
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Monday, 3 August 2015
పాకనాడు (నేటి ప్రకాశం జిల్లా) లోని గుడ్లూరు గ్రామం
పాకనాడు (నేటి ప్రకాశం జిల్లా) లోని గుడ్లూరు గ్రామం... క్రీ.శ.13వ శతాబ్దం ఉత్తరార్ధంలో..
మన్నేరు నది ఒడ్డునున్న ఈ గ్రామం లో నూరు పైన గుళ్లున్నాయి. అందువలననే ఆ గ్రామానికి ఆ పేరు స్థిర పడింది.. వానిలో నీలకంఠేశ్వర స్వామి గుడి బహు ప్రఖ్యాతి చెందింది.
అంతే సమానమైన ప్రాముఖ్యత సంతరించుకున్న కేశవ పెరుమాళ్ ఆలయంలో నారాయణుడు అత్యంత వైభవంతో పూజలందుకుంటున్నాడు.. శివ కేశవులిరువురూ ఆ గ్రామాన్ని తమ రక్షణలోనికి తీసుకున్నట్లు వెలిశారు.
పలు రకాల పండుగలకు, సాహిత్య సంగీత సభలకు ఆలవాలమయింది ఆ సీమ.
పామర జనాలు, బంగారపు తొడుగు గల గ్రామదేవత పోలేరమ్మను ఆరాధిస్తూ ఉంటారు.
ప్రతాప వీరాంజనేయ స్వామి గుడి, చెన్నకేశ్వరాలయం, వినాయకుడి గుడి, వీరభద్రుని ఆలయం.. అక్కడున్న ఆలయాల్లో కొన్ని. ఆ పరబ్రహ్మ అన్ని రూపాల్లోనూ కొలువై ఉన్నాడు అక్కడ.
నీలకంఠేశ్వర స్వామి ఆలయంలోని లింగం సగం తెలుపు రంగులో, సగం ఎరుపు రంగులో ఉంటుంది. ఇతిహాసం ప్రకారం దీనికొక కథ ఉంది.
Reactions: |
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment