సంగ్రామే సుభటేంద్రాణాం కవినాం కవిమండలే ।
దీప్తిర్వాదీప్తిహానిర్వా ముహుర్తాదేవ జాయతే॥
యుద్ధమునందు వీరుల శౌర్యాశౌర్యములు, కవి సంఘమునందు కవులయొక్క చాతుర్యాచాతుర్యములు (ప్రతిభ ), పండిత సదస్సు యందు పండితుడి పాండిత్యము రాణిస్తుందా లేదా అనునది ఒకక్షణమాత్రములో వెల్లడియగును.
(౧. యుద్ధమునందు మాత్రమే వీరుల శౌర్య ప్రతాపములు తెలుస్తాయి)
(౨. తోటి కవులతో ఉన్నప్పుడే కవి యొక్క చతురత బయటపడుతుంది )
(౩. పండిత సభలో మాట్లాడుతున్నప్పుడే పండితుడి గొప్పతనము తెలుస్తుంది)
గుణిని గుణజ్ఞో రమతే
ఒక గుణవంతుడే (వీరుడే)(కవే)(పండితుడే) మరియొక గుణవంతుడిని (వీరుడిని) (కవిని) (పండితుడిని) గుర్తించగలడు
ఎటువంటి సమయమైనా జగదంబ అనుగ్రహము ఉన్నచో విజయమే తప్ప అపజయము అనునది ఉండదు.
No comments:
Post a comment