గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 7 July 2015

మనుస్మృతి అంటే ధర్మ శాస్త్రం

మనుస్మృతి అంటే ధర్మ శాస్త్రం
“ధరతిలోకానితి ధర్మః “-లోకములను ఉద్దరించేది ధర్మం అని అర్దం.”థ్రియజే జనైరీతి ధర్మః”జనులచేత ధరింపబడేది ధర్మం అని మరొక సమన్వయం చేస్తే –ధర్మాచారణ వల్లనే ఈ లోకం నిలిచియున్నదని ,అట్లాగే మానవుల స్థితిగతులకు ధర్మమే మూలమని స్పష్టమవుతుంది.అలాంటి ధర్మానికి మూలం వేదం.అందుకే “వేదో ధర్మ మూలం” అని చెప్పబడింది ‘విద్’ శబ్దానికి జ్ఞానం అని అర్ధం .దర్మాధర్మా పరిజ్ఞానం కలిగించేది కనుకనే‘వేదమని ,ధర్మాధర్మాదులు దీని ద్వారా తెలియబడుతాయి కనుకనే ‘శృతి’’ అని ఆ ధర్మములు తరతరాలుగా అభ్యసించబడుతున్నాయి కనుక ‘ఆమ్యాయ’ మని వేదానికి పేర్లు .ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించేది వేదం అన్నమాట.అదే విషయాన్ని మనుస్మృతి కూడా “వేదోఖీలో ధర్మం మూలం”(2-6),”సర్వోభిహితో వేదో”(2-7), “ధర్మఎవహతో హంతి”ధర్మొ రక్షతి రక్షితః)8-15-అని పలు చోట్ల వివరించబడింది.

మనిషి మనిషిగా బ్రతకటానికి,మనిషిగా ఎదగటానికి చాలా ముక్యమైన ధర్మాన్ని ప్రబోధించినవాటిలో వేదం తరువాత, మొదట చేప్పదగినవి, ధర్మశాస్త్రాలు.ఆ దర్మశాస్త్రాలలో అగ్రగణ్యమైనది మనుస్మృతి.ఒక సారి ధ్యాన నిమగ్నుడైన మనువును,బ్రహ్మదేవుని సమస్త సృష్టి ధర్మాలు తెలుపవలసిందిగా ప్రార్ధించిన ఋషిగనానికి ,బృగుమహర్షిద్వారా వాటిని చెప్పించాడు.అదే మనుస్మృతి
“అల్పజ్ఞాత్ బిబ్యతి వేదః” ఏష మాం ప్రతిరిష్యతే ఇతి తస్మాద్మనురవదత్ తద్భేషజమ్ “-అల్పజ్ఞులైన వారు అపార్ధకల్పనలు చేస్తారని వేదము భయపడుతుందని,దానికి ముందును మనువు చెప్పాడని ప్రతీతి.అందుకే ధర్మ శాస్త్ర గ్రంధాలన్నింటిలోనూ మనుస్మృతి అగ్రస్థానం ఉన్నది.అయితే యుగయుగంలోనూ ధర్మాలు మారుతూ వచ్చాయి.అట్లాగే ధర్మ శాస్త్రాలు కూడా మారుతూవచ్చాయి.

“కృతేతు మానవాః ప్రోక్తః
త్రేతాయాం గౌతమ స్మృతిః
ద్వాపరే శంకలిఖితౌ
కలౌ పరాశర స్మృతిః “

అన్న శ్లోకం ఇదే విషయాని చెప్పుతుంది.కృతయుగంలో మనుస్మృతి పరమ ప్రామాణికంగా పరిగణించబడింది.అట్లాగే త్రేతాయుగంలో గౌతమ ధర్మ శాస్త్రం ,ద్వాపర యుగంలో శంకలిఖిత స్మృతి ప్రామాణికములు. ఈ కలియుగములో పరాశరస్మృతి ప్రామాణింగాఉన్నదని అర్ధం. ఈ శ్లోకం మనుస్మృతి ప్రామాణికతనే కాక ,ప్రాచీనత్వాన్ని కూడా తెలుపుతుంది. పితృశ్రద్దాలలో మాంసభక్షణ ,దేవరన్యాయమున పిల్లలను కనటం వంటివాటిని మనుస్మృతి సమర్దిస్తుండగా పరాశరస్మృతి కలియుగంలో అవి నిషిద్దంలని చెప్పింది.అట్లాగే –నామకరణము శిశువునకు 10 లేక 12వ రోజున చెయ్యవలెనని మనుస్మృతి (2-30) చెబుతూ ఉంటే,11 వ దినములో చెయ్యవలెనని శంకవచనము.ఇవన్నీ ఆచారాలు ,ధర్మాలు ఎట్లా మారుతూ వచ్చాయో తెలుపుతాయి .మొత్తం మీద –ఈనాడు మనం ఆచరిస్తున్న ఆచార వ్యవహారాలన్నిటికి మూలం ధర్మశాసస్త్రాలే.

ఈనాడు మనం ఆచరిస్తున్న జాతకర్మ ,ఉపనయనము,వివాహము వంటి పొడశ సంస్కారములు ,శ్రద్దవిది,జతాశౌచ మృతాశౌచములు స్త్రీ ధర్మాలు వంటి సదాచారములు ;అప్పుతీసుకొనటం ,క్రయవిక్రయాలలో తలెత్తే వివాదాలు,స్వామి-సేవకుల వివాదాలు,భూమి ఎల్లలు,స్త్రీ పురుష వివాదాలు, ఆస్తి పంపకం, జూదం,వ్యభిచారం వంటి అష్టాదశ వ్యవహారాలు ; సకాలంలో కర్మలు చెయ్యకపోవటంవల్ల కలిగే అనర్దాలకు చేసుకోవలసిన ప్రాయచ్చిత్తాలు ; అన్యాయం చేసిన వారికి రాజు విదించవలసిన వివిధ శిక్షలు – వంటి ఎన్నో విషయాలు ఈ ధర్మ గ్రంధాలలో వివరించబడినాయి .అంటే వేల సంవత్సరాలుగా నిలిచి ఉన్నది.తరతరాలుగా వస్తూఉన్నది ,అయిన మన సంస్కృతిని నిలబెట్టినవి మన ధర్మశాస్త్రగ్రంధాలే అందుకే వాటిని మనం అధ్యయనం చేసి ,మన సంస్కృతిని అర్ధం చేసుకొని ,మన జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలి. అలాంటి వాటిలో అగ్రగణ్యమైనది మనుస్మృతి . కొన్ని వేల సంవత్సరాలక్రితం అందులో చెప్పిన ఆచారవ్యవహారాలే ఈనాటికి అమలు చేస్తున్నామంటే ,అవి మనకు ఎంత ఆదనీయమో గ్రహించవచ్చు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML