ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Monday, 13 July 2015

ఈ గ్రంధంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వ్రాయబడ్డాయి. "యంత్రాలు ఎలా తయారు చేయాలి?","ఆకాశంలో ప్రయాణించడం ఎలా సాధ్యం?" అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి.భోజరాజు గురించి అతను ఒక గొప్ప మహారాజుగా మనందరికీ తెలుసు. ఇతని ఆస్థానంలోనే మహాకవి కాళిదాసు ఉండేవాడని చరిత్ర చెప్తోంది.

కానీ ఇతను "సమరాంగణసూత్రం" అనే గ్రంధం వ్రాశాడని చాలామందికి తెలీదు.

ఈ గ్రంధంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వ్రాయబడ్డాయి. "యంత్రాలు ఎలా తయారు చేయాలి?","ఆకాశంలో ప్రయాణించడం ఎలా సాధ్యం?" అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి.


అమరకోశం లో 'వ్యోమయానం విమానోస్త్రీ' అని ఉంది. అంటే "ఆకాశంలో ప్రయాణించే వాహనానికి విమానమని పేరు" అని అర్థం.

భోజరాజు తన 'సమరాంగణసూత్రం'లో విమాన నిర్మాణవిధానం గూర్చి వ్రాస్తూ భోజరాజు "విమాన నిర్మాణం గురించి స్థూలంగా తత్త్వము(theory) మాత్రమే వ్రాస్తున్నాను. దానిని నిర్మించే విధానం తెలిసే వదిలేస్తున్నాను,వ్రాయడం లేదు.చేయడం ఎలాగో చెప్పడం వల్ల సామాన్య జనానికి సుఖం బదులు కష్టమే ఏర్పడుతుంది అని ఇది వ్రాయడంలేదు' అని వ్రాశారు.

చిత్తశుద్ధి లేని వారి చేతిలో ఇలాంటివి పడితే పసిపిల్లల చేతిలో విషం ఉన్నట్లే కదా!

భోజరాజు గారు ఏమి ఆలోచించాడో ఏమో మనకైతే తెలియదు.

1980 లలో ఈ గ్రంధాన్ని చూసిన శాస్త్రవేత్తలు అందులో బెలూన్ల వంటి సాధనాల నిర్మాణం, అందులో ఎలా ప్రయాణించడం అనే విషయాలు వర్ణించారని అన్నారు.

ఇతర దేశాలలో నూతనశాస్త్రాలు అభివృద్ధి చెందుతూ ఉంటే మనదేశంలో ఉన్నశాస్త్రాలు కూడా నామరూపాలు లేకుండ నశిస్తున్నాయి. ఉన్న శాస్త్రాల ను ఉపయోగించుకొనే పద్దతి మనకు తెలియడంలేదు.

ప్రాచీన శాస్త్రాలను అర్థం చేసికొనడానికి పరిశోధనలు చెయ్యాలి. మనకు అర్థము కాకపోయినా మన తర్వాతి తరం కొరకైనా వానిని రక్షించాలి. ఇప్పుడు అర్థము కాకపోయినా మరియొక కాలంలోనైనా అవి ఉపయోగపడతాయి.

మిగిలిన దేశాలు మొదట అజ్ఞానదశలో ఉండి క్రమేణ జ్ఞానదశకు వచ్చాయి. మన దేశము ఆరంభ కాలములో ఉచ్చస్థితిలోఉండి క్రమేణ క్షీణస్థితికి వచ్చి మళ్లీ ఇప్పుడు ఉన్నత స్థితికి వెళ్తోంది.

ఇప్పటికే ఎన్నో శాస్త్రాలు మనకు దొరకడం లేదు. ఉన్న శాస్త్రములను మూర్ఖంగా పనికిమాలినవని పారవేస్తే మనకే నష్టం. వానిని అర్థం చేసికొనడానికి ప్రయత్నించాలి. నిరూపణ కానిదే దేనినీ ఖండించుటకు మనకు అధికారంలేదు. అర్థము చేసికొనుటకే మనకు అధికారం ఉంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML