ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Sunday, 2 August 2015

మందపల్లి శనీశ్వరస్వామిమందపల్లి శనీశ్వరస్వామి

నలరాజును పీడించి అతన్ని జీవితంలో అష్టకష్టాలనుభవించేందుకు కారణం అయినవాడు. ఆంజనేయస్వామిని కూడా పీడించడానికి ప్రయత్నించినవాడు. అయితే శరణం అని తనవద్దకు వచ్చే భక్తులను అభయమిచ్చే భగవంతుడు, రారాజైనా, మామూలు భక్తుడైనా కూడా దోషములను నివారించేవాడు... ఎవరు?

శనీశ్వరస్వామి.

గోదావరి నది ఒడ్డున ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలలో మందపల్లి శనీశ్వరస్వామి ఆలయం అతి ముఖ్యమైనది. దోష పరిహారం కావించి వరాలనిచ్చి భక్తులు సంతోషంగా జీవించేందుకు మూలకారణమైన ఆ భగవంతుడు మందపల్లి శనీశ్వరస్వామి.

ఈ క్షేత్రంలో ఆ స్వామి ఎలా కొలువైయ్యాడు?

కైటబాసురుడి కుమారులైన అశ్వ్ర్ధుడు, పిప్పలుడు అసురగుణాలతో భూలోకంలోని ప్రజలను పీడించేవాడు.

అశ్వర్ధుడు అవసరమైనప్పుడు అశ్వర్ధచెట్టు రూపం దాల్చే వరం వుండినది. పిప్పలుడు బ్రాహ్మణవేషం పొందగలిగేవాడు. దేవతలు ఋషులు చేసే యాగముల వద్దకు ఇద్దరూ వెళ్ళేవారు.

అక్కడుండే అశ్వర్ధ చెట్టులో ఐక్యం అయ్యేవాడు అశ్వర్ధుడు. యాగమాచరించే బ్రాహ్మణులలో ఒకడిలా వుండేవాడు. బ్రాహ్మణరూపంలో పిప్పలుడు, శాంతంగా పరిసరాలను గమనిస్తూ ఉండేవాడు.

యాగం ముగిసే సమయంలో పిప్పలుడు అసరుడిలా మారేవాడు. అశ్వర్ధ చెట్టులో వుండే అశ్వర్ధుడు తన అసలు రూపు దాల్చి బయటకి వచ్చేవాడు.

ఇద్దరు యాగాన్ని నాశనం చేసేవారు. యాగాలను చేసే బ్రాహ్మణులనూ అంతమొందించేవారు.

పిప్పలుడు ఎన్నో దుష్టకార్యాలను చేయడంలో ఘటికుడు. అతను అప్పుడప్పుడు వృషభ వేషంలో వేద పాఠశాల ఆవరణలో వేచి, చదువుకోడానికి వచ్చే శిష్యులపై దాడిచేసి స్వాహా చేసేవాడు.

యాగశాలలోనూ, పాఠశాలలోనూ బ్రాహ్మణవిధ్యార్ధులు ఈ అసురులకు విందు బోజనంగా మారేవారు. శిష్యులు సంఖ్య రోజురోజుకూ తగ్గిపోయింది.

ఈ పరిస్ధితిని చూసి ఎంతో బాధపడిన దేవతలు, ఋషులు, మునులు, అమాయకులైన బ్రాహ్మణులు ఒకరోజున నది ఒడ్డున తపస్సు చేస్తున్న స్వామిని చూశారు. ఇదే మంచి తరుణం అని సంతోషపడ్డారు.

అశ్వర్ధుడు, పిప్పలుడు చేస్తున్న దారుణాలను శని భగవానునికి తెలిపి ఎలాగైనా వారి ఆట కట్టించి, వారిని అంతమొంచించమని వేడుకున్నారు.

అయితే శనీశ్వరుడు తను ఇప్పుడు తపస్సు చేస్తున్నాననీ, ముగిసిన తర్వాత ఆ రాక్షసులను కడతేర్చే కార్యక్రమం గురించి ఆలోచిస్తానని చెప్పాడు.

దేవతలకు, మునులకు ఏం చేయాలో తోచలేదు. అయితే లోకరక్షణకోసం వారు శనీశ్వరుడితో "స్వామి! మా తపోశక్తినంతటినీ మీకు సమర్పించుకుంటాము. మీరు ఎలాగైనా ఆ అసురులను అంతమొందించండి అని ప్రార్ధించారు.

దయసాగరుడైన శనీశ్వరుడు లోక సన్రక్షణార్ధం ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు.

ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని నిర్ణయించుకున్న శనీశ్వరుడు బ్రాహ్మణవేషం ధరించాడు. అశ్వర్ధుడు అదృశ్య రూపంలో వున్న అశ్వర్ధ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆరోగ్యంగా, పుష్టిగా వున్న ఒక బ్రాహ్మణుడు తన వలలో చిక్కుకుంటాడని ఎంతో సంతోషంతో పొంగిపోయాడు అశ్వర్ధుడు. బ్రాహ్మణవేషంలో వచ్చింది శనీశ్వరుడని తెలీక అతన్ని మింగేశాడు.

శక్తిశాలి అయిన శనీశ్వరుడు అశ్వర్ధుణి కడుపు చీల్చుకుని బయటకి వచ్చ్హాడు. ఆ క్షణమే అశ్వర్ధుడు అంతమైపోయాడు.

ఆ తర్వాత వేదపాఠశాల ఆవరణలో వృషభ వేషంలో వున్న పిప్పలుణ్ణి కలిసి తను వేదం నేర్చుకోవడానికి వచ్చ్హానని వినయంగా తెలిపాడు. ఆ శిష్యుడు శనీశ్వరుడని తెలియని పిప్పలుడు ఆయనను స్వాహా కావించాడు.

అతని శరీరాన్ని చీల్చుకుని బయటపడ్డాడు శనీశ్వరుడు. పిప్పలుడూ అంతమైపోయాడు.

దేవతలూ, మునులూ ఎంతో ఆనందపడ్డారు.

అయితే అనురలను అంతమొందించిన శనీశ్వరునికి బ్రహ్మహత్యాదోషం పట్టింది. అదేచోట ఈశ్వరుడిని పూజించడానికి లింగప్రతిష్ట చేసి దోష పరిహారం పొందాడు శనీశ్వరుడు.

అంతేకాక తన భక్తజనుల కోసం "ఎవరైతే నాకు ప్రియమైన శనివారం రోజున అశ్వర్ధ చెట్టు ప్రదక్షిణం చేసి నేను ప్రతిష్ట చేసిన ఈ లింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి పూజలు చేస్తారో వారికి శనిదోషం వుండదని తమ కోరికలన్నీ నెరవేరుతాయని తెలిపాడు శనీశ్వరుడు.

ఆనాటి నుండి మందపల్లి క్షేత్రంలో వున్న కొలనులో స్నానము చేసి స్వామికి పూజలు చేసిన వారి కోరికలన్నీనెరవేరతాయన్నది నగ్నసత్యం అనడం అతిశయోక్తి కాదు.

రాజమండ్రి నుండి అమలాపురంకు వెళ్ళే బస్సులో మందపల్లి వెళ్ళోచు. ఒక పెద్ద ఆలయ ప్రాంగణం భక్తులను ఆహ్వానిస్తున్నాట్టు వుంటుంది.

విశాలమైన ఆలయ ప్రాంగణంలో వరుసగా ఐదు వేరు వేరు సన్నిధులు కనిపిస్తాయి.

మొదటి సన్నిధిలో శనీశ్వరుడు ధ్వజస్తంభం. ఆ తర్వాత నంది. దాని ఎదుట గర్భగుడిలో శనీశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. శనీశ్వరుడు ప్రతిష్ట చేసిన ఈశ్వరుడు కాబట్టి ఆయనను శనీశ్వరుడు అని అంటారు. మందపల్లిలో నెలకొన్నందువల్ల మందపల్లి శనీశ్వరుడు అని నామధేయం స్వార్ధకమైంది. స్వామిని దర్శించిన భక్తులు మైమరచిపోయి పరవశమైపోతారు మరి.

గర్భగుడి బయట గోడనానుకొని చిన్న కాలువ కట్టారు. అందులో చివరలో ఒక చుక్క నూనె వేస్తే అది స్వామివారిపై (లింగంపై) అభిషేకన్లా పడేలా ఏర్పాటు జరిగింది.

శనివారం రోజు మాత్రం సుమారు మూడు వందల మంది భక్తులు తిల తైలాభిషేకం జరిపిస్తారుట.

అమావాస్య, పౌర్ణమిల ముందు త్రయోదశి శనివారం వచ్చినదంటే సుమారు 15 వేల నుండి ఇరవై మంది భక్తులు తిల తైలాభిషేకం జరిపిస్తారట.

అభిషేకం ముందు, అభిషేకం ముగిసిన తర్వాత స్నానం చేయాలన్న పద్ధతి వున్నందువల్ల ఆరోజు అన్ని కొలనులో తేరు తిరునాళ్లు జరిగినట్టు జనసందోహం వుంటుంది.

శనీశ్వరస్వామి సన్నిధి తర్వాత వున్న సన్నిధిలో పార్వతి దేవి కొలువైంది. ఈ విగ్రహాన్ని సప్తఋషుల పతివ్రతలు అందరు కలిసి ప్రతిష్ట చేసినది.

ఆ తర్వాత బ్రహ్మప్రతిష్ట చేసిన పరమేశ్వరుడి సన్నిధి. పరమేశ్వరుడు నాగచత్రం కింద కవచం ధరించి చాలా గంభీరంగా ్దర్శనమిస్తారు. పక్కనే వున్న పార్వతీదేవి సన్నిధి బయట గణపతి.

ఆతర్వాత అష్ట మహా సర్పాలలో ఒకరైన కర్కోకటకుడు ప్రతిష్ట చేసిన నాగేశ్వరుడు స్పటిక నాగచత్రంతో స్పటిక లింగరూపంతో అద్భుతంగా దర్శనమిస్తాడు.

ఆ తర్పాత సన్నిధిలో సప్తఋషులలో ఒకరైన గౌతమ మహర్షి ప్రతిష్ట చేసిన వేణుగోపాలస్వామి విగ్రహం. మందపల్లి క్షేత్రానికి క్షేత్రపాలకుడిలా వేణువు చేతబూని చాలా అందంగా చెక్కిన స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం ఎదుట ఉత్సవ విగ్రహం. శనీశ్వర స్వామిని దర్శించండి. శనిదోష పరిహారం పూజలు చేసి మోక్షం పొందండి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML