గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 13 July 2015

మంత్రానికి శక్తి ఉందా ?...మంత్రానికి శక్తి ఉందా ?...

"ఈ విశాల సృష్టికి వరప్రసాదం లాంటిది శబ్ద శక్తి. ఈ శబ్ద శక్తి 'పర ', 'పశ్యంతి ', 'మధ్యమ', 'వైఖరి ' అనే నాలుగు రకాలుగా విభజించబడింది. బయటికి మనం మంత్రాలు గట్టిగా చదువుతామే అది వైఖరి అన్నమాట. మధ్యమ పెదవులు కదుపుతూ నెమ్మదిగా చదివే పూజ మంత్రాలు అలాంటిది. పశ్యంతి మౌనంగా మనసులో చేసే ధ్యానం. పరా వీటన్నిటికి అతీతమైన స్థితిలో ఉండే శబ్ద శక్తి.

భవతి పరవాక్ భైరవ్యాఖ్యా
పశ్యంతి సాకధితా తారా
రసనిధి మాప్తా జిహ్వరంగం
మాతంగీతి ప్రధితా సేయం


మూలాధారంలో ఇమిడియున్న ఈ శబ్ద శక్తి త్రిపుర భైరవి స్వరూపమున పరావాక్కు గా చెప్పబడుతోంది. ఈ శబ్దనాదమే హృదయమున పశ్యంతి రూపుగా (పశ్యంతి అంటే అన్నిటిని చూచునది గ్రహించునది అని అర్ధంట) దృష్టిని పొందుతూ "తార" గా వెలుగొందుతోంది. భాషావ్యాప్తికి మూలము, అక్షర బ్రహ్మయగు "ఓం" కూడా తార నుండే పుట్టిందని అని చెపుతారు.

"గురువుగారు తారని ఓంకార స్వరూపంగా చెపుతారు. అది నిజమేనా? " అని ఒక శిష్యుడు అడిగాడు.

"మహా తపస్వులు యోగులు అయిన గణపతిముని అదే చెప్పారు. సృష్ట్యాదిలో ఉన్న మౌలిక మౌనాన్ని ఖండిస్తూ "ఓం" అనే అక్షరం పుట్టింది కదా! అది తారా స్వరూపం పూర్తిగా కాదు ఎందుకంటే ఓం అనగానే అది ఖండితమైనది - అందుచేత అనంతమైన పరబ్రహ్మత్వాన్ని చూపలేదు. మనమ అఖండితమైన "ఓం" ని దర్శించగలిగితే అదే తార స్వరూపం", అని చెప్పారు గురువు గారు.

"కొంచెం అర్ధం కాలేదు, మళ్ళీ చెప్పగలరా గురువు గారూ? " అని ఒక శిష్యుడు అడిగాడు.

గురువుగారు వివరంగా చెప్పారు, "ఇది అర్ధం కావాలంటే, ఒక మహా సముద్రం ఊహించు. అది అఖండిత ఓంకారం అనుకో. మనం సముద్రం ఒడ్డున ఉండి ఒక బకెట్ సముద్రం నీళ్ళు తీసుకుంటే అప్పుడు ఆ బకెట్ చూపించి నువ్వు 'సార్ ఇది సముద్రం ' అంటే అది నిజమా? ఆ పాత్రలో నీళ్ళూ, సముద్రం నీళ్ళు ఒకటైనా బకెట్లోది సముద్రం కాదు. అలాగే "ఓం" అని ఉచ్ఛరించినప్పుడు ఆ అనంత సృష్టి ఓంకారం వ్యక్త తలంలోకి వచ్చి దాని మూలతత్వం నుంచి విడిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆగి అర్ధం చేసుకుంటే ఆ మూల తత్వమే "తార". ఆ ఆది ప్రణవనాదం "తార". తంత్రాలు చిన్న చిన్న మంత్రాలు ఆ మహాశక్తిని ప్రతిఫలించగలవే కాని పరి పూర్ణంగా అవి "తార" స్వరూపం కాదు. చిన్న అద్దంతో సూర్యకాంతిని ప్రతిఫలింప చేయగలం, కాని ఆ అద్దమే సూర్యుడు కాదు.
అందుకే హిమాలయ యోగులు, పూర్వపు ఋషులు అలా సంవత్సారల తరబడి తప్పస్సు చేసారు అఖండిత, అనంతత్వాన్ని మంత్రంతో పొందడానికి. " అని ముగించారు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML