గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 14 July 2015

పుష్కరములలో తప్పనిసరిగా చేయవలసినవి ఆచరించవలసినవిపుష్కరములలో తప్పనిసరిగా చేయవలసినవి ఆచరించవలసినవి
పరమ పవిత్రము, దుర్లభము అయిన పుష్కరము నదులకు వచ్చినపుడు ఆస్తిక జనులు తప్పక ఆచరించవలసిన కొన్ని కర్మలను శాస్త్రకర్తలు విధించినారు. వాటిని శ్రద్ధతో ఆచరిస్తే విశేష ఫలములు కలుగుతాయి. ఆ విధులు ఇలా ఉన్నాయి.

1. నదీ స్నానం: నదిలో సంకల్ప పూర్వకంగా స్నానం చేసి విధిప్రకారం కొందరు దేవతలకు ఆర్ఝ్యాదులు వదలవలెను.
2. గోదావరి-బృహస్పతి-పుష్కర రాజు ల పూజ : స్నానం చేసి బయటకి వచ్చి ఒక సమతల ప్రదేశంలో కూర్చుని యధావిధిగా నదికి - బృహస్పతికి - పుష్కరరాజుకు విడివిడిగా షోడశోపచార పూజలు చేయవలెను. నదిలో అనుకూలముండదు. తొందర అవుతుంది.
3. పితరులకు శ్రాద్ధ తర్పణాలు: పుష్కర కాలంలో నదీతీరంలో తమ పితరులకు శ్రాద్ధకర్మలు చేయవలెను. అందువల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ శ్రాద్ధకర్మ వల్ల మరణించిన వారికి పుణ్యలోక ప్రాప్తి చేసిన వారికి వంశవృద్ధి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పెద్దలకు పిండాలు పెట్టి శ్రాద్దం చేయలేని వాళ్ళు పెద్దల పేరు మీద నువ్వులు నీళ్లతో తర్పణాలైనా వదలవలెను.
4. దానాలు: పుష్కర సమయంలో తమ తమ శక్తికి తగినట్లు దశదానాలలో వేటినైనా దానం చేయవలెను.

నదీ స్నాన విధానం : “పుష్కర స్నాన సంకల్పము”
పుష్కర స్నానం శుభ్రత కోసం చేసేది కాదు. ఇది దివ్య స్నానం. అందుచేత ముందుగా ఇంటి వద్ద స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి పుష్కర స్నానానికి వెళ్ళాలి. మలిన వస్త్రములతో పుష్కర స్నానం చేయరాదు. సబ్బు షాంపూ వంటి వాటిని వాడరాదు. వంటికి నూనె రాసుకోవడం వంటివి చేయరాదు. నదిలో బట్టలు పిండరాదు. కేవలం నదిలో మూడు మునకలు వేసి స్నానం చేయాలి తప్ప శరీర శుభ్రత కోసం కాదు. పుష్కర స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. పురోహితుల సహాయంతో సంకల్పం చెప్పుకొని పుష్కర స్నానం చేయటం ఉత్తమోత్తమం. ఆ సౌలభ్యం లేని వారు ఈ క్రింది స్నాన సంకల్పం చెప్పుకొని స్నానం చేయవచ్చు.
శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే||
గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాంశ తైరపి
ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణు లోకం సగచ్ఛతి||
ముందుగా కొంచెం మట్టి లేక ఇసుక చేతిలోకి తీసుకొని నదివద్దకు చేరి ఈక్రింది శ్లోకాలను చదువుతూ ఆమట్టిని కానీ ఇసుకని కానీ నదిలో కలపవలెను. ( ఎక్కువ మట్టి వేస్తె ఎక్కువ పుణ్యం వస్తుంది అని భావించరాదు. చిటికెడు మాత్రమే వేయాలి )
1. పిప్పలాద మహాభాగ సర్వలోకశుభంకర
మృత్పిండం చ మాయా దత్తం ఆహారార్ధం ప్రకల్ప్యతామ్
2. పిప్పలాదాత్ నముత్పన్నే కృతే లోకే భయంకరే
మృత్తికాం తే మయా దత్తం ఆహారార్ధం ప్రకల్ప్యతామ్
ఆపై నదీ జలాన్ని మూడుసార్లు శిరస్సుపై "పుండరీకాక్ష , పుండరీకాక్ష , పుండరీకాక్ష" అనుచు చల్లుకోవలెను.
ఆచమనం ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా ( ఆచమనం చేయునప్పుడు చేతిలో నీళ్ళు పోసుకొని మూడుసార్లు శబ్దం లేకుండా త్రాగాలి )
ఓం గోవిందాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః,
ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః,
ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోజాక్షయ నమః, ఓం నారసింహాయ నమః,
ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దానాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః,
ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః,
ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమిభారకా:
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.
ప్రాణాయామంఓం భూ:, ఓం భువ:, ఓం సువ:, ఓం మహా:, ఓం జన:, ఓం తప:, ఓం సత్యం, ఓంతత్సవితుర్ వరేణం, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతీ రసో అమృతం బ్రహ్మ భూర్భువ స్సువ రోమ్.
సంకల్పం
ఓం ఓం ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా శ్రీ శివ శంభో రాజ్ఞయా ప్రవర్త మానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గోదావరీ తటే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ..... నామసంవత్సరే ...... ఆయనే ...... ఋతౌ ...... మాసే ....... పక్షౌ ...... తిధౌ ........ వాసరే, శుభనక్షత్రే శుభ యోగే శుభ కరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ ......గోత్రః, ...... నామదేయః,.......
శ్రీమతః...... గోత్రస్య ..... నామదేయస్య ........
( స్త్రీలు ఈక్రింది విధముగా చెప్పవలయును )
శ్రీమతి ....... గోత్రవతీ ........ నామధేయవతి , శ్రీమాత్యః ....... గోత్రవత్యః ...... నామధేయవత్యః
మమ సకుటుంబస్య, సపుత్రకస్య, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, ఇతోధిక మహాదైస్వర్యప్రాప్త్యర్దం,
ధర్మ పత్ని సమేతస్య సకుటుంబ సపరివారస్య – ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, గంగా వాలుకాభి సప్తర్షి మండల పర్యంతం , అశ్వమేధాది సమస్త క్రతు ఫలా వాప్త్యర్ధం, ఇహ జన్మని జన్మాంతరేషుచ బాల్య యౌవన కౌమార వార్ధక్యేషు, జాగ్రత్ స్వప్న సుషుప్తి అస్థాసు జ్ఞానతో అజ్ఞానతస్య కామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం, సర్వేషాం పాపానాం అపనోద నార్ధంచ- గంగా యమునాది సమస్త పుణ్య నదీ స్నాన ఫల సిద్ద్యర్థం, కాశీ ప్రయాగాది సర్వ పుణ్య క్షేత్ర స్నాన ఫల సిద్ద్యర్థం, సర్వ పాప క్షయార్ధం, ఉత్తరోత్తరాభి వ్రుద్ధ్యర్ధం మకరంగ తేరవౌ మహా పవిత్ర గోదావరి మహా పుష్కర స్నానం కరిష్యే...!

(ఈ విధముగా పలికి మూడుమార్లు నదిలో మునిగి, అనంతరం రెండుచేతులతో నదీజలాలను తీసుకొని 18 మార్లు తర్పణములుగ తిరిగి ఆనదిలోనే వదలవలెను)
తర్పణం
1) ఓం సంధ్యాం తర్పయామి 2) ఓం గాయత్రీం తర్పయామి3) ఓం బ్రాహ్మీం తర్పయామి4)
ఓం నిమృజీం తర్పయామి5) ఓం ఆదిత్యం తర్పయామి6) ఓం సోమం తర్పయామి7) ఓం అంగారకం తర్పయామి 8) ఓం బుధం తర్పయామి9) ఓం బృహస్పతిం తర్పయామి10) ఓం శుక్రం తర్పయామి11) ఓం శనిం తర్పయామి12) ఓం రాహుం తర్పయామి13) ఓం కేతుం తర్పయామి
14) ఓం యమం తర్పయామి15) ఓం సర్వదేవతాన్ తర్పయామి16) ఓం సకలపితృదేవతాన్ తర్పయామి17) ఓం సర్వఋషీన్ తర్పయామి 18) ఓం సర్వభూతాని తర్పయామి

శ్లో !! నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా !
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ !!
భాగిరధి భొగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ !
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే !!
స్నాన కాల పఠె న్నిత్యం మహా పాతక నాశనం||

స్నానం తరువాత ప్రార్ధనా శ్లోకాలను చదువుతూ, ప్రవాహానికి ఎదురుగా, వాలుగా, తీరానికి పరాజ్ముఖముగా కుడి చేతి బొటన వ్రేలుతో నీటిని కదిలించి మూడు దోసిళ్ళ నీళ్ళు తీరానికి జల్లి , తీరానికి చేరి బట్టలని పిండుకోవాలి.
తరువాత పొడి బట్టలు కట్టుకొని తమ సంప్రదాయానుసారం విభూతి వంటి వాటిని ధరించి సంధ్యా వందనాదులు చేసుకోవాలి. తరువాత నదీ తీరాన గాని దేవాలయాన గాని దైవమును అర్చించాలి.

స్నాన మంత్రాలు..:
౧) "ఆపోహిష్టమయో బువః స్తాన ఊర్జేదదాతనః
మహేరనాయ చక్షసే యోవశ్శివతమో రసః
తస్య భాజయితే హనః ఉషతీరివ మాతరః
తాస్మా ఆరంగ మామవః యస్యక్షయాయ జిన్వద ఆపో జనయదా చనః "

౨) పావనీ త్వం జగత్పూజ్యే సర్వతీర్థ మయే శుభె!
త్వయా స్నాతుమనుజ్ఞానంచ దేహిమే శర్వవల్లభే!!

౩) విష్ణు దేహాసముత్పన్నా సర్వపాప ప్రణాశని!
గోదావరీ నమస్తుభ్యం మమ పాపం వ్యపోహతు!!

౪) నమోదేవి మహాగంగే మహాపుణ్యం జలైర్యుతే! స్నాతు మిచ్చామి దేవేశి ప్రసీద పరమేశ్వరీ!!

పై శ్లోకాలతో దేనితోనైనా స్నానమాచరించవచ్చును
ఆ విధంగా స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాదులు తీర్థోపవాసం మృత్తికాస్నానం చేసి అర్ఘ్యాదులు ఇవ్వటం..
బృహస్పతికి, పుష్కర నదికి, లక్ష్మినారాయణునికి, సూర్యునికి, పార్వతీపరమేశ్వరులకు, బ్రహ్మసరస్వతులకు, మూడుకోట్ల దేవతలతో తీర్థాలతో కూడిన పుష్కర తీర్థదేవతకు ఇంద్రాది దేవతలకు, బృగ్వాది మహర్షులకు, సకల ఋషులకు , దెవతలకు, పితృదేవతలకు తర్పణాదులు విడవాలి.. మళ్ళీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం ఆచరించాలి..
తీర్థం వద్ద నివసించే యాత్రికులు తీర్థోపవాసం చేయటం ఉత్తమం ..

నదీమాతల్లికి అర్చన :
పుష్కర నదుల్లో పూజలు నిర్వహించటం దీర్ఘాయుష్షును కలిగిస్తుంది.
పూర్వం సుమతీ అనే రాజు శివుని వరం వల్ల ఒక కుమారుడిని కన్నాడు అతనికి ఆయుష్షు తక్కువ గృత్స్నమదుని సలహామేరకు కృష్ణాపుష్కర వ్రతం చేసి దీర్ఘాయుష్షుని పొందాడు

పుష్కర కాలంలో
నదిలో పుష్కరునితో బృహస్పతితొ కలిసి సకల దేవతలు నివసిస్తారు కనుక సకల దేవతలను పూజించటం చక్కటి పొలితాలను ఇస్తుంది

మొదటి రోజు నారాయణనుడి అర్చన జప తర్పనాదులతో ప్రారంభించి
రెండోరోజు భాస్కర.
మూడురోజు మహాలక్ష్మి.
నాలుగో రొజు గణేష.
ఐదవ రోజు శ్రీకృష్ణ.
ఆరవ రోజు సరస్వతీ.
ఏడవ రోజు పార్వతీ.
ఎనిమిదవ రోజు మహేశ్వర.
తొమ్మిదవ రోజు అనంత.
పదవ రోజు నృసింహ
పదకొండవ రోజు వామన
పన్నెండవ రోజు రామచంద్రుడు
ఇలా 12 రోజులు 12 దేవతలను అర్చించి 12రోజులు 12 రకాల దానాదులు ఇవ్వాలి అలా చెయటం పుష్కర వ్రతంగా పిలుస్తారు ఇది ఉత్తమమైనది..
అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్రాద్దం నిర్వహించి పిత్రుదేవతలకు తర్పణాదులు ఇవ్వాలి
మొదటి రోజు హిరణ్యశ్రాద్ధం
తొమ్మిదవ రోజు అన్నశ్రాద్దం
పన్నెండవ రోజు ఆమ శ్రాద్దం..తప్పనిసరి

పుష్కర సమయంలో నదీస్నానమే కాక పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా ముఖ్యం. అందువల్ల ఈ దిగువ తెలిపిన మీ పూర్వీకుల వివరములు (పేరు, గోత్రం మొదలయినవి) తప్పక తెలుసుకుని తెచ్చుకోండి.

పితరం (తండ్రి) గోత్రం శర్మాణం* వసురూపం
పితామహం (తాత) గోత్రం శర్మాణం రుద్రరూపం
ప్రపితామహం (ముత్తాత) గోత్రం శర్మాణం ఆదిత్యరూపం
మాతరం (తల్లి) గోత్రం దాయీం వసురూపం
పితామహీం (మామ్మ) గోత్రం దాయీం రుద్రరూపం
ప్రపితామహీం (ముత్తమ్మ) గోత్రం దాయీం ఆదిత్యరూపం
సపత్నీమాతరం (సవతితల్లి) గోత్రం దాయీం వసురూపం
మాతామహం (తల్లి తండ్రి) గోత్రం శర్మాణం వసురూపం
మాతుః పితామహం (తల్లి తాత) గోత్రం శర్మాణం రుద్రరూపం
మాతుః ప్రపితామహం (తల్లి ముత్తాత)గోత్రం శర్మాణం ఆదిత్యరూపం
మాతామహీం (అమ్మమ్మ) గోత్రం దాయీం వసురూపం
మాతుః పితామహీం (తల్లి మామ్మ) గోత్రం దాయీం రుద్రరూపం
మాతుః ప్రపితామహీం (తల్లి ముత్తమ్మ) గోత్రం దాయీం ఆదిత్యరూపం
ఆత్మ పత్నీం (భార్య) గోత్రం దాయీం వసురూపం
సుతం (కుమారుడు) గోత్రం శర్మాణం రుద్రరూపం
భ్రాతరం (సోదరుడు) గోత్రం శర్మాణం ఆదిత్యరూపం
పితృవ్యం (తండ్రి సోదరుడు) గోత్రం శర్మాణం వసురూపం
మాతులం (తల్లి సోదరుడు) గోత్రం శర్మాణం రుద్రరూపం

మాతులస్య పత్నిం (మేమమామ భార్య) గోత్రం దాయీం రుద్ర రూపం
దుహితరం (కూతురు) గోత్రం దాయీం వసురూపం
ఆత్మభగినీం (సోదరి) గోత్రం దాయీం వసురూపం
దౌహిత్రం (కూతురి కొడుకు) గోత్రం దాయీం వసురూపం
భాగినేయకం (మేనల్లుడు) గోత్రం శర్మాణం
పితృభగినీం (తండ్రి సోదరి) గోత్రం దాయీం వసురూపం

పితృభగినీ భర్తారం (మేనత్త భర్త) గోత్రం శర్మాణం వసురూపం
పితృభగినీ సుతం (మేనత్తల కుమారులు) గోత్రం శర్మాణం వసురూపం

మాతృభగినీం (తల్లి సోదరి) గోత్రం దాయీం వసురూపం
మాతృభగినీం భర్తారం (పైవారి భర్తలు) గోత్రం శర్మాణం వసురూపం

మతృభగినీ సుతం (పైవారి కుమారులు) గోత్రం శర్మాణం వసురూపం

జామాతరం (అల్లుడు) గోత్రం శర్మాణం వసురూపం
భావుకం (బావ, బావమరిది) గోత్రం శర్మాణం వసురూపం
స్నుషాం (కోడలు) గోత్రం దాయీం వసురూపం
స్వశురం (భార్య తండ్రి) గోత్రం శర్మాణం వసురూపం
స్వశ్రూం (అత్తగారు) గోత్రం దాయీం వసురూపం
శ్యాలకం (భార్య అన్న, తమ్ముడు) గోత్రం శర్మాణం వసురూపం

శ్యాలకస్య పత్నిం (పైవారి భార్యలు) గోత్రం దాయీం వసురూపం

స్వామిన్ (మత గురువు, పీఠాధిపతి)

గురుం (మంత్రోపదేశము, ఉపనయనము చేసినవారు) గోత్రం శర్మాణం వసురూపం

రిక్థినం (ఆస్తి నొసగినవారు, సహాయము చేసినవారు)

పితృవంశములో మృతులు
మాతృవంశములో మృతులు
బంధువర్గములో మృతులు
తనకులమందు శైశవమున, గర్భమున గతించినవారు
అగ్ని, పిడుగు, ఉరుము, మెఱుపుల వలన మృతులు
మృగములవలన హతులు
ఉరి, విషము, ఆయుధములు, ఆత్మహత్యలచే మృతులు
భూతప్రేత, పిశాచులు
రౌరవ, అంధతామిశ్ర, కాలసూత్ర నరకములలోనివారు
అసిపత్ర, కుంభీపాకములలోనివారు
ప్రేతలోకములోని వారు
యమపురములోన వారు
ఇతర నరకములలోని వారు
పశు, పక్షి, కీట, కర్ప, వృక్ష జన్మములలోనివారు
దహన సంస్కారములు జరుగక అంతరిక్ష, పాతాళములందలి వారు
జన్మాంతర బంధువర్గము
దుర్మరణము, బ్రహ్మహత్యాది పాతకులు
బంధువర్గమున సంతతి లేనివారు
దాస, భృత్య, సేవక, ఆశ్రితులు
జన్మాంతర మిత్ర, కళత్ర సుఖమునిచ్చిన ఇతరులు
జన్మాంతరమున పోషింపబడిన స్పృశింప బడినవారు

పుష్కర సమయంలో చేయవసిన దానాదులు :
తేది దైవం పేరు - దానములు/పూజలు
జులై 14(మొదటి రోజు) నారాయణ - ధాన్యము,రజితము,సువర్ణము, భూమి
జులై 15(రెండవ రోజు) భాస్కర - వస్త్రము,లవణము,గోవు,రత్నము.
జులై 16(మూడవ రోజు) మహాలక్ష్మి - బెల్లము,కూరలు,వాహనము, గొవు, అశ్వం, పండ్లు
జులై 17(నాలుగవ రోజు) గణపతి - నేయి,నువ్వులు,తేనె,పాలు,వెన్న,నూనె,పానకం
జులై 18(ఐదవ రోజు) శ్రీకృష్ణ - ధాన్యము,బండి,గేదె,ఎద్దు,నాగలి
జులై 19(ఆరవ రోజు) సరస్వతి - కస్తూరి,గంధపుచెక్క,కర్పూరము, ఓషదులు, సుంగంద ద్రవ్యాలు
జులై 20(ఏడవ రోజు) పార్వతి - గృహము,ఆసనము,శయ్య(మంచము), పల్లకి, ఊయల
జులై 21(ఎనిమిదవ రోజు) పరమేశ్వరుడు- కందమూలములు,అల్లము,పుష్పమూలము, వెన్న
జులై 22(తొమ్మిదవ రోజు) అనంత - కన్య,పఱుపు,చాప(శయన వస్తువులు), దేవతా విగ్రహాలు, సాలగ్రామాలు,
జులై 23(పదవ రోజు) నరసింహ - దుర్గ,లక్ష్మి,దేవి పూజ,వెండి, బంగారం, పూలు,ముత్యాలు, పురాణాలు
జులై 24(పదకొండవ రోజు) వామన - కంబళి,సరస్వతి,యజ్నోపవీతము,వస్త్రము,తాంబూలము, గ్రంథాలు
జులై 25(పన్నెండవ రోజు) శ్రీరామ - దశ,షోడశ మహాదానములలో అన్నిటిని దానం ఇవ్వవచ్చును

ఈ విధంగా పుష్కర వ్రతం దానాదులు ఆచరించటం అనంతకోటి పుణ్యఫలితాలను కలిగిస్తాయి..

పుష్కర స్నానం - నియమాలు
పుష్కరస్నానానికి గాని, తీర్థస్నానానికి గాని వెళ్ళినపుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఆ నియమాలు పాటించడం ఉత్తమం.

*తీర్థ స్థలానికి చేరిన రోజు ఉపవాసం చేయడం వాటిలో ఒకటి.
*దంపతులు కలిసే స్నానం చేయాలి. బ్రహ్మముడి వేసుకుని ఈ స్నానం చేయాలి.
*పురుషులు శిఖమాత్రమే ఉంచుకుని శిరోమండనం చేయించుకోవాలి. స్త్రీలు శిరోమండనం చేయించుకోరాదు.
*తండ్రి లేనివారు తీర్థస్నానం చేయాలి.
*పుష్కర దినాలలో తొమ్మిదవ రోజుగానీ, లేదా తమ పెద్దలు మరణించిన తిథి రోజు గానీ పితృ శ్రాద్ధాన్ని నిర్వహించాలి.
సమీప బంధువులకు, పిండ ప్రదానం చేయవచ్చు. తర్పణం విడవవచ్చు. స్నేహితులకూ ఆత్మియులకూ పిండ ప్రదానం చేస్తే సరిపోతుంది.
*పిండ ప్రదానం ఆకు దొప్పలలోనే చేయాలి.
*తీర్థాల సమీపంలో మలమూత్ర విసర్జన, ఉమ్మి వేయడం, బట్టలు ఉతకడం చేయరాదు.
*స్నానం చేసే సమయంలో నిట్టనిలువుగా మూడు సార్లు మునకలు వేయాలి.
*సంప్రదాయం కోసమే కాకుండా ఆరోగ్య కరమైన వాతావరణం కోసం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.

స్వస్తిప్రజాభ్యాం పరిపాలయంతాం ! న్యాయేన మార్గేన మహింమహీషాం !!
గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం ! లోకాసమస్తా స్సుఖినోభవంతు !!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML