పాదమర్దనం-....
Reflexology ....
మన పాదాలు మన శరీరాకృతినే తలపిస్తాయి...
1. బొటన వేలు తలను..
2. మిగిలిన వేళ్ళు కళ్ళు, ముక్కు , గొంతు, వరుసగా సూచిస్తాయి...
3. కాలివ్రేళ్ళ క్రింది భాగం... అంటే పాదాలకు వ్రేళ్ళకు మధ్య కలిసి ఉండే భాగం గొంతును సూచిస్తాయి
4. అరి కాలిపై ఉన్న ఉబ్బెత్తు భాగం చాతీని సూచిస్తుంది...
5. అరికాలి లోని గుంట భాగం నడుమును
6. కాలి మడమ భాగం కాళ్ళను
7. కాలి చివరి భాగం అరికాళ్ళను/మడమలు/పాదాలను సూచిస్తాయి...
ఇక విషయం చాలా వరకు మీకు అర్ధమయి ఉంటుంది...
బొటన వేలిని ఉబ్బెత్తు భాగాలను మర్దించటం ద్వారా తలలోని పిట్యుటరీ గ్రంధి చేతనమయి..
తలకు మేలు చేకూరుతుంది...
రెండవ మూడవ, మిగిలిన వేళ్ళ ఉబ్బెత్తు భాగాలు మర్దించటం ద్వారా కళ్ళు, ముక్కు, గొంతుకు సంబంధించిన అవయవాలు చేతనమయి...
ఆయా భాగాల సమస్యలు తగ్గుతాయి...
గతంలో మన భారతీయ స్త్రీలు ఎక్కువగా నీటిలోనే పని చేయవలసి వచ్చేది..
అందువల్ల ఎక్కువగా జలుబు, కాలి వ్రేళ్ళు పాయటం వంటి ఋగ్మతలకు లోనయ్యేవారు...
దీనికి విరుగుడుగా మెట్టెలు ధరించడం వలన కన్ను, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు నివారించబడేవి...
కాలివ్రేళ్ళ క్రింది భాగం... అంటే పాదాలకు వ్రేళ్ళకు మధ్య కలిసి ఉండే భాగం గొంతులోని థైరాయిడ్ గ్రంధిని సూచిస్తుంది.. ఈ భాగంలో మర్ధన థైరాయిడ్ సమస్యలను నివారిస్తుంది...
అరికాలి పైన ఉబ్బెత్తు భాగాన్ని మర్దించడం ద్వారా ఊపిరితిత్తులు శ్వాస కోశ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.. రాకుండా చూసుకోవచ్చు...
అరికాలి భాగాన్ని మర్దించడం ద్వారా మూత్ర పిండాలు, కాలేయానికి సంబంధించిన గ్రంధులు చేతనమయ్యి వాటికి ఋగ్మతలు రాకుండా చూసుకోవచ్చు..
కాలి మడమ ప్రాంతాలు మోకాళ్ళు, కాళ్ళు నొప్పులు రాకుండా నివారిస్తాయి... కాలి మడమల చివరి క్రింది భాగం దగ్గర మర్దనం పైల్స్ సమస్యలను నివారిస్తుంది... ఈ విధంగా కేవలం పది నిమిషాల పాద మర్ధన కార్యక్రమం ద్వారా మన శరీరంలోని ఎన్నో సమస్యలను నివారించ వచ్చు....
No comments:
Post a Comment