గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 12 July 2015

ఆదిశక్తి ఏకవీర తల్లి ....ఆదిశక్తి ఏకవీర తల్లి ....

ఆదిశక్తి ఏకవీర దేవి పరశురాముని తల్లిగా అందరికి సుపరిచితం. ఏకవీర, రేణుకా దేవిలు ప్రతిరూపమే ఆదిమాయ పార్వతీ దేవి. ఆమె అనేక దయ్యాలను సంహరించినట్టు పురాణాలు చెపుతున్నాయి. పౌరుషానికి ప్రతిరూపంగా పేరొందిన పరశురాముని తల్లిగాను, జమదగ్ని భార్య అని పురాణాలు చెపుతున్నాయి. రేణుకాదేవికి మరో పేరే ఏకవీరా దేవి.

సూర్యోదయం సమయాన ఆలయంలో కనువిందు చేసే ప్రకృతి రమణీయతను చూడొచ్చు. ఉదయించే సూర్య కిరణాలు దేవత విగ్రహంపై పడి, అవి వెదజల్లే కాంతిలో దేవీమాత ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. దీనికి తోడు పంజహార్ నదీ తీరం మరింత శోభాయమానంగా వుంటుంది. ఏకవీర దేవి విగ్రహం వెనుక భాగాన గణేష్, తుకైమాత విగ్రహాలు ఉన్నాయి.


ఆలయ ప్రవేశద్వారం ఏనుగుల విగ్రహాలతో చూడముచ్చటగా నిర్మించారు. ఈ ఆలయం ప్రాంగణంలో చాలా ఏళ్ళనాటి షామి చెట్టు ఉంది. దీన్నే షామి ఆలయంగా పిలుస్తారు. దేశంలో ఉన్న ఏకైక షామి ఆలయం ఇదే. ఆలయంలో మహాలక్ష్మీ, విట్టల్, రుక్మణి, సీతాలమాత, హనుమాన్, భైరవి, పరశురామ్ విగ్రహాలు కూడా ఉన్నాయి.

నవరాత్రి పండుగ సమయాల్లో ఇక్కడ ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు దేశ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అమ్మవారిని దర్శించుకుంటే.. అనారోగ్య సమస్యలు తీరడమే కాకుండా, సంపద సిద్ధిస్తుందని భక్తుల భావన.

ఈ ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని ధులియా పట్టణం సమీపంలోని పంజహర్ నదీ తీరంలో వెలసివుంది. ఈ దేవత కేవలం మహారాష్ట్ర వాసులకే కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తుల మనస్సుల్లో కొలువైవుంది.

ముంబై-ఆగ్రా, నాగ్‌పూర్-సూరత్ జాతీయ రహదారిలో ధులియా ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. ముంబై నుంచి ధులియా 425 కిలోమీటర్ల దూరంలో ఉంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML