గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 7 July 2015

గోదావరి తీరంలో...ముఖ్య తీర్ధ క్షేత్రాలు!!!!

గోదావరి తీరంలో...ముఖ్య తీర్ధ క్షేత్రాలు!!!!
గోదావరి పుష్కరాల సమీపిస్తున్న సందర్భంగా...
గోదావరి పుట్టిన దగ్గర నుండి సముధ్రం లో కలిసే దాకా గోదావరి తీరంలో కానీ...లేదా తీరానికి దగ్గరలో కానీ వున ప్రసిద్ద పుణ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాం...ముందుగా...
గోదావరి పుట్టినిల్లు మహారాష్ట్ర లోని నాసిక్. త్రయంబకేశ్వరం...
నాసిక్ కు 35 కిలో మీటర్ల దూరంలోని ‘త్రయంబక్’ అనే ఓ కుగ్రామంలో అలరారుతోంది. ఇక్కడ శివలింగం భూమికి 8 అడుగులు క్రిందకు ఉంటుంది. స్వామిని భక్తులు దర్శించేందుకు వీలుగా శివలింగానికి ఎదురుగా అద్దాన్ని అమర్చారు. భక్తులు ఆ అద్దంలోనే స్వామివారిని దర్శించుకుంటారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించినంతనే సకల పాపాలను హరించిపోతాయని స్తోత్ర గ్రంధాలు చెబుతున్నాయి.
ఒకసారి తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడింది. ప్రజలు క్షామపీడుతులయ్యారు. అప్పుడు అహల్యా గౌతములు ..వరుణుని ఉద్దేశించి తీవ్ర తపస్సు చేసారు. ఆ దేవుడు ప్రత్యక్షమై ఒక చిన్న గుంటలో అక్షయజలం ఆవిర్భవిస్తుందని వర మిచ్చాడు. ఆ జలమే తరువాత గౌతమీ నదిగా రూపొందింది. ప్రజలకు క్షామభాధ తీరింది. అహల్య గౌతముల కీర్తి నలుదిశలా వ్యాప్తించింది. ఇది చూసి కొందరు మునులు ఒక మాయా గోవును సృష్టించి గౌతముని పంట పొలాలలోకి వదిలారు. గౌతముడు గడ్డిపరకతో గోవుని అదిలించాడు. అది మరణించింది. గోహత్యాపాపం గౌతమునికి కల్గిందనీ, అతని ముఖం చూస్తే పాపమనీ మునులు గౌతముని నిందించారు.
గౌతముడు ప్రాయశ్చిత్తం చెప్పండని ఆ మునులను వేడుకొన్నాడు. వారు చెప్పినట్లు బ్రహ్మగిరి ప్రదక్షిణం చేసాడు. కోటిలింగాలను ఆరాధించాడు. అందుకు సంతసించిన శివుడు ప్రత్యక్షమై గోహత్యాపాపాన్ని తొలగించాడు. గౌతముని ప్రార్ధనమేరకు గంగా శంకరులు నెలకొన్న క్షేత్రమే నాసిక్. అలా ఉదయించిన గంగయే గోదావరి. ఆ లింగమే త్రయంబకేశ్వరుడు. ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML