ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 11 August 2015

త్రేతాయుగంలోనే స్వయంభువుగా అవిర్భవించిన తాడుబందు వీరాంజనేయ ప్వామి ....త్రేతాయుగంలోనే స్వయంభువుగా అవిర్భవించిన తాడుబందు వీరాంజనేయ ప్వామి ....


ఆంజనేయుడు మహా పరాక్రమవంతుడు ... అపజయమే ఎరుగనివాడు. శత్రువులను సంహరించడంలోను ... ఆశక్తులకు అభయమివ్వడంలోను ఆయన ఎంత మాత్రం వెనుకాడడు. ఆయన పేరు వింటేనే భూత .. ప్రేత .. పిశాచాలు కంటికి కనిపించనంత దూరం పారిపోతాయి. అంతటి శక్తిమంతుడైన ఆంజనేయుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి భక్త జనులను అనుగ్రహిస్తున్నాడు.


ఈ నేపథ్యంలోనిదే సికింద్రాబాద్ - బోయినపల్లి సమీపంలోని 'శ్రీ తాడుబందు వీరాంజనేయ ఆలయం'. వాడుకలో ఈ ప్రాంతాన్ని 'తాడ్ బండ్' అని పిలుస్తూ వుంటారు. త్రేతాయుగంలోనే ఇక్కడ స్వామి స్వయంభువుగా అవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు.

తన తపస్సుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడమని మహర్షి వినాయకుడిని ప్రార్ధించాడట. అందువలన ఇక్కడ ఆంజనేయుడితో సహా వినాయకుడు కూడా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. జాబాలి మహర్షి ఇక్కడ వీరాంజనేయస్వామిని ప్రతిష్ఠించినట్టు తెలిసి శ్రీ రాముడు హర్షాన్ని వ్యక్తం చేసినట్టు స్థలపురాణంలో వుంది. ఆ తరువాత ఎందరో మహనీయుల రాకతో మరింత పవిత్రమైన ఈ క్షేత్రం, కాలక్రమంలో కనుమరుగైపోయింది.

19 శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేశాడు. అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయ సహకారాలతో, నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు. ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడి స్వామిని పూజించడం వలన ఆపదలు ... అనారోగ్యాలు తొలగిపోతాయని చెబుతారు.

మంగళ - శని వారాల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. ఇదే ప్రాంగణంలో సీతారాములు ... శివుడు దర్శనమిస్తూ వుంటారు. హనుమజ్జయంతి ... శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతుంటాయి. ఈ సందర్భంగా స్వామిని సేవించుకుని తరించే భక్తుల సంఖ్య ఏ యేటికాయేడు పెరుగుతూనే వుండటం విశేషం.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML