గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 21 August 2015

మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను ... ప్రాధాన్యతను కలిగివుంది

మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను ... ప్రాధాన్యతను కలిగివుంది.శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే 'శ్రావణ మాసం'గా భావించబడుతోంది.ఈ మాసంలోనే శ్రీకృష్ణుడు, వామనుడు, హయగ్రీవుడు అవతరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఈ మాసం నారాయణుడికి ఎంత ఇష్టమో అర్థమవుతోంది. కార్తీకమాసం శివకేశవులకి ఎంత ఇష్టమైనదో, శ్రావణ మాసం లక్ష్మీపార్వతులకి అంత ప్రీతికరమైనది. సాధారణంగా శుక్రవారాన్ని ఎంతగానో ఇష్టపడేలక్ష్మీదేవి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుని మరింత ఇష్టపడుతుంది. వేంకటేశ్వరస్వామిది 'శ్రవణా నక్షత్రం' ... అందువలన ఈ మాసం అంటే అమ్మవారు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపుతుంది. శ్రావణ మాసంలో మంగళవారం ... శుక్రవారం ... పౌర్ణమి విశిష్టమైనవిగా చెబుతుంటారు.శ్రావణ సోమవారం రోజున చేసిన శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహర్షులు చెప్పడం జరిగింది. ఈ రోజున సాక్షాత్తు విష్ణు మూర్తి కూడా శివరాధాన చేస్తాడట. అందువలన ఈ రోజున పరమ శివుడిని భక్తితో అభిషేకించిన వారిని ఆయనతో పాటు విష్ణువు కూడా అనుగ్రహిస్తాడనిఅంటారు. ఇక అమ్మవారిని మంగళ గౌరీ అంటారు కనుక మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తూ 'శ్రావణ మంగళ వారం' నోము నోచుకుంటూ వుంటారు. తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోము నోచుకుంటారు.ఈ శ్రావణ మాసపు శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధించడం వలన సకల సంపదలు లభిస్తాయని చెబుతారు. అదే విధంగా గోలక్ష్మి (ఆవు)ని పూజించిన వారికి సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ... 'కనకధారా స్తోత్రం' చదువుకున్నట్టయితే, సిరిసంపదలు కలుగుతాయి.ఈ శ్రావణ మాసం పెళ్ళి అయిన, లేక పెళ్ళి కాని అడవాళ్ళకి చాలా ముఖ్యమైనది... ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమైనవి శుక్రువారాలు, మంగళవారాలు ఈ మాసంలో 4 శుక్రవారాలని శ్రావణ శుక్రవారాలు అని అంటారు ఈ 4 శుక్రవారాలు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి అమ్మవారిని పూజిస్తారు. ఇందులో 2వ శుక్రవారం చాలా ముఖ్యమైనది అది శుక్ల పక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆ రోజే “వరలక్ష్మీ వ్రతం“ చేసుకుంటాము. ఇది ముఖ్యంగా పెళ్ళి అయిన ముత్తైదువులు చేసుకుంటారు. ఈ వ్రతం వల్ల లక్ష్మీ దేవి కృపా కటాక్షాలు అందుకుని సకల సిరి సంపదలు పుత్ర పౌత్రభివృధి సుఖసంతోషాలు కలుగుతాయని ప్రతీతి. ఆ రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పూజా గృహంలో లక్ష్మీ దేవి కలశాన్ని అలంకరించి బంగారంతో చేసి ఉన్న లక్ష్మీ రూపు అమ్మవారికి పెట్టి అష్టోత్తరం పఠించి వ్రత కథ చదువుకుని నైవేద్యం సపర్పించిన తరువాత సంద్యా సమయమున ముత్తైదువులని పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. ఈ విధంగా 2 వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతము ఆచరించాలి. ఒక వేళ 2వ శుక్రవారం కుదరక పోతే 4 వరాల్లో ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు. ఈ రోజున ప్రతి ఊరు ... ప్రతి వీధి ... ప్రతి ఇల్లు వ్రతాలతో ... పేరంటాళ్ళతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి.ఈ వ్రతం జరుగుతున్న ప్రదేశాలకు లక్ష్మీదేవి నేరుగా వస్తుందని అంటారు. శ్రావణ మంగళవారాల్లో చేసే మంగళగౌరీ వ్రతాలను మంగళవారం నోములని కూడా అంటారు. ఈ వ్రతం చేసే రోజున స్త్రీలు ఉదయమే మంగళస్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని, పూజగదిలో కానీ, మరో అనువైన చోట కానీ మంటపం కట్టి దాని మధ్యన ముగ్గులతో తీర్చిదిద్ది కొబ్బరికాయకు లక్ష్మీరూపం అలంకరించి కలశస్థాపన చేసి వరలక్ష్మీ వ్రతమైతే లక్ష్మీ దేవినీ, మంగళగౌరీ వ్రతమైతేమంగళగౌరినీ ఆవాహనం చేసి, షోడశోపచారాలతో పూజిస్తారు. పూజానంతరం పసుపు పూసిన తోరం చేతికి కట్టుకొని, సాయంకాలం ఆరతి ఇచ్చి, పేరంటం చేస్తారు. తరువాత వరలక్ష్మీ వ్రతకథ మంగళగౌరీ వ్రతకథ చదువుతారు. ఆ కాలంలో దొరికే ఫలాలతో అలంకరించడం, నైవేద్యానికిఆవిరి కుడుములు వంటి తేలికైన తినుబండారాలను సిద్ధపర్చడం, అన్నింటినీ ఐదైదుగా పెట్టడం ఆచారం. ఇక శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత వుంది. ఈ 'శ్రావణపౌర్ణమి' రోజున 'రక్షాబంధన్' పండుగ జరుపుకుంటారు. జ్ఞాన స్వరూపంగా 'హయగ్రీవ స్వామి' ... పరిపూర్ణ అవతారంగా 'శ్రీ కృష్ణుడు' జన్మించింది ఈ మాసంలోనే. దైవ సంబంధమైన ఇన్ని వేడుకలకు వేదికగా నిలిచిన కారణంగానే శ్రావణమాసాన్ని అంతా ఆహ్వానిస్తారు ... ఆరాధిస్తారు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML