గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 23 August 2015

విశ్లేషణ: మాల, మాదిగ, అంబేద్కర్, రాజ్యాంగం :ఆధారాలతో : అంబేద్కర్ ఆశయాలు, ఆచరణలు నిలువునా పాతేసిన కొంతమంది మన సోదరులు SC/ST - కులస్తులు .

విశ్లేషణ :  అంబేద్కర్  ఆశయాలు, ఆచరణలు నిలువునా పాతేసిన కొంతమంది SC/ST లు  . ఏదో విధంగా, అర్హులయిన హిందూ సోదరులయిన  SC/ST- ప్రజలకు న్యాయం జరిగేలా, అంబేద్కర్  ఆశయాలకై  పోరాడండి. రాజ్యాంగ  విరుద్దంగా  క్రైస్తవ మతం తీసుకుని , రిజర్వేషన్ వాడుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగాలలో కులుకుతున్న వీళ్ళని ఏమి చేయాలి ?? ఇప్పటికి నిజమయిన హిందూ SC/ST  ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది . పెళ్లి పందిరి, క్రైస్తవ పెళ్లి పందిరి వంటివి వెతికితే ఇటువంటి వి  మరిన్ని దొరుకుతాయి. 23.08.2015  EENADU, PELLI PANDIRI .

Read More

విశ్లేషణ : అమెరికాలో ఇప్పటికి కొనసాగుతున్న హిందూ దేవాలయాల పై దాడులు .


Read More

విశ్లేషణ : ఐస్లాండ్ లో గోమూత్రం తో షాంపు. ఎందుకు పనికి రాని కొంతమంది భారత ప్రస్తుత, సైంటిస్ట్ లు, ప్రొఫెసర్ లు , సైన్స్ విద్యార్ధులు .

సకల విజ్ఞాన సంపద ఉంది కాని ఏమి  సాధించాం ??  మన విజ్ఞానాన్ని కాపి కొడుతున్న విదేశి  సైంటిస్ట్ లు, ప్రొఫెసర్ లు ,  సైన్స్ విద్యార్ధులు , pharma companies.  ఇక నైన, మన వేదాల పై, శాస్త్ర విజ్ఞాన పరి సోదన చేయాలి  సైంటిస్ట్ లు, ప్రొఫెసర్ లు ,  సైన్స్ విద్యార్ధులు .

Read More

విశ్లేషణ : ప్రముఖ హైందవ దేవాలయాలలో స్వయంగా మత ప్రచారం . క్రైస్తవానికి అమ్ముడు పోయిన "దేవా దాయ ధర్మా దాయ శాఖ" .


Read More

విశ్లేషణ : చర్చ్ ఫాదర్ ల కుటుంబీకుల ఆస్తి కోట్లల్లో . లక్షల కొట్లలో మత ప్రచారానికై విరాళాలు. విలాసమయిన భవనాలు, ఖరీదయిన సూట్(suits) లు, బట్టలు , కాలు కింద పెట్టకుండా ఖరీదయిన కార్లు.


Read More

సుప్రీం కోర్ట్ న్యాయ మూర్తి కన్నా నీకు ఎక్కువ తెలుసా ?? హిందుత్వమే గొప్పవాళ్ళ నినాదం.


Read More

విశ్లేషణ : మోడీ ప్రభుత్వం పై పగ పట్టిన దేశ క్రైస్తవ సంఘాలు .


Read More

విశ్లేషణ : తిరుపతి పై అన్యమతస్తుల విహారం. హిందువుల ముసుగులో హిందుత్వాన్ని తిట్టటం ప్రధానం . రోజు లక్షల మంది దర్శించే తిరుపతిలోనే ఇలా ఉంటే , మిగతా ఆలయాల దుస్తితి ఏమిటో ??


Read More

విశ్లేషణ : హిందూ ఆలయానికి ముస్లిం సోదరుని విరాళములు :


Read More

విశ్లేషణ : దేవాదాయ శాఖ అసమర్దత :భూములు హిందూ దేవాలయాలవి, వాటిలో క్రైస్తవ మత ప్రార్ధనలు, ఎన్నో చోట్ల ఇదే పరిస్తితి. వెలుగు చూడని విషయాలు ఎన్నో .Read More

విశ్లేషణ : బొట్టు పెట్టుకున్న, అయ్యప్ప మాల, శివ మాల , విష్ణు మాల వంటి హిందూ ధార్మిక కార్యకర మాలలో పాల్గొన్న పిల్లలకు నరకం చూపుతున్న కొన్ని క్రైస్తవ మిషనరీ schools . పిల్లలలను చావ బాదుతున్నారు


Read More

విశ్లేషణ : దేవుడు గర్భం ఇచ్చాడంట , కొన్ని క్రైస్తవ చర్చి లలో ప్రచారం . విజ్ఞాన వేదికా ?? లేక జన అజ్ఞాన వేదికా ?? హిందుత్వం పై దుమ్ము పోయటానికి మాత్రమె పనిచేస్తున్న విజ్ఞాన వేదికలు , నాస్తిక వాదులు


Read More

రామ నామ జపం లోను అంతులేని విజ్ఞానం. మన పూర్వీకుల గొప్పతనం


Read More

మతం మారితే డబ్బే డబ్బు. మీడియా ఆధారాలతో.


Read More

ప్రపంచం అంతా హిందుత్వమే మీడియా ఆధారాలతో & హిందుత్వానికి బానిసయిన బ్రిటన్ ప్రధాని


Read More

ఇటలి మీడియా : :: వాటికన్ సిటీ యువత హిందుత్వం వైపు పరుగులు : ఇటలి లో సగానికి పైగా హిందువులు


Read More

ఏసుక్రీస్తు కి పెళ్లిఅయినది : లండన్ లో సరికొత్త పుస్తకాలు . జనాల్లో ఆదరణ పొందుతున్న ప్రచురణలు


Read More

గుడ్డి ప్రభుత్వం : తిరుమల తిరుపతి దేవస్తానం colleges, schools లో అన్య మత పుస్తకాలు, పంచుతున్న పట్టించుకోని ప్రభుత్వం. అతి పెద్ద ధార్మిక క్షేత్రం లోనే ఈ పరిస్తితి ఉంటె మిగతా క్షేతాల పరిస్తితి ఏమిటి ????


Read More

Saturday, 22 August 2015

బ్రహ్మ దేవుడు ప్రతిష్టించిన శివ లింగములు ఎక్కడ ఉన్నవి ??బ్రహ్మ దేవుడు ప్రతిష్టించిన శివ లింగములు కొన్ని మాత్రమే : ఇంకా ఉన్నవి

బ్రహ్మ పురేస్వర్ : మాయ వరం , తమిళనాడు

కిరామం : తిరువొణమ్, నల్లూరు .

బ్రహ్మేశ్వర్ : నర్మదా దక్షిణ తీరం లో హతనోరాకు కి మీ ల దూరం లో ఉంది . దీనినే గుప్తేశ్వర్ అని కూడా అంటారు.

కిలూర్ : ఆనంద తాండవ పురం

బ్రహ్మేశ్వర లింగం : పులోముడు అనే రాక్షసుడిని చంపుటకు బ్రహ్మ ప్రతిస్టించెను

అభయేశ్వర లింగం : మహా కాల వనం , ఉజ్జయిని .

స్వర్గ ద్వారేశ్వర లింగం : ఉజ్జయిని

బాల బ్రహ్మేశ్వర స్వామీ : అలంపురం ,కర్నూలు జిల్లా

బ్రహ్మ లింగేశ్వర స్వామి : బలిఘట్టం , విశాకపట్నమ్

బ్రహ్మ పురేస్వర్ : నాగ పట్నం , తమిళనాడు

బ్రహ్మ పురేస్వర్ : తిరుపత్తూర్, తిరుచురా పల్లి , తమిళనాడు ,

పశుపతేశ్వ : కరూర్ , తమిళనాడు
ఇంకా ఉన్నవి.
Read More

లక్ష్మి దేవి ఆరాదించిన శివ లింగములు ఎక్కడ ఉన్నాయి ???లక్ష్మి దేవి ఆరాదించిన శివ లింగములు ఎక్కడ ఉన్నాయి ???

తిరునండి యార్ : ఆనంద తాండవర్

తిరువారూర్ :

తిరుప్పతూరు
Read More

Friday, 21 August 2015

శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రంశ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం

నమస్తే‌உస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌உస్తు తే ||


నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్]
Read More

అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రమ్అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రమ్

1. మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః
క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!!
2. త్వం శ్రీ రుపేంద్ర సదనే మదనైకమాతః
జ్యోత్స్నాసి చంద్రమసి చంద్ర మనోహరాస్యే
సూర్యే ప్రభాసి చ జగత్త్రితయే ప్రభాసి
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!!
3. త్వం జాతవేదసి సదా దహనాత్మ శక్తిః
వేధా స్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్
విశ్వంభరోపి భిభ్రుభయాదఖిలం భవత్యా
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!!
4. త్వత్త్యక్తమేతదమలే హరతే హరోపి
త్వంపాసి హంసి విదధాసి పరావరాసి
ఈడ్యో బభూవ హరిరప్యమలే త్వదాప్త్యా
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!!
5. శూరః శ ఏవ శ గుణీ శ బుధః శ ధన్యో
మాన్యః శ ఏవ కులశీల కళాకలాపైః
ఏకః శుచిః స హి పుమాన్ సకలేపి లోకే
యత్రాపతేత్తవ శుభే కరుణా కటాక్షః!!
6. యస్మిన్ వసేః క్షణమహో పురుషే గజేశ్వే
స్త్రైణే తృణే సరసి దేవకులే గృహేన్నే
రత్నే పతత్త్రిణి పశౌ శయనే ధరాయాం
శ శ్రీకమేవ సకలే తదిహాస్తి నాన్యత్!!
7. త్వ త్స్ప్రుష్టమేవ శకలం శుచితాం లభేత
త్వత్త్యక్త మేవ శకలం త్వశుచీహ లక్ష్మి
త్వ న్నామ యత్ర చ సుమంగళమేవ తత్ర
శ్రీ విష్ణు పత్ని కమలే కమలాలయేపి!!
8. లక్ష్మీ శ్రియంచ కమలం కమలాలయాంచ
పద్మాం రమాం నళినయుగ్మకరాం చ మాం చ
క్షీరోదజామమృత కుంభ కరామిరాంచ
విష్ణుప్రియా మితి సదా జపతాం క్వ దుఃఖం!!
ఈ స్తోత్రమును భక్తితో పఠించు వారికి సంతాపము, దారిద్ర్యము, ప్రియ వియోగము, సంపత్తి క్షయము ఉండవు. 
Read More

॥ శ్రీచాముణ్డేశ్వరీ అష్టోత్తరశతనామావలీ ॥॥ శ్రీచాముణ్డేశ్వరీ అష్టోత్తరశతనామావలీ ॥

అథ శ్రీ చాముణ్డామ్బాష్టోత్తరశత నామావలిః ॥

ఓం శ్రీ చాముణ్డాయై నమః ।
ఓం శ్రీ మహామాయాయై నమః ।
ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః ।
ఓం శ్రీవిద్యావేద్యమహిమాయై నమః
ఓం శ్రీచక్రపురవాసిన్యై నమః ।
ఓం శ్రీకణ్ఠదయితాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం గిరిజాయై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం మహాకాల్యై నమః । ౧౦
ఓం మహాల్క్ష్మ్యై నమః ।
ఓం మాహావాణ్యై నమః ।
ఓం మనోన్మణ్యై నమః ।
ఓం సహస్రశీర్ష సంయుక్తాయై నమః ।
ఓం సహస్రకరమణ్డితాయై నమః ।
ఓం కౌసుమ్భవసనోపేతాయై నమః ।
ఓం రత్నకఞ్చుకధారిణ్యై నమః ।
ఓం గణేశస్కన్దజనన్యై నమః ।
ఓం జపాకుసుమ భాసురాయై నమః ।
ఓం ఉమాయై నమః । ౨౦
ఓం కాత్యాయిన్యై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం మన్త్రిణ్యై నమః ।
ఓం దణ్డిన్యై నమః ।
ఓం జయాయై నమః ।
ఓం కరాఙ్గులినఖోత్పన్న నారాయణ దశాకృతయే నమః ।
ఓం సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః ।
ఓం ఇన్ద్రాక్ష్యై నమః ।
ఓం బగలాయై నమః ।
ఓం బాలాయై నమః । ౩౦
ఓం చక్రేశ్యై నమః ।
ఓం విజయాఽమ్బికాయై నమః ।
ఓం పఞ్చప్రేతాసనారూఢాయై నమః ।
ఓం హరిద్రాకుఙ్కుమప్రియాయై నమః ।
ఓం మహాబలాఽద్రినిలయాయై నమః ।
ఓం మహిషాసురమర్దిన్యై నమః ।
ఓం మధుకైటభసంహర్త్ర్యై నమః
ఓం మధురాపురనాయికాయై నమః ।
ఓం కామేశ్వర్యై నమః ।
ఓం యోగనిద్రాయై నమః । ౪౦
ఓం భవాన్యై నమః ।
ఓం చణ్డికాయై నమః ।
ఓం సత్యై నమః ।
ఓం చక్రరాజరథారూఢాయై నమః ।
ఓం సృష్టిస్థిత్యన్తకారిణ్యై నమః ।
ఓం అన్నపూర్ణాయై నమః ।
ఓం జ్వలఃజిహ్వాయై నమః ।
ఓం కాలరాత్రిస్వరూపిణ్యై నమః ।
ఓం నిశుమ్భ శుమ్భదమన్యై నమః ।
ఓం రక్తబీజనిషూదిన్యై నమః । ౫౦
ఓం బ్రాహ్మ్యాదిమాతృకారూపాయై నమః ।
ఓం శుభాయై నమః ।
ఓం షట్చక్రదేవతాయై నమః ।
ఓం మూలప్రకృతిరూపాయై నమః ।
ఓం ఆర్యాయై నమః ।
ఓం పార్వత్యై నమః ।
ఓం పరమేశ్వర్యై నమః ।
ఓం బిన్దుపీఠకృతావాసాయై నమః ।
ఓం చన్ద్రమణ్డలమధ్యకాయై నమః ।
ఓం చిదగ్నికుణ్డసమ్భూతాయై నమః । ౬౦
ఓం విన్ధ్యాచలనివాసిన్యై నమః ।
ఓం హయగ్రీవాగస్త్య పూజ్యాయై నమః । var పూజితాయై
ఓం సూర్యచన్ద్రాగ్నిలోచనాయై నమః ।
ఓం జాలన్ధరసుపీఠస్థాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం దాక్షాయణ్యై నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం నవావరణసమ్పూజ్యాయై నమః । ౭౦
ఓం నవాక్షరమనుస్తుతాయై నమః ।
ఓం నవలావణ్యరూపాడ్యాయై నమః ।
ఓం ద్వాత్రింశత్జ్వలతాయుధాయై నమః ।
ఓం కామేశబద్ధమాఙ్గల్యాయై నమః ।
ఓం చన్ద్రరేఖా విభూషితాయై నమః ।
ఓం చరాచరజగద్రూపాయై నమః ।
ఓం నిత్యక్లిన్నాయై నమః ।
ఓం అపరాజితాయై నమః ।
ఓం ఓడ్యాన్నపీఠనిలయాయై నమః ।
ఓం లలితాయై నమః ।
ఓం విష్ణుసోదర్యై నమః ।
ఓం దంష్ట్రాకరాలవదనాయై నమః । ౮౦
ఓం వజ్రేశ్యై నమః ।
ఓం వహ్నివాసిన్యై నమః ।
ఓం సర్వమఙ్గలరూపాడ్యాయై నమః ।
ఓం సచ్చిదానన్ద విగ్రహాయై నమః ।
ఓం అష్టాదశసుపీఠస్థాయై నమః ।
ఓం భేరుణ్డాయై నమః ।
ఓం భైరవ్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం రుణ్డమాలాలసత్కణ్ఠాయై నమః ।
ఓం భణ్డాసురవిమర్ధిన్యై నమః । ౯౦
ఓం పుణ్డ్రేక్షుకాణ్డ కోదణ్డాయై నమః ।
ఓం పుష్పబాణ లసత్కరాయై నమః ।
ఓం శివదూత్యై నమః ।
ఓం వేదమాత్రే నమః ।
ఓం శాఙ్కర్యై నమః ।
ఓం సింహవాహిన్యై నమః ।
ఓం చతుః షష్ట్యూపచారాడ్యాయై నమః ।
ఓం యోగినీగణసేవితాయై నమః ।
ఓం వనదుర్గాయై నమః ।
ఓం భద్రకాల్యై నమః । ౧౦౦
ఓం కదమ్బవనవాసిన్యై నమః ।
ఓం చణ్డముణ్డ శిరఃఛేత్ర్యై నమః ।
ఓం మహారాజ్ఞ్యై నమః ।
ఓం సుధామయ్యై నమః ।
ఓం శ్రీచక్రవరతాటఙ్కాయై నమః ।
ఓం శ్రీశైలభ్రమరామ్బికాయై నమః ।
ఓం శ్రీరాజరాజవరదాయై నమః ।
ఓం శ్రీమత్త్రిపురసున్దర్యై నమః ॥ ౧౦౮
ఇతి శ్రీ చాముణ్డామ్బాష్టోత్తరశత నామావలిః సమ్పూర్ణం ॥
Read More

భారతీయ శ్లోకాల్లో సైన్స్… ఆశ్చర్యపరిచే నిజాలు…

భారతీయ శ్లోకాల్లో సైన్స్… ఆశ్చర్యపరిచే నిజాలు…
భారతీయుల ఙ్ఞానసంపద ఒక మహా సముద్రం… అందులో మన ఋషులు, మునులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు రచించిన శ్లోకాలు నీటి బిందువులు వంటివి. అందులో రెండంటే రెండు నీటి బిందువులు చాలు… భారత దేశం “విశ్వగురువు” అని సగర్వంగా చెప్పడానికి.
1. హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం
2. గాయత్రి మంత్రం...
ముందుగా తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గురించి మాటాడుకుందాం…
“యుగ సహస్ర యోజన పర భానూ!
లీల్యోతాహి మధుర ఫల జానూ”!!
దీని తాత్పర్యం సవివరముగా తెలుసుకుందాం…
యుగ= 12,000 దివ్య సంవత్సరములు
సహస్ర=1000
యోజన్= 8 మైళ్ళు
యుగ x సహస్ర x యోజన= పర్ భాను
12000 x 1000 x 8 మైళ్ళు=96000000 మైళ్ళు
1 మైళు = 1.6 కిలో మీటర్లు
96000000 మైళ్ళు = 96000000 x 1.6 కిలో మీటర్లు =
153600000 కిలో మీటర్లు (ఇది భూమికి సూర్యునికి మధ్య దూరంగా కవి వర్ణన)
ఈ విషయాన్ని నాసావాళ్లు స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే నాసా(NASA) శాస్త్రఙ్ఞులు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఇంత ఖచ్చితంగా చెప్పలేదు.
హనుమంతుడు భువి నుండి సూర్యుణ్ణి చూసి దానిని ఒక తినే పండుగా భావించి సూర్య మండలానికి చేరుకున్నాడని మన ఇతిహాసాలు తెలిపిన విషయాలలో వాస్తవికతను గ్రహించిన విదేశీయులు ఆశ్చర్యచకితులవుతున్నారు.
ఇప్పుడు గాయత్రీ మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం. మహిమ అనంగానే అదేదో మ్యాజిక్కు, మాయ అని కాకుండా మహిమను ఙ్ఞానమార్గంగా తీసుకుందాం. అప్పుడే ఙ్ఞానాభివృధ్ధి కలుగుతుంది.
అమెరికన్ శాస్త్రవేత్త డా.హోవార్డ్ స్టెయిన్జెరిల్.. గాయత్రీ మంత్ర బీజాక్షరముల ధ్వనులపై తనయొక్క లేబొరేటరీలో పరిశోధన చేయగా అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు…
ఆయన తెలిపిన వివరాలు ఏంటంటే…
గాయత్రీ మంత్రం ఉఛ్ఛారణ జరుగుతున్నప్పుడు 1,10,000 ధ్వని తరంగాలు ఒక్క సెకనులోనే విడుదలయ్యాయని, ఈ ప్రపంచంలో మరే శ్లోకానికి గాని, పదాలకు గాని ఇంతటి శక్తి లేదని తేల్చి చెప్పాడు.
గాయత్రీ మంత్రోఛ్చారణ సమయంలో బీజాక్షర విస్ఫోటనం సంభవిస్తుంది. అది వినినా లేదా పఠించిన అయా వ్యక్తులకు మానసిక వికాసం పరిఢవిల్లుతుంది అని ఆ తర్వాత జరిపిన పరిశోధనల్లో కూడా అది స్పష్టమయింది.
ఈ విషయాన్ని గ్రహించిన ఎన్నో ఇతర దేశాలు గత రెండు సంవత్సరముల నుండి సూర్యోదయ సమయమందు పఠనం లేదా శ్రవణం చేయడం వారి జీవితాలలో ఒక భాగంగా చేసుకున్నారు.
వేల సంవత్సరాల క్రితమే మనకున్న విఙ్ఞానం అలాంటిది…!
ఇదీ మన భారత వైశిష్ట్యం…
ఇదీ మన వేద విఙ్ఞాన సారం…
ప్రతి భారతీయుడికి గర్వకారణం…
మన ఈ విఙ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం
Read More

॥ మహామహిమాన్వితం ఆదిత్యస్తోత్రమ్ ॥॥ మహామహిమాన్వితం ఆదిత్యస్తోత్రమ్ ॥

అథ శ్రీమదప్పయ్యదీక్షితవిరచితం మహామహిమాన్వితం ఆదిత్యస్తోత్రమ్ ॥

విస్తారాయామమానం దశభిరుపగతో యోజనానాం సహస్రైః
చక్రే పఞ్చారనాభిత్రితయవతి లసన్ నేమిషట్కే నివిష్టః ।
సప్తచ్ఛన్దస్తురఙ్గాహితవహనధురో హాయనాంశత్రివర్గ
వ్యక్తాకౢప్తాఖిలాఙ్గః స్ఫురతు మమ పురః స్యన్దనశ్చణ్డభానోః ॥ ౧॥


ఆదిత్యైరప్సరోభిర్మునిభిరహివరైర్గ్రామణీయాతుధానైః
గన్ధర్వైర్వాలఖిల్యైః పరివృతదశమాంశస్య కృత్స్నం రథస్య ।
మధ్యం వ్యాప్యాధితిష్ఠన్ మణిరివ నభసో మణ్డలశ్చణ్డరశ్మేః
బ్రహ్మజ్యోతిర్వివర్తః శ్రుతినికరఘనీభావరూపః సమిన్ధే ॥ ౨॥

నిర్గచ్ఛన్తోఽర్కబిమ్బాన్ నిఖిలజనిభృతాం హార్దనాడీప్రవిష్టాః
నాడ్యో వస్వాదిబృన్దారకగణమధునస్తస్య నానాదిగుత్థాః ।
వర్షన్తస్తోయముష్ణం తుహినమపి జలాన్యాపిబన్తః సమన్తాత్
పిత్రాదీనాం స్వధౌషధ్యమృతరసకృతో భాన్తి కాన్తిప్రరోహాః॥ ౩॥

శ్రేష్ఠాస్తేషాం సహస్రే త్రిదివవసుధయోః పఞ్చదిగ్వ్యాప్తిభాజాం
శుభ్రాంశుం తారకౌఘం శశితనయముఖాన్ పఞ్చ చోద్భాసయన్తః ।
ఆరోగో భ్రాజముఖ్యాస్త్రిభువనదహనే సప్తసూర్యా భవన్తః
సర్వాన్ వ్యాధీన్ సుషుమ్నాప్రభృతయ ఇహ మే సూర్యపాదాః క్షిపన్తు ॥ ౪॥

ఆదిత్యానాశ్రితాః షణ్ణవతిగుణసహస్రాన్వితా రశ్మయోఽన్యే
మాసే మాసే విభక్తాస్త్రిభువనభవనం పావయన్తః స్ఫురన్తి ।
యేషాం భువ్యప్రచారే జగదవనకృతాం సప్తరశ్మ్యుత్థితానాం
సంసర్పే చాధిమాసే వ్రతయజనముఖాః సత్క్రియాః న క్రియన్తే ॥ ౫॥

ఆదిత్యం మణ్డలాన్తఃస్ఫురదరుణవపుస్తేజసా వ్యాప్తవిశ్వం
ప్రాతర్మధ్యాహ్నసాయం సమయవిభజనాదృగ్యజుస్సామసేవ్యమ్ ।
ప్రాప్యం చ ప్రాపకం చ ప్రథితమతిపథిజ్ఞానినాముత్తరస్మిన్
సాక్షాద్ బ్రహ్మేత్యుపాస్యం సకలభయహరాభ్యుద్గమం సంశ్రయామి ॥ ౬॥

యచ్ఛక్త్యాఽధిష్ఠితానాం తపనహిమజలోత్సర్జనాదిర్జగత్యామ్
ఆదిత్యానామశేషః ప్రభవతి నియతః స్వస్వమాసాధికారః ।
యత్ ప్రాధాన్యం వ్యనక్తి స్వయమపి భగవాన్ ద్వాదశస్తేషు భూత్వా
తం త్రైలోక్యస్య మూలం ప్రణమత పరమం దైవతం సప్తసప్తిమ్ ॥ ౭॥

స్వఃస్త్రీగన్ధర్వయక్షా మునివరభుజగా యాతుధానాశ్చ నిత్యం
నృత్తైర్గీతైరభీశుగ్రహనుతివహనైరగ్రతః సేవయా చ ।
యస్య ప్రీతిం వితన్వన్త్యమితపరికరా ద్వాదశ ద్వాదశైతే
హృద్యాభిర్వాలఖిల్యాః సరణిభణితిభిస్తం భజే లోకబన్ధుమ్ ॥ ౮॥

బ్రహ్మాణ్డే యస్య జన్మోదితముషసి పరబ్రహ్మముఖ్యాత్మజస్య
ధ్యేయం రూపం శిరోదోశ్చరణపదజుషా వ్యాహృతీనాం త్రయేణ ।
తత్ సత్యం బ్రహ్మ పశ్యామ్యహరహమభిధం నిత్యమాదిత్యరూపం
భూతానాం భూనభస్స్వః ప్రభృతిషు వసతాం ప్రాణసూక్ష్మాంశమేకమ్ ॥ ౯॥

ఆదిత్యే లోకచక్షుష్యవహితమనసాం యోగినాం దృశ్యమన్తః
స్వచ్ఛస్వర్ణాభమూర్తిం విదలితనలినోదారదృశ్యాక్షియుగ్మమ్ ।
ఋక్సామోద్గానగేష్ణం నిరతిశయలసల్లోకకామేశభావం
సర్వావద్యోదితత్వాదుదితసముదితం బ్రహ్మ శమ్భుం ప్రపద్యే ॥ ౧౦॥

ఓమిత్యుద్గీథభక్తేరవయవపదవీం ప్రాప్తవత్యక్షరేఽస్మిన్
యస్యోపాస్తిః సమస్తం దురితమపనయత్వర్కబిమ్బే స్థితస్య ।
యత్ పూజైకప్రధానాన్యఘమఖిలమపి ఘ్నన్తి కృచ్ఛ్రవ్రతాని
ధ్యాతః సర్వోపతాపాన్ హరతు పరశివః సోఽయమాద్యో భిషఙ్నః ॥ ౧౧॥

ఆదిత్యే మణ్డలార్చిః పురుషవిభిదయాద్యన్తమధ్యాగమాత్మ-
న్యాగోపాలాఙ్గనాభ్యో నయనపథజుషా జ్యోతిషా దీప్యమానమ్
గాయత్రీమన్త్రసేవ్యం నిఖిలజనధియాం ప్రేరకం విశ్వరూపమ్ ।
నీలగ్రీవం త్రినే(ణే)త్రం శివమనిశముమావల్లభం సంశ్రయామి ॥ ౧౨॥

అభ్రాకల్పః శతాఙ్గః స్థిరఫణితిమయం మణ్డలం రశ్మిభేదాః
సాహస్రాస్తేషు సప్త శ్రుతిభిరభిహితాః కిఞ్చిదూనాశ్చ లక్షాః ।
ఏకైకేషాం చతస్రస్తదను దినమణేరాదిదేవస్య తిస్రః
కౢప్తాః తత్తత్ప్రభావప్రకటనమహితాః స్రగ్ధరా ద్వాదశైతాః ॥ ౧౩॥

దుఃస్వప్నం దుర్నిమిత్తం దురితమఖిలమప్యామయానప్యసాధ్యాన్
దోషాన్ దుఃస్థానసంస్థగ్రహగణజనితాన్ దుష్టభూతాన్ గ్రహాదీన్ ।
నిర్ధూనోతి స్థిరాం చ శ్రియమిహ లభతే ముక్తిమభ్యేతి చాన్తే
సఙ్కీర్త్య స్తోత్రరత్నం సకృదపి మనుజః ప్రత్యహం పత్యురహ్నామ్ ॥ ౧౪॥

॥ ఇతి శ్రీమదప్పయ్యదీక్షితవిరచితశ్రీమదాదిత్యస్తోత్రరత్నమ్ ॥
Read More

అనంత పద్మనాభ స్వామి దేవాలయం


అనంత పద్మనాభ స్వామి దేవాలయం
ప్రపంచంలో మొట్ట మొదటిసారి, బుల్లెట్ ద్వారా కాకుండా, బాలెట్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తెచ్చిన కేరళ రాష్ట్రంలో, రాష్ట్ర రాజధాని నగరం తిరువనంతపురానికి మూడు-నాలుగు మైళ్ల దూరంలో-దాదాపు నగరం నడి బొడ్డులోనే, గత కొన్ని వారాలుగా జాతీయ అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తల్లోకెక్కిన "పద్మనాభ స్వామి మందిరం" గా మళయాళంలో పిలువబడే ప్రాచీన "శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం" వుంది. ఎవరెవరి వూహకందిన విధంగా వారి వారి అంచనాల ప్రకారం, కోట్ల కోట్లాది రూపాయల విలువగల అపార సంపద ఆ దేవాలయం నేల మాళిగలలో నిక్షిప్తమై వుందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి పోవడంతో, న్యాయమూర్తుల ఆదేశానుసారం, ఆ నిధి నిక్షేపాలను వెలికితీయడం మొదలైంది. ఇదమిద్ధంగా ఇంతని అధికారికంగా విలువలు వెలువడకపోయినా, లభ్యమైన సంపద అంతులేనిది, అపారమైనది అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే, దేవాలయానికి, దేవాలయంలోని అనంత పద్మనాభుడుకి, ఆ మందిరం భూగర్భంలో వెలువడిన వెలువడుతున్న విలువకట్టలేని నిధులకు, ఏకంగా అంతరిక్ష పహారాతో పటిష్టమైన బధ్రతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గగన తలంలోని ఉపగ్రహ సేవలను ఇందుకోసం వినియోగించుకునేందుకు రంగం సిద్ధమవుతోంది
వైష్ణవుల ఆరాధ్యదైవం పద్మనాభుడు. చారిత్రక నేపథ్యం, పౌరాణిక విశిష్టత సంతరించుకున్న సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం తిరువనంతపురం. సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం అక్కడ కట్టబడిన, అత్యంత పురాతనమైన అనంత పద్మనాభుడి ఆలయం ఒకప్పుడు "ఎట్టువీట్టిల్ పిల్ల మార్" అనే ఎనిమిది కుటుంబాల వారి నిర్వహణలో వుండేది. తర్వాతి కాలంలో ట్రావెన్ కోర్ సంస్థాపకుడైన కేరళ రాజు మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని, 1729 సంవత్సరంలో పునరుద్ధరించి, ఆలయానికి తామే సమస్తమంటూ ప్రకటించి, ఆలయంలోని శంఖాన్ని తమ సంస్థానానికి సంకేతంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం 1566 లోనే నిర్మించారు. 10008 సాల గ్రామాలతో రూపు దిద్దుకున్న ఈ ఆలయాన్ని ఆసాంతం చూడాలంటే వరుసగా మూడు ద్వారాలను దర్శించుకోవాల్సిందే. నేటికి ఈ ఆలయం ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకుల ఆధీనంలోనే ఉంది. ఇక్కడ దీర్ఘ చతురస్రంగా వున్న వరండా నిర్మించడానికి 4000 మంది తాపీ పనివారు, 6 వేల మంది నిపుణులు, 100 ఏనుగులను ఉపయోగించి 7 నెలల్లో పూర్తిచేసారని అంటారు. ఈ దేవాలయ ప్రాంగణం 7 ఎకరాల వరకుంటుంది. ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచంతో తయారు చేయబడిన ఈ దేవాలయం ధ్వజ స్తంభం ఎత్తు 80 అడుగులు.
1750 ప్రాంతంలో ట్రావన్‌ కోర్‌ను పరిపాలించిన మార్తాండ వర్మ అనంతపద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేశాడు. ఇక నుంచి రాజులు అనంతపద్మనాభుని సేవకులుగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ట్రావన్‌ కోర్ రాజులకు అనంత పద్మనాభ దాస అనే బిరుదు కూడా వచ్చింది. ఆలయం నుంచి లభించిన అపార సంపద ట్రావన్‌ కోర్ రాజవంశం వారసులకు చెందుతుందని పలువురు అంటున్నా, రాజ వంశానికి చెందిన వారు మాత్రం ఆ సంపద అంతా అనంత పద్మనాభుడికే చెందుతుందనడం వారి అపార భక్తికి నిదర్శనం. ట్రావన్‌ కోర్ రాజులు అనంత పద్మనాభుడుని సర్వస్వంగా భావించి, ఆరాధించారు. మార్తాండ వర్మ కాలంలోనే ఆలయానికి అపార సంపద సమకూరి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ దేవాలయంలో దైవ దర్శనమంటే, ఆదిశేషుడి మీద శయనించి ఉన్న అనంత పద్మనాభుడి 18 అడుగుల మూర్తిని మూడు ద్వారాల నుంచి-ముఖాన్ని దక్షిణ ద్వారం నుండి, పాదాలను ఉత్తర ద్వారం నుండి, నాభిని మధ్య ద్వారం నుండి దర్శించు కోవడమే. పదివేల ఎనిమిది సాల గ్రామాలతో రూపు దిద్దుకొని, అమూల్యమైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్వామి ధగధగా మెరిసిపోతూ దర్శనం ఇస్తారు. ఆదిశేషుడిపై యోగనిద్రలో వుండే విగ్రహం ఎదుట వుండే మండపం పై కప్పు ఒకే ఒక్క గ్రైనేట్ రాయితో మలచింది. ట్రావెన్ కోర్ రాజు తమ ఇలవేల్పుగా భావించిన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు, నిత్య ఆలయానికి వెళ్లడం ఆనవాయితీ. శ్రీ మహావిష్ణువు యోగనిద్రా మూర్తిగా దర్శనం ఇచ్చే అనంత పద్మనాభ స్వామి ఆలయం అపురూప శిల్పకళకు నిలయం. ఆలయం లోని స్తంభాలపై అనేక రకాల శిల్పాలు చెక్క బడి వుంటాయి. శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో అనంతపద్మనాభ క్షేత్రం ఒకటి. విష్ణుమూర్తి ఇక్కడ మూడు భంగిమల్లో... శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని దర్శనం ఇస్తారు. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. తమిళ ఆళ్వారుల ప్రబంధాల్లో ఈ ఆలయం ప్రస్తావన కనిపిస్తుంది. ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. పురుషులు పంచె, ఉత్తరీయం, స్త్రీలు చీరె ధరించి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తారు.
"పద్మ నాభ" అంటే పద్మం ఆకారంలో ఉన్న నాభి కల వాడని అర్థం. యోగ నిద్రా మూర్తిగా శయనించి ఉండగా, నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై వున్న అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ రూపం, నయనానందకరంగా కనిపిస్తుంది భక్తులకు. శేషుడు మీద శయనించిన శ్రీ మహావిష్ణువు చేతి కింద శివ లింగం కూడా ఉంటుంది. ఈ విధంగా, ఆలయం, త్రిమూర్తులకు నిలయంగా వెలిసిపోతుంటుంది. గర్భగుడిలో మూలవిరాట్టు వెనుక, కుడి, ఎడమ గోడల మీద అపురూపమైన దేవతామూర్తుల చిత్రాలు ఉంటాయి. శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీమహావిష్ణువు ఉత్సవ మూర్తుల విగ్రహాల్ని కూడా భక్తులు దర్శించుకునే వీలుంటుందిక్కడ. ఆలయంలో నరసింహ, అయ్యప్ప, గణపతి, శ్రీకృష్ణ, హనుమ, విష్వక్సేన, గరుడ ఆలయాలు కూడా ఉన్నాయి. శిల్పాలు, పంచ లోహాలు, చెక్కలో అందంగా మలచిన దేవతామూర్తులు ఈ ఆలయంలో దర్శనం ఇస్తాయి. గర్భగుడితో పాటు గాలి గోపురం మీద కూడా అందమైన శిల్పాలు దర్శనం ఇస్తాయి. ఆలయం ముందు పద్మ తీర్థం అనే కోనేరు ఉంటుంది. ఆలయం లోపల 80 ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడి విశేషం. ఆలయ ప్రాంగణంలో ఉన్న బలిపీఠం మండపం, ముఖమండపాల్లో కూడా దేవతామూర్తుల అపురూప శిల్పాలు కనిపిస్తాయి. ప్రధాన ఆలయ మండపం ఒక మహాద్భుతం. 365 రాతి స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ రాతి స్తంభాలతో పాటు మండపం పై కప్పు మీద కూడా దేవతామూర్తుల శిల్పాలను అందంగా చెక్కడం విశేషం. శిల్పుల కళా ప్రతిభ అంతా ఇక్కడ పోత పోసుకుందా అనిపిస్తుంది.
ద్రావిడ శైలి వాస్తు శిల్ప శాస్త్రం ఆధారంగా నిర్మించిన పద్మనాభ మందిరం వివరాలు చాలా వరకు మధ్య కాలీన తమిళ ఆళ్వారుల దివ్య ప్రబంధాలలో చెప్పడం జరిగింది. ఆరు-ఏడు శతాబ్దాల కాలంలో రూపు దిద్దుకున్న ఈ దేవాలయ నిర్మాణం, మధ్య యుగపు చేరా వంశీ యుల కాలం వరకూ మార్పులూ చేర్పులూ చోటుచేసుకుంటూ, పదహారవ శతాబ్దిలో గోపురం కట్టేంతవరకు కొనసాగింది. ఆ మాటకొస్తే, పద్ధెనిమిదవ శతాబ్దంలో కూడా పునరుద్ధరణ పనులు జరిగాయక్కడ. కేరళ రాష్ట్ర రాజధాని "తిరువనంతపురం" పేరు కూడా ఈ దేవాలయంలోని దేవుడి పేరు ఆధారంగానే వచ్చింది. "తిరు అనంత పురం" అంటే, అనంత పద్మనాభ స్వామి నిలయమైన పవిత్ర స్థలం అని అర్థం. భారత దేశాన్ని పాలించిన రాజుల్లో, చేరా రాజవంశం అతి ప్రాచీనమైన రాజ వంశంగా చరిత్రకారులు అంటుంటారు. చోళులతోను, పాండ్యులతోను కలిసిన చేరా రాజవంశీయులు, ఉమ్మడిగా దక్షిణ భారతంలోని మూడు ప్రధాన తమిళ రాజ్యాలను నెలకొల్పారు. సంగం తరం రాజ వంశీ యుల కంటే ముందు నుండి, పన్నెండవ శతాబ్దం వరకు దక్షిణ భారత దేశాన్ని ఏలిన చేరా రాజులు, తమ పరోక్ష వారసులుగా వేనాడ్ చేరా వంశస్త్తులుగా తయారు చేశారు. చేరా రాజ వంశం వారసులే ఐన, కులశేఖర వంశానుక్రమం నుంచి వచ్చిన "ట్రావన్ కోర్ రాజులు" "పద్మనాభ సేవకులు" గా తమను తామే భావించుకుని, అనంత పద్మనాభ స్వామి దేవాలయం నిర్వహణ బాధ్యతలు నిర్వహించుకుంటూ వస్తున్నారు అనాదిగా.
కేరళ రాష్ట్రంలోని పదకొండు దివ్య ప్రదేశాలలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటని తమిళ ఆల్వార్ ప్రబంధ గ్రంధాలలో వుంది. బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ-నాలుగు పురాణాలలో ఈ దేవాలయం ప్రస్తావన వుంది. ఎనిమిదవ శతాబ్దపు ఆల్వార్ కవి "నమ్మాళ్వార్" పద్మనాభ స్వామి దేవాలయం గురించి పొగడుతూ, నాలుగు శ్లోకాలను, ఒక ఫల శృతిని తన రచనలలో పొందుపరిచారు. దేవాలయంలో ఇప్పుడున్న వంద అడుగుల-ఏడంతస్తుల గోపురం పునాదులు 1566 లోనే పడ్డాయి. "పద్మ తీర్థం" అనే విశాలమైన చెరువు సరస్సును ఆనుకుని వుంటుంది దేవాలయం. 365 గ్రానైట్ రాతి స్తంభాలతో కూడిన విశాలమైన దేవాలయ ప్రాకారం, తూర్పు దిశగా విస్తరించి, గర్భ గుడిలోకి దారితీస్తుంది. ప్రాకారం నుండి లోనికెళ్లే ప్రధాన ద్వారం ముందర ఎనభై అడుగుల జండా స్తంభం వుంది. తూర్పు దిక్కుగా వున్న ప్రధాన ద్వారం సమీపంలో, గోపురం కింది భాగానున్న మొదటి అంతస్తును "నాటక శాల" అని పిలుస్తారు. మళయాళం పంచాంగం ప్రకారం, మీనం, తులం నెలల్లో, ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు ఆలయ ప్రాంగణంలో నిర్వహించే "పది రోజుల ఉత్సవాల" లో భాగంగా, దేవాలయ కళకు సంబంధించిన "కథాకళి" కార్యక్రమాన్ని ఈ నాటక శాలలోనే ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు.
అనంత శయనుడి విగ్రహాన్ని రూపొందించడానికి వాడిన సాల గ్రామాలను, నేపాల్ లోని గండకి నది ఒడ్డునుంచి తెప్పించారు. సాల గ్రామాలను ఏనుగులపై వూరేగించుకుంటూ అక్కడకు తెచ్చారట. ప్రతి సాల గ్రామం పైన ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమంతో తయారుచేసిన పదార్థాన్ని, అతకడానికి వీలయ్యే ప్లాస్టర్ లాగా ఉపయోగించారట. క్రిమి కీటకాల నుంచి విగ్రహం కాపాడబడ్డానికి అలా చేశారంటారు. నిత్యం జరిగే పూజా కార్యక్రమాలకు పుష్పాలను ఉపయోగిస్తారు. అభిషేకానికి ఉత్సవ విగ్రహాలనే వాడుతారక్కడ. గర్భ గుడి ముందుండే ఎత్తైన ప్రదేశాన్ని "ఒట్టక్కళ్ మండపం" అంటారు. పూజ చేయాలన్నా, దర్శనం చేసుకోవాలన్నా, ఆ మండపం ఎక్కాల్సిందే. దర్శనం కావాలంటే, మూడు ద్వారాలు దాటాల్సిందే. ఒక్క ట్రావన్ కోర్ రాజు మినహా ఎవరికీ సాష్టాంగపడి ప్రణామం చేసే అర్హత లేదక్కడ. ఆ రాజులు మాత్రమే "పద్మనాభ సేవకులు" గా పిలువ బడుతారు.
శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో, మూడు భంగిమల్లో ఏదో ఒక భంగిమలో మాత్రమే స్వామి దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ దేవాలయంలో మాత్రం, శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని స్వామి దర్శనం ఇస్తారు స్వామి. మరొక విశేషమైన అంశం, అదీ, ఇటీవలే బయట పడిందింకొకటుంది. పద్మనాభ స్వామి విగ్రహం, ముఖం, ఛాతీ మినహా, పూర్తిగా బంగారంతో చేయబడిందే కావడం. ఆయుర్వేద మిశ్రమం ఉపయోగించడానికి కూడా బలీయమైన కారణం వుంది. ముస్లిం రాజుల దండయాత్రలలో విగ్రహాలను ధ్వంసం కాకుండా కాపాడుకోవడానికి దాన్ని ఉపయోగించి వుండొచ్చు. స్వామి కిరీటం, చెవులకున్న కుండలాలు, ఛాతీని అలంకరించిన భారీ సాల గ్రామ మాల, మొత్తం ఛాతీ భాగం, శివుడి విగ్రహం వున్న చేతికున్న కంకణం, కమలం పట్టుకున్న ఎడమ చేయి, నాభి నుండి బ్రహ్మ వున్న కమలం వరకున్న తీగ, స్వామి పూర్తి పాదాలు కూడా బంగారు మయమే.
పద్మనాభ స్వామి దేవాలయం పుట్టు పూర్వోత్తరాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారక్కడి వారు. "విల్వ మంగళతు స్వామియార్" గా ప్రసిద్ధికెక్కిన దివాకర ముని, శ్రీ కృష్ణ భగవానుడి దర్శనం కొరకు ప్రార్థన చేశాడట. ఆయనను కరుణించేందుకు, భగవంతుడు, మారు రూపంలో-ఒక అల్లరి పిల్లవాడుగా దివాకర ముని వద్దకు వచ్చాడు. ముని పూజలో వుంచిన ఒక సాల గ్రామాన్ని తీసుకుని మింగడంతో, కోపంతో పిల్ల వాడిని తరిమికొట్టగా, ఆ రూపంలో వున్న శ్రీ కృష్ణుడు సమీపంలో వున్న ఒక చెట్టు పక్క దాక్కున్నాడు. మరు క్షణమే పడిపోయిన ఆ వృక్షం, విష్ణు మూర్తిగా మారి పోయి, శయన భంగిమలో అనంత శయనంగా యోగ నిద్రా మూర్తి తరహాలో కనిపించింది. అలా జరిగిన ఆ సందర్భంలో, ఆయన రూపం ఆకారం ఎంతో పెద్దగా వుండడంతో, దివాకర ముని, అంత పెద్ద ఆకారాన్ని పూర్తిగా తన తనివి తీరా దర్శించుకోలేక పోతున్నానని, దాంట్లో మూడో వంతుకు తగ్గమని ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలను అంగీకరించిన భగవంతుడు, అలానే తగ్గిపోయి, తనను దర్శించుకోవాలంటే, మూడు ద్వారాల గుండా మాత్రమే వీలుంటుందని అంటాడు. ఇప్పుడున్న ఆ మూడు ద్వారాలు రావడానికి అదే కారణమంటారు. ఏడు పరశురామ క్షేత్రాలలో ఒకటైన పవిత్ర స్థలంలో, పద్మనాభ స్వామి దేవాలయం వుందని మరొక నమ్మకం. స్కంద, పద్మ పురాణాలలో, ఈ దేవాలయానికి సంబంధించిన విశేషాలున్నాయి.
కేరళలో అత్యంత ప్రధానమైన పండుగ ఓనం. ఏటేటా, ఆ పండుగను పురస్కరించుకుని, శతాబ్దాల కాలం నుంచి, తమిళనాడులోని కాంచీపురం నుండి తిరువనంతపురం వలస వచ్చిన, సంప్రదాయ కుటుంబ కళాకారులు, పద్మనాభుడుకి అపురూపమైన కాల్పనిక చిత్రాలను కానుకగా ఇచ్చే సంప్రదాయం వుంది. చెక్కలపై విష్ణుమూర్తి అవతారాల కాల్పనిక చిత్రాలను, అత్యంత రమణీయంగా రూపొందించి, "ఓనవిల్లులు" గా పిలువబడే ఈ బహుళ రంగుల చిత్ర కళాఖండాలను, ఆలయంలో జరుపుకునే ఓనం సంబరాల సందర్భంగా, "తిరువోనం" రోజున, భగవంతుడికి సమర్పించు కుంటారు. పద్దెనిమిదవ శతాబ్దంలో, పద్మనాభ స్వామి ఆలయాన్ని పునరుద్ధరించిన, నాటి ట్రావెన్ కోర్ రాజు మార్తాండ వర్మ పిలుపు మేరకు, తమిళనాడు నుంచి వచ్చి పని చేసిన, "వణియమ్మూల విలాయిల్" కుటుంబీకుల సంతతికి చెందిన ఈ తరం ప్రధాన కళాకారుడు, బిన్ కుమార్, నాటి పరంపరను ఈ ఏడాది కూడా కొనసాగించే పనిలో తమ కుటుంబీకులు నిమగ్నమై వున్నారని అంటున్నారు. సుమారు వేయి చిత్రాలకు పైగా తయారు చేసి, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరుగనున్న ఓనం పండుగ కల్లా, అనంత పద్మనాభుడుకి కానుకగా అందచేసే ప్రయత్నంలో కళాకారులున్నారు.
పురాతన ఆలయాలన్నింటికీ అపారమైన సంపదలున్నాయి. ఆస్తులు కొదవ లేదు. వేలాది ఎకరాల భూములు, నగదు ఉండటం మామూలే. అయితే అనంత పద్మనాభుడి ఆస్తులు ఇతర దేవాలయాలతో పోల్చదగినవి కాదు. తిరుమలేశుని సంపద కంటే ఎక్కువే. ఇటీవల దేవాలయంలోని నేలమాళిగలో బయట పడిన నిధులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనంత పద్మనాభుడి ఆలయంలో ధన కనక రాశులను భద్రపరిచే రహస్య భూ గృహాలు ఆరున్నాయి. వీటిలో దేవుడి సంపద కొంత దాగుందని ఒకప్పుడు కొందరికి, ఇప్పుడు అందరికీ తెలిసిన రహస్యం. ఈ సంపదను ఎప్పుడూ ఎవరూ లెక్కించిన ఆనవాళ్లు లేనట్లే. రాళ్లతో మూసివుండే ఈ గదుల్లో కొన్నింటిని తెరిచి దాదాపు 150 ఏళ్లు దాటిపోయింది.1860 లో కొన్ని గృహాలను ఏదో కారణం వల్ల మూసి వేశారు. 1950లో కొన్నింటిని సీల్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఆలయాలన్నింటినీ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినప్పటికి, పద్మ నాభస్వామి ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులు తమ పర్యవేక్షణలోనే ఉంచుకున్నారు. ఇప్పటికీ ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకులే దీని కార్య నిర్వహణ ట్రస్టీలుగా కొన సాగుతున్నారు.
ప్రస్తుతం, ఉత్తర దామ్ తిరుణాళ్ ఈ ఆలయ ట్రస్టీగా ఇంకా కొనసాగుతున్నారు. ఆలయ సంపద నిర్వహణలో అక్రమాలు నెల కొన్నాయని, వీటిని గాడిలో పెట్టాలని సుందర రాజన్ అనే న్యాయవాది 2011 లో, సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దేవాలయాన్ని నిర్వహించే ట్రస్టుకు, ఆస్తులు సంరక్షించే శక్తి సామర్థ్యాలు లేవని సుందర రాజన్ తన పిటీషన్లో ఆరోపించారు. అగ్నిమాపక దళం శాఖకు చెందిన ప్రభుత్వాధికారులను, పురావస్తు శాఖకు చెందిన అధికారులను, గర్భ గుడిలోని రహస్య గృహాలను తెరిచి తనిఖీ చేసి చూడాల్సిందిగా, వారికి కనిపించిన వస్తువులేంటి తేల్చాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
Read More

మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను ... ప్రాధాన్యతను కలిగివుంది

మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను ... ప్రాధాన్యతను కలిగివుంది.శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే 'శ్రావణ మాసం'గా భావించబడుతోంది.ఈ మాసంలోనే శ్రీకృష్ణుడు, వామనుడు, హయగ్రీవుడు అవతరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఈ మాసం నారాయణుడికి ఎంత ఇష్టమో అర్థమవుతోంది. కార్తీకమాసం శివకేశవులకి ఎంత ఇష్టమైనదో, శ్రావణ మాసం లక్ష్మీపార్వతులకి అంత ప్రీతికరమైనది. సాధారణంగా శుక్రవారాన్ని ఎంతగానో ఇష్టపడేలక్ష్మీదేవి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుని మరింత ఇష్టపడుతుంది. వేంకటేశ్వరస్వామిది 'శ్రవణా నక్షత్రం' ... అందువలన ఈ మాసం అంటే అమ్మవారు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపుతుంది. శ్రావణ మాసంలో మంగళవారం ... శుక్రవారం ... పౌర్ణమి విశిష్టమైనవిగా చెబుతుంటారు.శ్రావణ సోమవారం రోజున చేసిన శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహర్షులు చెప్పడం జరిగింది. ఈ రోజున సాక్షాత్తు విష్ణు మూర్తి కూడా శివరాధాన చేస్తాడట. అందువలన ఈ రోజున పరమ శివుడిని భక్తితో అభిషేకించిన వారిని ఆయనతో పాటు విష్ణువు కూడా అనుగ్రహిస్తాడనిఅంటారు. ఇక అమ్మవారిని మంగళ గౌరీ అంటారు కనుక మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తూ 'శ్రావణ మంగళ వారం' నోము నోచుకుంటూ వుంటారు. తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోము నోచుకుంటారు.ఈ శ్రావణ మాసపు శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధించడం వలన సకల సంపదలు లభిస్తాయని చెబుతారు. అదే విధంగా గోలక్ష్మి (ఆవు)ని పూజించిన వారికి సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ... 'కనకధారా స్తోత్రం' చదువుకున్నట్టయితే, సిరిసంపదలు కలుగుతాయి.ఈ శ్రావణ మాసం పెళ్ళి అయిన, లేక పెళ్ళి కాని అడవాళ్ళకి చాలా ముఖ్యమైనది... ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమైనవి శుక్రువారాలు, మంగళవారాలు ఈ మాసంలో 4 శుక్రవారాలని శ్రావణ శుక్రవారాలు అని అంటారు ఈ 4 శుక్రవారాలు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి అమ్మవారిని పూజిస్తారు. ఇందులో 2వ శుక్రవారం చాలా ముఖ్యమైనది అది శుక్ల పక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆ రోజే “వరలక్ష్మీ వ్రతం“ చేసుకుంటాము. ఇది ముఖ్యంగా పెళ్ళి అయిన ముత్తైదువులు చేసుకుంటారు. ఈ వ్రతం వల్ల లక్ష్మీ దేవి కృపా కటాక్షాలు అందుకుని సకల సిరి సంపదలు పుత్ర పౌత్రభివృధి సుఖసంతోషాలు కలుగుతాయని ప్రతీతి. ఆ రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పూజా గృహంలో లక్ష్మీ దేవి కలశాన్ని అలంకరించి బంగారంతో చేసి ఉన్న లక్ష్మీ రూపు అమ్మవారికి పెట్టి అష్టోత్తరం పఠించి వ్రత కథ చదువుకుని నైవేద్యం సపర్పించిన తరువాత సంద్యా సమయమున ముత్తైదువులని పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. ఈ విధంగా 2 వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతము ఆచరించాలి. ఒక వేళ 2వ శుక్రవారం కుదరక పోతే 4 వరాల్లో ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు. ఈ రోజున ప్రతి ఊరు ... ప్రతి వీధి ... ప్రతి ఇల్లు వ్రతాలతో ... పేరంటాళ్ళతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి.ఈ వ్రతం జరుగుతున్న ప్రదేశాలకు లక్ష్మీదేవి నేరుగా వస్తుందని అంటారు. శ్రావణ మంగళవారాల్లో చేసే మంగళగౌరీ వ్రతాలను మంగళవారం నోములని కూడా అంటారు. ఈ వ్రతం చేసే రోజున స్త్రీలు ఉదయమే మంగళస్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని, పూజగదిలో కానీ, మరో అనువైన చోట కానీ మంటపం కట్టి దాని మధ్యన ముగ్గులతో తీర్చిదిద్ది కొబ్బరికాయకు లక్ష్మీరూపం అలంకరించి కలశస్థాపన చేసి వరలక్ష్మీ వ్రతమైతే లక్ష్మీ దేవినీ, మంగళగౌరీ వ్రతమైతేమంగళగౌరినీ ఆవాహనం చేసి, షోడశోపచారాలతో పూజిస్తారు. పూజానంతరం పసుపు పూసిన తోరం చేతికి కట్టుకొని, సాయంకాలం ఆరతి ఇచ్చి, పేరంటం చేస్తారు. తరువాత వరలక్ష్మీ వ్రతకథ మంగళగౌరీ వ్రతకథ చదువుతారు. ఆ కాలంలో దొరికే ఫలాలతో అలంకరించడం, నైవేద్యానికిఆవిరి కుడుములు వంటి తేలికైన తినుబండారాలను సిద్ధపర్చడం, అన్నింటినీ ఐదైదుగా పెట్టడం ఆచారం. ఇక శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత వుంది. ఈ 'శ్రావణపౌర్ణమి' రోజున 'రక్షాబంధన్' పండుగ జరుపుకుంటారు. జ్ఞాన స్వరూపంగా 'హయగ్రీవ స్వామి' ... పరిపూర్ణ అవతారంగా 'శ్రీ కృష్ణుడు' జన్మించింది ఈ మాసంలోనే. దైవ సంబంధమైన ఇన్ని వేడుకలకు వేదికగా నిలిచిన కారణంగానే శ్రావణమాసాన్ని అంతా ఆహ్వానిస్తారు ... ఆరాధిస్తారు
Read More

శ్రావణ మాసం అంటే శుభ మాసంశ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.

శ్రావణ సోమవారం
ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు

శ్రావణ మంగళవారం
శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.

శ్రావణ శుక్రవారం
ఈ మాసం లో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవి ని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం

శ్రావణ శనివారాలు
ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పౌర్ణమి
శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి .

జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు

రక్షా బంధనం
శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండి వస్తున్నా సంప్రదాయమేనని తెలుస్తోంది.
Read More

{ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను.}

{ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను.}వినాయకుని శ్లోకం:శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజంప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేఅగజానన పద్మార్కం గజానన మహర్నిశంఅనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.***వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభనిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదాఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః{అని నమఃస్కారం చేసుకోవాలి}***ఏకాహారతి వెలిగించాలి:{ఏకాహారతి వెలిగించి దానికి పసుపు, కుంకుమ, అక్షంతలు & పూల తో అలంకరించవలెను.}***దీపారాధన వెలిగించేటప్పుడు శ్లోకం:{యీ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి దీపం వెలిగించాలి}భోదీప దేవి రూపస్త్వం,కర్మ సాక్షిహ్య విఘ్ణకృత్,యావత్ పూజాం కరిష్యామి,తావత్వం సుస్థిరో భవ.దీపారాధన ముహూర్తః సుమూహూర్తోస్తు{పై శ్లోకం చదువుకుంటూ దీపారాధన కుంది కి పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలతో పూజ చెయ్యాలి.}***ఆచమనం:{చెయ్యి అలివేణి (ప్లేటు)లో కడుగుకోవాలి}ఓం కేశవాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}ఓం నారాయనాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}ఓం మాధవాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}{మళ్లీ చెయ్యి కడుగుకోవాలి}ఓం గోవిందయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}***{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను}కేశవనామాలు:ఓం గోవిందాయ నమఃఓం విష్ణవే నమఃఓం మధుసూధనాయ నమఃఓం త్రివిక్రమాయ నమఃఓం వామనాయ నమఃఓం శ్రీధరాయ నమఃఓం రిషీకేసాయ నమఃఓం పద్మనాభాయ నమఃఓం దామోదరాయ నమఃఓం సంకర్షణాయ నమఃఓం వాసుదేవాయ నమఃఓం ప్రద్యుమ్నాయ నమఃఓం అనిరుద్ధాయ నమఃఓం పురుషోత్తమాయ నమఃఓం అదోక్షజాయ నమఃఓం నరసింహాయ నమఃఓం అచ్యుతాయ నమఃఓం జనార్ధనాయ నమఃఓం ఉపేంద్రాయ నమఃఓం హరయే శ్రీకృష్ఱాయ నమః***యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళాతయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయమంగళమ్ ||లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవఃయేషా మిందీనరశ్యామో హృదయస్థో జనార్థనః ||ఆపదామపహర్తారందాతారం సర్వసంపదాంలోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికేశరణ్యే త్ర్యంబికేదేవి నారాయణి నమోస్తుతే ||{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమఃఓం ఉమామహేశ్వరాభ్యాం నమఃఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమఃఓం శచీపురందరాభ్యాంనమఃఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమఃఓం శ్రీ సితారామాభ్యాం నమః||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||భూశుద్ధిఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతేభూమిభారకాః |ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||{ప్రాణాయామము చేసి అక్షంతలను వెనుక వేసుకోవలెను.}ప్రాణాయామంఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||||ఓమా పోజ్యోతీరసోమృతంబ్రహ్మభూర్భువస్సువరోమ్||***అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినాయః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః ||(అని నాలుగు దిక్కులా ఉద్ధరని తో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా.)సంకల్పంమమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం(కులదైవాన్ని సంభోదించుకోవాలి"పరశ్వరుని" బదులుగా)శుభేశోభనే ముహూర్తే - శ్రీ మహావిష్ణో రాజ్ఞయాప్రవర్తమానస్య - ఆద్యబ్రహ్మణఃద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పేవైవస్వత మన్వంతరే - కలియుగేప్రథమపాదే - జంబూద్వీపేభరతవర్షే -భరతఖండే(India లో వుంటే "భరతఖండే" అని చదవాలి, U.S లో వుంటే "యూరప్ఖండే" చదవాలి)మేరోః దక్షిణ దిగ్భాగే(ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి)(శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా / గోదావర్యోః మధ్యదేశే" )కావేరి నదీ సమీపేనివాసిత గృహే(Own house అయితే "సొంత గృహే"అని చదవాలి)అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (for details check thissite:శ్రీ ఖర నామ సంవత్సరేఉత్తరాయనే(దక్షిణాయనే [6 months కి ఒక సారి మారుతుంది. See panchamgam])గ్రీష్మ ఋతువే('గ్రీష్మ ఋతువే' - 'Summer Season' / 'వర్ష ఋతువే' - 'Rainy Season' / 'వసంత ఋతువే' - 'Winter Season')జ్యేష్ఠ మాసే(తెలుగు నెల)(శ్రావణ, చైత్ర, జ్యేష్ఠ, )శుక్ల పక్షే(శుక్ల పక్షం [as the size of the moon increases] / బహుళ పక్షం [as the size of the moon decreases],కృష్ణ పక్షం)________ తిధౌ(morning ఏ తిథి start అయితే ఆ తిథే చదువుకోవాలి)(Ex: పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షస్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ or అమావాస్య.)________ వాసరే(ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి Ex: ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని.)శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరుణే,ఏవం గుణవిశేషణ విశిష్టాయాం,శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రా(Ex: భారద్వాజస )అహం __________ నామ ధేయా(భర్త పేరు చదువు కోవాలి) (Ex: సత్య ప్రకాష్)ధర్మ పత్ని ______________ నామ ధేయా,(Ex: లక్ష్మీ శైలజ)సకుటుంభాయాః సకుటుంబస్య - ఉపాత్త దురితక్షయ ద్వారా,శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం,క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం,సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం,సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే,{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను.}****కలశారాధనఅదౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజార్ధం తదంగ కలశారాధనం కరిష్యే.{కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు వేసి, కుడి చేటితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను.}కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః మూలే తత్ర స్థితోబ్రహ్మామధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపావసుంధరా ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే చైవగోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు.{శిరస్సు పైన పూజా ద్రవ్యముల పైన నీరు చల్లవలెను}ఆత్మానం సంప్రోక్ష్య, పూజ ద్రవ్యాణి సంప్రోక్ష్య.
Read More

నాగ జాతి జనము :నాగ జాతి జనము :
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాతువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

దాంతో సకల దేవతలు అంటా బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .


"విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హిమ్సించరాడు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .

దాంతో డేవాగానామంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు .

వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది . పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.

వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పానువు . వాసుకి పరమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు .

నాగ పంచమి వ్రత కద :
పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .
Read More

స్త్రీ పురుషులు దేవునికి ఎలా నమస్కారం చేయాలో చెప్పే శిల్పాలివి, తమిళనాడులో గల ఒక దేవాలయంలో భక్తులకు తెలియచెప్పడం కోసం ఎన్నో ఏళ్ల క్రితం అప్పటి రాజులు చెక్కించారు

స్త్రీ పురుషులు దేవునికి ఎలా నమస్కారం చేయాలో చెప్పే శిల్పాలివి, తమిళనాడులో గల ఒక దేవాలయంలో భక్తులకు తెలియచెప్పడం కోసం ఎన్నో ఏళ్ల క్రితం అప్పటి రాజులు చెక్కించారు.


Read More

శ్రీ గణపతి దేవాలయమ -సికింద్రాబాద్శ్రీ గణపతి దేవాలయమ -సికింద్రాబాద్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సమీపం లో వెలసిన శ్రీ గణపతి దేవాలయం వంద సంవత్సరాలకు పైన చరిత్ర గల మహిమన్మితమైన, శక్తివంతమైన దేవాలయం . ఈ క్షేత్రం లో వెలసిన విఘ్నేశ్వరుడు కరుణ కటాక్షలతో నమ్మిన వారికి శుబములు ప్రసాదిస్తాడు18వ శతాబ్దం లో బ్రిటిషు కాలం లో ఒక పాత బావి తోవ్వకల్లో లబించగా నిర్మించిన ఈ దేవాలయం దిన దినబిరుద్ది చెందుతుంది. 1932 సంవత్సరం లో ఈ దేవాలయ ఆవరణ లో శ్రీ వల్లిసేన సుబ్రమణ్య స్వామి దేవాలయమ ,శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ,శ్రీ అధిత్యాది నవగ్రహాలను ప్రతిస్టించాబడ్డాయి .శ్రీ గణపతి ఆలయం లో ఉన్న స్వామి వారు అత్యంత మహిమన్మితులు . కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం స్వామి వారు . ఈ ఆలయం లో ప్రతి నిత్యము సత్య గణపతి వ్రతము జరుగుతుంది . భాద్రపద శుద్ధ చతుర్థి నుండి పౌర్ణమి వరకు గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది . ప్రతి కృతిక నక్షత్రమున శ్రీ సుబ్రమణ్య స్వామి కి , హనుమాన్ జయన్తి సందర్భంగా ఆంజనేయ స్వామి కి , దసరా సందర్భంగా శ్రీ ఉమా మహేశ్వరీ దేవి కి విశెసమైన పూజ కార్యక్రామాలు నిర్వహించడం ఈ ఆలయ విశెశము.ఆలయం లోని రాజ గోపురం , మహామండప నిర్మాణము, శ్రీ వారి విమాన గోపుర నిర్మాణాలు , శ్రీ గణపతి స్వామి జన్మవ్రుత్తంతము మొదలగు వివరములు చాల విశేషంగా ఆకట్టుకుంటాయి .
Read More

Thursday, 20 August 2015

పార్వతి దేవి శివలింగ ప్రతిష్టలు : ఎన్నో ఉన్నప్పటికీ, కొన్ని మాత్రమె తెలియచేయుచున్నాముపార్వతి దేవి శివలింగ ప్రతిష్టలు


ఏకాంబ రేశ్వర : పార్వతి దేవి ప్రతిష్ట , కంచి పురం , తమిళనాడు .

మంగళేశ్వర ఆలయం : పార్వతి దేవి ప్రతిష్ట, సిరికుడి , తమిళనాడు .

అప్పు లింగం : పార్వతి దేవి ప్రతిష్ట, తిరువనైకావల్ , జంబుకేశ్వరం , తిరుచురా పల్లి , తమిళనాడు .

ఉత్తవేద్వే శ్వరర్ : పార్వతి దేవి ప్రతిష్ట, కుత్తాలమ్, నాగపట్టణం
Read More

రుద్రుడు చేసిన శివలింగ ప్రతిష్టలు : ఎన్నో ఉన్నప్పటికీ, కొన్ని మాత్రమె తెలియచేయుచున్నామురుద్రుడు చేసిన శివలింగ ప్రతిష్టలు :

కాశీ విశ్వేశ్వరుడు : ఈ శివలింగము రుద్రా ప్రతిష్ట . కాశి, ఉత్తర ప్రదేశ్

శ్రీ కరవేర నాదర్ : ఈ శివలింగము రుద్రా ప్రతిష్ట , బ్రహ్మపురేస్వర్ ఆలయం కరై వీరం , తిరుప్పూర్, తమిళనాడు.

తిరుతల్లి నాదర్ : భైరవ స్వరూప రుద్రుని ప్రతిష్ట , తిరు పుత్తూరు , శివ గంగ, తమిళనాడు.Read More

వేదాలు ఉపనిషత్తులు

4 వేదాలలో మొత్తం  1180 కి పైగా   ఉపనిషత్తులు ఉన్నాయి .  21  ఋగ్వేదం లో ఉపనిషత్తులు, యజుర్వేదం లో  109  ఉపనిషత్తులు,  సామవేదం లో  1000  ఉపనిషత్తులు,  అధర్వణ వేదం లో  50 ఉపనిషత్తులు ఉన్నాయి  కలియుగానికి  పట్టిన దోషం వలన కలియుగ మానవుల దురదృష్టం వలన ప్రస్తుతం మనకు  కేవలం మనకు 108  ఉపనిషత్తులు మాత్రమె లభిస్తున్నాయి. 


Read More

అతి పురాణాలు : వాటి పేర్లు

అతి పురాణాలు :
బృహన్నార   దీయ పురాణం
బృహత్ విష్ణు పురాణం
బృహత్ వామన పురాణం .
బృహత్  మత్య   పురాణం
బృహత్  స్వాయం   పురాణం
బృహత్    ధర్మ   పురాణం
బృహత్   గణేశ   పురాణం
బృహత్   కల్కి   పురాణం
బృహత్    మరీచి   పురాణం
బృహత్  విష్ణు ధర్మ   పురాణం
బృహత్   నార సింహ   పురాణం
బృహత్   ఔసనస   పురాణం
బృహత్   భాస్కర  పురాణం
బృహత్  భవిష్యోత్తర  పురాణం
బృహత్   నందికేశ్వర   పురాణం
బృహత్   కూర్మ   పురాణం
బృహత్  యుగ  పురాణం
బృహత్   దేవి   పురాణం
Read More

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి .....కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి .....

16 వ శతాబ్దం ఆదిలోనే హైదరాబాద్ నగరంలో చార్మినార్ కట్టడం నిర్మాణం జరిగినది.ఈ నిర్మాణం స్వచ్చమైన డంగు సున్నం తో నిర్మించబడినది.ఇదే రీతి గా సున్నం ఉపయోగించి ఈ దేవస్తానకట్టడం జరిగినది.ఈ నిర్మాణము యొక్క సున్నపు కట్టడము ఆలయ గోపుర మందు ఈ నాటికి చెక్కు చెదరకుండా కనిపించుచున్నది.కావున ఈ ఆలయ నిర్మాణం 16 వ శతాబ్దం లో ఉపయోగించబడిన నిర్మాణ సామాగ్రి తో నిర్మితమైనది అని నిరూపణ జరిగినది.

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఇంజాపురం గ్రామం, హైయత్ నగరం, రంగారెడ్డి జిల్లాలో కలదు.
ఆగమ వాస్తు శాస్త్రం ననుసరించి ఇంజాపురం గ్రామానికి (ఈశాన్యం) నందు ఆలయ నిర్మాణము జరిగినది.

ఈ గ్రామం యొక్క పేరు పూర్వం ఇనుజాపురం అని పిలువబడేది.కాలక్రమేనా ఇది ఇంజపురులుగా వ్యవహరించబదుచున్నధి.ఇనుజులు అనగా దేవతకు వర్తింతురు.పూర్వికులలో వంశవృక్ష పురుషుడైన బాలగొని రామస్వామి కి దైవచింతన ఆధ్యాత్మిక అనుకరణ సహజ సిద్ధముగా అవడినవని ప్రతీతి.ఇతని పొలాలొ ఆవాసం ఉండుట చే ఒకనాటి రాత్రి అతనికి ధవళ వస్త్రదారులైన ఇనుజులు కనిపించి ఇది ఇనుజ ఆవాసము -మనుజుల ఆవాసము కాదు ఇక్కడ నీవు ఆలయ నిర్మాణము సకల దేవతానుగ్రహ ప్రాప్తికి అనువుగా నిర్మించవలసింధిగా స్వప్నము లో కోరినట్లుగా వారి కుమారులైన వెంకయ్య చౌదరి గారు మరియు పాపయ్య చౌదరి గార్లు తమ తండ్రి ఈ విషయాన్నీ తెలుసుకున్నా ఇక్కడ మత సామరస్యాన్ని కాపాడుటకు అనువుగా (16వ శతాబ్దము లో వైష్ణవ,శైవ మత విబేధము ప్రజ్వరిల్లి ఉండేది).వైష్ణవ మరియు శైవ సంప్రదాయాలు అనుగుణంగా బాలజి ఆలయము మరియు శివాలయ నిర్మాణమునకు శంకుస్థాపన గావించిరి.ఇక్కడ దేవతల అనుగ్రహ ప్రాప్తి కి యజ్ఞ యాగాది క్రతువులు ఆయా మాసములలో నిర్వహించబడేవి.వీటికి ఆధారం ఈ స్థలాన్ని పరిశీలించినప్పుడు ఈ ఆలయానికి ఉత్తర ఈశాన్య భాగములలో చతురస్రాకారము లో గల శిధిలావస్థ లో ఉన్న వేదికలు వాటి చుట్టూ కట్టబడిన ఇటుక ప్రహారీలు సాక్షమిచ్చుచున్నది.ఇటుక వైశాల్యం ఒక్కొక్కటి 2 అడుగుల పొడవు 8 అంగుళాల వెడల్పు తో అక్కడక్కడ ఇప్పటికి దృగ్గోచర…మరొక ఉత్పత్యర్ధము ననుసరించి ఈ ఊరు పేరు అయిన ఇనుజ అనగా సుర్యిని యొక్క కుమార్తె అనగా స్వాతి దేవతకు వర్తించును.

అందువలన ఈ గ్రామానికి ఉత్తర భాగములలో ఉన్న ఆలయాల ప్రశస్థనము గురించి మరియు ఉత్పత్యర్ధం దృష్ట్యా ఇనుజాపురం అని స్థిరనామదేయము ఏర్పడినది.కావున ఆ ఆలయాల పరిధి లో మనుజ ఆవాసములు లేవు.ఇనుజుల ఆవాసముగా పేరుపొంది కాలానుగుణంగా నిర్వహింపబడిన ప్రశస్తము వలన ఈ గ్రామానికి ఇనుజపురం అనునామము సార్ధకమైనధి.కాల గర్బం లో అనుక్రమణ నానుడి లో ఇనుజపురం ఇంజపురము గా మారినది.

ఉపయోగించబడిన పంచలొహముల తొడుగుల యొక్క పరిశీలిన వలన (గాలి గొపురమునకు ఉన్న తొడుగు) ఈ నాటికి మెరుగు లో వన్నె తగ్గకపోవడం అనే అంశము వాడబడిన లోహ ప్రాశిస్త్యాన్ని ప్రస్పుటింపజేయుచున్నది.సాధారణముగా పంచాలోహపు విగ్రహాలు కాని తొడుగులు కాని ప్రతి నిత్యము శుబ్రపరిచనప్పుడు వానిలో తళుకు బహిర్గతం కాదు.కాని ఏ శుబ్రత లేకుండా 16 శతాబ్దం నుండి గాలి గోపురం లో కనిపించుచున్న మెరుగైన తళుకు ఆ నాటి కాలం లో వాడబడిన లోహ మిశ్రమానికి తార్కాణము.

ఏక శిలా నిర్మాణము కలిగి ఉండి పైన గల గరుడ విగ్రహపు చెక్కడము చెప్పి చెప్పకనే తిరుమల తిరుపతి దేవస్థానము లోని గరుడ స్థంభ నిర్మాణము తలపింపజేయుచున్నది.ఆలయం లోని ప్రాకార కుడ్యము మెట్లు,గర్భగుడి ఆనతి శిల్ప ప్రాశిస్త్యాన్ని ప్రస్పుటము చేయుచున్నది.ఆలయ గోపుర నిర్మాణము పూర్తిగా రాతి స్థంబాలతో సున్నపు పూత చే నిర్మింపబడి నాలుగు వందల సంవత్సరాల పూర్వము చార్మినార్ కట్టడానికి ఉపయోగించిన సున్నాన్ని తలపింపజేయుచున్నది.ఇందుకు కారణం ఈ నాటి వరకు గోపురం యొక్క కట్టడంలోని ఏ బాగము కూడా మచ్చుకైనాను నాచు,నీరు ఇతర మలినాలు కనిపించకుండా యదా విధిగా గోచరించు చున్నది.త్రిగునాత్మకతకు ప్రతిగగా అన్నట్లు ఈ ఆలయం లో వేరుగా అమ్మవారి అంతర ఆలయము లేకుండా మూలవరులు ఒకే అంతర ఆలయము లో శ్రీ దేవి,భూ దేవి,వెంకటేశ్వరులు మాత్రమే ఉన్నవి.వీరికి సాదృశ్యము గా ఈ ఆలయానికి 3 ద్వారములు మాత్రమే నిర్మింపబడినవి.ముఖ ద్వారము దాదాపు 16 అడుగులు ఒక్కక్క తలుపు 4 అడుగుల వెడల్పు తో చెక్కపై ఇనుప తొడుగులతో నిర్మింప బడినది.ఇవి ఆ నాటి మానవ నిర్మానత్మకతకు నిదర్శనము.

వెంకటేశ్వర స్వామి మరియు అమ్మవార్లు ఇక్కడ తూర్పు దిశగా దర్శనమిస్తారు.స్వామి వారి గర్బగుడి ద్వారం ముందు జయ విజయ లు తూర్పు దిశగా మరియు ఎదురుగా పశ్చిమ దిశగా గరుత్మంతుడు,హనుమంతుడు దర్శనమిస్తారు.వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పశ్చిమ దిశగా ద్వారపాలకుడి గా ఆంజనేయ స్వామి చూడ వచ్చు(సాదరంగా హనుమంతుడు దక్షిణము దిశ గానే దర్శనమిస్తారు).ఇక్కడ ఆంజనేయుడి పాదాల కింద శనిమః దేవుడు దర్శనమిస్తారు.దేశం లోనే ఇదొక అరుదైన విగ్రహం గా చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి దేవాలయం లోని సున్నం కొట్టు లో వందల సంవత్సరాల పాము (నాగరాజు) ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు.కానీ నాగరాజు యొక్క దర్శనం చేసుకున్న వాళ్ళు చాల అరుదు.వెంకటేశ్వర స్వామి దేవాలయమునకు ఈశాన్య భాగము లో ఒక పెద్ద రధం ఉండేది.ఈ రధం దాదాపు వెంకటేశ్వర స్వామి గర్బగుడి ఎత్తు ఉండేది.కానీ ఇప్పుడు అది కాలగార్బం లో కలిసి పోయింది.

ఇక్కడ శివాలయము లో గల పాన పట్టము మరియు శివ లింగము కాశి విశ్వేశ్వరుని పోలికలు కలిగి యున్నవి.గర్బగుడి లో వినాయకుడు,శివ లింగము,పార్వతి,సూర్యుడు,చంద్రుడు మరియు నంది దర్శనమిస్తారు.శివాలయం లో ద్వారపాలకుడి గా బాలాంజనేయుడు దక్షిణ దిశగా దర్శనమిస్తారు.ఆలయం ప్రహరి లోపట (శివాలయం వెనుక)పాము పుట్ట దర్శనమిస్తుంది.ఈ మధ్య కాలం లో ఇక్కడ భక్తులు సుబ్రమణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

క్షేత్రపాలకుడు – ఆంజనేయుడు :

శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవస్థానానికి క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు దర్శనమిస్తారు.ఈ ఆలయం శివాలయానికి దక్షిణం లో మరియు వెంకటేశ్వరస్వామి దేవాలయానికి పడమర దిశలో ఉండును.ఈ దేవస్థానం భూమి మొత్తానికి ఈయన కాపలాదారుడు.ఇక్కడ 41 రోజు మండలము చేసిన వారికి చాల మంచి జరుగుతుంది అని భక్తుల విశ్వాసం.ఆయనే స్వయంగా కలలోకి వస్తారని అనేక మంది భక్తులు చెబుతుంటారు.ఈ దేవస్థానం లో మొత్తం నాలుగు హనుమాన్ విగ్రహాలు ఉంటాయి.

..................తీర్థం, చిత్రాలు-గుగుల్ సౌజన్యంతో.............
Read More

Wednesday, 19 August 2015

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్ధానము, పంపనూరు..శ్రావణ మాసం వచ్చేసింది. అత్యంత వైశిష్ట్యంకల ఈ మాసంలో ఆధ్యాత్మిక భావాలుకల మహిళలకు అన్నీ పండగలే. శివుడు, పార్వతి, శ్రీ మహలక్ష్మి, శ్రీమన్నారాయణుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, ఇలా ఎందరో దేవతలను పూజించే పండగలు ఎన్నో. ఈ హడావిడంతా మనకే కాదండీ, వేరే రాష్ట్రాలవారికి కూడా వున్నదని మొన్న తమిళనాడు వెళ్ళినప్పుడు తెలిసింది. అక్కడ ఒక శివాలయానికి వెళ్తే మార్వాడీ మహిళలు (రాజస్ధాన్) శివ పార్వతుల పూజ చేస్తున్నారు సామూహికంగా. ఇవాళ ఏమైనా ప్రత్యేక పూజ వున్నదా అని అడిగితే ఒకావిడ చెప్పారు కధ జరుగుతోంది. శ్రావణ మాసంకదా ఈ నెలంతా పూజలు, కధలు జరుగుతూనే వుంటాయి అని. వాళ్ళకి శ్రావణ మాసం మొదలయిపోయింది.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజలు నాగుల చవితికి, సుబ్రహ్మణ్య షష్టికి చేస్తారు. అలాగే తెలంగాణాలో శ్రావణ మాసంలో చవితి, పంచమి రోజుల్లో చేస్తారు. పుట్టని పూజించి, పుట్టలో వున్న నాగేంద్రునికి పాలు, కోడి గుడ్లు, చిమ్మిరి, చలిమిడి సమర్పించి తమ పిల్లా పాపలని చల్లగా చూడమని ప్రార్ధిస్తారు. ఈ పండగ సందర్భంగా మనంకూడా ఒక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం దర్శించాలికదా. మీకోసం, ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక ఆలయాల సమాచారం తీసుకొచ్చాను. ముందుగా ఈ నెల 19వ తారీకున వచ్చే నాగుల పంచమి సందర్భంగా పంపనూరులోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్ధానము, పంపనూరు..
స్ధల పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో పూర్వకాలంలో మునులు తపస్సు చేసుకుంటూవుండేవాళ్ళు. అందుకనే ఈ ప్రాంతాన్ని తపోవనం అనేవారు. ఆ సమయంలో ఇక్కడ ఏడు కోనేర్లు వుండేవంటారు. ప్రస్తుతం మాత్రం ఒకటే కనబడుతుంది. 500 ఏళ్ళక్రితం, శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సమయంలో వ్యాసరాయలువారిచే ఈ దేవాలయం నిర్మించబడినది. తర్వాత కాలంలో సరైన ఆదరణ లేక శిధిలమయింది. పైగా దుండగులు ఆలయంలో నిధులున్నాయని తవ్వి పోశారు. క్రీ.శ. 1980 –90 మధ్య ఆ గ్రామస్తులు ఆలయంలో పూజాదికాలు నిర్వహించటానికి ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్న కీ.శే. వి. మధుసూదన శాస్త్రిగారిని తీసుకొచ్చారు.

పూజ నిర్వహించటానికి వచ్చిన శాస్త్రిగారు మూల విరాట్ ని చూసి ఆశ్చర్యపోయారు. అందులోని విశిష్టతని గుర్తించి అక్కడకు వచ్చినవారికి స్వామి తేజోరూపాన్ని, అలాంటి స్వామిని పూజిస్తే కలిగే ప్రభావాన్ని తెలిపారు. ఆ రోజు రాత్రి కలలో సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంతో సాక్షాత్కరించి, పంపనూరు దేవస్ధానంలో తనకు నిత్యపూజలుచేసి, నైవేద్యాలు సమర్పించి అన్నదానము చేస్తే భక్తులను అనుగ్రహిస్తానని చెప్పారు.
తెల్లవారిన తర్వాత రాత్రి వచ్చిన కల దైవ సంకల్పంగా భావించి, పంపనూరు వచ్చి అక్కడివారికి ఆ కల గురించి చెప్పారు. తర్వాత అక్కడి పెద్దలను, గ్రామస్తులను కలుపుకుని విరాళాలు సేకరిస్తూ, వాటితో ప్రతి ఆదివారం (శాస్త్రిగారికి సెలవురోజు) పూజకు, అన్నదానానికి కావలసిన సరుకులు తీసుకువచ్చి, స్వామికి శ్రధ్ధగా పూజలు, అభిషేకాలు నిర్వహించి, అన్నదానం జరిపేవారు.

భజనలు చేసేవారు. వారి పూజలకి సంతృప్తి చెందిన స్వామి కొలిచే భక్తులకు కొంగు బంగారమై తన మహిమలను చూపించసాగాడు. క్రమ క్రమంగా స్వామి మహత్యం నలు మూలలా తెలిసి దూర ప్రాంతాలనుంచి కూడా భక్తులు రాసాగారు. ముఖ్యగా వివాహం కానివారు, సంతానం లేనివారు, జాతకంలో సర్పదోషం వగైరాలు వున్నవారు, గ్రహ గతి సరిగ్గాలేనివారు ఇక్కడికి వచ్చి 9 లేక 11 మంగళవారాలుకానీ, ఆదివారాలుకానీ స్వామిని పూజించి, 108 ప్రదక్షిణలు చేస్తే వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం.

భక్తుల రాక అధికం కావటంతో దేవాలయమూ అభివృధ్ధి చెందుతూ వస్తోంది. 2004 సం. లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశీస్సులతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తల్లిదండ్రులైన శివ పార్వతులను స్వామి పక్కనే రెండు ఉపాలయాలలో ప్రతిష్టించారు. అప్పటినుంచీ, పక్క రాష్ట్రాలనుంచి కూడా భక్తుల రాక అధికమైంది. ముఖ్యంగా గ్రహ దోష నివారణకు శాస్త్రోక్తమయిన పూజలు చేయించుకోవటానికి చాలామంది వస్తున్నారు. ఇంతకీ అన్ని ఆలయాలలోను ఇలాంటివి జరుగుతూనే వుంటాయి...దీనిలో విశేషమేమి టంటారా ఈ ఆలయం మరీ పెద్దదేమీకాదు. అద్భుతమైన శిల్పకళ లేదు. కానీ ఇందులో వున్న అద్భుత మంతా మూలవిరాట్ లోనే. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహంలో శివ కుటుంబం మొత్తం దర్శనమిస్తుంది.

స్వామి విగ్రహంలోని విశిష్టతని గురించి అక్కడ ప్రధాన అర్చకులు శ్రీ నారావఝ్ఝల సీతారామమోహన్ శర్మగారు వివరించినదాని ప్రకారము, స్వామి విగ్రహము సర్ప రూపంలో వుంటుంది. పీఠంనుండి సింహతలం వరకు స్వామి ఐదు రూపాలలో దర్శనమిస్తాడు. పీఠంలో శ్రీ చక్రము వున్నది. ఇది అమ్మవారి శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. శ్రీ చక్ర స్వరూపంలో వున్న అమ్మవారు రాహుగ్రహము యొక్క అధిష్టాన దేవత. సర్పం చివరభాగము శ్రీచక్రానికి 3 1/2 సార్లు చుట్టుకోవటం మానవ శరీరంలోని వెన్నెముక చివరిభాగం మూలాధారంలో కుండలిని శక్తి రూపంతో సర్పాకారంతో మూడున్నర చుట్లు కలిగి వుండటాన్ని సూచిస్తోంది అన్నారు.

సర్ప రూపంలో క్రింద భాగము వక్రతుండ ఆకారంలో సుబ్రహ్మణ్యస్వామికి అన్నగారైన శ్రీ మహాగణపతి ఆకారంలో దర్శనమిస్తుంది. ఈ గణపతి స్వరూపం కేతుగ్రహ అధిష్టాన దేవత, మూలాధార చక్ర అధిదేవత. మూల విరాట్ లోని మధ్యభాగం శివలింగం ఆకారంతో దర్శనమిస్తుంది. ఈశ్వర స్వరూపం కాల స్వరూపుడు. కాల సర్ప అధిష్టాన దేవత. ఆయన ఆయుష్యు, ఆరోగ్య ప్రదాత.

ఇంక పైన, ఏడు పడగలు విప్పిన నాగేంద్రుని రూపాన్ని దర్శించవచ్చు. విగ్రహం చివరి భాగంలో వున్న సింహధ్వజము నరసింహ స్వరూపంగా విష్ణు తత్వాన్ని సూచిస్తుంది. ఇది శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య రాజముద్రగా భావింపబడుతోంది. స్వామికి ఇరువైపుల నెమలి పింఛాలతో కూడివున్న చక్రాలు స్వామివారి వాహనం మయూరాన్ని సూచిస్తుంది. అంతేకాదు కాలగమనంలో పంచ భూతాలు, సంవత్సర, ఆయన, ఋతు, మాస, పక్ష, తిధి, వార, నక్షత్రాలను సూచిస్తాయి.

ఇవ్వన్నీ చూస్తే మూల విరాట్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం పైన చెప్పిన విధంగా వివిధ శక్తి రూపాలతో వెలసి వుండటం, ఒకే విగ్రహంలో శివుడు, పార్వతి, గణపతి, నాగేంద్రుడు, ఇలా శివుని పరివారమంతా ఒకే చోట దర్శనము ఇచ్చే విధంగా వుండటంతో ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఏర్పడింది.

ఈ క్షేత్రంలో వున్న సర్ప రూప సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించడం ద్వారా నాగ దోషాలు, సర్ప దోషాలు, రాహు కేతు, కాల సర్ప దోషాలు, గ్రహ దోషాలు, కుజ దోష పరిహారము జరిగి, విద్య, ఉద్యోగము, వ్యాపార, వివాహ, సంతామను కలిగి సుఖ సంతోషాలతో వుంటారని భక్తుల నమ్మకం, అనుభవం. అద్భుత మూల విరాట్ నెలకొనియున్న ఈ క్షేత్రం అభివృధ్ధికి ఎక్జికూటివ్ ఆఫీసర్ శ్రీమతి బి. సుధారాణి, ప్రధాన అర్చకులు శ్రీ యన్. సీతారామమోహన్ గారు అభినందనీయ కృషి చేస్తున్నారు.
మార్గము
అనంతపురం జిల్లా, ఆత్మకూరు మండలంలో వున్న ఈ గ్రామానికి అనంతపురంనుంచి బస్సులు వున్నాయి. అనంతపురంనుంచి వెళ్ళి రావచ్చు.


పాములు పాలు తాగుతాయనే అపోహతో చాలామంది పుట్టలో పాలుపొయ్యటం, కోడిగుడ్లు, చిమ్మిలి, చలిమిడి, అరటిపండు వగైరాలు వెయ్యటం చేస్తారు. దయచేసి అలా చెయ్యవద్దు. పాములు పాలు తాగవు. పుట్టలో పాలు వగైరాలు వేసి వాటిని ఇబ్బంది పెట్టవద్దు. అసలు ఈ పుట్టలో పాలు పోయటం అనేది ఏ శాస్త్రంలోనూ చెప్పలేదని పెద్దలు అంటున్నారు. పాములను పూజించే విధానం ప్రకారం ఇంటి బయట ఆవు పేడతోగానీ, పసుపుతోగానీ పాము ఆకారం వేసి దానిని పూజించాలి. అది వీలుకాకపోతే పూజా స్ధలంలో బంక మట్టి, బియ్యంపిండి, గోధుమ పిండి, మినప పిండి (ఏదో ఒకదానితో) పాము ఆకారం చేసి పళ్ళెంలో పెట్టి దానిని పూజించాలి. ఇంట్లో ఇవ్వన్నీ చేసుకోలేనివారు, దేవాలయాలలో నాగ ప్రతిష్టలు చేసి నాగుల విగ్రహాలు పెడతారుకదా. వాటికి అభిషేకం చెయ్యవచ్చు. ఆలోచించి, ఆచరిస్తారుకదూ.
Read More

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజునకు అధిష్టాన దైవం....సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజునకు అధిష్టాన దైవం....

సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.


మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.

మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.

జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం.

సంతానప్రాప్తిని కోరే మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారు.
Read More

Friday, 14 August 2015

పుణ్యక్షేత్రమైన వారణాసి (కాశీ)పుణ్యక్షేత్రమైన వారణాసి (కాశీ)

భారతదేశంలో వుండే అతి ప్రాచీన నగరాలలో కాశీ ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగానదిలో వరుణ, అసి అనే రెండు నదులు కలుస్తాయి. దీంతో దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వుంది. బ్రిటీష్ పరిపాలకులు దీనిని బెనారస్ అనే పేరుతో పిలుచుకునేవారు.

ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేసుకోవడం వల్ల... మనం పుట్టుకనుండి చేసిన సర్వపాపాలు నశించి, పుణ్యులవుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు.. ఇక్కడ మరణించడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వశిస్తారు. ఈ వారణాసి ప్రాంతంలో అన్యమతాలవారు, ఎక్కువ జనావాసం గల నగరాలలో ఒకటి.

ఎంతో పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఈ వారణాసి ప్రాంతంలో వుంది. ఈ నగరంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన చిహ్నాలు దర్శనం ఇస్తాయి. ఈ ప్రాంతంలోనే బౌద్ధునికి సంబంధించిన సారనాత్ క్షేత్రం కూడా వుంది. కాబట్టి ఇక్కడ బౌద్ధులు, జౌనులు తరచూ సందర్శించడానికి వస్తుంటారు. ఇక్కడ హిందూ దేవాలయాలు చాలానే కొలువున్నాయి.

చరిత్ర :
పౌరాణిక గాధల సారాంశం ప్రకారం..... సుమారు 5000 సంవత్సరాల క్రితం వారణాసి నగరాన్ని శివుడు స్థాపించాడు. హిందువులకు ఎంతో పవిత్రమైన ఏడు మహానగరాలలో ఈ వారణాసి ఒకటి. ఈ నగరానికి సంబంధించి ఋగ్వేదం, రామాయణం, స్కాంద పురాణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో కూడా అన్ని విషయాలు వివరించబడ్డాయి. 18వ శతాబ్దంలో ఒక ప్రత్యేకమైన రాజ్యంగా ఏర్పడిన తరువాత బ్రిటీష్ వారు దీనిని ఒక వాణిజ్యం కేంద్రంగా మలుచుకున్నారు.

పురాణ కథనాలు :

కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు. ఆరంభకాల పూరాతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత మరియు తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్ధంలో 23వ జైనగురువు మరియు ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.

వారణాసి... ఒక పవిత్ర క్షేత్రం :

వారణాసిలో అన్యమతాలవారికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఎన్నో కొలువున్నాయి. ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎంతో విశిష్టమైన శివలింగం ఇక్కడుంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి లక్షలమంది పైగా యాత్రికులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానాలు చేసుకోవడం వల్ల సకలపాపాలు తొలగిపోవడమే కాకుండా, పునర్జన్మ నుండి విముక్తి పొందుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం.

బుద్ధుడు కూడా తను ప్రయాణించిన యాత్రస్థలాలలో కాశీనగరం గురించి బోధించాడు. వారణాసి ప్రాంతానికి సమీపంలో బుద్ధుని సారనాథ్ క్షేత్రం వుంది. అలాగే జైనులకు 23వ తీర్థంకుడైన పార్శ్వనాధుని జన్మస్థలం కూడా వారణాసియే కాబట్టి... జైనులు కూడా ఇక్కడ తరుచూ సందర్శించడానికి వస్తుంటారు.

ముస్లిములకు సంబంధించిన ఇస్లామిక్ సంస్కృతి కూడా ఇక్కడ ప్రగాఢంగా వ్యాపించి వుంది. పూర్వంలో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు కూడా ఏర్పడ్డాయి.

అలాగే ఇక్కడ హిందువులకు సంబంధించిన అనేకరకాల పుణ్యక్షేత్రాలు, మందిరాలు చాలానే కొలువున్నాయి. అందులో అన్నపూర్ణామందిరం, విశాలాక్షిమందిరం, శాంక్తా మందిరం, దుర్గా మందిరం, సంకట మోచన్ హనుమాన్ మందిరం, తులసీ మానస మందిరం, భారతమాత ఆలయం, బిర్లా మందిరం, కాలభైరవ మందిరం, కవళీ మాత ఇలా ఒక్కొక్క మందిరానికి సంబంధించి ఒక్కొక్క చరిత్ర వుంది. ముస్లిములకు సంబంధించిన మసీదులు ఇక్కడ చాలానే కొలువున్నాయి.

ముఖ్య శివ లింగాలు :

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు

విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద

మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్

ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్

కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్

త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్

కాల మాధవుడు - కథ్ కీ హవేలీ

ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్

అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్

ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్

ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్

పరమేశ్వరుడు - శంక్తా ఘాట్

హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ

వశిష్టేశ్వరుడు - శంక్తా జీ

కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్

నీల కంఠేశ్వరుడు - నీల కంఠా

ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా

కాశేశ్వరుడు - త్రిలోచన్

శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్

శుక్రేశ్వరుడు - కాళికా గలీ

మతపరమైన ఉత్సవాలు :

మహాశివరాత్రి పర్వదినంలో శివరాత్రి ఊరేగింపు మృత్యుంజయ ఆలయం నుండి విశ్వనాథ ఆలయం వరకు కొనసాగుతుంది.

తులసీ ఘాట్ వద్ద ద్రుపదునికి అంకితం ఇవ్వబడిన ఉత్సవాలు ఐదు రోజులపాటు నిర్వహించబడుతుంది. ఇది ఫిబ్రవరి- మార్చ్ మాసాల మద్య నిర్వహించబడతాయి.

సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి (మార్చ్-ఏప్రెల్) హనుమంతునికి ప్రత్యేక పూజలు, హారతి మరియు ఊరేగింపు నిర్వహించబడతాయి. 1923 నుండి హనుమాన్ సంగీత సమారోహ్ పేరిట ఐదు రోజులపాటు సాస్కృతిక సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రదర్శనకు దేశం అంతటి నుండి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలివ్వడానికి ఆహ్వానించబడుతుంటారు.

రామనగర్ రామలీలా వద్ద రామచరితమానసలో వర్ణించినట్లు రామాయణం ప్రదర్శించబడుతుంది. రామనగర్‌లో 31 రోజులు ప్రదర్శించే ఈ ప్రదర్శనకు కాశినరేష్ చేత నిధిసహాయం అందుతూ ఉంది. ఈ ఉత్సవాలకు రావణసంహారంతో ముగింపు పలుకుతారు. కాశీనరేష్ చేత 1830లో ఆరంభించబడిన ఈ ఉత్సవాలను ఇప్పటికీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

భారత్ మిలాప్ మిలాప్ పేరిట 14 సంవత్సరాల వనవాసం తరువాత రామ భరతుల సమావేశం ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఉత్సవాలను విజయదశమి మరునాడు నిర్వహించబడుతుంటాయి. కాశీరాజు తనపరివారంతో రాజరీక అలంకారలతో ఈ ఉత్సవాలలో పాల్గొంటాడు. ఈ ఉత్సవాలు అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్నాయి.

కార్తికమాస కృష్ణచవితి నాడు కాళీయుని మీద కృష్ణిని విజయానికి సంకేతంగా కాళీయమర్ధన దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కొరకు గంగాతీరంలో కదంబ వృక్ష శాఖను నాటి దాని సమీపంలో నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే బాలలు కాళీయుని శిరసులపై నృత్యం చేసి వేణుగానం వినిపిస్తుంటాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు గంగాతీరం మరియు పడవలలో ఉండి చూస్తుంటారు.

గంగాఅహోత్సవాల పేరిట ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ చేత నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలను కార్తిక పూర్ణమినాడు నిర్వహించబడుతుంటాయి. పంటల కొరకు గంగాదేవికి కృతఙత తెలుపుతూ ఈ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.

గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో మరియు పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.

ఇంతటి పవిత్రమైన ఆ పుణ్యక్షేత్ర నగరంలో ఇంకా సందర్శించడానికి చాలానే వున్నాయి. ఆర్థికపరంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది కూడా
Read More

గయాసురుడుగయాసురుడు

గయాసురుడు పురాణ ప్రసిద్ధి చెందిన తపస్వి, రాక్షసుడు. మహా విష్ణుభక్తుడు, తన తపోశక్తిచే తన శరీరమే పరమ పవిత్రంగా మలచుకుని, దానిని తాకిన వారు ముక్తి పొందేలా చేసుకోగలిగినవారు. విష్ణుభక్తితో తన శరీరాన్ని సకల తీర్థాలకన్నా పరమ పవిత్రంగా మలచుకోవడంతో వైదిక కర్మలు నశించినప్పుడు ఆయన శరీరంపై బ్రహ్మ యజ్ఞం చేసినాడు. ఆ యాగానంతరం ఆయన శరీరంలోని మూడు భాగాలు దివ్యక్షేత్రాలుగా పితరులను తరింపజేసే దివ్యధామాలుగా చేసుకునే వరం పొందారు.

కథ
గయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంతవ్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశారు. తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకొమ్మనగా నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు, అంతేకాక కీటకాలు, సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి.
ఇది కాక ఆయన చేసిన గొప్ప యాగాలు, పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్రపదవి లభించింది, అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీభ్రష్టుడయ్యారు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టానని, దానికి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుణ్ణి కోరారు. గయాసురుడు చాలా భారీకాయుడు. 576 మైళ్ళ పొడవు, 268 మైళ్ళ నడుము చుట్టుకొలత కలిగిన అతికాయుడు కాబట్టి పవిత్రమూ, విశాలమూ అయిన తన తలపై యజ్ఞం చేసుకొమ్మని అనుమతించారు.[1]
బ్రహ్మ యాగం వేడికి గయుని తల కదలడం ప్రారంభించింది. దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్దపెద్ద శిలలను గయాసురిని తలపై పెట్టసాగారు. ఆ శిలలేవీ కూడా గయాసురుని తల కదలకుండా ఆపలేకపోగా అవన్నీ చుట్టూ పడి రామపర్వతం, ప్రేతపర్వతం వంటివి ఏర్పడ్డాయి. దానితో బ్రహ్మ చివరకు మరీచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత దేవవ్రత శిలను తీసుకువచ్చి తలపై పెట్టారు. శిలారూపంలోనున్న మహాపతివ్రతను తోసివేయలేక కదలికలు కట్టడి చేసుకున్నా మొత్తానికి మానుకోలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన గదాధారుడై వచ్చి తన కుడికాలు గయాసురుని తలపై పెట్టి తొక్కిపట్టారు.[2]
గయాసురుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి నా శరీరం పరమ పవిత్రమైన తీర్థక్షేత్రంగా వరం పొందింది. నా తలపై బ్రహ్మదేవుడే యాగం చేశాడు. పతివ్రతయైన దేవవ్రత శిలారూపంలో నిలిచింది. సాక్షాత్తూ మహావిష్ణువువైన నీవే కుడిపాదాన్ని పెట్టావు. ఇన్ని పొందిన నా శిరోమధ్యపాద భాగాలు పితృదేవతలను సైతం తరింపజేసే ప్రభావశాలి, పరమ పవిత్రమూ అయిన దివ్యక్షేత్రములయ్యేట్టుగా, అవి తన పేరున వ్యవహరింపబడేట్టుగా వరం కావాలని కోరి పొందారు.
ఈ కథలోనే కొన్ని వేర్వేరు చిరు భేదాలు ఉన్నాయి. మరో కథనం ప్రకారం గయుడు ఇంద్రుడు కావడం కాక గయుని మహా ప్రభావం వల్ల ఆయనను చూసినవారు, తాకినవారు నేరుగా బ్రహ్మమును పొందుతూండగా వేదకర్మలు నశిస్తూన్న స్థితి ఏర్పడింది. దానితో లోకంలో వేదకర్మలు నశించగా, ఇంద్రాదుల కోరికపైన(కొన్ని కథనాల్లో స్వయంగానూ) బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించి, గయుని తలపై చేస్తారు. రాత్రి మొత్తం ఉండే ఈ యాగం తెల్లవారినాకా పూర్తవుతుంది. ఐతే శివుడు కుక్కుటరూపంలో(కోడిపుంజుగా) వచ్చి కూయడంతో నిజంగా తెల్లవారిందేమోనని భ్రమించిన గయాసురుడి హఠాత్ కదలికల వల్ల యాగం అర్ధాంతరంగా ఆగిపోతుంది. నిర్ణయించిన దాని ప్రకారం శిక్షగా ఆయన తలను పాతాళానికి తొక్కుతారు అనేది ఆ ప్రత్యామ్నాయ కథనం చెప్పే విషయం.

గయా క్షేత్రాలు
గయాసురుని అంత్యకాలంలో విష్ణుమూర్తిని కోరుకున్న వరప్రభావంతో ఆయన తల, నాభి, పాదం ప్రాంతాల్లో గయాక్షేత్రాలు ఏర్పడ్డాయి. శిరోగయ, మధ్యగయ, పాదగయగా పిలవబడే వీటిలో శిరస్సుకు సంబంధించినది గయ క్షేత్రంగా నేటికీ పేరుపొందుతోంది. పాదగయను పిఠాపురంగా వ్యవహరిస్తున్నారు.
Read More

బొట్టుని సంస్కృతంలో "తిలకం" అని అంటారు.బొట్టుని సంస్కృతంలో "తిలకం" అని అంటారు.
నొదుటున బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయపు విశిష్ట లక్షణం .
బొట్టు పెట్టుకున్న వాళ్ళ ముఖం చూస్తూ ఉంటే, వారిలో తేజస్సు, వర్చస్సు, కళ తాండవిస్తుంది.
అందుకునే, బొట్టు లేని మొఖాన్ని చూడకూడదు అని సంప్రదాయాలు పాటించే పెద్దవారు అంటూ ఉంటారు.
వైదిక కర్మలు ఆచరించేటప్పుడు నుదుటున తప్పకుండా "తిలకధారణ" చెయ్యాలి, అని "బ్రహ్మవైవర్త పురాణం " చెబుతోంది.


!! "స్నానం దానం తపో హోమో దేవతా పితృకర్మచ
తత్సర్వం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా
బ్రాహ్మణాస్తిలకం కృత్వా , కుర్యాత్సంధ్యాన్య తర్పణమ్" !!

అంటే,
"పుణ్య స్నానాలు చేసేటప్పుడు, దానం చేస్తునప్పుడు , తపస్సును ఆచరించేటప్పుడు, హోమం చేస్తునప్పుడు, దేవతార్చన చేసే సమయంలో, పిత్రుకర్మలను ఆచరిస్తున్నప్పుడు తప్పనిసరిగా నుదుటున తిలకధారణ చెయ్యాలి, లేకపోతే ఎటువంటి ఫలితాలని ఇవ్వవని , అదేవిధంగా బ్రాహ్మణులు సంధ్యావందనాన్ని చేసేటప్పుడు, తర్పణాలను విడిచేటప్పుడు , తప్పని సరిగా తిలకాన్ని ధరించాలని అర్ధం.
బ్రహ్మవైవర్త పురాణం లో "తిలకధారణ" ................................... బొట్టుని సంస్కృతంలో "తిలకం" అని అంటారు. నొదుటున బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయపు విశిష్ట లక్షణం . బొట్టు పెట్టుకున్న వాళ్ళ ముఖం చూస్తూ ఉంటే, వారిలో తేజస్సు, వర్చస్సు, కళ తాండవిస్తుంది. అందుకునే, బొట్టు లేని మొఖాన్ని చూడకూడదు అని సంప్రదాయాలు పాటించే పెద్దవారు అంటూ ఉంటారు. వైదిక కర్మలు ఆచరించేటప్పుడు నుదుటున తప్పకుండా "తిలకధారణ" చెయ్యాలి, అని "బ్రహ్మవైవర్త పురాణం " చెబుతోంది. !!
Read More

పెనుగంచిప్రోలు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం.పెనుగంచిప్రోలు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం.
పెనుగంచిప్రోలు ఒకపురాతన నగరము మున్నానది గా పిలువ బడే మునేటి ఒడ్డున విలసిల్లిన బృహత్కాంచీపురమే ఈ పెనుగంచిప్రోలు. 11వ శతాబ్దంలో గుడిమెట్ట ను పాలించిన చాగి వంశీయులకు రెండవరాజథాని గా పేరొందిన నగరమిది . వీరు రెండు శతాబ్దాల కాలం కాకతీయరాజులకు విథేయులుగా ఉంటూనే స్వతంత్ర ప్రతిపత్తి గల మాండలిక రాజ్యంగానే కొనసాగినట్లు చరిత్ర చెపుతోంది. ఇచ్చట నూటొక్క దేవాలయాలున్నట్లు అవన్నీ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయినట్లు స్ధానికులు చెపుతుంటారు.
“ అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ “ అంటాడు అల్లసాని పెద్దన. అలాగే ఈ పెనుగంచిప్రోలు లో ఎక్కడ తవ్వినా శిధిలశిల్పాలు కళాఖండాలే లభిస్తాయి. ఎక్కడ ఇంటికి పునాదులు తీస్తున్నా, ఎక్కడ కొత్త నిర్మాణానికి గోతులు తవ్వుతున్నా ఏదో ఒక పురాతన అవశేషాలు బయట పడుతూనే ఉంటాయి. ఒక ప్రదేశానికి అంత మహత్తు కలగటం ఆ స్థలమహత్యమని పెద్దలు చెపుతారు .
అటువంటి పవిత్ర ప్రదేశంలో తిరుపతమ్మ తల్లి పేరంటాలై కొలువు తీరింది. కొలిచిన భక్తులకు కొంగుబంగారమై, కోర్కెల తీర్చెడి కల్పవల్లి శ్రీ తిరుపతమ్మ తల్లి.
శ్రీశ్రీశ్రీ తిరుపతమ్మ గోపయ్యలదివ్యమూర్తులు
స్థలపురాణం:- శ్రీ తిరుపతమ్మ తల్లి వృత్తాంతం క్రీ.శ 1695 లో జరిగినట్లు గా చెప్పబడుతోంది. శ్రీ తిరుపతి వేంకటేశ్వరుని అనుగ్రహంతో పుట్టిన బిడ్ఢ కావున ఆమెకు తిరుపతమ్మ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. కృష్ణాజిల్లా అనిగండ్లపాడు గ్రామానికి చెందిన కొల్లాశివరామయ్య, రంగమాంబ లు ఆదర్శదంపతులు. భగవంతుని యందు అపారభక్తి విశ్వాసములుకలిగి,పేదసాదలను ఆదుకొంటూ కీర్తిప్రతిష్టలు గడించిన కుటుంబం వారిది.ధనధాన్య పశు బంధుమిత్రాదులను కొల్లలుగా ఇచ్చిన ఆ భగవంతుడు ఆ కొల్లా వారి కుటుంబానికి సంతానయోగం లేకుండా చేశాడు.సంతానార్ధులై తిరుమలయాత్ర చేసిన ఆదంపతులకు తిరుమలేశుని అనుగ్రహంతో ఆడశిశువు జన్మించింది.
శ్రీ తిరుమల వాసుని దివ్య ఆశీస్సులతో పుట్టిన బిడ్డకు తిరుపతమ్మ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచు కొనసాగిరి. ఆ బిడ్డ పుట్టిన వేళావిశేషమో, ఏమో గాని ఆయింట ధన ధాన్య పశుసంమృధ్ది ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఆ యిల్లే కాక ఆ గ్రామమంతయు పాడిపంటలతో కళకళలాడుచుండెను. పూవు పుట్టగనే పరిమళించునన్నట్లు చిన్ననాటినుండియు శ్రీ తిరుపతమ్మ భగవంతుని యందు భక్తి విశ్వాసాలను, పెద్దలయందు వినయవిధేయతలను , బీదలయందు దయాదాక్షిణ్యాలను ప్రదర్శిస్తూ అందరికి తలలో నాల్క వలే మెలగు చుండెడిది
ఇదే సమయంలో ప్రక్కనే ఉన్న పెనుగంచిప్రోలు లో తిరుపతమ్మ కు తల్లియైన రంగమాంబ గారి అన్నగారి కుటుంబం నివసిస్తుండేది. కాకాని రామయ్య గారి కుటుంబం పెనుగంచిప్రోలు లో కీర్తి ప్రతిష్ఠలు గల్గిన వ్యవసాయ కుటుంబం . వీరి తమ్ముడు కృష్ణయ్య. అన్నదమ్ములిద్దరు బలరామకృష్ణులవలె ఒకే మాట ఒకే బాట గా వ్యవహరించెడి వారు. రామయ్య గారి భార్య పుత్ర సంతానాన్ని కని కాలం చేయడం , మరికొంతకాలానికి రామయ్య కూడ మరణించడంతో ఆ పసివాని ఆలనా పాలనా కృష్ణయ్య దంపతుల మీద పడింది. అతని పేరే మల్లయ్య. అన్నయ్య బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కృష్ణయ్య దంపతులను చూసి ఇరుగు పొరుగు వారు ఆశ్చర్య పోయేవారు.కొంతకాలానికి కృష్ణయ్య-వెంగమాంబా దంపతులకు మగపిల్లవాడు జన్మించాడు . అతనికి గోపయ్య అని నామకరణం చేశారు. కృష్ణయ్య కు వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తూ మల్లయ్య ,గోపయ్య లు పెరిగి పెద్ధ వాళ్లు అయ్యారు. యుక్త వయస్కుడైన మల్లయ్యకు అనిగండ్లపాడుకే చెందిన కన్నేటి వారి ఆడబడుచు చంద్రమ్మ నిచ్చి వివాహం చేశారు.
శ్రీ తిరుపతమ్మ ను గోపయ్యకు ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు సంప్రదించుకొని తాంబూలాలు పుచ్చుకున్నారు.ముహూర్తసమయానికి అంగరంగవైభవంగా గోపయ్య తిరుపతమ్మల కళ్యాణం జరిగింది.రెండు గ్రామాల్లోను పండుగ వాతావరణం వెల్లివిరిసింది.తిరుపతమ్మ అత్త వారింట అడుగు పెట్టింది. ఆడపడుచు ను అత్తవారింటికి పంపిస్తూ సమస్త గృహోపకరణాలతోపాటు ఒక గోవు ను కూడ అరణం గా పంపించాడు స్ధితిమంతుడైన శివరామయ్య.
కొత్తకోడలు రాకతో కాకాని వారింటికి కొత్త కళవచ్చింది. పాడిపంటలు సిరిసంపదలు వృద్ధిచెందాయి. లక్ష్మీదేవి వచ్చిన వేళావిశేషమని నలుగురు చెప్పుకోసాగారు. క్రమక్రమంగా తోడికోడలు చంద్రమ్మ మనసులో ఈర్ష్యాసూయలు బయలు దేరినాయి. అత్తగారైన వెంకమ్మ మనసును కూడ మార్చి వేసింది. సూటిపోటిమాటలతో తిరుపతమ్మ ను వేధించసాగినారు.

ఇదేసమయంలో ముదిరాజు వంశజురాలైన పాపమ్మ వచ్చి, తిరుపతమ్మతో పరిచయంచేసుకొని, ఆవిడకు అన్ని రకాల చేదోడు వాదోడు గా వుంటుండేది. తీరికసమయాలలో భారత,భాగవత,రామాయణాదులతో సద్గ్రంథ కాలక్షేపం చేస్తుండేవారు.
కాలం ఎప్పుడూ ఒకేరీతిగా ఉండదు కదా కృష్ణాజిల్లాలో వర్షాబావ పరిస్ధితులేర్పడ్డాయి. కరువుకాటకాలతో జనం వలసలు వెడుతున్నారు. గొడ్లకు మేతదొరకడం గగనమై పోయింది. ఆలమంద ను ఉత్తర ప్రాంత భూముల కు మేత కోసం తోలుకుపోవడానికి నిర్ణయించుకొని ఊరంతా నిర్ణయించుకొంది.ఇంటికి ఒకరు చొప్పున మంద వెనక వెళ్లాలని తీర్మానం.కృష్ణయ్య గారి ఇంటి నుండి గోపయ్య బయలుదేరాడు. భర్త వెళ్లడం తిరపతమ్మకు ఇష్టం లేకపోయినా సందర్భం కాదని మాట్లాడకుండా ఉండిపోయింది.
గోపయ్య అడవి వెళ్లినదగ్గరనుండి తిరుపతమ్మ కు అత్త తోడికోడలు పెట్టే ఆరళ్లు కూడ ఎక్కువైనాయి.ఇంతలో తిరుపతమ్మకు కుష్టువ్యాధి సోకటంతో ఆమెను గొడ్లసావిట్లో పడేశారు.ఇన్ని బాధలు పడుతున్నాతిరుపతమ్మ పుట్టింటికి ఒక్కకబురు కూడ చేయలేదు. అన్ని వేళలా పాపమ్మె ఆమెకు చేదోడు వాదోడు గా ఉండేది. ఇంతలో ఆలమందల వద్ద నున్న గోపయ్యకు తిరుపతమ్మ ను గూర్చి ఏవేవో చెడు కలలు రాలడంతో ,తన ఆవులను తోటివారి కప్పగించి పెనుగంచిప్రోలు వచ్చేశాడు. ఇంట్లో తిరుపతమ్మ కనపడలేదు. అమ్మ వదినలు తిరుపతమ్మ పుట్టింటికి వెళ్లిందని అబద్దమాడారు. మునేటి ఒడ్డున అమ్మలక్కల మాటల్లో తిరుపతమ్మ కొచ్చిన కష్టాన్ని విన్న గోపయ్య పరుగు పరుగన గొడ్లసావిడికి చేరుకొన్నాడు.
కుళ్లి కృశించి నీరసించిన శరీరంతో గోశాల లోపడివున్న ఇల్లాలును చూచి విహ్వలుడై, ఆమెను పట్టుకొని బోరుబోరు న విలపించాడు గోపయ్య. వెంటనే వెళ్లి అలమందను తోలుకొచ్చేసి ,తిరుపతమ్మ దగ్గరే వుండి ఆరోగ్యాన్ని చూసుకంటానన్నాడు. తిరుపతమ్మవద్దంటున్నా వినక మందను తోలుకు రావడానికి అడవికి వెళ్లిపోయాడు గోపయ్య .అక్కడ కు వెళ్లేసరికి పరిస్థితంతా అస్తవ్యస్దంగా ఉంది. తిరుపతమ్మ పుట్టింటినుండి అరణంగా తెచ్చుకున్నఆవు ను పెద్దపులి నోట కరుచుకు పోయిందని చెప్పారు తోటిస్నేహితులు. అసలే బాధలో వున్న గోపయ్య ఆవేశంతో గండ్రగొడ్డలి పట్టుకొని పులి గుహలోకి ప్రవేశించాడు. విథివక్రించింది . గోపయ్య నేలకొరిగాడు. ఆవిషయం తన యోగశక్తి తో తెలుసుకున్న తిరుపతమ్మ యోగాగ్ని తో మరణించడానికి సిద్దపడి, గ్రామపెద్దయైన శ్రీశైలపతి గార్కి పాపమ్మ ద్వారా కబురు చేసింది.చర్చోపచర్చల తరువాత గ్రామపెద్దల అంగీకారం జరిగింది. వెంకమ్మ, చంద్రమ్మలు తమ తప్పు తెలుసు కొని తిరుపతమ్మను శరణువేడారు. పాపమాంబ వంశము ఆచంద్ర తారార్కము అభివృధ్ధి చెందుతూ,నిత్యనైవేద్య దీపధూప అర్చనహారతులు తిరుపతమ్మకు పాపమ్మవంశము వారినుండే లభించేటట్లు ఆదేశించిన తిరుపతమ్మ పసుపు కుంకుమలతో కూడిన పూజాపళ్లాన్ని పాపమ్మకు అందించింది . పాపమ్మ కడసారిగా కన్నీటితో తిరుపతమ్మకు పాదాభిషేకం చేసింది .
సాయంసంథ్యావేళలొ , బాజాభజంత్రీలుమారుమ్రోగుతుంటే, దిక్కులు పిక్కటిల్లేలా జనసందోహం జయజయథ్వానాలు చేస్తుంటే తిరుపతమ్మ యోగాగ్ని ప్రవేశం చేసింది. ఆప్రదేశంలో తిరుపతమ్మ తల్లి చెప్పిన ప్రకారం” మంగళసూత్రము కుంకుమ భరిణె దేదీపేయమానంగా ప్రకాశించే గోపయ్య తిరువతమ్మ” ల విగ్రహాలు లభించాయి. గ్రామపెద్దలైన శ్రీశైలపతి గారు ఆప్రదేశంలోనే దివ్యయంత్రాలతో ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయాన్ని నిర్మించారు. తమ్ముడి మరణం మరదలు యోగాగ్ని ప్రవేశంతో దిగులు పడి మంచం పట్టి మరణించాడు మల్లయ్య. తన తప్పులు తెలుసుకున్న చంద్రమ్మ పసిపాపతో సహా సతీసహగమనం చేసింది. శ్రీశైలపతి గార్కి తిరుపతమ్మ కలలో కన్పించి చెప్పడంతో, చంద్రమ్మ మల్లయ్యలకు కూడ అమ్మవారి ఆలయానికి దక్షిణంగా గుడి కట్టించారు. ముందుగా చంద్రమ్మ దంపతులను దర్శించిన తరువాతే అమ్మవారిని దర్శిచాలనేది నియమం. ఆనాటి నుండి తిరుపతమ్మ పేరంటాలు భక్తుల పాలిట కామధేనువై కోరిన కోరికలను తీరుస్తూ, భక్తులమొక్కులను అందుకుంటూ కాపాడుతోంది.
ఆలయ ప్రత్యేకత : సంతానార్థులైన దంపతులు మునేట్లో మునిగి, తడిబట్టలతో ఆలయప్రదక్షణం చేసి, ప్రాణాచారం పడినట్లయితే అమ్మ పసిపాప రూపంలోనో, పెద్దముత్తైదువు రూపంలోనో వచ్చి ఆశీర్వదిస్తుందని భక్తులనమ్మకం. కోరిక తీరిన భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించు కుంటుంటారు. పెళ్లిజరగటంలో జాప్యం జరుగుతున్నా, కాపురంలో కలతలు రేగినా వారి తల్లిదండ్రులుగాని అత్తమామలు గాని వచ్చి అమ్మవారి కళ్యాణం జరిపించి పసుపు కుంకుమ అక్షతలను స్వీకరిస్తే కలతలు తీరతాయని విశ్వాసం.


Read More

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం -దేవుని కడప

 

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం కడప పట్టణానికి 2 కి మీ దూరం లో ఉన్నది . పూర్వం తిరుపతికి వెళ్ళే యాత్రికులకు మార్గం ఇదే . దేవుని కడపలో వెలసిఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుల దర్శనంతారమే తిరుమలేశుని దర్శించుకోవడం సంప్రదాయంగా పాటించబడుతుండేది . ఈ క్షేత్రాన్ని తిరుమల తొలి గడప అని పిలిచేవారు. 
 

దేవుని కడప లో కృపచార్యులు ఇచ్చటి వేంకటేశ్వరుని ప్రతిష్టించినట్లు ప్రతీతి . తిరుమల వరహక్షెత్రమైథె కడప హనుమత్ క్షేత్రం . ఇచ్చటి వెంకటేశ్వర స్వామి వేనుకబాగన ఆంజనేయ విగ్రహం ఉంది . ఈ క్షేత్రాన్ని క్రిపవతి క్షేత్రం అని పిలిచేవారు అని పురాణాలూ చెబుతున్నాయి . ఈ క్షేత్రానికి హనుమాన్ క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు . . 
 

విశాలమైన ఈ ఈ అలయంనందు అద్బుతమైన శిల్పకళ,ముఖ మండపం రమణీయంగా ఉంటాయి. శ్రీ కృష్ణ దేవరాయల కాలం లో దేవాలయం ఎంతో అభిరుద్ది చెందింది గ శాసనాల ద్వారా తెలుస్తుంది. దేవాలయ ప్రాంగణం లో చాల ఉపాలయాలు ఉన్నాయి . 
 

ఈ క్షేత్రాన్ని తాళ్ళపాక అన్నమ చార్యులు ,శంకర చార్యులు చాలాసార్లు దర్సిన్చారట.స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. ప్రతి ఒక్క్కరు చూసి తరించాల్సిందే !! 
 


 

‘Devuni kadapa’ is a place in Kadapa town, famous for the temple of Sri Laxmi Venkateshwara. It is historically been known as the gateway to the temple of Venkateshwara, the presiding deity of Tirumala. Also called as Devuni Gadapam , it derives its name from Gadapa , a Telugu word, which means Threshold or gateway or doorstep . Such is the importance of this temple, from the olden days it was believed that every pilgrim who visits the temple of Sri Venkateshwara at Tirumala, should visit this temple on their way to Tirumala only then it is believed that their visit to Tirumala is complete. Sri Laxmi Venkateshwara Temple stands as an outstanding example of Vijayanagar architecture. The very sight of the temple, with great sculptures and carvings adorning it, takes you back to the Vijayanagar Era. There is a sculpture of dancing Vigneswara (Lord Ganesha), a master piece of those times, in the Mukha Mandapam (main hall). Sri Laxmi Venkateshwara temple is popularly known as Hanumath Kshetram as there is an idol of Anjaneya (Lord Hanuman) behind that of Lord Venkateshwara in the sanctum sanctorum. It is believed that Sage Kripacharya had installed the idol of the presiding deity. It is said that Tallapaka Annamacharya visited this place and all the Sankaracharya s of the Advaita Mutt, heads of Ahobilam Mutt and Mahakavi Kshetrayya also visited this place. Recently, this temple has been undertaken by the Tirumala Tirupati Devasthanam. 


History : Devuni Kadapa is also known as Tirumala TholiGadapa The place Kadapa is named after the word Gadapa which is originated from the word “Devuni Gadapa” means “Entrance for The Lord Venkateswara Swamy”. The Idol of the Lord Venkateswara has been established by Kripacharya, hence the ancient name of devuni kadapa is also mentioned in puranas as “Kripavathi Kshetram”. Pilgrims who are about to visit Lord Venkateswara `this is because first they have to pray Annamacharya and potuluri veerabramhendra swamy. This temple is very famous in Rayalaseema region, people from various places visit this temple, and this temple is generally crowded on Saturdays.
How To Reach :

By Road/Bus : 

Kadapa is connected with the major and minor cities of Andhra Pradesh by both state transport corporation and private buses. The cities like Hyderabad, Chennai, Bangalore, Tirupati etc are well connected with Kadapa.

By Air : 

Kadapa has its own airport, situated at a distance of 8 km from the city center. This airport is yet to get ready. Besides this, airdromes at Hyderabad, Chennai, Bangalore and Tirupati are quite near to the city. The further distance to be traveled for getting to the city can be covered by private taxis or state buses.

By Train/Rail : 

Kadapa Railway Station is located on the Chennai-Tirupati-Pune-Mumbai line. From Hyderabad, it lies about 405 km away and regular trains ply on this route. Though the city is not directly connected with the other parts of India by train, the stations at major cities within the state connect it indirectly. - See more at: http://www.manatemples.net/Pages/dev_kadapa.htm#sthash.VU5foiyP.dpuf
Read More

Powered By Blogger | Template Created By Lord HTML