సతీ దేవి జీవుడు సంసారం జీవనం నుంచి మోక్షం ఎలా పొందగలడు అని అడిగింది ! దానికి శివుడు ఇలా అంటున్నాడు , పరతత్త్వం అంటే విజ్య్ఞానం . ఆ విజ్ఞ్యనం ఉదయించిన జ్ఞ్యాని మనసులో 'నేనే బ్రహ్మమును' అనే స్మృతి కలుగుతుంది . ఆ జ్ఞ్యానం దుర్లభం . నా యందలి భక్తియే ఆ జ్ఞ్యానం పుట్టటానికి హేతువుఅవుతుంది . ఆ భక్తి 9 విధాలు ! జ్ఞ్యానానికి భక్తికి బేధం లేదు. భక్తి లేని వానికి జ్ఞ్యానం కలగదు ! భక్తుల విషయం లో నాకు తారతమ్యాలు లేవు.జాతి వర్ణ భేదాలు లేవు . ఆ బక్తి సగుణ నిర్గుణ భేదం చే రెండు విధాలు . సహజంగా హృదయం లో పుట్టిన భక్తి గొప్పది . కోరికలతో పుట్టిన భక్తి తక్కువైనది.
ఈ సగుణ , నిర్గుణ భక్తి నైష్టిక అనైష్టిక భేదం చేత రెండు విధానాలు . నైష్టిక భక్తి ఆరు భేదాలు కలది అనైష్టిక భక్తి లో భేదాలు లేవు . సగుణ నిర్గుణ భక్తి విహితం అవిహితం భేదం చే బహు భంగులుగా ఉంటుంది . భక్తి ఏదైనా అంగాలు తొమ్మిది 1.శ్రవణం 2. కీర్తనం 3.స్మరణం 4.సేవనం 5.ధ్యానం 6.అర్చనం 7.నమస్కారం 8.సఖ్యం 9.ఆత్మార్పణం . వీటికి అనేక ఉపాంగాలు ఉన్నాయి
1) భగవత్కతలను శ్రద్దా భక్తులతో వినటం ,శ్రవణం.
2) భగవంతుని లీలలను గానం చెయ్యటం కీర్తనం .
3)సర్వ వ్యాపకుడైన శంకరుని నిత్యము సర్వత్రా దర్శించి లోకంలో నిర్భయుడై ఉండుట స్మరణం.
4)సూర్యోదయం మొదలు అంఖిత భావంతో సర్వదా సేవకుని వలే అనుకూలంగా ఉండటం సేవనం.
5)భగవంతుని ప్రియునిగా భావిస్తూ అమృత రూపనందాన్ని అనుభవించటం దాస్యం
6)పాద్యం మొదలు షోడశోపచారాలతో పూజించటం అర్చన .
7)అష్టాంగములచే భూమిని స్పృశించటం వందనం
8)అంతా మనమేలు కొరకే అనే దృఢ నిశ్చయం సఖ్యం
9)దేహం మొదలు సర్వమును భగవానుని ప్రీతి కొరకే సమర్పించటం ఆత్మార్పణ
కావున దేవీ ! ఇట్టి భక్తి శ్రేష్టం ,జ్ఞాన వైరాగ్యాలకి తల్లి వంటిది , ముక్తికి దాసి వంటిది ! సర్వ కర్మల ఫలం భక్తి నుంచే పుడుతుంది !

No comments:
Post a comment