గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 11 July 2015

సనాతనం లో ఏదన్న తప్పు దొరుకుతుందా దాన్ని పట్టుకొని ఎలా విసిగిద్దామా అనుకుంటుంటారు , కానీ వాస్తవం ఏంటంటే

సనాతనం లో ఏదన్న తప్పు దొరుకుతుందా దాన్ని పట్టుకొని ఎలా విసిగిద్దామా అనుకుంటుంటారు , కానీ వాస్తవం ఏంటంటే సనాతనం యొక్క గ్రందాలు ఏ 1200 పేజిలకో పరిమితం కాలేదు సనాతనం లో ఒక్కో గ్రంధమే దాదాపు 1000 పేజీల పై చిలుకు ఉంటాయి , 18 పురాణాలూ 108 ఉపనిషత్తులు , 4 వేదాలు , రామాయణం , భారతం , భగవత్ గీత అన్ని కలిపితే 12000 పేజీల పైచిలుకు అయిన పెద్ద అతిశయోక్తి కాదు ! అసలు విషయం ఏంటంటే విజ్ఞేశ్వర జననం లో వివిధ పురాణాల్లో వివిధంగా ఉంది అని కొంత మంది తెగ చించుకుంటున్నారు వాస్తవానికి వారు విన్నవి అన్ని కూడా వాస్తవమే వరాహ పురాణం లో ఒక రకంగా , శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము , శివపురనల్లో వేరు గా ఉండటానికి కారణం అవి జరిగిన యుగాలు .. సాదారణంగా ఈ మతి తప్పిన గొర్రెలు ఏదో 1200 గ్రంధానికే పరిమితం చేసి ఇంతే ఇంతకూ మించి లేదు అనుకుంటారు సనాతనం లో కూడా ఇదే ఉంటది అని వీరి భావన కానీ వీరి లాగా సనాతనం సృష్టి వయసు ని 6000 కి ఖుదించలేదు , నాలుగు యుగాలు , సత్యయుగం(కృత యుగం) , త్రేతా యుగం , ద్వాపరయుగం , కలి యుగం , పైగా దేవుడి యొక్క ప్రతి అవతారానికి ఒక కారణం ఉంటుంది దుష్ట శిక్షణ జరగాల్సిన ప్రతి మారు అయన అవతరించటం అన్నది జరుగుతూనే ఉంటది దేన్నే కృష్ణ భగవానుడు భగవత్ గీత లో " పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం.ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే " అన్నాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ , ధర్మ సంరక్షణ కోసం పదే పదే అవతరిస్తాను అని చెప్పాడు . ఇదే విదంగా గణేశుడు కూడా తానెత్తిన అవతారాల్లో మహోత్కట వినాయకుడు , మయురేశ్వర వినాయకుడు , గజాననుడు అవతారాలు ముఖ్యమైనవి ! కృతయుగంలో ఈయన తల్లిదండ్రులు అదితి కశ్యపులు. బంగారు శరీరచ్ఛాయతో పది చేతులతో సింహవాహనమెక్కి మహోత్కట గణపతి పేరుతో ప్రసిద్ధుడై దేవాంతక నరాంతక రాక్షసుల్ని వధించాడు.త్రేతాయుగంలో గణనాధుని తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. స్ఫటిక శరీరచ్ఛాయతో 8 చేతులవాడై మయూర వాహనం ఎక్కి మయూర గణపతిగా ఖ్యాతి నార్జించి సింధువనే రాక్షసుణ్ణి చంపాడు.
ద్వాపరయుగంలో పార్వతి నలుగుమట్టి ద్వారా పుట్టి, కుంకుమరంగు శరీరచ్ఛాయతో 4 చేతులవాడై ఎలుక వాహనాన్ని ఎక్కి గజావన గణపతి పేరుతో విఖ్యాతుడై సిందూరడనే రాక్షసుడిని మట్టుపెట్టాడు.
కలియుగంలో తనంత తానుగా (స్వయంభువు) పుట్టి పొగ రంగు శరీరచ్ఛాయతో రెండు చేతులవాడై అశ్వ వాహనాన్ని ఎక్కి ధూమకేతు గణపతి పేరిట కలియుగంలోని మొదటి పాదం దాటాక (1,80,000 సంవత్సర మీదట) దుర్జనులందర్నీ వధిస్తాడు. ప్రతికార్యంలో ముందుగా విఘ్నేశ్వరుడు పూజింపబడతాడని శివుడు అనుగ్రహించాడు!! త్రేతా యుగాములోను , ద్వాపరయుగాములోను శివ పార్వతులకే వేరు వేరు విధాలుగా జన్మించటం చూసి ఎవరైనా గందరగోళం చెందుతారు కానీ వాస్తవం ఇది ! అయన త్రేతాయుగం లో పార్వతి మాత తప్పస్సు వల్ల కలుగగా , ద్వాపరం లో తన చేతిలో బొమ్మగా చేసి ప్రాణం పోసింది !ఇవే కాకా వక్రతుండ , ఏకదంతా , మహోదర,గజానన,లంబోదర,వికట విఘ్నరాజ !!!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML