గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 1 August 2015

‘‘ఓం భూర్భువః స్వః.....ప్రచోదయాత్’’

‘‘ఓం భూర్భువః స్వః.....ప్రచోదయాత్’’
ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలకు కారణమైన బ్రహ్మ స్వరూపమైన నవతుని అవిద్యవలన కలిగే నామ రూపాత్మకమైన బ్రహ్మ స్వరూపాన్ని ధ్యానిస్తున్నాం. ఆ పరమాత్మ మనకు ప్రశాంత జీవనమును, సమృద్ధిని, సదాచారమును సర్వదా ప్రసాదించుగాక అని అర్థం. ఈ రెండు చిన్న పాదాలలో గూఢార్థాన్ని నిక్షిప్తం చేయడం జరిగింది.
ఒక్క ఈ గాయత్రీ ఉపాసన దివ్యమైనది. దీనిలో ప్రతి అక్షరం ఒక్కో శక్తి ధార. ఒక్కో కళ, ఒక్కో మాతృక, ఒక్కో ప్రకాశకిరణమై మనలను ఉత్తేజితులను చేస్తాయి. మానవుల ఆరోగ్య పరిరక్షణ కోసం సేవించే ఔషధాలులో అనేక రసాయనిక పదార్థాలు కలిగి ఉంటాయి. వాటికి ప్రత్యేక గుణాలు, ధర్మాలు ఉంటాయి. అవన్నీ కలిసినపుడు విశిష్టమైన గుణాన్ని పొంది అనారోగ్యాన్ని పటాపంచలు చేస్తుంది. అలాగే గాయత్రీ మంత్రం విశిష్టమైన ఔషధంగా అతి విలువైన శక్తి తత్త్వంగా మనలను చైతన్యవంతుల్ని చేస్తుంది. ఇందుగల ప్రతి అక్షరం ఒక్కో దేవతా స్వరూపం.
ఈ మంత్రంలోగల దేవతలు, ఆ శక్తులవల్ల కలిగే ఫలితాలు : 1.మొదట ఆదిదేవుడు విఘ్ననాయకుడు - కఠిన కర్మలలో సాఫల్యం, బుద్ధి వృద్ధి చెంది వివేకంను, 2.నృసింహ ధ్యానంవల్ల పరాక్రమశక్తి , పురుషార్థం, పరాక్రమం, 3.విష్ణ్ధ్యునం ద్వారా పరిపాలనా శక్తి , ప్రాణుల పాలన, ఆశ్రీత రక్షణ, యోగ్యత, అభివృది, 4.శివధ్యానంవల్ల కల్యాణ శక్తి , అరిష్టాల నాశనం, మంగళ వృద్ధి, దృఢ నిశ్చయం, 5.కృష్ణద్యానం ద్వారా యోగ శక్తి , క్రియాశీలత ఆత్మనిష్ఠ, అనాసక్తి, కర్మయోగం, సౌందర్యం, 6.రాధాధ్యానంవల్ల ప్రేమశక్తి, ద్వేషభావం నశించడం, 7.లక్ష్మీ ధ్యానంవల్ల ధన శక్తి , పదవి, కీర్తి, భోగ్య పదార్థ ప్రాప్తి , 8.అగ్నిధ్యానం ద్వారా వేడి, ప్రకాశం, శక్తి సామర్థ్యాలు వృద్ధి అయి ప్రతిభాశాలి, తేజస్వి అవుతారు. 9.ఇంద్రధ్యానంవల్ల రక్షాశక్తి ,10.సరస్వతీ దేవి ధ్యానం ద్వారా బుద్ధి శక్తి కలిగి మేధాబుద్ధి, దూరదృష్టి, వివేకశాలత , 11.దుర్గ్ధ్యానం ద్వారా దమన శక్తి , 12.హనుమధ్యానంవల్ల నిష్టాశక్తి , విశ్వాసం, బ్రహ్మచర్యం, నిర్భయంగా ఉండటం, 13.పృధ్వీధ్యానంవల్ల ధారణశక్తి , ఓర్పు, దృఢ నిశ్చయం, 14.సూర్యధ్యానంవల్ల ప్రాణశక్తి కలిగి ధీర్ఘ ఆయుర్దాయం, వికాసం, వృద్ధి, 15.రామనామ ద్వారా ప్రతిష్ఠా శక్తి కలిగి ఫలితంగా కష్టాలకు చలించకపోవటం, ధర్మము, నియమపాలన, 16.సీతాధ్యానంవల్ల తపోశక్తి కలిగి నిర్వికారత, పవిత్రత, మాధుర్యం, సాత్త్వికత, శీలము, 17.చంద్రధ్యానం ద్వారా శాంతి శక్తి కలిగి ఉద్విగ్న శాంతి, శోక క్రోధ చింతా ప్రతిహింసాది, 18.యమ ధ్యానంవల్ల కాలశక్తి కలిగి ఫలితంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, మృత్యుభయ రాహిత్యం, 19.బ్రహ్మదేవుని ధ్యానంవల్ల ఉత్పాదక శక్తి కలిగి ఫలితంగా ఉత్పాదన శక్తి వృద్ధి అయి వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. సంతానవృద్ధి, పశు, వ్యవసాయ, వృక్ష, వనస్పత్తు ఉత్పత్తి పెరుగుతుంది. 20.వరుణధ్యానం ద్వారా రసశక్తి పెరిగి భావుకత, సరళత, కళాప్రియత, కవిత్వం, 21.నారాయణ మంత్రం ద్వారా ఆదర్శ శక్తి వచ్చి మహత్వకాంక్ష, శ్రేష్ఠత, దివ్య గుణాలు 22.హయగ్రీవ ధ్యానం ద్వారా సాహస శక్తి కలిగి ఉత్సాహం, సాహసం, వీరత్వం, శూరత్వం, నిర్భయత్వం, 23.హంస ధ్యానం ద్వారా వివేక శక్తి కలిగి ఉజ్వల కీర్తి, ఆత్మ సంతోషం, సదసద్వివేకం, దూరదృష్టి, సత్సాంగత్వం, 24.తులసీధ్యానంవల్ల సేవాశక్తి కలిగి ఫలితంగా దేశ సేవలో ప్రవృత్తి, సత్యప్రధానత, పాతివ్రత్యం, పత్నీవ్రతం, మొ.నవి చేకూరుతాయి.
ఈ విధంగా ఎవరికి ఏ గుణ, కర్మ స్వభావాలు తక్కువగా ఉండి వికృతి కనిపిస్తుందో వారు ఆ శక్తి దేవతను విశేషంగా ఉపాసన చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. సర్వదేవతలను స్మరించుకొని ఉపాసించే ఏకైక మంత్రం ఒక గాయత్రి మాత్రమే. సరైన రీతిలో ఉచ్ఛారణ చేస్తే చాలు. ఫలితం తప్పక వస్తుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML