గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 7 July 2015

ఈ మధ్య ముష్కర మూకకి దొరికిన మరొక ఆయుధం దొరికింది అదే "మనుస్మృతి".

చదివి షేర్ చేయండి (పూర్తిగా తప్పక చదవండి)
ఈ మధ్య ముష్కర మూకకి దొరికిన మరొక ఆయుధం దొరికింది అదే "మనుస్మృతి". సాదారణంగా సనాతనం మీద ఏ విధంగా బురదచల్లుదామా అని కాచుకు కూచునే వారికీ ఇదేదో బాగా దొరికింది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు , కొత్త బిచ్చ గాడికి పొద్దు ఎరగనట్టు "మనుస్మృతి" లోని విషయాలనే పట్టుకొని ఊగిపోతూ దర్మం మీద పడి ఏడుస్తుంటారు!
ఏదో సనాతన ధర్మాన్ని మొత్తం తిరగేసినట్టు ఊగిపోయే ఈ ముష్కరులకి బహుశా "స్మృతి" అన్న పదానికి అర్థం తెలియదు కాబోలు ! మనువులు 14 మంది , స్మృతులు 18 అన్న కనీస జ్ఞ్యానం కూడా లేకుండా వెర్రి వాళ్ళ లాగా వాగుతుంటారు ! స్మృతులు అంటే విన్న వాటిని మననం చేసుకోటం , వీటిలో మనం ఎలా జీవించాలో , ఏవి చేయవచ్చో , ఏవి చేయకూడదో ,దార్మిక జీవనం ఎలా గడపాలో చెప్పబడ్డాయి మరి మనుస్మృతి ఒక్కటే చెప్పబడింద?? కాదు కదా , 1)మను , 2)యాజ్ఞవల్క్య , 3)పరాశర , 4)విష్ణు , 5)దక్ష , 6)సమ్వర్త , 7)వ్యాస , 8)హరిత , 9)సతతప , 10)వసిష్ఠ , 11)యమ,12)అపస్తంబ ,13)ఘౌతమ,14)దేవల,15)శంఖ-లిఖిత,16)ఉసన,17)అత్రి ,18)శౌనక అన్నవి 18 స్మృతులు!
వాటిలో ఈ మనుదర్మ శాస్త్రం అన్నది కృత యుగానికి చెందినది , దీనికి ప్రస్తుతం ఉన్న కలి యుగానికి ఎటువంటి సంబంధం లేదు ! అంతే కాకా అవి స్మృతులు అంటే చెప్పిన వాటిని జ్ఞ్యప్తికి తెచ్చుకోటమే తప్ప మరొకటి కాదు ! మన పూర్వికులు వెండి పళ్ళెం లో అన్నం తిన్నారు రాగి చెంబులో నీళ్ళు తాగే వారు అని మనం అనుకోటం గత స్మృతులే , మరి మనం వాటిని పాటిస్తున్నామా?? లేదే ! వారి యొక్క విధానాన్ని నెమరు వేసుకుంటున్నాం అంతే! వాటిలో మంచిగా మనకేదన్న తోచితే దాన్ని వాడుకుంటాము ! ప్రస్తుత కలియుగానికి పారాశర స్మృతి అన్నది పాటించాలి ! త్రేతాయుగం కోసం యాజ్ఞవల్క్య స్మృతి అన్నది ఉండేది . ద్వాపర యుగానికి శంఖ-లిఖిత స్మృతి ఉండేది! ఎప్పుడో కృతయుగానికి చెందిన మనుస్మృతిని ,ప్రస్తుతం ఎవరు పాటించని మను స్మృతిని అజ్ఞ్యానులు బురదచల్లటం కోసం మాత్రమె ఎన్నుకోటం వీరికి సనాతనం మీద ఉన్న విద్వేషం ఏపాటిదో తెలియచేస్తుంది! ఒక వైపు ఈ ముష్కర మూక ఇలా విషం చిమ్ముతుంటే మన పొరుగు దేశాలైన బర్మా , ఇండోనేషియ , చైనా లో కూడా మనుస్మృతి ప్రభావం ఉండేది ! సయామ్ , బాలి దేశాలు మనుస్మృతి లోని న్యాయ విభాగానికి అదిక ప్రాదాన్యత ఇచ్చాయి ! .మహానుబావుడు అంబేద్కర్ గారు కూడా కాలం చెల్లిన ధర్మ గ్రంధం అని మను స్మృతిని వ్యతిరేకిన్చాడే తప్ప మరే సనాతన గ్రంధాన్ని అయన కించపరచలేదు ! మరి ఈ ముష్కర మూక ఏమో అంతం చెందిన సత్యయుగం నాటి స్మృతులని స్మరించుకుంటూ అవే సనాతన ధర్మం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి కలియుగానికి పరాశర స్మృతి అన్నదే ప్రామాణికం మనుదర్మాన్ని పాటించాలి కలియుగం లో అని ఏ సనాతన గ్రంధం కూడా చెప్పడం లేదు ! పైగా మను ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు బ్రిటిషు వారు లేనివి చేర్చారు అని రాజీవ్ దీక్షిత్ గారు ఆవేదన చెందిన విషయం తెలిసిందే!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML