గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 7 July 2015

కలిసంతానం వినాయకుడిపై పడింది... శివుడు కన్నకొడుకునే చంపాడు..అంత క్రూరమైనవాడా?.ఆయన దేవుడైతే తన కొడుకని తెలియదా? మనిషితల కాకుండా ఎనుగుతల ఎందుకు పెట్టాడు?వినాయకుడు దేవుడెలా అయ్యాడు?..ఇలా రాంగోపాల్ వర్మని గుర్తు చేస్తున్నారు.కలిసంతానం వినాయకుడిపై పడింది... శివుడు కన్నకొడుకునే చంపాడు..అంత క్రూరమైనవాడా?.ఆయన దేవుడైతే తన కొడుకని తెలియదా? మనిషితల కాకుండా ఎనుగుతల ఎందుకు పెట్టాడు?వినాయకుడు దేవుడెలా అయ్యాడు?..ఇలా రాంగోపాల్ వర్మని గుర్తు చేస్తున్నారు.


పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు...వీడు మహా శివభక్తుడు..ఎంతటి భక్తి అంటే శివుడు తన ఒక్కడికే సొంతం కావాలని..ఘోర తపస్సు చేసి మహాదేవుడిని తన ఉదరంలోనే ఉండమని వరం కోరుకున్నాడు..శివుడు సరేనన్నాడు..మహాదేవుడే అచేతనంగా ఉండటంతో సృష్టిధర్మం గతి తప్పింది..విష్ణువు ఒక ఉపాయం ద్వారా గజాసురుడికి బుద్ది చెప్పి శివుడు బైటకు వచేలా చేసాడు..
అలా బైటకు వచేటప్పుడు గజాసురుడి ఉదరం చీలింది..
అప్పుడు మహాదేవుడు "గజాసురా నీది గొప్పభక్తి.కాని స్వార్ధం వల్ల వినాశనం కొనితెచ్చుకున్నావు..ఇంకేదైనా వరం కోరుకో" అన్నాడు...అందుకు ఆ రాక్షసుడు దేవా! నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూ మీ సమక్షంలో ఉండేలా అనుగ్రహించమన్నాడు.శివుడు 'తధాస్తు' అన్నాడు.
ఆ తర్వాత కైలాసానికి వస్తున్న శివుడిని వినాయకుడు అడ్డుకోవడం,వద్దని వారించిన దేవతలను పరాజితులని చేయడంతో తప్పనిసరి పరిస్థితులలో శివుడు వినాయకుడిని దండించాడు...మళ్లీ గజాసురుడి శిరస్సుతో బ్రతికించాడు..


కైలాసంలో జరగబోయే సంఘటన ముందే తెలుసుకనుకే గజాసురుడికి నువ్ ఎల్లప్పుడూ మా సమక్షంలో ఉంటావని వరమిచ్చాడు..అలాగని ఏ చెట్టుగానో చీమగానో కైలాసంలో ఉండమని చెప్పవచ్చు..కాని అతని అనితరసాద్యమైన భక్తికి మెచ్చుకుని ఏకంగా తన పుత్రుడి స్థానాన్నే ఇచ్చాడు..
అది మహాదేవుడి కరుణ..అపారం.....

ఏనుగు మదించిన బలానికి,బుద్దికి గుర్తు....
వర్షాకాలంలో అడవిఅంతా దట్టంగా అల్లుకుపోతుంది...అప్పుడు అన్ని జీవులు ఏనుగు కోసం చూస్తాయి...ఏనుగు నడుస్తూ పోతుంటే దారి ఏర్పడుతుంది..ఆదారిలో ఇతర జీవులు తేలికగా ప్రయాణం చేయగలుగుతాయి.."అందువల్ల వినాయకుడు దారి చూపించేవాడు".
ఎలుక చపల చిత్తానికి,తామస బుద్దికి ప్రతీక.ఎలుక మీద స్వారి చేయడమంటే కామ,క్రోదాలని అదుపులో ఉంచడమే..
భూత,భవిష్య,వర్తమాన కాలాలను బొజ్జలో దాచుకుంటాడు కనుక లంభోదరంతో ఉంటాడు.
ఒకపక్క విరిగిన దంతం త్యాగాబుద్దిని సూచిస్తుంది.
.
వినాయకుడు అంటే "విశేషమైన నాయకుడు" అని అర్ధం... ప్రమదగణాలకు,దేవగణాలకు నాయకత్వం వహించడానికి అత్యంత సమర్ధత ఉండాలి..అంతటి సమర్ధుడు కనుక శివుడు ఆ భాద్యతని వినాయకుడికి ఇచ్చాడు.
ఉపాసనా సాంప్రదాయంలో దైవరూపంలోని శక్తిని భార్యలుగా ఆరాధిస్తారు..సిద్ది,బుద్ధి ని కలిగించే దైవం కనుక వాటిని ఆయన భార్యలుగా,స్త్రీదేవతా రూపంలో ఆరాధిస్తారు
గణపతి ఆరాధన చాలా తేలిక. గడ్డిపరకతో పూజించినా ప్రసన్నుడౌతాడు.
ఇంకా చాలా చెప్పవచ్చు కాని లెంగ్త్ ఎక్కువవుతుంది కనుక ఇక్కడితో ముగిస్తున్నాను..

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML