అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పశ్చిమాన కొండ దిగువ ప్రాంతంలోని ఆత్మకూరు వీధిలో శ్రీ దశభుజ గణపతి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని 13, 14వ శతాబ్ద కాలంలో శ్రీ కృష్ణదేవరాయుల వంశీయులు భూపతిరాయులు నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కొండ ప్రాంతంలో ఉన్న తమ రాజ్యానికి వెళ్లే మార్గంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ దేవాలయంలో 15 అడుగుల పొడవు 12 అడుగుల వెడల్పుతో విగ్రహం చెక్కబడి ఉంది. ఈ మూలవిరాట్‌పై శ్రీ లక్ష్మీ అమ్మవారు దర్శణమిస్తారు. అంతేగాకుండా శ్రీ ధశభుజ గణపతికి పది భుజాలు కలిగి ఉన్నాయి. ఈ పది చేతుల్లోని కుడివైపు మొదటి చేతిలో నారికేళం. రెండవ చేతిలో చక్రం, మూడవ చేతిలో త్రిశూలం, నాల్గవ చేతిలో ధనస్సు, ఐదవ చేతిలో అంకుశం లాంటి ఆయుధాలు ఉన్నాయి. ఎడమవైపు మొదటి చేతిలో అమ్మవారు, రెండవ చేతిలో శంఖం, మూడవ చేతిలో పవిత్రము(పాశము), నాల్గవ చేతిలో శరం, ఐదవ చేతిలో ఖడ్గం ఉన్నాయి. ఇల పది భూజాలు కలిగి ఉండటం వల్ల స్వామి వారికి శ్రీ దశభుజ గణపతి అని నామదేయం వచ్చి ఉంటుందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అలానే మూలవిరాట్‌కు అరుదైన రీతిలో నుదుటి మీద మూడో కన్ను ఉండటం విశేషం. శిరస్సు పైబాగంలో పూర్ణకలశంతో మహాగణపతి కనిపిస్తారు. కుడివైపు తొండం, తొండం కొనభాగంలో నారికేళం ఉండటం విశేషమని ఆగమ శాస్త్ర పండితులు చెబుతారు. మూలవిరాట్ ఎడమ అరికాలిలో అష్టదళపద్మం ఉండి పైన సూర్యచంద్రులను కలిగి అలరారుతున్న స్వామి విశ్వం విశిష్ఠతను రక్షిస్తూ భక్తుల సంకల్పం మేరకు కోరికలను నెరవేర్చడం దేశంలోనే ఎక్కడాలేదన్నది భక్తుల విశ్వాసమని పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇంతటి విశిష్టమైన రూపం కలిగిన శ్రీ దశభుజ మహాగణపతి అతి సుందరంగా భక్తులకు కన్పిస్తారు. శ్రీ.. గణనాథం భజమ్యహం.. అని కొలిస్తే చాలు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ప్రత్యేక పూజలకు ఆంధ్ర, కర్ణాటక రాష్ర్టాల్లోని భక్తులు విచ్చేస్తుంటారు.ఈ పూజల్లో శ్రీ స్వామి వారికి నిండు టెంకాయను సంకల్పం చేసి పూజలు చేయించి మూలవిరాట్ భుజాలపై ఉంచి ప్రార్థిస్తే 41 రోజులలో సంకల్పసిద్ధి అవుతుందని ప్రతీతి. శ్రీ దశభుజ మహాగణపతిని సంపూర్ణ విశ్వాసం, భక్తి ప్రపత్తులతో కొలిచే భక్తుల సమస్యలు, బాధలు, కష్టాలను స్వామి వారే తన దశ భుజస్కందాలపై మోసికొసి భక్తులకు ఆనందమయ జీవితం ప్రసాదిస్తారని కొంత మంది భక్తుల తమ అనుభవాల్లో జరిగిన సంఘటనలు చెబుతారు. అలాగే ఆలయంలో శ్రీ దశభుజ గణపతితో పాటు వెలసిన లక్ష్మీసమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకొంటారు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment