గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 11 July 2015

న్యాయోపార్జిత ద్రవ్యముతో మాత్రమే భక్తిపూర్వకముగా శివుని పూజింపవలెను

న్యాయోపార్జిత ద్రవ్యముతో మాత్రమే భక్తిపూర్వకముగా శివుని పూజింపవలెను. ఒకవేళ అన్యాయముగ సంపాదించిన ధనముతో భక్తిపూర్వకముగ శివుని పూజించినను ఏ పాపమును అంటదు. ఎందుకనగా భగవంతుడు భావవశుడైయుండును. న్యాయముగ సంపాదించిన ధనముతో భక్తి లేకుండ ఎవరైన పూజించినచో అట్టివారికి ఫలితమేమియు ఉండదు. పూజా సాఫల్యమునకు భక్తియే కారణము. తన వైభవమున కనుగుణముగ భక్తిభావముతో శివుని ఉద్దేశించి చేయబడునది కొంచెమైనను, అధికమైనను అట్టివాడు ధనవంతుడైనను, దరిద్రుడైనను అందరికిని ఒకే ఫలము లభించును. ధనము లేనివాడైనను, భక్తి భావ ప్రేరితుడై శివుని పూజింపవచ్చును. కాని గొప్ప సంపదలు కలిగి, భక్తి హీనులైన వారు శివుని పూజింపరాదు. శివుని ఎడల భక్తి లేని పురుషుడు తన సర్వస్వమును సమర్పించినను అతడు శివారాధన ఫలమును పొందలేడు. ఎందుకనగా ఆరాధనయందు భక్తియే ముఖ్యకారణము.
శివుని ఆరాధనయందు భక్తికే గొప్ప ప్రాధాన్యత గలదు. పాపమనెడు మహాసాగరమును దాటుటకు భగవంతుడగు శివునియెడల భక్తియే నౌకతో సమానమైనది. అంత్యజుడు, అధముడు, మూర్ఖుడు, పతితుడైనవాడు కూడ భగవంతుడగు శివుని శరణుజొచ్చినచో అట్టివాడు సకల దేవతలకు, అసురులకు కూడ పూజ్యుడగును. కనుక సర్వదా సర్వథాభక్తి భావముతో శివపూజ యొనర్చుటకు ప్రయత్నము చేయవలెను.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML