గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 7 July 2015

వాస్తు శాస్త్రం :;;వాస్తు శాస్త్రం :;;

వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం.
వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం.
భారతీయులు తమ ఇంటి నిర్మాణాల్లో పాటిస్తారు.
వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి.

భూమి వాస్తు.
హర్మ్య వాస్తు
శయనాసన వాస్తు.
యాన వాస్తు.

పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను.
అప్పుడు లోక సమ్రక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు.
ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది.

ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు.
బ్రహ్మదేవుని శరణువేడారు.
సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి 'ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు.
బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముకంగా క్రిందకు పడవేశారు.

ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది.
అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు.

శిరస్సున - శిఖి(ఈశ) దక్షిణ నేత్రమున - సర్జన్య వామనేత్రమున - దితి దక్షిణ శోత్రమున - జయంతి వామ శోత్రమున - జయంతి ఉరస్సున (వక్షమున) - ఇంద్ర, అపవత్స, అప, సర్ప దక్షిణ స్తనమున - అర్యమా వామ స్తనమున - పృధ్వీధర దక్షిణ భుజమున - ఆదిత్య వామ భుజమున - సోమ దక్షిణ బాహువున - సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా

వామ బాహువున - పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట దక్షిణ పార్శ్వకామున - వితధి, గృహక్షత వామ పార్శ్వకామున - అసుర, శేష ఉదరమున - వినస్వాన్, మిత్ర దక్షిణ ఊరువున - యమ వామ ఊరువున - వరుణ గుహ్యమున - ఇంద్ర జయ దక్షిణ జంఘమున - గంధర్వ వామ జంఘమున - పుష్పదంత దక్షిణ జానువున - భృంగరాజ వామ జానువున - సుగ్రీవ దక్షిణ స్పిచి - మృగబు వామ స్పిచి - దౌవారిక పాదములయందు - పితృగణము

ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే 'వాస్తు పురుషుడూ గా సృష్టిగావించాడు.

వాస్తు శాస్త్రంలోని నిర్మాణ వ్యవస్థలో ప్రధాన వస్తువులు పంచ భూతాలైన

భూమి
జలం
అగ్ని
వాయు
ఆకాశం

వాస్తు పురుష మండలాలు :;

ఎనిమిది దిక్కులకు పరిపాలించే అష్టదిక్పాలకులు ప్రధాన మండలాధిపతులు:

ఈశాన్యము - Ruled by lord of all quarters- Ishvara (Religions,Luck and Faith)

తూర్పు - ఇంద్రుడు- Ruled by the solar deity- Aditya (Seeing the world)

ఆగ్నేయము - అగ్ని- Ruled by the fire deity - Agni (Energy Generating)

దక్షిణం - యముడు- Ruled by lord of death - Yama (Damaging)

నైఋతి - పిత్రు/నైరుత్య, - Ruled by ancestors (History)

పడమర - వరుణుడు- Ruled by lord of water (Physical)

వాయువ్యం - వాయు- ruled by the god of winds (Advertisement)

ఉత్తరము - కుబేరుడు- Ruled by lord of wealth (Finance)

కేంద్రము - బ్రహ్మ- Ruled by the creator of the universe (Desire)

ఆది నుంచి వెలుగు చూస్తున్న శాస్త్రాల ప్రకారం మానవుడి కర్మఫలాల పరిశీలన మేరకే ఆయా రుతువుల ప్రకారం వాస్తును జీవనాన్ని విశదీకరించటం జరుగుతుందని ప్రతీక. హైందవ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. దానికి అనుగుణంగానే గృహం, వివాహం, సంతానం, ఉద్యోగం, ధనం, జీవితం అంటూ మానవుడికి పలు విధాలుగా శాస్త్రాల ఫలితాలను అందించటం జరుగుతుంది.

ఆయా జన్మ నక్షత్రాల మేరకు రాజు శనిగా, మంత్రి గురువుగా ఆర్ఘాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు తదితర విభాగాల ద్వారా ఫలితాలను విశదీకరిస్తుంటారు.

ప్రధానంగా జన్మ ఫలాలు, నక్షత్రాలు, జాతక చక్రాలకు అనుగుణంగానే జీవనం సాగుతుందని భారతీయుల నమ్మకం.
ఇందులో భాగంగానే పురాణ పండితులు అనాదిగా చూపుతున్న శాస్త్రాలను పరిగణలోకి తీసుకుని, తమ జీవితాలకు తగ్గట్టుగానే నడుచుకుంటున్నారు.

ఇందులో గృహం, వాహనంజీవనం అనే వాస్తు జీవిత గమనాన్ని కూడా మమేకం చేస్తూ ఆయా జన్మ నక్షత్రాల ప్రకారం ఫలితాలను అందిస్తుంటాయి.

ప్రధానంగా గృహాల నిర్మాణం ద్వారానే జీవన గమనంలో పెను మార్పులు సంభవిస్తాయని శాస్త్రాలు వెల్లడించటంతో భారతీయులు అధికంగా వాటినే అనుసరిస్తున్నారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML