
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Wednesday, 12 August 2015
అతిరాత్రం.. అత్యద్భుతం : తేల్చిన కేరళ శాస్త్రవేత్తల బృందం
అతిరాత్రం.. అత్యద్భుతం : తేల్చిన కేరళ శాస్త్రవేత్తల బృందం
అతిరాత్రం మహాయజ్ఞంలో శాస్త్రీయత ఎంత…? ఇది హేతువాదులతో పాటు… హిందూధర్మంపై నమ్మకం ఉన్నవారికి కూడా ఆసక్తి కలిగించే ప్రశ్న. దీనికో అద్భుతమైన జవాబు దొరికింది. అతిరాత్రం వల్ల పర్యావరణానికి, ఉత్పాదకతకు జరిగే మేలు అంతా ఇంతా కాదని తేలింది. ఇది తేల్చింది ఏ సాధుసన్యాసులో, పండితులో కాదు… ఏకంగా ఒక శాస్త్రవేత్తల బృందమే పరిశోధించి తేల్చిన నిజమిది.
వివరాల్లోకి వెళితే…
• హోమగుండంలో వేసే పదార్థాలు, సామూహికంగా వేద మంత్రాలు ఇవన్నీ ఎంతో సహేతుకమైనవని, పర్యావరణానికి సానుకూలమని, ఆరోగ్యకరములని, ఎంతో అర్ధవంతమైనవని కేరళ రాష్ట్రంలో ప్రొఫెసర్ నాంపూరి(ఫార్మర్ డైరక్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫోటానిక్స్, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ), మరి కొంతమంది సైంటిస్టులతో కలిసి చేసిన రీసెర్చ్ లో కుండ బద్దలుగొట్టేలా స్పష్టం చేసారు.. కేరళ రాష్ట్రం., త్రిస్సూర్ జిల్లా., పంజల్ గ్రామంలో నిర్వహించిన “అతిరాత్రం” యజ్ఞాన్ని ప్రత్యక్షంగా పరీక్షించిన ఈ శాస్త్రవేత్తల బృందం అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
• యఙ్ఞాలను నిర్వహిస్తున్నప్పుడు చుట్టుపక్కన వున్న ప్రదేశమంతా చక్కటి ప్రశాంతతతో,ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సంతరించుకుంటుంది.
• గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం ఇలా సకల జీవకోటికి ఆధారాలైన పంచభూతాలను యఙ్ఞ కర్మలు శుధ్ధి చేస్తాయి.
• యఙ్ఞ ప్రభావిత ప్రాంతాలలో మనుషులే కాదు… సకల జీవరాశుల పెరుగుదల ఆరోగ్యవంతంగా ఉంటుంది. దీనిని రుజువు చేయటానికి … వాళ్ళు కొన్ని రకాల విత్తనాలను యజ్ఞస్థలానికి దగ్గరగా… మరికొన్ని మరికాస్త దూరంగా నాటారు. యాగానికి మరీ దగ్గరగా ఉన్న విత్తనాల పెరుగుదల … దూరంగా ఉన్నవాటి కంటే 2000 రెట్లు ఎక్కువ వేగంగా ఉందని తేల్చారు. అందుకు హోమద్రవ్యాల ప్రభావంతో పాటు…. వేదమంత్రోచ్ఛారణ సైతం మొక్కల ఎదుగుదలపై సానుకూల ప్రభావం కనబరించిందని ధృవీకరించారు.
• యఙ్ఞం నిర్వహిస్తున్న ప్రాంతం నుంచి భూమిపై కొన్ని కిలోమీటర్ల దాకా , అలాగే ఆకాశంలో మేఘాల దాకా ఆ మంత్ర ధ్వనుల తరంగదైర్ఘ్యాలు ఆవరిస్తాయని , దానివల్ల స్వచ్ఛమైన గాలితో పాటుగా సకాలంలో వర్షాలు కూడా కురుస్తాయన్నారు.
• వీటితో పాటు యజ్ఞంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారు కూడా ఆ మంత్రోచ్ఛారణ ప్రభావంతో సానుకూల ధోరణులతో వ్యవహరిస్తారని శాస్త్రవేత్తల బృందం వివరించింది.
- భారత్ టుడే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment