గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 7 July 2015

బాలకాండ అని ఎందుకు పేరు?బాలకాండ అని ఎందుకు పేరు?

రామాయణాన్ని గురించి ఎన్ని సార్లు చెప్పుకున్నా యుగాలు చాలవు. రామాయణం ఇరవైనాలుగు వేల శ్లోకాలుగానే అవతరించింది ఈ లోకంలో. అసలు బ్రహ్మలోకంలో అది శతకోటి ప్రవిస్తరం అంటారు. మనం అంత గ్రహించలేం. ఈ ఇరవైనాలుగు వేల శ్లోకాలనే కొన్ని కాండలుగా విభజించారు. ఇది ఒక అవధి అని కాండాలకి ఒక్కో పేరు పెట్టి ఉన్నారు. బాల కాండ మరియూ సుందర కాండకు ఉన్న పేర్లలో ఎంతో రహస్యం ఉంది. బాల కాండము అంటే రాముడు బాలుడిగా ఉన్నప్పటి విషయాలను చెప్పినటువంటిది అని అనిపిస్తుంది. కానీ రాముని బాల్యాన్ని గురించి అంతగా ప్రస్తావించదు. 18 వ సర్గలో రామలక్ష్మణభరతశత్రజ్ఞులు జన్మించిరి అని చెప్పి, వారికి 11 వ రోజున నామకరణం చేశారు, వేద విద్యలు, బుద్దిమంతులైన ఆ పిల్లలు అస్త్రశస్త్రాలు నేర్చుకున్నారు, వారికి పెళ్ళి చేయాలని వారి తండ్రి అనుకుంటున్నాడు అంతలోనే విశ్వామిత్రుడు వచ్చాడు అని చెబుతాడు వాల్మీకి. ఒక నాలుగైదు శ్లోకాలు మాత్రమే ఉంటాయి. రాముని బాల్యం గురించి ఇక ప్రస్తావన ఉండదు. తరువాత విశ్వామిత్రుడు తన యజ్ఞ పరిరక్షణకై రాముడిని కోరుతాడు, ముందు దశరథుడు ఒప్పుకోడు, తరువాత వశిష్టులవారు చెబితే అప్పుడు శ్రీరాముడిని ఆయన వెంట పంపుతాడు. ఆ తరువాత రామ లక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రునితో కలిసి అడవిలో ప్రయాణించడమే ఉంటుంది, బాల కాండ ముగిసే సరికి రామచంద్రుడు సీతమ్మను వివాహం ఆడి అయోద్యచేరి 12 సంవత్సరాలు గడుస్తుంది. బాల్యం గురించి ఏమి చెప్పనే లేదు. మనం గుర్తించాల్సిన విషయం ఉంది. ఈ కాండము అంతా విశ్వామిత్రుని గురించి చెప్పడానికి ఉన్నదే.
విశ్వామిత్రుడు బాలుడా ? ఎంతో పెద్ద ఋషి, ఎన్ని పనులుచేసాడు, ఎన్నో సార్లు తను దిగజారి పోయాడు, ఎంతో కష్టపడి తిరిగి పైకి వచ్చాడు. ఆయనా బాలుడంటే ? అని అనిపిస్తుంది. కానీ బాలుడంటే ఆయనే. బాల కాండలో దశరథ మహారాజు రామచంద్రుని భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టగానే వారి భవిష్యత్తు తీర్చి దిద్దగలిగేవాడు విశ్వామిత్రుడే కనుక ఆయన గురించే ప్రస్తావించాడు వాల్మీకి. విశ్వామిత్రుడు వచ్చి రామచంద్రుడిని తీసుకెళ్ళి రకరకాల అస్త్ర శస్త్రాలను నేర్పించి సీతారాముల కళ్యాణం వరకు మాత్రమే విశ్వామిత్రుడు కనిపిస్తాడు. అయితే ఆయన జీవితం ఒక ఆదర్శం.
యాగ రక్షణ తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను జనక చక్రవర్తి సభకి తీసుకొస్తాడు. అక్కడ పూర్వ పరాలు విచారించాక అక్క జనక చక్రవర్తి యొక్క మంత్రి శతానందుడు రామ లక్ష్మణులతో విశ్వామిత్రుని గురించి చెబుతాడు. విశ్వామిత్రుడు మీకు గురువు కావడం ఎంతో అదృష్టమయా. ఇతను ఒకప్పుడు ఎలా ఉండే వాడు ఈ నాడు ఎలా అయ్యాడు. లోకంలో తనను తాను ఇంతగా సంస్కరించుకున్న వ్యక్తి మరొకడు లేడు అని వారందరికీ విశ్వామిత్రుని కథని వర్ణిస్తాడు. విశ్వామిత్రుని కథ అంత ఆనంద దాయకంగా ఉండదు. అంత అందంగానూ ఉండదు. అంతకు ముందు ఆయన ఎన్నో సార్లు కామ క్రోదాలను జయించలేక పోయాడు. కానీ సభలో కూర్చోబెట్టి శతానందుడు విశ్వామిత్రుని కథను పిల్లలకు చెబుతుంటే ఎట్లాంటి కోపం రాలేదు, స్పందించలేదు. తను వేరే వారి కథను వింటుంన్నట్టు కుదురుగా కూర్చొని విన్నాడు. ఆస్థితికి పక్వత చెందాడు. సాదకుడిగా తను తపస్సు చేసినప్పుడు కామ క్రోదాలకు బానిస అయ్యాడు, కానీ తన సాధనకి దైవానుగ్రహంగా శ్రీరామచంద్రుడిని జోడుచేసుకొన్నాడు. అట్లా రామాయణంలో ప్రతి అంశం మానవుడు తెలుసుకోవాల్సినవి. ఒక బాలుడి వలె మనస్తత్వం ఆయనలో ఏర్పడింది. పిల్లవాని వలె నిష్కల్మషంగా తయారు అయ్యాడు. కనుకనే బాలకాండ అని పేరు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML