం ,చక్రం, గద, అంకుశం ధరించి వుంటుంది. ఈ పంచ రంగులు అమ్మవారిఈ పంచ ముఖాలకు ప్రతీకలు. ఆవిడ పంచ ముఖాలకు సంబంధించి కొన్ని వివరణలు:
౧. నాలుగు వేదాలు + పరమాత్మ
౨. పంచాయతన పూజకు సంబంధించి ( విష్ణు, శివ, శక్తి, సూర్య, గణేశ(బ్రహ్మ))
౩. పంచభూతాలకు అధిష్టాన దేవతలకు సంబంధం
౪. పంచ జ్ఞానేంద్రియాల ఆదిస్థాన దేవతలు
5. ఆత్మశుద్ధి, ద్రవ్యశుద్ధి, స్థానశుద్ధి, మంత్రంశుద్ధి, దేవ శుద్ధి కి ప్రతీకలు
6. సద్యోజాత, వామదేవ, తత్పురుష, ఈశాన, అఘోర రూపాలు.
ఆ ప్రతి ఒక్క అక్షర ప్రాశస్త్యం కింద ఇవ్వబడినబొమ్మలో ఇవ్వడమైనది
(దేవిభాగవతం లో నారదునికి నారాయణ మహర్షి వివరణలోనిది)
గాయత్రీ ప్రాశస్త్యం గురించి మన ఋషులేమన్నారో ఒకసారి అవధరించండి
• గాయత్రికి బ్రహ్మకు భేదం లేదు. —వ్యాస మహర్షి
• ముక్తిపొందుటకు గాయత్రిమంత్రం మూలకారణం. —శృంగి మహర్షి
• గాయత్రి మంత్రం జన్మమరణముల బంధం నుండి విముక్తి లభింప చేస్తుంది. —గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వా మిత్ర మహర్షి
• గాయత్రి మంత్రం పాపములను నశింపజేయును. —యాజ్ఞ వల్క్యుడు
• గాయత్రి మంత్రం బ్రహ్మను (పరమాత్మను) సాక్షాత్కరింప చేస్తుంది. —భరద్వాజుడు
• గాయత్రి మంత్రఉపాసన దీర్గాయువు కలిగించును. —చరకుడు
• గాయత్రి మంత్రజపం వలన దుర్మార్గుడు పవిత్రుడై (సన్మార్గుడు) పోవును. —వశిష్ట మహర్షి
• గాయత్రి వేదములకు మాత.ఈ జగత్తుకూ గాయత్రి మాతయే. —మహాదేవుడు
• గాయత్రి సర్వశ్రేష్టమైన మంత్రం. దీనినే గురుమంత్రమందురు. ప్రాచీనకాలం నుండి దీనిని ఆర్యులందరూ జపించుచూ వచ్చిరి. —దయానంద మహర్షి
గాయత్రీ గురించి వెయ్యినాలుకలున్న ఆదిషేశుడే వివరింపలేదు. మానవమాత్రులం మనమెంత.
వున్న ఛందస్సులలో గాయత్రి ఒక ఛందస్సు. గాయత్రి మంత్రానికి ఛందస్సుకు చాలా తేడా వుంది.
సర్వం శ్రీ వేంకటేశ్వర అర్పనమస్తు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment