గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 30 July 2015

మహాభారత‬ యుద్ధం నాటికి వర్ణవ్యవస్థ మాత్రమే ఉండేది. కులవ్యవస్థలేదు.మహాభారత‬ యుద్ధం నాటికి వర్ణవ్యవస్థ మాత్రమే ఉండేది. కులవ్యవస్థలేదు. ఆ యుద్ధంలో ఎందరో యోధులు, వేదశాస్త్రాలను అభ్యసించిన పండితులు, అనేక నాగరికతలకు మూలపురుషులు, అనేక రాజ్యాల రాజులు పాల్గొన్నారు. అందులో వేదసారాన్ని ప్రచారం చేసిన పండితులు కూడా ఉన్నారు. ఈ యుద్ధం కారణంగా వారందరూ మరణించారు. అదీగాక, యుద్ధంలో వాడిన అస్త్రాలు పడి చాలా రాజ్యాలు తుడిచిపెట్టుకొని పోయాయి. అప్పటివరకు వేదం గ్రంధస్థం కాలేదు. ఆ యుద్ధం సమయానికి దాదాపు 197,29,43,963 సంవత్సరాలకు ముందు వేదం మానవాళికి ఇవ్వబండింది. అప్పటినుంచి పరంపరగా, ఎక్కడా ఆటంకం లేకుండా గురుశిష్యపరంపరగా వచ్చింది. కానీ ఈ యుద్ధం ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. భారతదేశంలో రోడ్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇదంతా చూసిన ఋషులు, మునులు తీవ్ర ఆలోచనలో పడ్డారు. 'ఋషిః ఆ క్రాంతి దర్శనః' - భవిష్యత్తును దర్శించగలవారిని ఋషులు అంటారు. మానవజాతి మూలపురుషులైన ఋషులు ప్రపంచ భవిష్యత్తును గమనించారు.

అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఋషులందరూ భరతభూమికి తరలివచ్చారు. తొలిసారిగా 88,000 మంది మహర్షులతో ‪#‎భారతదేశంలో‬ ఒక పెద్దసమావేశం జరిగింది. అది ఒకరకంగా అత్యవసరసమావేశం లాంటిదే. ప్రపంచభవిష్యత్తుపై మేధోమధనం జరిగింది. అది ఒక ‪#‎యజ్ఞం‬ లాంటిది, అనేకులు దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. యుద్ధం ద్వాపరయుగాంతం యొక్క ప్రభావ ఫలితమే. అందుకే అంతపెద్ద జనవినాశనం సంభవించింది. శ్రీ కృష్ణపరమాత్మ మహానిర్యాణంతో ద్వాపరయుగాంతం అవుతుంది. అప్పుడు ప్రపంచాన్ని ఒక మహాజలప్రళయం ముంచెత్తుంతుంది. ప్రపంచనాగరికతలన్నీ నాశనమవుతాయి. అసలే వేదంలో ఉద్దండులైన వారందరూ యుద్ధం కారణంగా మరణించారు, వేదం నశించకపోయినా, వేదం తెలిసినవారందరూ నశించారు. వేదం నిరంతరం అధ్యయనం చేయాలి, అప్పుడే మానవజాతి పురోగమిస్తుంది, ప్రపంచం శాంతి మార్గంలో ప్రకృతి నియమాలకు లోబడి అభివృద్ధి చెందుతుంది. అందరూ రక్షించబడతారు. ................ రాబోయేది ‪#‎కలియుగం‬. ప్రజల్లో అధ్యాత్మిక భావన తగ్గిపోతుంది, నాస్తికం, దురాచారం, అధర్మం ప్రభలుతుంది. అప్పటివరకు శరీరంతో ఉన్న రాక్షసులు ఈ యుగంలో మానవ మనసుల్లో తిష్టవేస్తారు. వర్ణాశ్రమ ధర్మాలు మంటగలుస్తాయి. కొత్త మతాలు, వాదాలు పుట్టి జనాలను పక్కదారి పట్టిస్తాయి. అప్పటివరకు సమాజంలో సంచరించిన ఋషులు, మునులు ఇవి చూడలేక సమాజానికి దూరంగా తపస్సులో మునిగిపోతారు. ఎప్పుడో ఒకసారి ఒక మహానుభావుడికి దర్శనం ఇచ్చి, ధర్మరక్షణకు పురికొల్పుతారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ కలియుగంలో మానవుల ఆయుర్దాయం చాలా తక్కువ, కేవలం 120 సంవత్సరాలు మాత్రమే. అది కూడా సక్రమంగా వాడుకోరు. పైగా అల్పబుద్ధులు, అనంతమైన వేదాన్ని ధారణలో నిలుపుకోలేరు. కాబట్టి ఇప్పుడు వేదాన్ని గ్రంధస్థం చేయవలసిన అవసరం ఏర్పడింది అని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.. అది మహాసాహసకృత్యం, అప్పటివరకు ఎవరు చేయడానికి పూనుకోనిది.
Read More

వ్యాసుడు‬ సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపుడువ్యాసుడు‬ సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపుడు. అనంతమైన వేదాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవడం కలియుగంలో మానవులకు సంభవం కాదని, అసలు మొత్తం వేదం అధ్యయనం చేయుటకు వారి ఆయుర్దాయం సరిపోదని గ్రహించి, వారి మేధాశక్తి తక్కువగా ఉంటుందని, వేదంలో కొద్ది భాగాన్ని మాత్రమే గ్రంధస్థం చేశారు. వేదం అంతా ముఖ్యమైనదే అయినా, అందులో కూడా అతి ముఖ్యమైనది, కనీసం మానవులకు తెలియవలసిన భాగాన్ని నాలుగు వేదాల నుంచి సేకరిచి, వాటిని తిరిగి సంకలనం చేశారు. ఆ భాగాల్లో మిగిలిన అన్ని భాగాల యొక్క స్పర్శ ఉండేలా చూశారు.

అలా వ్యాసుడు తిరిగి వేదవిభాగం చేసి, నాలుగు వేదాలను గ్రంధస్థం చేశారు. అవే ఋగ్ వేదం, యజుర్ వేదం, సామవేదం, అధర్వణ వేదం. వాటికి అశ్వలాయనుడు మొదలైన మహర్షులు రాసిన వ్యాఖ్యానాలను చేర్చారు (‪#‎వేదాలకు‬ ఋషులు రాసిన వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలు అంటారు). అవేగాక ఆరణ్యకాలు, ఉపనిషత్తులను కూడా వాటికి జోడించి వేదానికి సమగ్రమైన రూపాన్నిచ్చారు. అనంతమైన వేదాన్ని విభాగం చేశారు కనుక ఆయనకు వేదవ్యాసుడనే పేరు వచ్చింది. అప్పటివరకు వారి పేరు కృష్ణద్వైపాయనుడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. వ్యాసుడు వేదాన్ని గ్రంధస్థం చేశారు, అనగా వేదాన్ని ఒక పుస్తక రూపంగా అందించారు, కానీ ఆయన వేదాలను రచించలేదు. వేదం అపౌరుషేయం (మానవుల చేత రచించబడినది కాదు), వేదములు ఈశ్వరీయములు (ఈశ్వర ప్రసాదితములు).

వ్యాసుడే లేకుంటే ఇంత జ్ఞానం మానవజాతికి అందేది కాదు. అందువలననే 'వ్యాసోఛిష్టం జగత్సర్వం' అంటారు, వ్యాసుడు ఉఛ్చిష్టమే (వదిలివేసిన భాగం / ఎంగిలి) ఈ జగత్తంతా అని. మానవజాతికి ఇంత మేలు చేసిన వ్యాసుడిని స్మరించుకుని, పూజించి, కృతజ్ఞతలు తెలుపడం కోసం ఆషాఢ పూర్ణిమను వ్యాసపూర్ణిమగా, గురు పూర్ణిమగా జరుపుకుంటారు. నిజానికి గురుపూర్ణిమ రోజున మాములు గురువులను కాదు, వ్యాసుడినే పూజించాలి. తమతమ గురువులలో వ్యాసుడిని చూసుకోవాలి. వ్యాసుడు చేసిన మేలుకి ఇప్పటికి మానవజాతి ఋణపడి ఉంది.

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||

వేదాలను గ్రంధస్థం చేసిన తర్వాత తన 4 ‪#‎శిష్యులకు‬ ఒక్కో వేదాలను నేర్పి, వాటిని అప్పగించి వేదప్రచారం చేయించారు. వైదికపరంపరను నిలిపారు. పైలుడికి ఋగ్ వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతుడికి అధర్వణ వేదాన్ని అప్పగించారు. ఇంత చేసిన వ్యాసుడు ఒక మత్స్యకన్యకు జన్మించారు. వ్యాసుడికి కులం అంటగట్టడం సరికాదు కాని కొందరికి అర్దమయ్యేలా చేప్పాలంటే మానవజాతి చేతులెత్తి మొక్కే వ్యాసుడు ఎస్.సి. వర్గానికి చెందినవాడవుతాడు. హిందూధర్మం బ్రాహ్మణుల కుట్ర, వేదం బ్రాహ్మణులు తమ స్వార్ధానికి రాసి, ఇతరులపై రుద్దారని ప్రచారం చేసే మూర్ఖశిఖామణులు ఈ విషయాన్ని విస్మరించడం గమనార్హం.
Read More

ఆషాడ పూర్ణిమ, ‪గురుపూర్ణిమ‬ సందర్భంగా .......ఆషాడ పూర్ణిమ, ‪#‎గురుపూర్ణిమ‬ సందర్భంగా .......

గురుపూర్ణిమ రోజున వ్యాసభగవానుని పూజించాలి. తమ తమ గురువులలో వ్యాసమహర్షిని చూసుకుని గురువులను ఆరాధించాలి. గురుపూర్ణిమకు సంబంధించిన వైశిష్ట్యం తెలుసుకుందాం.

అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కనుక ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతోంది. అసలు ఈ ఆషాడ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత గురించి ఒక చక్కని ప్రాచీన కధ ఉంది. పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధి'. ఆయన భార్య వేదవతీ. వీరిద్దరు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తుండేవారు. వారు సంతానము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి సంతానము మాత్రం కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాడు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తుంటారని వార్త తెలుసుకుని ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు, ఒక రోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు. వెనువెంటనే వేదనిధి ఆయన పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము వదలకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసి, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకి నీకు ఏమికావాలో కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అని చెప్తాడు. అందులకు మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తారు.

అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యకి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులు ఎంతో ఆదరాభిమానాలతో వారిని పూజిస్తారు. అనంతరం వారు దేవతార్చనకు సాలగ్రామం, తులసి దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యానికి ఎంతో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరంకావాలో కోరుకోండి అంటారు. మేము నోయని నోము లేదు, చేయని వ్రతం లేదు, అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న ‪#‎వ్యాసభగవానునితో‬ ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని వేదనిధి ప్రశ్నిస్తాడు.

దానికి వ్యాస మహర్షి బదులుగా 'ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచూ ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించాను. అందువలకు నన్ను మీరు ఎలా దర్శించగలరో చెప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేదవేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైన వ్యక్తిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను.

అదేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విశ్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే! వారికి నా అనుగ్రహము లేనిదె చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణినికి ఆషాఢ శుద్దపాడ్యమి నాడు వారికి గురుపూజ చేసి పూజించవలెనని చెప్పారు. నాటి నుండి నేటివరకు అదే ఆచారము కొనసాగడం మనం చూస్తున్నాం!. అది విన్న 'వేదనిధీ మరోమారు వ్యాసభవానుని మహాత్మాతమను ఏయే రోజుల్లో ఏ విధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పండి అని ప్రశ్నిస్తాడు.

"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః
ఆషాధ శుక్ల పక్షేతు పూర్ణిమాయాం గురౌతథా
పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః
దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్
ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం
భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."

ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుక గురువారము అయితే, అది మరింతగా శ్రేష్టమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువారికి నా స్వరూప సాక్షాత్కారం లభిస్తుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పారు. అప్పటి నుంచి వ్యాసపౌర్ణమి, నేటికీ సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ కధ పూర్వము నారదుడు వైశంపాయనుడికి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ ‪#‎స్వధర్మసింధు‬ అనే గ్రంధములోను వివరంగా చెప్పబడి యున్నది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః
Read More

చైనా భాషలో భగవద్గీత…!!!చైనా భాషలో భగవద్గీత…!!!

కమ్యూనిస్టు దేశమైన చైనాలో భారతీయ గ్రంథరాజం భగవద్గీత విజయబావుటా ఎగురవేసింది. మొదటిసారిగా భగవద్గీత యథాతథంగా చైనా భాషలో అనువాదమయింది. ఈ అనువాద గ్రంథావిష్కరణ 2015 జూన్ 17న జరిగింది. జెజియాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ వంగ్ ఛు చెంగ్, ప్రొఫెసర్ లింగ్ హైలు ఈ యధాతథ అనువాదాన్ని గావించగా, సిచుయాన్ పీపుల్స్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు.

అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా సుమారు 700 మంది ప్రముఖ యోగశాస్త్ర నిపుణులు హాజరైన సదస్సులో ఈ గ్రంథ ఆవిష్కరణ జరిగింది. చైనాలోని ప్రముఖ పత్రికలు టీవీ చానళ్లు ఈ సందర్భాన్ని ప్రసారం చేశాయి. చైనా, భారత సాంస్కృతిక సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని అవి ప్రశంసించాయి.


చైనా దేశానికి , భారత దేశానికి గత రెండు వేల సంవత్సరాల నుంచి సాంస్కృతిక సంబంధాలున్నాయని, చైనా దేశంలోని బౌద్ధ మతం భారతదేశం నుంచే వచ్చిందని, బౌద్ధం, హిందూ ధర్మం సరైన సమన్వయంతో సోదర భావంతో వ్యాప్తి చెందాయని – చైనాలోని భారత రాయబారి శ్రీ అశోక్ కె. కాంత గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ అన్నారు.

ఇండియన్ కాన్సలేట్ జనరల్ శ్రీ కె. నాగరాజ నాయుడు ఈ గ్రంథానికి ముందు మాట రాశారు.

‘భగవద్గీత సార్వజనీన గ్రంథం..దీనిని హిందూ మతగ్రంథంగా చూడటం సరికాదు. నిగూఢమైన ఎన్నో తాత్త్విక విషయాల సమాహారమైన ఈ గ్రంథం చైనాలో ప్రజాదరణ పొందగలదని ఆశిస్తున్నాను’ అని ఆయన రాశారు.

శ్రీ నరేంద్ర మోడీ చైనా పర్యటనలో షాంఘై నగరంలో జరిగిన ‘మేకిన్ ఇండియా’ సదస్సులో ప్రసంగిస్తూ, ఇటీవల కాలంలో చైనాలో భగవద్గీత ఎంతో ఆదరింపబడుతోందని, అందుకు సహాయపడుతూ భారతీయ విజ్ఞానాన్ని చైనా దేశస్తులకు పరిచయం చేస్తున్న పండితులను ప్రశంసించారు.

పెకింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు ప్రొఫెసర్ జి జియాన్ లిన్ తన జీవితంలో చాలా భాగాన్ని వాల్మీకి రామాయణం పరిశోధనకే అంకితం చేశారని, 2008లో భారత ప్రభుత్వం ఆయనను సముచితంగా సన్మానించిందని పేర్కొన్నారు.

భారత ప్రధాని చైనాతో సత్సంబంధాల కోసం చేస్తున్న కృషిలో భాగంగా ఈ అనువాద గ్రంథం ఒక మైలురాయిగా నిలవగలదని పలువురు మేధావులు ప్రశంసలు అందజేస్తున్నారు.

సేకరణ - శ్రీపీఠం మాస పత్రిక (ఆగస్టు ప్రతి)

- భారత్ టుడే
Bhaarat Today, a vibrant Telugu satellite channel coming soon...

Read More

జ్ఞాపక శక్తిని ప్రసాదించు శ్రీ శారదా స్తోత్రం.


Read More

పుష్కర భక్తులకు ముస్లింల అన్నదానంపుష్కర భక్తులకు ముస్లింల అన్నదానం
రాజమండ్రి అర్బన్‌, జూలై 21: రాజమండ్రి నగరం పుష్కరాల సందర్భంగా మరోసారి తన విశిష్టతను చాటుకుంది. లైన్‌ మాస్క్‌ అధ్యక్షుడు హబీబుల్లా ఖాన్‌ ఆధ్వర్యంలో జాంపేట సెంటర్‌లో మంగళవారం సుమారు రెండు వేల మంది పుష్కర యాత్రికులకు వెజిటబుల్‌ బిర్యానీ, బంగాళాదుంప కూరతో అన్నదానం చేశారు. పుష్కరాల తొలిరోజు నుంచి అల్పాహారం, అన్నదానం చేస్తున్నామని, పుష్కరాలు పూర్తయ్యే వరకూ తమ సేవా కార్యక్రమం కొనసాగుతుందని హబీబుల్లాఖాన్‌ చెప్పారు. ఇటువంటి వారిని చూస్తే ఎంతో ఆనందం గా ఉంటుంది.. ఇది అసలైన సెక్యులరిజం అంటే.Read More

తమ ఉనికి కోసం, అల్పానందం కోసం 'రామాయణం' మీదపడి ఏడ్చే తోడేళ్ళమందకి ఈ వ్యాసం అంకితం.తమ ఉనికి కోసం, అల్పానందం కోసం 'రామాయణం' మీదపడి ఏడ్చే తోడేళ్ళమందకి ఈ వ్యాసం అంకితం.ఇది చదివినాక మీకు ఇంకా బతికే అర్హత ఉంది అనుకుంటే సిగ్గు,శరం లేకుండా బ్రతికేయొచ్చు...లేదా ఎందులోనైనా దూకి చావండి..మంచివాళ్ళే పోతున్నారు..మీరు చచ్చినంత మాత్రాన భూమికేమి వెలితి కాదు.

'రామాయణము'అంటే రామునియొక్క ప్రయాణము,రాముడు నడిచిన మార్గము...అనగా రాముడు నడిచిన ధర్మ మార్గము...ఆ ధర్మమార్గం ఏమిటో చూద్దాం..
సీతా స్వయంవరం జరుగుతుంది..రాజులు,చక్రవర్తులు ప్రగల్బాలు పలుకుతూ వచ్చి శివధనస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి బంగపడుతున్నారు.. రాముడు ధనుర్బంగం చేయగలడు..సామర్ద్యం ఉంది కదా అని వెంటనే బలప్రదర్శన చేయలేదు..గురువు ఆజ్ఞ్య వచ్చేవరకూ ఆగాడు. పెద్దలు,గురువుల ఎదుట అంత వినయంగా ఉండేవాడు..
మిడి,మిడి జ్ఞ్యానంతో మిడిసిపడి గురువులనే గడ్డిపోచలుగా భావించే అసుర సంతానానికి రాముడు నచ్చలేదు.

రాముడికి పట్టాభిషేకం అని ప్రకటించారు.కాని పరిస్థితులవల్ల వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది..వెళ్ళకపోతే తండ్రికి అవమానం..తన తండ్రిగారి మర్యాద నిలబెట్టడం కోసం చిరునవ్వుతో రాజవాసాన్ని విడిచి అరణ్యవాసానికి బయలుదేరాడు..
ఆస్తి పంపకాల్లో అర్దరూపాయ్ తక్కువ వస్తే తల్లితండ్రులను లేపేసే పుత్రరత్నాలు ఉన్నారు....మీరు(పైన చెప్పిన తోడేళ్ళమంద) కూడా ఇదే జాతికి చెంది ఉంటారని నా ప్రగాడ విశ్వాసం.అందుకే తండ్రి మాటకి అంత విలువ ఇచ్చిన రాముడు మీకు నచ్చలేదు.

వనవాసంలో సీతాపహరణం జరిగింది...సీతను అన్వేషిస్తుండగా హనుమ,సుగ్రీవుడు ఎదురయ్యారు..వాలి,సుగ్రీవుల మద్య జరిగిన పోరు తెలుసుకుని రాముడు సుగ్రీవుని పక్షం వహించి అతనికి అండగా నిలిచాడు....
వాలి అమిత బలవంతుడు...రాజ్యం, సైన్యం వాలి దగ్గర ఉన్నాయి..రాముడు వాలి పక్షం వహిస్తే తనకు అన్నిరకాలుగా సహాయం చేయగలడు..సుగ్రీవుడు ఒంటరివాడు..
కాని "ధర్మం సుగ్రీవుని వైపున ఉంది కనుక బలహీనుడైనా సుగ్రీవునితో స్నేహం చేశాడు".
అవసరమైతే శత్రువుల దగ్గరికి వెళ్లి ఎక్కడలేని ప్రేమ ఒలకబోసి తమపని కానిచ్చుకోవడం , తమవాళ్ళే కష్టాల్లో ఉన్నా చూసి చూడనట్టు నటించడం ఇలా స్వార్ధంకోసం రంగులు మార్చే మనస్తత్వం ఉన్న ఊసరవెల్లులకి రాముడు నచ్చలేదు.

వాలి సంహారం;.రాముడు ఎదురుగా వచ్చి బాణం వేసినా వాలి నేలకూలుతాడు...రామబాణానికి ఎదురులేదు..
మరి వాలికి ఉన్న వరం సంగతి ఏంటి?..అది వ్యర్దమవుతుంది..దేవతల వరాలు వ్యర్దమయ్యాయంటే మానవులకి దేవతలపై ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది.ఆ ప్రభావం యజ్ఞ్య,యాగాలు పూజాది క్రతువులపై పడుతుంది..లోకంలో అధర్మం ప్రబులుతుంది...తాను వచ్చింది ధర్మాన్ని స్థాపించడానికి కాని అధర్మాన్ని కాదు..అందుకే తనకి శక్తిఉన్నా వాలికి ఉన్న వరాన్ని గౌరవించి చాటుగా బాణం వేశాడు.
ఇంకా వాలి నరుడు కాదు. వానరుడు..క్రూర మృగాలని రాజులు చాటునుండి వేటాడవచ్చు..అది ధర్మమే..

రావణున్ని ఎదురించి విభీషణుడు రాముడి శరణు వేడాడు..శత్రువుకి సహోదరుడైనా రాముడు అతనికి అభయమిచ్చాడు..లంకకి రాజుని చేస్తానని మాట ఇచ్చాడు...ఐతే రావణుడు లొంగిపోయి సీతను తిరిగి ఇచ్చేస్తే ఏమి చేస్తావని అడిగారు...అతనికి నా రాజ్యాన్ని ఇస్తానన్నాడు రాముడు.

రామ, రావణ యుద్ధం మొదలయ్యింది..ఒకరోజు రావణుడు రాముని చేతిలో పరాజితుడయ్యాడు...రాముని ఎదురుగా నిస్సహాయంగా కూలబడిపోయాడు....తన భార్యను అపహరించి తనను ఇన్ని రోజులుగా ఎంతో మనోవేదనకి గురి చేసిన రావణుడు తన ఎదురుగా అచేతనంగా ఉన్నాడు...అప్పుడు "నీవు నిరాయుదుడవై ఉన్నావు.శక్తిహీనంగా ఉన్నావు. ఒంటరిగా ఉన్నావు..ఇప్పుడు నిన్ను చంపడం ధర్మం కాదు..నేడు పోయి రేపు రా" అన్నాడు..
ఏదో ఒకరకంగా వెన్నుపోటు పోడిచైనా శత్రువుని దెబ్బ తీస్తేచాలు..అనుకునే పింజారి వెధవలకి రాముడి ప్రవర్తన నచ్చలేదు మరి..

సీత మీద తన ప్రజల్లో అపవాదు ఉందని రాముడికి గూఢచారుల వల్ల తెలిసింది..అపవాదు ఉన్న సీతను వాళ్లకి పట్టపురాణిగా ఉంచడం ధర్మం కాదు..పరిత్యజించాలి...తాను రాజు కాకపోయి ఉంటే అలా చేయాల్సిన అవసరముండదు..ప్రాణ సమానమైన భార్యను విడిచిపెట్టడం కన్నా రాజ్యాన్ని త్యజించడం మేలనుకున్నాడు..తన తమ్ములను పిలిచి రాజ్యభారాన్ని స్వీకరించామన్నాడు..
తమ్ముళ్ళు వెంటనే రాముడి పాదాలపై పడ్డారు.."అన్నా నీవు అడిగితే మా ప్రాణాలైనా ఆనందంగా ఇచ్చేస్తాం..కాని నీ స్థానంలో కూర్చునే దుస్సాహసం కలలో కూడా చేయలేమన్నారు"..
రాముడు గుండె రాయి చేసుకున్నాడు.తనవల్ల రఘువంశ ప్రతిష్ట మసకబారకూడదనుకున్నాడు..ప్రాణాదికమైన భార్యను విడిచిపెట్టాడు..


"రామో విగ్రహవాన్ ధర్మః" రాముడు నిలువెత్తు ధర్మస్వరూపం.భూమి ఉన్నంత కాలం రామనామం ఉంటుంది..రామనామం లేనినాడు విశ్వమే ఉండదు..
"శ్రీరామ రక్ష సర్వ జగద్రక్
Read More

విశ్లేషణ :: ఇది నిజమేనా ???? యేసుని పట్టించిన యూదా ఆ తర్వాత ఏమయ్యాడు??..యేసుని పట్టించిన యూదా ఆ తర్వాత ఏమయ్యాడు??..
ఈ ప్రశ్నకి సమాదానం బైబిల్ లో దొరుకుతుంది.....ఒకటి కాదు రెండు దొరుకుతాయి...


 1)అతడు పశ్చాతాపం చెంది యేసుని అమ్మగా వచ్చిన ఆ వెండి నాణాలను దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకునెను..(మత్తయ్-27;3,4,5)
2)యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను..అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బైటకు వచ్చెను..ఆ పొలానికి రక్తభూమి అని పేరు వచ్చెను..(అపోస్తులుల కార్యములు-1;18)


చూశారా ఎంత అద్భుతంగా రెండు రకాలుగా ఉందో....ఈ రెండు వెర్షన్ లే కాక మూడోది కూడా ఉంది..
యేసు శిష్యులు మిగిలిన పదకొండు మంది అతనిని కొట్టి   చంపేరని ..  అసలు యేసుని పాపుల కోసం సిలువ వేయబడటానికే దేవుడు పంపించాడు అని చెప్పుకుంటారు కదా!!!!...

"దేవుడు కోరుకున్నదే యూదా చేశాడు........ దేవుడి నిర్ణయాన్ని అమలు చేసి యేసు సిలువ వేయబడటానికి కారణమైన యుధాని పాపిగా,విలన్ గా చూపించారెందుకు"???

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు?
Read More

యేసు క్రీస్తు తాత ముత్తాతలు, ప్రార్దించినది మన గణపతినే, ఆధారాలతో = రోమన్లు, క్రీస్తు పుట్టక ముందు విఘ్నేశ్వరుడిని పూజించేవారు


Read More

Wednesday, 29 July 2015

సరస్వతీ ఆలయం - బాసరసరస్వతీ ఆలయం - బాసర
విధాత అర్థాంగిగా సరస్వతీదేవికి హైందవ ఆధ్యాత్మిక జగత్తులో విశిష్ఠస్ధానం ఉంది. కానీ..సకల కళామతల్లి అయిన సరస్వతీదేవికి మన దేశంలో కేవలం రెండు ఆలయాలే ఉండడం ఆశ్చర్యకరం. ఒకటి ఉత్తరభారతదేశంలోని కాశ్మీరంలో ఉన్న ‘శరణాలయం’. రెండవది తెలంగాణా రాష్టంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ‘బాసర’ గ్రామంలో ఉన్న సరస్వతీదేవి ఆలయం.
మహాకాళీ..మహాలక్ష్మీ..మహాసరస్వతిగా కీర్తించబడే సరస్వతాదేవి సకల విద్యలకు అధిదేవత. ఎంత ధనమున్నా.., విద్య లేనివాడు వింత పశువే. కనుక ప్రతి మానవునకూ సరస్వతీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తొలి అక్షరాభ్యాసాన్ని బాసరలోని సరస్వతీదేవి ఆలయంలో జరిపిస్తారు.
బాసరలోని సరస్వతీదేవి ఆలయం అతి పురాతనమైనది., చారిత్రాత్మకమైనది. ఆదికవి అయిన వాల్మీకిమహర్షి బాసరలో సరస్వతీదేవి ప్రతిష్ఠ చేసాడనీ., ఇక్కడే శ్రీమద్రామాయణాన్ని రచించాడనీ.,బ్రహ్మాండ పురాణంలో ఉన్నట్లు పెద్దలు చెప్తారు. ఈ ఆలయం క్రీ.శ.4వ శతాబ్దికి పూర్వంనుంచీ ఉన్నదనీ.,ఈ క్షేత్రం రాష్ట్రకూటుల కాలంనాటిదనీ చరిత్రకారులు చెప్తారు.

సరస్వతీదేవి ఆలయం సమచతురస్రాకారంలో ఉంటుంది. ఆలయానికి దక్షిణభాగాన కోనేరు ఉంది. దీనిని ‘గుండం’ అని ప్రాంతీయులు పిలుస్తారు. దానికి ప్రక్కగా ఒక సమాధి ఉంది. దానిని ‘వాల్మీకి సమాధి’ అని అర్చకులు భక్తులకు పరిచయం చేస్తారు. శివరాత్రి మొదలు ఇక్కడ ఉత్సవాలు చేస్తారు. బాసరక్షేత్రం చేరుకోవడానికి రైలుమార్గం కూడా ఉంది. ఈ క్షేత్రానికి రెండు మైళ్ళ దూరంలో రైలుస్టేషన్ కూడా ఉంది. అందరూ చూసి తరించతగ్గ పుణ్యక్షేత్రం బాసర.Read More

శ్రీ నారసింహ క్షేత్రాలు - ఛత్రవట నరసింహస్వామి, పెంచలకోనశ్రీ నారసింహ క్షేత్రాలు - 15
ఛత్రవట నరసింహస్వామి, పెంచలకోన
నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిధ్ధి చెందిన ఛత్రవట నరసింహస్వామి ఆలయం నెల్లూరు జిల్లా, పెంచలకోనలో వున్నది. ఉగ్ర నరసింహుడు చెంచులక్ష్మిని చూసి శాంతపడింది, ఆడి పాడి మనువాడింది ఇక్కడేనంటారు. ఆ తరంవారికి చెంచులక్ష్మి అనగానే .. చెంచులక్ష్మి సినిమా, అంజలీదేవి, నాగేశ్వరరావు, చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా అనే పాట .. గుర్తు రాకుండా వుండవు కదా. ఆ ఆటపాటలన్నీ ఇక్కడేనంట. (సినిమా కాదు .. ఒరిజినల్).
ధర్మచ్యుతి జరిగి రాక్షసుల బాధలకు లోకాలు తల్లడిల్లుతున్నప్పుడు, స్ధితి కారకుడైన శ్రీ మహా విష్ణువు సర్వ జీవ సంరక్షణార్ధమై, వివిధ రూపాలలో, వివిధ నామాలతో ఆవిర్భవించి దుర్మార్గులను మట్టుబెట్టి సన్మార్గులను రక్షిస్తూ వుంటాడు. అలా శ్రీమన్నారాయణమూర్తి అనేక అవతారాలు ఎత్తాడు. వాటిలో దశావతారాలు అందరికీ తెలిసినవేకదా. పండితులు ఈ అవతారాలను మూడు తరగతులుగా విభజించారు. అవి 1. పూర్ణావతారాలు .. అవే .. రాముడు, కృష్ణుడు, 2. ఆవేశావతారాలు.. అవి .. పరశురామావతారము, నరసింహావతారము, ఇంక 3. అంశావతారములు .. అవి విష్ణువు శక్తిలో కొంత భాగముతో ఆవిర్భవించినవి..అవి మత్స్య, కూర్మ, వరాహ వగైరా మిగతావి. ఈ దశావతారాలు భూమిమీద జీవుల పరిణామ విధానాన్ని తెలియజేస్తాయని పండితుల అభిప్రాయం.
వీటిలో నాల్గవదయిన నరసింహావతారము చాలా ఉత్కృష్టమైనది అంటారు. ఎందుకంటే ఉత్కృష్టమయిన మానవజన్మ, మృగశ్రేష్టమైన సింహము సమ్మేళనముతో రూపొందిన అవతారం, అమిత శక్తివంతమైన, ఆవేశపూరితమైన అవతారం ఇది. ఈ అవతారంగురించి పద్మ, కూర్మ, అగ్ని, విష్ణు పురాణాలలో చెప్పబడింది. భారత దేశంలో మిగతా చోట్లకన్నా దక్షిణ భారత దేశంలో ప్రాచీన కాలంనుంచి నృసింహస్వామి ఆరాధన, ఉపాసన వున్నది. దానికి కారణం బహుశా స్వామి ఇక్కడే ఆవిర్భవించి, ఈ ప్రాంతాలలో తిరుగాడటం కావచ్చు. కులంతో నిమిత్తం లేకుండా చాలామంది నరసింహస్వామిని తమ కులదైవంగా భావిస్తారు. ఇక్కడివారు స్వామి మీద భక్తితో తమ పిల్లలకు పెంచలయ్య, పెంచలమ్మ వగైరా పేర్లను పెట్టుకుంటారు.
ఈ ప్రాంతంలో ఇదివరకున్న దట్టమైన అరణ్యాలు ఇప్పుడు లేకపోయినా, ఇప్పటికీ అరణ్యాలు, జలపాతాలతో శోభిల్లుతూ, రకరకాల ప్రకృతి సంపదకు ఆలవాలమై వుంది. ఇక్కడ స్వామి స్వయంభు. ఈయన సాకారుడు కాదు నిరాకారుడు. రెండు శిలలు పెనవైచుకున్నట్లు కనిపిస్తాడు. స్వామి రూపం గురించి రెండు కధలు ప్రచారంలో వున్నాయి. పురాణాల ప్రకారం నరసింహస్వామి యోగముద్రలో పెద్ద బండగా వెలిశాడని, అందుకే ఈ క్షేత్రానికి పెనుశిల (పెద్ద బండ) అనే పేరు వచ్చింది అని ఒక కధనం. హిరణ్యకశిపుణ్ణి చంపిభయంకర ఆకారంతో ఇక్కడ తిరుగుతున్న స్వామి చెంచు లక్ష్మిని చూసి శాంతించారు. ఆమెని వివాహమాడి, ఆమెని పెనవేసుకుని ఇక్కడ ఆ రూపంలో ఆవిర్భవించారని ఇంకొక కధనం. ఈయనకి వెండి తొడుగు అలంకరించి వుంటుంది.
ఇదివరకు ఈ ప్రాంతమంతా చెంచులు వుండేవాళ్ళుగనుక చెంచులకోన అనేవారు. ఆ చెంచులకోనే నేటి పెంచలకోనగా మారిందంటారు. స్వామి వారికి ఛత్రవట నరసింహస్వామని, వెండిగొడుగుల వాడని పేర్లున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు, వెనుక, సుమారు నెల రోజులు పెంచలకోన సమీపంలోని భైరవకోనలో స్వామి స్నానాద్యనుష్టానాలు చేసుకుంటారని, ఆ సమయంలో సప్త ఋషులు స్వామివారికి దివ్య ఛత్రము పడతారని భక్తుల నమ్మకం. అందుకే ఆయనకి ఛత్రవటి నరసింహస్వామని పేరు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు స్వామి వారికి మొక్కుబడిగా గొడుగులు సమర్పించుకుంటారు. ఈ గొడుగులను ప్రత్యేకంగా అలంకరించి, ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో వున్నప్పటికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి కీటకాలనుండి తలెత్తవు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు.

ఆదిలక్ష్మి

స్వామి చెంచులక్ష్మీని వివాహమాడినట్లు తెలుసుకున్న ఆదిలక్ష్మీ అమ్మవారు ఆగ్రహించి స్వామికి దూరంగా వెళ్ళినట్లు కధనం. అందుకే ఆదిలక్ష్మి అమ్మవారికి ఇక్కడ విడిగా దేవస్ధానం వుంటుంది.

క్షేత్రపాలకుడు

ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి కూడా స్వామి ఆలయ సమీపంలోనే విడిగా ఆలయం వున్నది.
ఆలయం
త్రేతాయుగంనాటి ఈ ఆలయం కాలగమనంలో శిధిలంకాగా, పునరుధ్ధరింపబడటానికి కారణం ఒక గొర్రెలకాపరి. పెంచలకోనకు ఆరు కిలో మీటర్ల దూరంలో గోనుపల్లిలో వుండే ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడువులలోకి వెళ్తుండేవాడు. ఒక రోజు స్వామి ఆయనకు వృద్ధుని రూపంలో కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలసి వున్నారని గ్రామస్దులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పమన్నారు. ఆ గొర్రెలకాపరిని వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి ఆదేశించగా అతను సరేనని కోద్ది దూరం వెళ్ళిన తరువాత వెనుతిరిగి చూడడంతో శిలగా మారినట్లు చెబుతారు. (ఈ గొర్రెల కాపరి ఆలయం గోనుపల్లి గ్రామానికి దగ్గరలో వుంది.) విషయం తెలుసుకున్న గ్రామస్దులు స్వామి వారికి దేవస్ధానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది.1959లో ఈ దేవస్ధానం దేవాదాయశాఖవారి అధీనంలోకి వచ్చింది. అప్పటినుంచి అభివృధ్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి.

ఇతర విశేషాలు

భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగాడని, శకుంతలను, ఆయనను పెంచిన కణ్వమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకున్నారని అక్కడ వున్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు కూడా కధనం.

ఈ ఆలయానికి అతి సమీపంలో మాతా విజయేశ్వరీదేవి ఆశ్రమం వున్నది.

దర్శన సమయాలు

మధ్యాహ్నం 12 గం. లు 3 గం.ల మధ్య ఆలయం మూసి వుంటుంది. రాత్రి 7-30కి ఆలయం మూసివేస్తారు.

మార్గము

జిల్లా ముఖ్యకేంద్రం నెల్లూరునుంచి గంటకొక బస్సు (80 కి.మీ. ల దూరం), రాపూరునుంచి అరగంటకొక బస్సు (రాపూరు మండలంలోని గోనుపల్లి గ్రామానికి 7 కి.మీ. ల దూరం) వున్నాయి. ఫోన్ నెంబర్లు 08621 – 221604, సెల్ 9491000737.


Read More

శ్రీ నారసింహ క్షేత్రాలు - పాదమే దైవంగా పూజించబడే పెన్నహోబిలం


శ్రీ నారసింహ క్షేత్రాలు - 14
పాదమే దైవంగా పూజించబడే పెన్నహోబిలం
జయశ్రీ నరసింహేశ జయదైత్య విదారణ l

జయప్రహ్లాదవరద జయకుంధాభ విగ్రహ ll

ఇందుగలడందులేడని సందేహము వలదు .. అంటూ సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుని గురించి పూర్వం చిన్ని బాలుడు ప్రహ్లాదుడు మనస్పూర్తిగా నమ్మి ఆ భగవంతుని అనుగ్రహం పొందటమేగాక, నమ్మినవారిని కాపాడటానికి భగవంతుడు ఏ రూపంలోనైనా, ఏ స్ధలంలోనైనా ప్రత్యక్షమవుతాడని నిరూపించాడు. అది పురాణకాలం. నేటికీ భగవంతుడు శంఖ చక్రాలతో, నాలుగు చేతులతో ఎదురుగా ప్రత్యక్షం కాకపోయినా, నమ్మినవారికి తన ఉనికిని తెలియబరుస్తూనే వున్నాడు. అందుకే భక్తులు భగవంతుని పూర్తి రూపంతోనేకాదు, ఆయనదిగా చెప్పబడే దేనికైనా భక్తి శ్రధ్ధలతో నమస్కరిస్తారు, కొన్నిచోట్ల పూజిస్తారు. అలాంటి ఒక నరసింహ క్షేత్రం గురించి ఇప్పుడు చెబుతాను. ఇదే పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామి కుడి పాద ముద్ర పైన ఆలయం నిర్మింపబడింది. మరి నేను తెలుసుకున్న ఆ చరిత్రగురించి మీకు చెప్పాలికదా.
క్షేత్రం
బ్రహ్మాండ పురాణంలో, పద్మి పురాణంలో ప్రస్తావించబడిన ఈ క్షేత్రనికీ, శ్రీ నరసింహస్వామి నవనారసింహ రూపాలతో వెలుగొందే అహోబిల క్షేత్రనికీ అవినాభావ సంబంధం వున్నది. ఇక్కడకూడా నరసింహస్వామిది ఉగ్ర రూపం. కొండమీద వున్న ఈ ఆలయం గోపురం ప్రక్కనే నెలకొల్పిన పెద్ద నరసింహస్వామి విగ్రహం దూరంనుంచే కనిపిస్తాయి.
పురాణాలద్వారా తెలిసిన చరిత్ర
త్రేతా యుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్యం. ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదపి చిన్నతనంనుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు. ఆయన ఈ కొండపై ఘోర తపస్సు చేశారట. ఆయన తపస్సుకి మెచ్చి స్వామి సాక్షాత్కరిస్తే ఆయన స్వామిని అక్కడ జ్వాల, అహోబిల నరసింహస్వామిగా కొలువుండమని ప్రార్ధించాడుట. స్వామి ఆయన కోరిక తీర్చాడుట. ద్వాపర యుగంలో ఉద్దాలక మహర్షి ఆశ్రమమిక్కడ వుండేదిట. ఆ ఆశ్రమానికి సమీపంలో ఒక పెద్ద బిలం వుండేది. ఆయన శిష్యులకు విద్యని బోధిస్తూ సమీపంలో వున్న బిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానిస్తూ చాలాకాలం గడిపేవాడు. ఆయన ధ్యాన నిష్టకు ప్రసన్నుడైన స్వామి ఒక రోజు ఆయన స్వప్నంలో సాక్షాత్కరించి అభీష్టమేమిటని అడిగాడుట. మహర్షి స్వామిని అక్కడ కొలువై వుండమన్నాడుట.

అందుకు స్వామి తన కుడి పాద ముద్రను ఆ బిల ముఖ ద్వారమున ప్రతిష్టిస్తానని చెప్పి అదృశ్య మయ్యాడట. మర్నాడు నిద్రలేచిన ఉద్దాలక మహర్షి ఆ బిల ద్వారం వద్దకు వెళ్ళి పరీక్షించగా, బిల ముఖద్వారంలో స్వామి కుడి పాద ముద్ర స్పష్టంగా దర్శనమిచ్చిందట. అప్పటినుంచీ ఆయన ఆ పాదానికి పూజలు చేస్తూ దానికి చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ పాద ముద్ర స్వామి స్వయంగా వేసినదిగనుక ఈ క్షేత్రం పవిత్ర క్షేత్రంగా అనతి కాలంలోనే ప్రసిధ్ధికెక్కింది. స్వామి పాదాన్ని పూజిస్తూ భక్తులు స్వామినే పూజించినట్లు భావించేవారు. స్వామి పాదానికి అభిషేకం చేసిన జలం కింద వున్న బిలంద్వారా వెళ్ళి దగ్గరలోనే వున్న పెన్నానదిలో కలుస్తుందని, ఆ నదిలో స్నానం చేసినవారి పాపాలన్నీ హరించిపోతాయనీ భక్తులు విశ్వసించేవారు. కాలగమనంలో కొంతకాలం ఈ క్షేత్రం మరుగున పడిపోయింది. కానీ స్వామి స్వయంభువుడిగా వెలిసి,ఎంతో మంది ఋషులచేత పూజించబడ్డ పుణ్య క్షేత్రాలు శాశ్వతంగా కనుమరుగు కావు. తిరిగి ఏదోవిధంగా వెలుగులోకి వస్తాయి. తర్వాత కాలంలో.....

క్రీ.శ. 7, 8 శతాబ్దాలలో ఈ క్షేత్రం తిరిగి వెలుగు చూసింది. అక్కడికి సమీపంలో వున్న గొల్లపల్లె అనే గ్రామం .. పేరుకు తగ్గట్లే పాడిపశువుల నిలయం. ఆ గ్రామంలో ఒక తెల్ల ఆవు కొండపైగల బిల ముఖద్వారము దగ్గర క్షీరమునిచ్చి వచ్చేది. దాని యజమాని ఆవు పాలివ్వకపోవటంతో ఏమయిందా అని దిగులుపడసాగాడు. ఒక రాత్రి అతని స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఆ పాలు తానే తాగుతున్నానని, ఆ కొండపై ఒక పుట్ట, దానిపక్కనే బిలము వున్నాయని, ఆ బిలము తవ్వితే తను కనబడతానని చెప్పాడు. ఆ ఆసామీ అమితాశ్చర్యంతో స్వామి చెప్పిన ప్రకారం చెయ్యగా అక్కడ జీర్ణస్ధితికి చేరిన ఆలయగోపురం, బిలము, బిలముఖద్వారమున స్వామి పాద ముద్ర, కొండకింద భాగంలో నైరుతి దిశలో శ్రీ లక్ష్మీదేవి విగ్రహం కనిపించాయట. ఆ ఆలయాలను పునరుధ్ధరించి, నిత్యపూజలు చేశారు. తర్వాత కాలంలో ఆ గొల్లపల్లె జాడ కూడా లేకుండా కాలగర్భంలో కలిసిపోయింది.

తర్వాత 9వ శతాబ్దంలో రాజేంద్రచోళుడనే చోళరాజు ఆ దోవలో వెళ్తూ, కాకతాళీయంగా ఈ దేవాలయాన్ని చూశారు. గోపురం, ప్రాకారాలతో వున్న ఈ ఆలయం పాదముద్రికపై ఆలయం వుండటం చూసి ఆశ్చర్యపోయాడట. అప్పటికే ఈ క్షేత్రం పునరుధ్ధిరంపబడిందిగానీ, దానికి కారకులెవరో తెలియదు. రాజేంద్రచోళుడు అప్పటికే తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఆయన, పెన్నహోబిలంలో కొండకిందవున్న లక్ష్మీదేవి ఆలయ గోపురాన్ని బాగుచేయించి, శ్రీ నరసింహస్వామి, లక్ష్మీదేవి, భూదేవిల పంచలోహ ఉత్సవ విగ్రహాలను ఆలయానికి సమర్పించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 15వ శతాబ్దంలో ఈ పుణ్యక్షేత్రము చాలా వైభవంతో విలసిల్లినది. క్రీ.శ. 1565 విజయనగర రాజు, తుళువ సదాశివరాయలు తన దిగ్విజయ యాత్ర ముగించుకుని పెనుగొండనుంచి రాజధాని విజయనగరానికి వెళ్తూ ఈ క్షేత్రాన్ని దర్శించాడు. కొంత జీర్ణావస్ధకి చేరిన ఈ క్షేత్రాన్ని పునరుధ్ధరించమని తన సామంత రాజులని ఆజ్ఞాపించాడు.

అప్పుడు ఉరగాద్రి (ప్రస్తుతం ఉరవకొండ)ని పాలించే రాజ ప్రతినిధి అప్పలరాజు అయ్యంగార్, ఉదిరిపికొండ రాజప్రతినిధి ఉదిరప్పనాయుడు ఆలయ ప్రాకారాలని, రాజగోపురాలను, గర్భగుడి గోపురాన్ని ద్రావిడ వాస్తుకళా పధ్దతుల్లో తమ ప్రభువు సదాశివరాయలపేర పునరుధ్దిరింపచేశారు. అప్పుడే అప్పలరాజు అయ్యగారి భార్య అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా పునరుధ్దరింపచేసినట్లు దేవాలయంలో వున్న శిలా శాసనంద్వారా తెలుస్తున్నది. రాజ ప్రతినిధులిద్దరూ నాలుగువైపుల గోపురాలకి మెట్లు ఏర్పాటు చేశారు. వీటిలో దక్షిణ దిశలోని గోపురం కొంచెం చిన్నదిగా వుంటుంది. ఈ గోపురం చిన్నదిగా వుండటానికి కారణం తెలియదు. దీనిని పాలగోపురం అంటారు. ఒక గొల్ల వనిత పాలు అమ్మగా వచ్చిన డబ్బుతో ఈ గోపురాన్ని నిర్మింపచేసినదని ప్రజలు చెప్పుకుంటారు.

ఉదిరప్పనాయుడు ఆలయ పునరుధ్దరణతోబాటు దాదాపు 50 అడుగుల ఎత్తున్న ఏకశిలా దీపస్తంభమును, సదాశివరాయల దిగ్విజయ యాత్రకు గుర్తుగా మరొక ఏకశిలా స్తంభమును స్వామి గర్భగుడికి ఎదురుగా ప్రతిష్టింపచేశాడు. ఇప్పటికీ వీటిని చూడవచ్చు. ఈ దీప స్తంభములో ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఈ క్షేత్రంలో స్వామి ధూప, దీప, నైవేద్యాలకు, పాలనా ఖర్చుకు, రెండువేల ఎకరాలున్న పెన్నహోబిల గ్రామాన్ని సదాశివరాయలు దానం చేసినట్లు ఆలయంలో వున్న శిలా శాసనంద్వారా తెలుస్తున్నది. క్రీ.శ. 1979లో శ్రీలక్ష్మీనరసింహస్వామి పాదముద్రకు పైభాగమున శ్రీ లక్ష్మీనరసింహస్వామి శిలా విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటినుంచి, ఈ క్షేత్ర మహిమలు ద్విగుణీకృతమయినాయని భక్తులు భావిస్తున్నారు.

విశేషాలు..

స్వామి కొండ కింద వున్న శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారి ముందు ఒక పుట్టు శిల వున్నది. దీనిని భక్తులు భూదేవిగా ఆరాధిస్తూంటారు. ఉగ్ర నరసింహస్వామి శాంతించి, చెంచు లక్ష్మితో వనవిహారం చేస్తుండగా భూదేవి ఖిన్నురాలై, భూగర్భాన కృంగిపోసాగిందిట. అప్పుడు స్వామి ఆమె శిగబట్టి బయటకి లాగాడట. పుట్టుశిలకు ఒకవైపు కొప్పున్నట్లు ఎత్తుగాకనబడుతుంది. ఇక్కడే ఎత్తయిన పీఠంపై లక్ష్మీదేవిని ప్రతిష్టించారు. స్వామి పాదముద్రకింద బిలం వున్నది. ఈ బిల మార్గము క్షేత్రానికి పడమటదిక్కులో ప్రవహిస్తున్న పెన్నానదిదాకా వున్నదని భావిస్తారు. స్వామి పాదానికి అభిషేకము చేసిన జలము ఆ బిలంద్వారా వెళ్ళి పెన్నానదిలో కలుస్తుందనీ, అందుకే ఈ నదీ స్నానం సకల పాపహరమని నమ్మకం.

ఈ జలం క్షేత్రానికి దిగువభాగంలో నైరుతి దిశలో వున్న జువ్విచెట్టు ఊడలలో ఊట జలరూపంగా ఎంతోకాలంనుంచీ ప్రవహిస్తూ బసవన్న కోనేరులో పడుతోంది. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ కోనేటిలో స్నానంచేస్తే అన్ని రకాల రుగ్మతలూ పోతాయని నమ్ముతారు. ఈ క్షేత్రాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఇదివరకు జిల్లా కలెక్టరు శ్రీ సోమేష్ కుమార్ గారునృసింహావతారం ఆవిర్భావాన్ని తూర్పు ద్వారం పక్కన రహదారికి ఎదురుగా నిర్మింపచేశారు. ఈ విగ్రహాలు దూరంనుంచే దర్శించవచ్చు. క్రీ.శ. 2007లో జరిగిన ఒక సంఘటన స్వామి అనంతలీలలు తెలియజెయ్యటమేగాక భగవంతుడు కుల మతాలకు అతీతుడని తెలియజేస్తుంది. ఒక ముస్లిం వ్యక్తి కుమారుడికి హటాత్తుగా రెండుకాళ్ళు చచ్చుపడి ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితంలేకపోయింది. మిత్రుల సలహామీద ఆయన కొడుకుని ఎత్తుకుని, పెన్నహోబిల స్వామిని దర్శించి బసవన్న కోనేటి జలాన్ని నాలుగు వారాలు పిల్లవాడికి తాగించాడుట. ఐదవవారం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ పిల్లవాడు తనంతతాను మెట్లెక్కి స్వామి దర్శనం చేసుకున్నాడుట.

ఉత్సవాలు...

స్వామి అభిషేకజలం కలవటంవల్ల ఇక్కడ పెన్నానది మరింత పవిత్రతను సంతరించుకున్నదికదా. ప్రతి సంవత్సరం మాఘమాసంలో మూడవ ఆదివారం పెన్నేటి గంగమ్మ జాతర పెద్ద తిరనాళ్ళలాగా జరుగుతుంది. వేలకొద్దీ స్త్రీలు ప్రాతః కాలంలోనే పెన్నలో స్నానం చేసి ఒడ్డున వున్న శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి, అక్కడే వున్న గంగమ్మ విగ్రహానికి నారికేళాలను సమర్పించి, స్వామి దర్శనం చేసుకుంటారు. దీనివలన శ్రీఘ్రవివాహం, కలతలు లేని సంసారం ప్రాప్తిస్తాయని నమ్మకం. స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుధ్ధ ద్వాదశినుంచి వైశాఖ బహుళ సప్తమివరకు పన్నెండు రోజులు వైభవంగా బరుపబడతాయి.

మార్గము

అనంతపురం జిల్లాలో, ఉరవకొండకు 10 కిలోమీటర్లు, అనంతపురానికి 30 కి.మీ. దూరంలో వున్నది ఈ క్షేత్రం. అనంతపురంనుంచి క్షేత్రందాకా బస్సులు నిర్ణీత సమయాలలో వున్నాయి. బళ్ళారి, ఉరవకొండ వెళ్ళే బస్సులు చాలా వుంటాయి. వాటిలో వెళ్తే ఒక కిలోమీటరు నడిస్తే ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు.

Read More

కౌశికుడు

నైమిశారణ్యం-20

కౌశికుడు
కౌశికుడు ఒక బ్రాహ్మణుని కుమారుడు. ఇతని తల్లిదండ్రులు వృద్ధులు. కౌశికుడు మొదటినుంచీ అహంకారి. తపస్సుచేసి శక్తులు సాధించాలనే కోరిక ఎక్కువ. అందుకే తల్లిదండ్రులు ఎంత చెబుతున్నా వికుండా అరణ్యాలకు పోయి ఒక చెట్టు క్రింద కూర్చుని తపస్సు ప్రారంభించాడు.అతని తపోదీక్షలో చాలా కాలం గతించి పొయింది. అయినా కౌశికుడు పట్టుదలగా తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఓ కొంగ, కౌశికుడు తపస్సు చేస్తున్న చెట్టుమీద వ్రాలి అతనిమీద రెట్ట వేసింది. దానితో కౌశికునకు తపోభంగమై, కన్నులు తెరచి కోపంగా ఆ కొంగవైపు చూసాడు. అంతే..ఆ కొంగ మలమల మాడి భస్మమైపోయింది. అదిచూసి కౌశికుడు ఆశ్చర్యపోయాడు. తన తపస్సు సిద్ధించిందనీ, తను మహాతపశ్శక్తి సంపన్నుడననీ తలచి, తపస్సు విరమించి, అరణ్యాలు వదలి నగరంలో ప్రవేశించాడు. నగరపౌరులెవ్వరూ అతని శక్తిని గుర్తిచడం లేదు. ఎవరి దారిన వారు పోతున్నారు. కౌశికుడు ఒక ఇంటిముందు నిలబడి ‘భవతీ భిక్షాం దేహి’ అని అరిచాడు. ఆ ఇంటి ఇల్లాలు బయటకు వచ్చి కౌశికుని చూసి, భిక్ష తెస్తాను ఇక్కడే ఉండు అని చెప్పి లోపలకు వెళ్లింది. సరిగ్గా అదే సమయానికి ఆమె భర్త ఇంటికి వచ్చాడు. భిక్ష తెస్తున్న ఆ ఇల్లాలు వచ్చిన భర్తను చూసి, భిక్షపాత్రను పక్కనపెట్టి, భర్త సేవలో నిమగ్నమైంది. కౌశికుడు ‘భవతీ భిక్షాం దేహి’ అని అరుస్తూనే ఉన్నాడు. ఆ అరుపులు ఇల్లాలుకు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ.. అదేమీ ఆమె పట్టించుకోకుండా, భర్తకు భోజనం పెట్టి, అతను నిద్రపోయేవరకూ అతని పాదాలు ఒత్తి, ఆ తర్వాత భిక్ష తీసుకుని గుమ్మం దగ్గరకు వచ్చింది. ఆమెను చూస్తూనే కౌశికుడు కోపంతో ఊగిపోతూ..‘ఇంత ఆలస్యంగానా భిక్ష తీసుకురావడం.. నేనేమైనా సాధారణ భిక్షగాడిననుకున్నావా...మహాతపశ్శక్తి సంపన్నులం’ అని కోపంతో ఎర్రబడిన కన్నులతో ఆమెవంక చూసాడు. ఆమె అడవిలోని కొంగలా మలమలా మాడి మసైపోలేదు. అదిచూసి మరింత ఆశ్చర్యపోయాడు కౌశికుడు. అది గమనించిన ఆ ఇల్లాలు ‘మీ కోపానికి మలమలా మాడిపోవడానికి నేనేమీ అడవిలోని కొంగను కాదు’ అంది. అడవిలో జరిగిన సంఘటన ఆ ఇల్లాలుకు ఎలా తెలిసిందో కౌశికునకు అర్థంకాలేదు. అదే ప్రశ్న ఆమెను అడిగాడు. అప్పుడా ఇల్లాలు

‘నాకు తెలిసినదల్లా నా భర్తను సేవించుకోవడమే. అంతకుమించి నేను ఏ దైవపూజలు చెయ్యను.’ అని బదులిచ్చింది. కౌశికుడు ఆమెను పతివ్రతగా గుర్తించి, ఆమె పాదాలకు నమస్కరించి ధర్మోపదేశం చెయ్యమని ఆమెను అర్థించాడు. ఆమె తనకు తెలిసిన ధర్మాలు చెప్పి, ‘మీకింకా ధర్మాలు తెలుసుకోవాలని ఉంటే మిథిలానగరంలో ఉండే ధర్మవ్యాథుని కలవండి’ అని చెప్పింది ఆ ఇల్లాలు. ధర్మవ్యాథుని కలుసుకోవాలని కౌశికుడు మిథిలానగరం వచ్చి అతనుండే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ మాంసం విక్రయిస్తూ ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి కౌశికుని చూస్తూనే చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చి ‘ఆ పతివ్రత పంపితే నా దగ్గరకు వచ్చారు కదూ’ అన్నాడు. ఆసంగతి ఇతనికెలా తెలిసిందో కౌశికునకు అర్థంకాలేదు. కానీ అతనే ధర్మవ్యాథుడై ఉంటాడని ఊహించాడు. అది గమనించి ‘అయ్యా... నేనే ధర్మవ్యాథుడను..నానుంచి ధర్మాలు తెలుసుకుందామని వచ్చారు..కొంతసేపు ఇక్కడ విశ్రమించండి.. నా వ్యాపారం ముగిసిన తర్వాత మీతో ధర్మ ప్రసంగం చేస్తాను’ అని చెప్పి తన వ్యాపారంలో నిమగ్నమయ్యాడు ధర్మవ్యాథుడు. కౌశికుడు అతని రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి ధర్మవ్యాథుడు అతని దగ్గరకు వచ్చాడు. కౌశికునితో ఎన్నో ధర్మసూక్ష్మాలు చర్చించాడు. కౌశికుడు ఆశ్చర్యపోతూ ‘మాంసం విక్రయించుకునే మీకు ఇన్ని ధర్మాలు మీకెలా తెలిసాయి’ అని ప్రశ్నించాడు. ధర్మవ్యాథుడు కౌశికుని తన ఇంటిలోకి తీసుకుని వెళ్లాడు. అక్కడ వృద్ధులైన దంపతులు ఉన్నారు. ధర్మవ్యాథుడు వారిని కౌశికునకు చూపిస్తూ ‘వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవలు చెయ్యడం తప్ప మరే పూజలు నేను చెయ్యను. అంతేకాక మాంసం విక్రయించడం నా కులవృత్తి. కులవృత్తిని మించిన దైవం మరేదీ లేదు.. మాతా పితరుల సేవను మించిన ధర్మం లేదు’ అని పలికాడు ధర్మవ్యాథుడు. కౌశికునకు ధర్మం ఏమిటో పూర్తిగా అర్థమైంది. అతను ధర్మవ్యాధుని దగ్గర సెలవు తీసుకుని తన తల్లిదండ్రులకు సేవలు చేసుకోవడానికి స్వ్రగ్రామానికి బయలుదేరాడు.
Read More

శ్రీ నారసింహ క్షేత్రాలు - దక్షిణ సింహాచలంశ్రీ నారసింహ క్షేత్రాలు -
దక్షిణ సింహాచలం
సముద్రే పశ్చమతటే నారదేన ప్రతిష్టితః
నరసింహాలయం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే
ఆంధ్రప్రదేశ్ లో సింహాచలంలోనేకాక శ్రీ వరాహ నరసింహస్వామి పూజలందుకుంటున్న క్షేత్రం ఇంకొకటున్నది తెలుసా మీకు? అదే ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ. ఆ ఊరికా పేరు రావటానికికూడా ఈ స్వామే కారణం. ఎలాంటి సింహాలకైనా రాయడైన నరసింహస్వామి వెలసిన కొండకనుక అది సింగరాయకొండ..అదే ఊరి పేరు.
స్ధల పురాణం

ఈ కొండ పైన వరాహ నరసింహస్వామి కొలువై వుండగా, కొంచెం దిగువగా యోగ నరసింహస్వామి వెలిసి వున్నాడు. పూర్వం నారద మహర్షి ఇక్కడ తపస్సు చెయ్యగా నరసింహస్వామి ప్రత్యక్షమయినాడు. ఆ యోగ నరసింహస్వామిని నారద మహర్షి ఇక్కడ ప్రతిష్టించాడు. ఈయన ఆలయం చిన్నదే. దీనిలోంచి మాల్యాద్రికి ఒక సొరంగ మార్గమున్నదని పూజారిగారన్నారు. యోగ నరసింహస్వామి గురించి ఒక విశేషం ప్రచారంలో వున్నది. ఆయనది ఉగ్రరూపం. సముద్రంలో వెళ్తున్న స్టీమర్లు ఈయన దృష్టి పడ్డవెంటనే కాలిపోయేవిట. బ్రిటిష్ వారి సమయంలో ఈ స్వామి దృష్టి సముద్రంలో స్టీమర్ల మీద పడకుండా వాకిలి మార్పించారుట. అప్పటినుంచీ ఈ సమస్య తొలగిపోయింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు యోగ నరసింహస్వామిది ఉగ్రరూపం కనుక ఇక్కడ శాంత రూపం కూడా వుండాలని కొండమీద వరాహ నరసింహస్వామిని ప్రతిష్టించారు. ఇక్కడ వరాహ నరసింహస్వామి కొలువై వున్నాడు కనుకనే ఈ క్షేత్రాన్ని దక్షిణ సింహాచలం అంటారు. యోగ నరసిహస్వామికి పక్కనే వీరాంజనేయస్వామి ఉపాలయం వున్నది.
ఆలయ నిర్మాణం

15వ శతాబ్దంలో విజయనగర రాజు దేవ రాయలు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాలద్వారా తెలుస్తున్నది. ఇక్కడ లభ్యమయిన శాసనం ప్రకారం క్రీ.శ. 1449-50 లో బండారిసెట్టి, కునిసెట్టి అనేవారిచేత ఆలయం గోడలకి సిమెంటు పని చేయించినట్లు తెలుస్తున్నది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించి, ఆలయ నిర్వహణకోసం ఐదు ఊళ్ళు ఇచ్చారు. ఆలయ గోపురాన్ని నిర్మింపచేశారు. ఈయన సమయంలో ఆలయం సర్వతో ముఖాభివృధ్ధి చెందినది.
ఆలయ విశేషం

ఈ స్వామి దర్శనం అప్రయత్నంగా అవుతుందిట. అంతేకాదు. దర్శనం చేసుకున్నవాళ్ళకి తప్పకుండా ఏదో ఒక మంచి జరుగుతుందిట. స్వామి దర్శనం వల్ల ఆ మంచి జరిగిందని తిరిగి ఈ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు వున్నారుట.
మార్గం
ప్రకాశం జిల్లాలోని కందుకూరునుంచి 14 కి.మీ. లు, ఒంగోలు నుంచి 29 కి.మీ.లు, కనిగిరినుంచి 64 కి.మీ. ల దూరంలో వున్న సింగరాయకొండకి రైలు (విజయవాడ, చెన్నై), రోడ్డు మార్గాలున్నాయి.Read More

శ్రీకృష్ణుడు శివుణ్ణి ఎందుకు ఆరాధించాడు

శ్రీకృష్ణుడు శివుణ్ణి ఎందుకు ఆరాధించాడు

శ్రీ దేవీ భాగవతంలో సూత మహర్షి శౌనకాది మునులకు శ్రీకృష్ణ చరితను చెప్పిన తర్వాత శౌనకాది మునులకు ఒక సందేహం వచ్చింది. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారం కదా... మరి ఆయన శివుణ్ణి ఆరాధించడమేమిటి? ఆయనకు పార్వతీదేవి వరాలు ఇవ్వడమేమిటి? వీరిద్దరినీ శ్రీకృష్ణుడు ఆరాధించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.. తాను స్వయంగా సర్వేశ్వరుడు అయి వుండీ, సర్వ సిద్ధప్రదుడై వుండీ సాధారణ మానవుడిలాగా మరొక దేవుడిని ఉపాసించడమేంటి? ఘోర నియమాలతో తపస్సు చేయడమేంటి? ఇది మాకు అర్థం కాని విధంగా వుంది. దయచేసి మాకు అర్థమయ్యేలా వివరించండి అని అడిగారు.

దానికి సూత మహర్షి స్పందించారు. ఇప్పుడు శౌనకాది మునులకు వచ్చిన సందేహమే గతంలోనూ జనమేజయుడికీ వచ్చిందట. ఆ సందేహాన్ని ఆయన ఆ సమయంలో వ్యాసుడి దగ్గర వ్యక్తం చేశాడట. అప్పుడు వ్యాసుడు ఆయనకు చెప్పిన సమాధానాన్నే సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పారు.

మునులారా.. మీరన్నది నిజమే! శ్రీకృష్ణుడు నిజంగానే జనార్దనుడే. సర్వకార్య నిర్వహణ సమర్థుడే. అకానీ, మానవరూపంలో వున్నాడు కదా. అందుకుని వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మానుష భావాలను ఆచరించాడు. పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, బ్రాహ్మణులను సత్కరించడం, దేవతలను ఆరాధించడం లాంటి గృహస్థాశ్రమ ధర్మాలను అనుసరించాడు. అలాగే దుఃఖ పడవలసిన విషయాలలో దుఃఖపడటం, సంతోషించాల్సిన సందర్భాలలో సంతోషించడం, రకరకాల అపవాదాలకు తల ఒగ్గి బాధపడటం, స్త్రీలతో కామోపభోగాలు అనుభవించడం, సమయానుకూలంగా విజృంభించే అరిషడ్వర్గాలకు లోనుకావడం లాంటి గృహస్థు గుణాలకు కట్టుబడ్డాడు. గుణమయ శరీరాన్ని ధరించి గుణాతీతంగా వుండటం అసంభవం.
సౌబలి శాపం వల్ల యాదవ వినాశనం, బ్రాహ్మణ శాపం వల్ల కృష్ణుడి అవతార సమాప్తి తెలిసీ వీటిని తప్పించగలిగాడా? కృష్ణ పత్నులను దొంగలు దోచుకున్నారు. అర్జునుడు సన్నిధిలోనే వున్నాడు. మహావీరుడైన అర్జునుడు బాణాలు వేసి దానిని ఆపగలిగాడా? అలాగే ప్రద్యుమ్నాపహరణాన్ని శ్రీకృష్ణుడు నివారించగలిగాడా? కనీసం తెలుసుకోను కూడా తెలుసుకోలేకపోయాడు. వీటన్నిటి ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, మానవ దేహం ధరించినప్పుడు మానవ లక్షణాలే వుంటాయి. అంచేత నారాయణుడైనా, నారాయణాంశజుడైనా మానవుడు మానవుడే. మానవ రూపంలో వున్న శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం అవసరం లేదు.

ఆ శివుడు సర్వేశ్వరుడు. విష్ణుమూర్తికి కూడా కారణ భూతుడు. సుషుప్తస్థాన నాథుడు. విష్ణువుకే శివుడు పూజనీయుడు అయినప్పుడు విష్ణ్వంశజులైన కృష్ణాదులకు పూజనీయుడు కావడంలో వింత ఏమీ లేదు. అలాగే ఆదిపరాశక్తి సర్వోతృష్ట. జగన్మాత అర్ధమాత్రంగా, అనుచ్చార్యగా వున్నప్పటికీ సర్వోతృష్టురాలు. తక్కిన త్రిమూర్తులలో బ్రహ్మకన్నా విష్ణువు, విష్ణువు కన్నా శివుడు అధికులు. అందుచేత శ్రీకృష్ణుడు శివుణ్ణి అర్చించడంలో సంశయించాల్సింది, సందేహించాల్సింది ఏమీ లేదు అని వారి సందేహాలను సూత మహర్షి నివృత్తి చేశారు.
Read More

నైమిశారణ్యం= విష్ణుపాదోద్భవ - గంగాదేవినైమిశారణ్యం

విష్ణుపాదోద్భవ - గంగాదేవి
ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి తల్లిదండ్రులు ఉంటారు. వారు దేవతలైనా సరే., దానవులైనా సరే., మరే జాతి వారైనా సరే., తల్లిదండ్రులు లేకుండా జన్మించడం జరగదు. కానీ గంగాదేవికి మాత్రం జన్మనిచ్చిన తండ్రే గాని తల్లి మన పురాణాల్లో కనిపించదు.. గంగ విష్ణుపాదాలనుంచి ఉద్భవించిందని పురాణ కథనం. ఆ కథ ఏమిటంటే...

ఒకసారి నారదమహర్షి నారాయణ సంకీర్తనం చేస్తూ హిమాలయాలమీదుగా ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. అప్పుడు అతనికి ఎందరో స్త్రీలు, పిల్లలు ముక్తకంఠంతో రోదనలు చేస్తున్న ధ్వనులు వినిపించాయి. నారదుడు ఆశ్చర్యపోయి ఆ దిశగా వెళ్లి చూసాడు. అక్కడ ఎందరో స్త్రీలు, పిల్లలు ఏదో ఒక అవయవ లోపంతో ఏడుస్తూ కనిపించారు. ‘మీకీ అవయవ లోపాలేమిటి..మీ రోదనలకు కారణం ఏమిటి? ’ అని వారిని ప్రశ్నించాడు. అప్పుడు వారు కన్నీరు తుడుచుకుని ‘నారదా.. మేము రాగాధి దేవతలం. తోడి, కల్యాణి శంకరాభరణం, ఇత్యాది రాగాల పేర్లే మా పేర్లు. వీరంతా మా పిల్లలు. మోహన, హిందోళం, వసంత ఇత్యది జన్యరాగాల పేర్లే వీరి పేర్లు. భూలోకంలోని మానవులు సంగీత సాధన చేస్తున్నప్పుడు రాగసంకరం జరిగినా., అపస్వరం దొర్లినా., మాకిలా అవయవ లోపాలు ఏర్నడతాయి’. అని చెప్పారు. ‘మీకీ అవయవ లోపం పోయే మార్గం లేదా’ అని నారదుడు వారిని తిరిగి ప్రశ్నించాడు. ‘ఉంది. ఎవరైనా సంగీతశిఖామణి తన దివ్య గానంతో మా రాగాలను సుస్వరయుక్తంగా ఆలాపిస్తే.. మాకీ అవయవలోపం పోతుంది’ అని వారు బదులిచ్చారు.
‘ఈ సృష్టిలో నాకన్న గొప్ప సంగీతశిఖామణి ఎవరున్నారు..నేను మీ అవయవలోపాన్ని సరిచేస్తాను’ అన్నాడు నీరదుడు. ‘ప్రయత్నించి చూడు’ అని వారు బదులిచ్చారు. నీరదుడు తన మహతిని శృతిబద్ధం చేసి 72 మేళకర్త రాగాలనూ.. వాటి జన్యరాగాలనూ ఆలాపించాడు. కానీ ఎవ్వరికీ అవయవలోపం సరికాలేదు. అది చూసి ఆశ్చర్యపోయాడు నారదుడు. అప్పుడు వారు ‘నారదా.. మా అవయవలోపాన్ని సరిచేసే సంగీత ప్రతిభ నీకేకాదు....సకలకళాగతల్లి అయిన ఆ సరస్వతీదేవికే లేదు’ అన్నారు. నారదుడు మరింత ఆశ్చర్యపోతూ..‘మరి మీ అవయవలోపం సరిచేసే మార్గమే లేదా అని అడిగాడు.’ ‘ఉంది..సంగీతానికి ఆద్యుడు.,నాథుడు అయిన ఆ పరమశివుడు ఇక్కడకు వచ్చి తన గానమాధుర్యంతో రాగసంచారం చేసినప్పేడు మా అవయవలోపం పోతుంది’ అని వారు బదులిచ్చారు.

అయితే ఇప్పుడే కైలాసం వెళ్లి పరమశివుని తీసుకుని మీ దగ్గరకు వస్తాను ’ అని చేప్పి నారదుడు కైలాసం వెళ్లి ఆ రాగాధి దేవతల విషయం శివునకు విన్నవించాడు. అంతావిన్న శివుడు ‘నేను తప్పకుండా వారి దగ్గర సంగీత కచేరి చేసి వారి అవయవ లోపాలను సరిచేస్తాను. అయితే..నా సంగీతాన్ని విని అర్థం చేసుకుని ఆనందించి నన్ను ప్రశంసించే ఉత్తమ శ్రోత ఒక్కడైనా ఒక్కడు ఉండాలి’అన్నాడు. ‘అలాంటి ఉత్తమ శ్రోత ఎవరున్నారు’ అని నారదుడు శివుని ప్రశ్నించాడు. ‘నాదలోలుడైన ఆ శ్రీహరే నా సంగీతాన్ని అర్థం చేసుకోగల ఉత్తమ శ్రోత’అని బదులిచ్చాడు శివుడు. వెంటనే నారదుడు వైకుంఠం వెళ్లి సంగతంతా చెప్పి...పరమశివుని సంగీత కచేరి వినడానికి శ్రీహరిని ఒప్పించాడు.

హిమాలయాల్లో రాగాధి దేవతల ముందు పరమశివుని సంగీత కచేరి ప్రారంభమైంది. ఆ సంగీత కచ్చేరీకి బ్రహ్మాది దేవతలు వచ్చారు. పరమశివుని గానంలో 72 మేళకర్తలు, వాటి జన్యరాగాలు జవజీవాలు సంతరించుకోని స్వర సంచారం చేస్తున్నాయి. వాటి మహిమవల్ల రాగాధి దేవతల అవయవాల లోపాలు చక్కబడి వారి వారి లోకాలకు వెళ్లిపోతున్నారు. పరమశివుని గాంధర్వ గానానికి శ్రీమహావిష్ణువు ఆనంద రసమయ లోకాలలో విహరిస్తూ... పరవశించిపోతున్నాడు. ఆయన హృదయానందమే జలరూపంధరించి ఆ శ్రీహరి కుడికాలి బోటనవేలు నుండి బయటకు ప్రవహించింది. అది గమనించిన భ్రహ్మదేవుడు తిరిగి అలాంటి అవకాశం లబించదని ఆ పవిత్ర జలాన్ని తన సువర్ణ కలసంలో భద్రపరిచాడు. అలా విష్ణుపాదోద్భంగా గంగ జన్మించింది. శ్రీమహావిష్ణువు వామనావతారం ధరించి త్రివిక్రముడై ఒకపాధంతో భూమిని, మరోక పాధంతో ఊర్ధ్వలోకాలను కొలిచే సమయంలో ఆ విష్ణు పాధాన్ని తన కమండలంలో భద్రపరిచిన గంగాజలంతో అభిషేకించాడు చిత్రముఖుడు. అప్పుడే గంగానది దివిజగంగా అవతరించింది. ఆ తర్వాత కాలంలో భగీరధ కోరిక మేరకు పరమశివుని శిరసుపై ఊరికి, అచ్చట నుంచి మానససరోవరంలోని భిందు సరసులోకి దుమికి గంగానదిగా అవనిపై ప్రవహించింది స్వరనదిమాత అయిన గంగానది.
Read More

పరోపకారం... భగవంతుని చేరే మార్గంపరోపకారం... భగవంతుని చేరే మార్గం

భగవంతుడిని పొందడానికి ఎన్నో మార్గాలు వున్నాయి. వాటన్నిటిలో ‘సర్వభూత హితాభిలాష’ కూడా ఒకటి. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు కొలువై వుంటాడు. అందువల్ల సమస్త ప్రాణులకు హితాన్ని, సుఖాన్ని చేకూరుస్తూ వుంటే భగవంతుడిని సేవించినట్టే అవుతుంది. ఎవరి హృదయం అయితే పరుల హితాన్ని కోరుకుంటూ వుంటుందో వారికి లోకంలో దుర్లభమైనది ఏదీ వుండదని భక్త తులసీదాసు కూడా చెప్పాడు. స్కాంద పురాణంలో ఒకచోట ఇలా పేర్కొనబడింది.

పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతామ్
నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే
తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలమ్
తపోభిరుగ్రైస్తన్నాప్య ముపకృత్యా యదాప్యతే

ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. సంపదలెన్నో వారికి ప్రాప్తిస్తాయి. పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించినా ప్రాప్తించదు. అందువల్ల కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు.

నిష్కామ భావనతో పరోపకారం చేయడం కోసం పాటుపడేవారికి భగవత్ప్రాప్తి కూడా కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పారు...

లభంతో బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూషితే రతాః

ఎవరి పాపములు నశించినవో, ఎవరి సకల సంశయాలు జ్ఞానం వల్ల తొలగిపోయినవో, ఎవరు ప్రాణుల హితమునందు ఆసక్తి వున్నవారై వుంటారో, ఎవరు మనస్సును జయించి నిశ్చలముగా పరమాత్మలో నిలిచి వుంటారో అట్టి బ్రహ్మవేత్తైన పురుషులు శాంత బ్రహ్మను పొందుతున్నారు.

పైన చెప్పిన లక్షణాలన్నీ కలిగి వుంది, పాప రహితులైన రుషులు సర్వభూత హితరతాన్ని కలిగి వుండటం వల్ల నిర్వాణ బ్రహ్మను పొందుతున్నారు. కాబట్టి మానవుడు సర్వ విధాలా స్వార్థాన్ని పరిత్యజించి, తన తనువును, మనసును, ధనమును ఇతరుల హితానికి అర్పించి దుఃఖంలో వున్నవారికి, అనాథలు, ఆపదలో వున్నవారికి సేవ చేయాలి. అభావంతో బాధపడుతున్న ప్రాణుల దుఃఖాన్ని నివారించి వారికి సర్వం వినియోగించాలి. తమ జీవనము, తమ సర్వస్వము దీనులు, దుఃఖ గ్రస్తులు, అనాథలైన జనులను సేవించడం కోసమే వున్నదని ఎవరైతే భావిస్తారో వారు ధన్యజీవులు.
Read More

ఉత్తరాఖండ్ లోని అల్మోడా జిల్లాలో అరతోలా అనే చిన్న గ్రామం లో ఈ జాగేశ్వర్ మందిర సముదాయం వుంది.జాగశ్వర్ మహాదేవ మందిరం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాన్ని ఘరేవాల్, కుమావు ప్రాంతాలుగా విభజించేరు. బదరినాధ్, కేదార్ నాధ్, గంగోత్రి, యమునోత్రి, మొదలయిన పుణ్య క్షేత్రాలు ఘరేవాల్ ప్రాంతంలో వుండగా నైనిటాల్, రాణిఖేత్ ,జాగేశ్వర్, భాగేశ్వర్, పాతాళభువనేశ్వర్ కుమావు ప్రాంతంలో వున్నాయి. కుమావు ప్రాంతం లో వున్న జాగేశ్వర్ మహాదేవ్ గురించి తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ లోని అల్మోడా జిల్లాలో అరతోలా అనే చిన్న గ్రామం లో ఈ జాగేశ్వర్ మందిర సముదాయం వుంది. ఈ సముదాయంలో చిన్న పెద్ద రాతి దేవాలయాలు సుమారు 120 కి మించి వున్నాయని అంటారు. ముఖ్యంగా ఇక్కడ వున్న మందిరాలలో ఆది శంకరులచే గుర్తింప బడ్డ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఓకటైన " దారుకావనే నాగేశం " ఇక్కడ వుంది అనేది స్థానికులు చెప్పేమాట. " ఈ దారుకావనే నాగేశం " మహారాష్ట్ర , గుజరాత్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాల వారు వారి రాష్ట్రం లో ఉన్నదే అసలు నాగేశం అంటారు. నా లాంటివారికి " ఎందుకొచ్చిన మీమాంశ అన్నీ చూ సేస్తే పోలా అనిపిస్తుంది ". అలా అన్ని నాగేశాలని దర్శించుకున్నాం. మహారాష్ట్ర లో పర్భాణి జిల్లాలో వున్న ఓండా నాగనాధ్, గుజరాత్ లో ద్వారకకి సుమారు పది, పదిహేను, కిమీ దూరంలో వున్ననాగేశం. हिमाद्रेरूत्तरे पार्श्वे देवदारूवनं परम् पावनं शंकरस्थानं तत्र् सर्वे शिवार्चिताः ఆది శంకర విరచిత పై శ్లోకం ప్రకారం ఉత్తరాఖండ్ రాష్ట్రం లో నాగేశమే అసలు జ్యోతిర్లింగమని అంటారు.

ప్రయాణమార్గం:-
ఇప్పుడు జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. భారతదేశ రాజధాని ఢిల్లీ నుంచి జాగేశ్వర కి 400కిమి..,ఢిల్లి నుంచి టూరిస్టు బస్సులు, ప్రైవేట్ టాక్సీలు బుక్ చేసుకోవచ్చు. రైలులో వెళ్లాలను కొనేవారు ఢిల్లి నుంచి కాఠ్ గోదాం వరకు రైలులో వెళ్లి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలి. కాఠ్ గోదాం నుంచి జాగేశ్వర్ సుమారు 125 కిమీ ... యీ దూరం మాత్రం రోడ్డు మార్గం ద్వారానే చేరుకోగలం. కాఠ్ గోదాం నుంచి అంతా ఘాట్ రోడ్డే కాబట్టి ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది. ఢిల్లి నుంచి రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటే మన ప్రయాణం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ , మొరాదాబాద్ , రామనగర్ ( సమాజ్ వాది పార్టీ లో వుండగా జయప్రద ఎం.పి గా వున్న నగరం ), మీదుగా సాగి ఉత్తరాఖండ్ లోని పంత్ నగర్ , హాల్ద్ వాని, కాఠ్ గోదాం మీదుగా సాగి ఆల్మొడా చేరుతాం. కాఠ్ గోదాం దాటిన తరువాత భోజన వసతులకు అల్మొడాలో మాత్రమే అనుకూలంగా వుంటుంది. బడ్డీ కొట్ల లో టీ తప్ప మరేం దొరకే వసతి లేదు. కాఠ్ గోదాం నుంచి అంతా ఘాట్ రోడ్డు అవటం వల్ల, రోడ్డు వెడల్పు తక్కువ, కొండ చరియలు విరిగి పడ్డం వగైరా అంతరాయాలు వుండటం వల్ల ప్రయాణం నెమ్మదిగా సాగుతూ 125 కిమీ.. సుమారు ఆరు యేడు గంటల సమయం పడుతుంది. ఆల్మోడా దగ్గర పిత్తొరాఘఢ్ వెళ్ళే హైవే మీద సుమారు 35 కిమీ .. ప్రయాణం చేస్తే జగేశ్వర్ చేరుతాం. పభుత్వం వారిచే నడపబడే కైలాష్ మానస సరోవర్ యాత్ర యీ అల్మోడా మీదుగా పిత్తొరాఘఢ్ లో వున్న మెదటి శిబిరం చేరుతుంది. ఈ రోడ్డులో సుమారు 14కిమీ.. వెళ్ళిన తరువాత చితై అనే వూరు వొచ్చింది. ఈ కొండ ప్రాంతాలలో ఊరులన్నీ రోడ్డుకి ఆనుకొని వుంటాయి. ఊరు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టగలినన్ని ఇళ్ళు నిత్యావుసర వస్తువుల దుకాణాలు వొకటో , రెండో అదీ ఊరు. బట్టల షాపు, టీ బడ్డి వుంటే అది టౌను.

గోలు దేవి
చితై ఊర్లో రోడ్డుకి ఇరువైపులా చిన్నచిన్న షాప్స్ అందులో అమ్మే వస్తువులు మనని ఆకట్టుకుంటాయి. అవి గంటలు, కోవెలలో కట్టే లాంటివి అతిచిన్న సైజు నుంచి అతి పెద్ద సైజు వరకు పెట్టి అమ్ముతున్నారు. కుతూహలం ఆపుకోలేక కారు రోడ్డుపక్కన ఆపి విషయం అడిగితే వాళ్లు చెప్పినదేమిటంటే అక్కడే చిన్న గుట్ట మీద వున్న అమ్మవారిని ఛితై దేవి లేక గోలు దేవి అని అంటారని, ఈ అమ్మవారికి మొక్కుబడులు యీ గంటల రూపంలో తీర్చుకుంటారుట భక్తులు కాబట్టి యీ దేవిని ఘంటా దేవి అని అంటారని చెప్పేరు . అది వినగానే మేము కూడా అమ్మవారిని దర్శించు కోడానికి వెళ్లేం.
ప్రవేశద్వారం నుంచి మెట్లు వుంటాయి, మేట్లుకి రెండువైపులా కొన్నివేల, లక్షకి చేరేయేమో చిన్న, పెద్ద గంటలు వేలాడ దీసి వున్నాయి. మండపం చుట్టూరా కుడా ఎన్నో గుత్తులుగా గంటలు వేలాడ దీసి వున్నాయి. మండపం చుట్టూరా ఏవేవో రాసిన చిన్న పెద్ద కాయితాల గుత్తులు వేలాడదీసి వున్నాయి. అవి అన్నీ న్యాయంకోసం పెట్టుకున్న ఆర్జీలుట. కోర్టు లో సాక్షాధారాలు న్యాయం వైపు లేక అన్యాయం జరిగిన వారు, న్యాయం కోసం కోర్టు వరకు వెళ్ళలేని వారు యిక్కడ తమకు జరిగిన అన్యాయం గురించి ఓక కాయితం మీద రాసి కోవెలలో వ్రేలాడ దీస్తారు. అలాంటి వారికి న్యాయం చేస్తుందిట అమ్మవారు. ఈ కోవెలలో గోలు దేవత, కల్వ దేవత, గర్హ దేవత విగ్రహాలు వున్నాయి. స్థానికులు గోలు దేవత శివుని అవతారమని కల్వ దేవత భైరవుడని, గర్హ దేవి అంటే శక్తి స్వరుపిణి అని భావిస్తారు. కుమావు ప్రాంత ప్రజలు యీ దేవతలని కుల దేవతలుగా పుజిస్తారు. పన్నెండు సంవత్సరాలు క్రిందట మేం మొదటిమారు యీ గోలు దేవిని దర్శించు కున్నప్పుడు ఇది చాలా చిన్న మందిరం. ఏటికేడాది ఆ కోవెలలో మార్పులు చోటు చేసుకుంటూ యిప్పడు ఆ కోవేలకి అర కిమీ.. ముందు నుంచి పూజా ద్రవ్యాలు, గంటలు అమ్మే దుకాణాలు మొదలవుతున్నాయి . గంటల సంఖ్య కుడా బాగా పెరిగిపోయాయి. అలాగే అర్జీలు కుడా గణనీయంగా పెరిగేయి. దీన్ని బట్టి ఛితై దేవి మీద భక్తుల నమ్మకం రోజు రోజుకూ పెరుగుతోందని చెప్పొచ్చు. గోలు దేవిని దర్శించు కొని తిరిగి మా ప్రయాణం కొనసాగించేము. అంతవరకు అడవులలో సాగిన మా ప్రయాణం కాకులు దూరని కారడివి అంటారే అలాంటి అడవి లోంచి సాగింది. పట్టపగలు చీకటిగా వుంటుంది.
అలాంటి దారిలో మరో 20 కిమీ .. వెళ్లిన తరువాత రోడ్డుకి కుడివైపున జటగంగ వొడ్డున మందిర సముహం కనిపించింది. ఈ మందిరాలని బాల జాగేశ్వర్ మందిరాలని అంటారు. ఇక్కడ కుబేరుని మందిరం, శివుని కోవెల యింకా చిన్న చిన్న మందిరాలు వున్నాయి. ఈ దేవాలయ సముదాయం అర్కియాలజికల్ సర్వే ఆఫ్ యిండియా వారి సంరక్షణలో వున్నాయి. అర్కియాలజి వారి సర్వే ప్రకారం యీ దేవాలయాలు కనీసం 450 సంవత్సరాలకి పూర్వం నిర్మించ బడ్డట్టుగా గుర్తించేరు.

జాగేశ్వర్ మహాదేవ్ మందిరం
ఈ ప్రదేశం నుంచి మరో రెండు కిమీ.. వెళితే పరమ పవిత్ర మైన సురభి, నందిని సెలయేళ్ళు సంగమించి జటగంగగా ఆవిర్భవించిన , బహు అరుదుగా కనిపించే జంట దేవదారు ( కవలల మాదిరి వొకే మానుకి పైకి రెండుగా చీలి ) వృక్షాల నడుమ జాగేశ్వర్ మహాదేవ్ మందిర సముదాయం కనిపిస్తుంది . ఈ మందిర సముదాయం తొమ్మిద శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం మధ్యలో నిర్మింప బడ్డాయి. తిరిగి వీటిని 18వ శతాబ్దం లో కట్యూరి రాజ వంశీకుడైన శాలివాహన దేవ్ యీ మందిరాలను పునరుద్దరించి పూజారులకు గుడి మాన్యంగా కొన్ని గ్రామాలను యిచ్చినట్లు చరిత్రకారులు గుర్తించేరు. ఈ మందిర సముదాయాన్ని' తరుణ జాగేస్వర్ ' మందిరాలుగా స్థానికులు వ్యవహరిస్తారు. రోడ్డు పైకి చిన్న గేటు తీసుకోని లోనికి వెళితే కుడిచేతి వైపు ముందుగా ఆ సముదాయంలో పెద్దదిగా వున్న మృత్యుంజయ మందిరం వస్తుంది. ఇది స్వయంభూలింగం. దీని పైన కన్ను ఆకారంలో చీలిక వుంటుంది. ఈ లింగం తూర్పు ముఖం గా వుండడం విశేషం . ఈ కోవెల మండపం లో మృత్యుంజయ మహా మంత్రమైన
ॐ हौ जूँ सः
ॐ भूर्भुवः स्वः
ॐ त्रयंबकं यजामहे सुगन्धिम् पुष्टिवधर्नम्
उर्वारूकमिव बन्धनान्मृत्यॊर्मुक्षीय मामृतात्
ॐ स्वः भुवः भूः ॐ
सः जूँ हौ ॐ జపిస్తే అకాల మృత్యు దోషాలు పోతాయని భక్తుల నమ్మిక. ప్రతి సంవత్సరం ఆంధ్రా నుంచి చాలా మంది భక్తులు గ్రూపులుగా వచ్చి యిక్కడ మృత్యుంజయ హోమం నిర్వహిస్తూ వుంటారు. అదే ప్రాంగణం లో కేదారేశ్వర్, కుబేరుడు, పశుపతి నాథ్ , నవ దుర్గల చిన్న చిన్న మందిరాలు చూడొచ్చు. మృత్యుంజయ మందిరం లాగే యీ ప్రాంగణం లో వున్న మరో పెద్ద కోవెల "నాగేశమ్ లేక నాగనాథ్ . దీనిని ద్వాదశజ్యోతిర్లింగాలలో వొకటిగా యిక్కడి వాళ్ళు చెబుతారు .

కోవెల ద్వారపాలకులుగా నంది మరియు స్కంది వుండగా శివుడు పడమర ముఖంగా వుంటాడు. ఇక్కడి శివలింగం రెండు భాగాలు కలిపినట్టుగా వుంటుంది. దీనిని అర్ధనారీశ్వర శివలింగమని, పెద్దగా వున్న భాగం శివుడని, కాస్త చిన్నగా వున్న భాగం పార్వతని అంటారు. ఈ శివలింగాన్ని చేత్తో కదిపితే కదులుతుంది. అన్ని శివాలయాలలోను శివుడు యోగనిద్రలో వుండి హారతి సమయాలలో మాత్రమే జాగరూకుడై భక్తులను అనుగ్రహిస్తాడుట కాని యిక్కడ సర్వకాల శర్వావస్థల యందు జాగ్రదావస్థలో వుండి భక్తులను అనుగ్రహిస్తాడుట అందుకని ఈ ఇశ్వరుని "జాగేశ్వరమహదేవ్ " అని అంటారు. శివలింగానికి వెనుక వైపున చందరాజులైన దీప్ చంద్ , త్రిపాల చంద్ ల అష్ఠలోహ విగ్రహాలు అఖండ జ్యోతి వుంటాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే గర్భ గుడిలో కుడివైపున పట్టు పరుపు పై రాత్రి స్వామికి పవ్వళింపు సేవ చేస్తారు. రాత్రి చక్కగా పరచిన పక్క మరునాడు నలిగి వుంటుందిట స్వామి స్వయంగా పవ్వళించినట్లుగా స్థానికులు భావిస్తారు. కోవెలలో యెలుకలు లాంటివి వున్నాయేమో అనే సందేహం వెలిబుచ్చితే ఆ వూరు మొత్తం మీద యెలుకలు లేవు అనే సమాధానం మిచ్చేరు. ఆ విషయం మాకు నమ్మశఖ్యం కాలేదు. ఆది శంకరా చార్యుల తో వచ్చిన కర్ణాటక బ్రాహ్మణులు యిక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ యిక్కడే వుండిపోయి కాలక్రమం యిక్కడి పిల్లలని పెళ్లి చేసుకొని యిక్కడే స్థిరబడ్డారు. వారి సంతతి వారే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రోడ్డుకి అవతల వైపున వున్న మ్యుజియం లో దుర్లభ మైన దేవతా మూర్తులు ఉన్నాయి. ఇక్కడికి సుమారు వొక కిలోమీటరు దూరం లో గుట్టపై పురాతనమైన వృద్దజాగేశ్వర్ మందిరం వుంది. ఇవికాక యిక్కడ చూడదగ్గ పెద్ద మందిరాలలో దండేశ్వర్ మహాదేవ మందిరం వొకటి. జాగేస్వర్ మందిరం నుంచి కొంచెం మీదకి నడుచు కొని వెళితే వస్తుంది. ఇక్కడ ప్రకృతిశిలనే శివలింగం గా పూజించడం చూడొచ్చు. ఈ మందిరం శిధిలమై పోయింది. జటగంగ సామ్ గంగ నదుల సంగమం దగ్గర జాగేశ్వర్ కోవేలకి రెండు కిలోమీటర్ల దూరం లో కోటిలింగ మహాదేవ కోవెల శిధిలావస్థలో వుంది. ఇది పరమ శివుడు తపస్సు చేసిన ప్రదేశం గా చెప్తారు. ఝంకార్ సామ్ మహాదేవ మందిరం , పుష్ఠిదేవి లేక పుష్ఠి భగవతి , సూర్యదేవుని మందిరం ,కాల భైరవ్ మందిరం చూడ తగ్గవి. అరతోల గ్రామం కి 200 మీటర్ల నుంచి తరుణ జాగేశ్వర్ , ఝంకార్ మహాదేవ , వృద్ధ జాగేశ్వర్ , కోటి లింగేశ్వర్ మందిర ప్రాంతాలను " వినాయక క్షేత్రం " అని అంటారు. ప్రతి యేడాది శ్రావణ మేళా , శివరాత్రి మేళాలు చాలా భక్తీ శ్రద్దలతో జరుపుకుంటారు.
కావడి యాత్ర ;-
శ్రావణ మేళా ( ఆషాఢ పున్నమి నుంచి శ్రావణ పున్నమి వరకు ) శ్రావణ మాసం పొడవునా జరుగుతుంది. కుమావు ప్రాంత ప్రజలంతా వారి వారి ఊర్లలో వుండే నదులనుంచి నీరు తెచ్చి జగేశ్వర్ లోని శివలింగానికి అభిషేకించి యిక్కడి జటగంగ లోని నీరు తీసుకు వెళ్లి వారి వూరి శివాలయం లో అభిషేకిస్తారు. దీనిని కావడి యాత్ర అంటారు. ఈ యాత్రని చాలా నియమ నిష్ఠలతో భక్తి శ్రద్దలతో చేస్తారు. ఈ " కావడి యాత్ర " హరిద్వార్ గంగ వరకు కూడా చేస్తూ వుంటారు. ఈ యాత్ర జరిగే సమయం లో డిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళే రోడ్ల పై భారీ వాహనాలని అనుమతించరు. శివ రాత్రి మూడు రోజుల పండగగా జరుపుకుంటారు. ఇక్కడ భోజన వసతి సౌకర్యాలకు కుమావు వికాష్ మండలి వాళ్ళ గెస్ట్ హౌస్ వుంది. అక్కడ రాత్రి బస చేసి, మర్నాడు ప్రొద్దున్న మా తిరుగు ప్రయాణం మొదలు పెట్టేము.Read More

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నాచారం, మెదక్ జిల్లాశ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నాచారం, మెదక్ జిల్లా
శ్రీ నారసింహ క్షేత్రాలు - 20
600 ఏళ్ళుగా ప్రసిధ్ధికెక్కిన ఈ ఆలయం వున్న చిన్న గుట్టని శ్వేతగిరి అని, గార్గేయ మహర్షి ఇక్కడ తపస్సు చేసినందువల్ల తపోవనం అనికూడా అంటారు. నవనాధులైన ఋషులు తపస్సు చేసిన ప్రాంతంగా కూడా చెబుతారు. నవనాధుల తపస్సుకి మెచ్చి స్వామి ఇక్కడ వెలిశారు. నాచార్ అనే భక్తుని పేరుతో వెలిసిన క్షేత్రమిది. 66 ఎకరాల 33 కుంటల స్ధలం లో వున్న ఈ ఆలయం రెండు గోపురాలతో అలరారుతున్నది. ప్రధానాలయం కొండల నడుమ వుంది. గర్భాలయ ద్వారానికి అటూ ఇటూ జయ విజయుల నల్లరాతి ప్రతిమలున్నాయి.

స్వామి స్వయంభూగా కొండల నడుమ వెలిశాడు. అక్కడే విగ్రహ ప్రతిష్ట జరిగింది. స్వామి ఉగ్రమూర్తిగా నాలుక జాపి దర్శనమిస్తాడు. పక్కనే లక్ష్మీదేవి. గర్భాలయం ఎడమవైపు 12 ఆళ్వారుల విగ్రహాలు, కుడివైపు ఉత్సవ విగ్రహాలున్నాయి. నిత్యం సత్యన్నారాయణ వ్రతాలు జరిగే ఈ ఆలయంలో వాటికోసం విశాలమైన వ్రత మండపమున్నది. ఉపాలయాలలో కాలభైరవుడు, నవగ్రహాలు, శివాలయం, పక్కనే శ్రీ వీర వెంకట సత్యన్నారాయణ స్వామి మందిరం (పాలరాతి విగ్రహాలు), రామాలయం (పాలరాతి విగ్రహాలు), ఆంజనేయస్వామి మందిరం, దత్తసాయి మందిరం (ఇందులో దత్తాత్రేయ విగ్రహం, సాయి విగ్రహాలున్నాయి) ఇక్కడ ప్రతి నిత్యం పల్లకీ ఉత్సవం, నిత్యం కళ్యాణోత్సవం జరుగుతాయి. ఫాల్గుణ శుధ్ధ పంచమినుండి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

దర్శనం:

ఉ 6-30 నుంచి 7-30, 9నుంచీ 1 గం. దాకా తిరిగి సాయంత్రం 4 గం.లనుంచి 8-30 గం. ల దాకా

మార్గం:

బొంతపల్లినుంచి తూప్రాన్ – గజ్వేల్ మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తూప్రాన్ ఊళ్ళోకొచ్చిన వెంటనే వచ్చే టి జంక్షన్లో కుడివైపు తిరిగాలి. కొంచెం దూరం వెళ్ళగానే ఎడమవైపు కమాన్ కనబడుతుంది. అక్కడనుంచి 5 కి.మీ. లు వెళ్తే ఆలయం చేరుకోవచ్చు. హైదరాబాదునుంచి నేరుగా ఈ ఆలయానికి వెళ్ళాలంటే మేడ్చల్ – సిద్దిపేట మార్గంలో వెళ్ళి తూప్రాన్ దగ్గర కుడివైపు తిరిగి 5, 6 కి.మీ. లు వెళ్తే చేరుకోవచ్చు. నాగపూర్ వెళ్ళే జాతీయ రహదారిలో హైదరాబాదు నుంచి 40 కి.మీ. లు, మెదక్ నుంచి 12 కి.మీ. ల దూరంలో వున్నది. దోవ పొడుగూ చెట్లు, కొండలు, గుట్టలు కనువిందు చేస్తాయి.

విజ్ఞప్తి:

శ్రీ నరసింహ క్షేత్రాలను ఆదరించి, అభిమానించిన పాఠకులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నేను చూసిన దేవాలయాల గురించి, నేను సేకరించిన విషయాలు అందరితో పంచుకోవాలనే కోరికతో మొదలు పెట్టిన నా వ్యాస పరంపర పాఠకుల సహృదయంతో సాగుతున్నది. ఇందులో నేను సేకరించిన విషయాల్లో పొరపాట్లు దొర్లి వుండవచ్చు, అసంపూర్ణంగా వుండవచ్చు, ప్రాంతాలనుబట్టి కధలు మారుతూ వుండవచ్చు. ఉదాహరణకి శ్రీ హరహర గారు ... యజ్ఞజ్యోతి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి .... వ్యాసంలో వ్యాఖ్యానించారు .. నరసింహస్వామిని శాంతపరచటానికి శివుడు కారణమని, ఆయనని శరభేశ్వరుడంటారని. కానీ తెలుగు దేశంలో మనం చెప్పుకునే కారణం చెంచు లక్ష్మి, లక్ష్మీ దేవి అని. ఇలాంటి విషయాలు తెలిసినవారు ఇక్కడ తెలియజేస్తే అందరూ తెలుసుకోగలుగుతారు.


శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు ఆంధ్ర రాష్ట్రాలలోవేకాక కర్ణాటక, తమిళనాడులోకూడా విలసిల్లుతున్నాయి. వాటిలో కొన్నింటని మేము దర్శించే భాగ్యం కలిగింది. వాటిలోంచి కొన్ని ఆలయాల విశేషాలు మీతో పంచుకున్నాను. అయితే ఇంకా చాలా వున్నాయి. వాటిని గురించి అవకాశాన్నిబట్టి...... ప్రస్తుతం ఆషాఢ మాసం మొదలయింది. ఈ నెలలో తెలంగాణాలో భక్తి శ్రధ్ధలతో జరుపుకునే పండుగ బోనాలు. అందుకనే వచ్చే వారంనుంచీ అధిక, నిజ ఆషాఢ మాసాల సందర్భంగా, తెలుగు రాష్ట్రాలలో మేము దర్శించిన కొన్ని అమ్మవార్ల ఆలయాలగురించి తెలియజేస్తాను.
Read More

మావుళ్ళమ్మవారి ఆలయం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లామావుళ్ళమ్మవారి ఆలయం
భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా
ఆది పరాశక్తి అయిన శ్రీ లలితా దేవి అనేక ప్రదేశాలలో అనేక రూపాలలో విరాజిల్లుతూ భక్తులను కాపాడుతూ వున్నది. ఆ పరమేశ్వరి పండితులు పూజించే శ్రీమాతగానేకాక పామరులు తమ తల్లిగా, తమ ఈతి బాధలను తీర్చే కరుణారసవల్లిగా, తమ గ్రామాలను కాపాడే గ్రామ దేవతగా కొలుచుకుంటారు. ఆ అమ్మ అనేక చోట్ల అనేక రూపాలతో, ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికే దయార్ద్రహృదయురాలిగా పూజలందుకుంటున్నది. అలాంటి అమ్మ ఆలయాలలో కొన్నింటిని గురించి ఆషాఢమాసం సందర్భంగా చెప్పుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో నెలకొని వున్న మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తూ ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు. పూర్వం ఈ చుట్టుప్రక్కల అంతా మామిడి తోటలు వుండేవిట. అందుకే ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ....మావిడి చెట్లల్లో వున్న అమ్మ అనేవారని కొందరి కధనం. ఇంకొందరు చెప్పేదేమిటంటే ఈ చుట్టుప్రక్కల వున్న వూళ్ళన్నిటిని చల్లగా కాపాడే తల్లని ప్రతివారూ మా వూళ్ళ అమ్మ ...మా వూళ్ళకి అమ్మ...అనేవారు.. ఆ పేరే మావుళ్ళమ్మ అయింది.

వంద సంవత్సరాల పైన చరిత్రగల ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో భీకరంగా వుండేది. ఆ విగ్రహం 1910 లో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినటంతో శ్రీ గ్రంధి అప్పారావుచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి. చతుర్భుజ అయిన ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తు వుంటుంది. నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం వున్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగావుండే ఆ తల్లి కూర్చున్నట్లు వుంటుంది.ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా వుందని అక్కడి ప్రజల విశ్వాసం.ప్రతి సంవత్సరం జనవరి 14నుంచి నెల రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.

విజయవాడకి 103 కిలో మీటర్ల దూరంలో వున్న ఈ వూరికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. సమీప ఎయిర్ పోర్టు విజయవాడ. భీమవరం రైలు స్టేషను నుంచి గుడి 2 కి.మీ.ల లోపే వుటుంది. బస్ స్టాడునుంచి గానీ, రైల్వే స్టేషను నుంచి గానీ అటో తీసుకుంటే గునుపూడి సోమేశ్వరాలయం (పంచారామాలలో ఒకటి), యనమదుర్రు శక్తేశ్వర స్వామి దేవాలయం, భీమవరం మావుళ్ళమ్మ దేవాలయం చూసి రావచ్చు. అన్నీ కలిపి 10 -15 కి.మీ. ల దూరంలోనే వున్నాయి.

Read More

నందవరం వీర చౌడేశ్వరీదేవినందవరం వీర చౌడేశ్వరీదేవి

 ధైర్య సాహసాలిచ్చే వీర చౌడేశ్వరీదేవిని దర్శించుకు వద్దాము. ఆవిడ దర్శనానికి మనం కర్నూలు జిల్లాలోని నందవరం వెళ్ళాలి. ఈ ఊరు కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి 20 కి.మీ. ల దూరంలో, పాణ్యం – బనగానపల్లె రోడ్డులో వున్నది. అతి పురాతనమైన ఈ ఆలయం నిర్మాణకాలం తెలియదని కొందరంటే 4 వేల సంవత్సరాల క్రితం నిర్మింపబడిందని కొందరంటారు. సమయం ఎప్పుడైనా, ఈ దేవి తనను కొలిచే కొందరు బ్రాహ్మణులకోసం సాక్ష్యం చెప్పటానికి కాశీనుంచి సొరంగమార్గాన కదిలివచ్చి ఇక్కడ కొలువైందని అందరూ అంటారు.

ఆ కధేమిటంటే…. పూర్వం చంద్రవంశీయ రాజైన నంద భూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూవుండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో వుండేవాళ్ళు. నందభూపాలుడికి దైవభక్తి కూడా మెండు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీ దత్తాత్రేయస్వామి రోజూ కాశీవెళ్ళి గంగలో స్నానం చెయ్యాలనే ఆయన కోర్కెను తీర్చటానికి పావుకోళ్ళను ప్రసాదించాడు. అయితే ఆ విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వుంచమంటాడు. ఆ రాజు, రోజూ తెల్లవారుఝామునే ఆ పావుకోళ్ళు ధరించి మనోవేగంతో కాశీచేరి గంగలో స్నానమాచరించి, విశ్వనాధుణ్ణి, విశాలాక్షిని, అన్నపూర్ణని దర్శించి తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యం చేరుకునేవాడు.

కొంతకాలం ఇలా గడిచాక, నందభూపాలుడి భార్య శశిరేఖ తన భర్త రోజూ తెల్లవారుఝామునే ఎక్కడికో వెళ్ళివస్తూండటం గమనించి భర్తను అడుగుతుంది. తప్పనిసరి పరిస్ధితుల్లో శశిరేఖకు విషయం చెప్తాడు నందభూపాలుడు. ఆవిడ తనని కూడా కాశీ తీసుకువెళ్ళమని కోరుతుంది. ఆవిడ మాట కాదనలేక రాజు ఆ రోజు ఆవిడనికూడా కాశీ తీసుకువెళ్తాడు. తిరిగివచ్చు సమయానికి పావుకోళ్ళు పనిచేయవు. కారణం రాణీ శశిరేఖ బహిష్టుకావటం. తన రాజ్యానికి సత్వరం చేరకపోతే రాజుజాడ తెలియక రాజ్యం అల్లకల్లోలమవుతుందనే భయంతో దిక్కుతోచని రాజు ఆ సమీపంలోనేవున్న ఆలయందగ్గరవున్న బ్రాహ్మణులనుచూసి వారిని తరుణోపాయం చూపించమని వేడుకుంటాడు.

అందులో ఋగ్వేద పండితుడయిన ఒక బ్రాహ్మణుడు రాజుకి సహాయంచెయ్యటానికి సంసిధ్ధతను తెలియజేస్తాడు. ఆయన తనతోటి వారిని ఇంకో 500 మంది పండితులనుకలుపుకుని, దోషనివారణార్ధం జపతపాలుచేసి, తమ తపోశక్తి వారికి ధారపోసి వారిని వారి రాజ్యానికి చేరుస్తారు. ప్రత్యుపకారంగా రాజు వారికేసహాయంకావాల్సివచ్చినా తప్పక చేస్తానని, వారు నిస్సంకోచంగా కోరవచ్చునని అనగా, ఆ బ్రాహ్మణులు భవిష్యత్ లో అవసరమైనప్పుడు తప్పక కోరుతామంటారు. రాజూ, రాణీ తమ రాజ్యానికి చేరుకున్నారు. ఆ పాదుకలను, మంత్ర శక్తిని తిరిగి వాడకుండా దత్తాత్రేయ మందిరంలో వుంచి, తమ రాజ్యంలో సుఖంగా వుండసాగారు.

కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువురాగా, నందభూపాలుని సహాయమర్ధించటానికి ఆ బ్రాహ్మణులలో కొందరు బయల్దేరుతారు. వారు నందవరంచేరి, రాజసభకువచ్చి తమరాకకి కారణం చెబుతారు. రాజుకి అంతా తెలిసినా, తన తోటివారికి తెలియదుకనుక, వారికికూడా తెలియజేసే ఉద్దేశ్యంతో తానిచ్చిన వాగ్దానానికి ఋజువేమిటని అడుగుతాడు. బ్రాహ్మణులు రాజు వాగ్దానము చేసింది నిత్యం తాము కొలిచే చాముండేశ్వరీదేవి గుడి ముందు, ఆవిడ తప్ప వేరే సాక్ష్యంలేదనీ, ఆవిడనే నమ్ముకున్న తాము సాక్ష్యమిమ్మని ఆవిడని బతిమాలుతామంటారు. రాజు ఆ దేవదేవి మహత్యం అందరికీ తెలుస్తుందని లోలోన సంతోషించి అంగీకరిస్తాడు.
వచ్చిన బ్రాహ్మణులలో కొందరు తిరిగి కాశీ వెళ్ళి తమ ఇష్టదైవం చాముండేశ్వరీదేవిని పరిపరివిధాల ప్రార్ధించి, సాక్ష్యం చెప్పటానికి రావలసినదిగా కోరుతారు. ఆ దేవి అలాగే వస్తానని, వారిని ముందు బయల్దేరమని, తేజోరూపంలో తను వారి వెనుకనే వస్తానని, అయితే దోవలో ఎక్కడా వెనుదిరిగి చూడవద్దని చెబుతుంది. మునుపు రాజుకి సహాయంచేసిన మిగతా 500మంది బ్రాహ్మణులనికూడా నందవరం రమ్మని చెబుతుంది. అందరూ సొరంగ మార్గాన నందవరానికి బయల్దేరుతారు. నందవరం చేరుతుండగా అందులో ఒక బ్రాహ్మణునికి అనుమానం వస్తుంది. తమ వెనుక ఏమీ అలికిడి కావటంలేదు, అమ్మవారు తమతో వస్తోందో రావటంలేదోనని సందేహంతో వెనుదిరిగి చూస్తాడు. అక్కడదాకా వచ్చిన అమ్మవారు వెంటనే శిలారూపందాలుస్తుంది. చింతిల్లితున్న బ్రాహ్మణులతో ఆమె చౌడేశ్వరీదేవిగా తానక్కడే కొలువైవుండి భక్తులను సంరక్షిస్తూ వుంటానని తెలుపుతుంది.

నందభూపాలుడు కాశీనుంచి వచ్చిన ఆ దేవత తమ రాజ్యంలో వెలిసినదని సంతోషంతో గుడి కట్టించి, పూజలుసల్పసాగాడు. అమ్మవారితో కాశీనుంచి కదిలివచ్చిన 500మంది బ్రాహ్మణులు, అమ్మవారి ఆజ్ఞమేరకు అక్కడే వుండి తమ కులదైవమైన ఆ దేవిని పూజించుకోసాగారు. ఆ బ్రాహ్మణ కుటుంబాలను నందవరీకులంటారు. వారు ఇప్పటికీ చౌడేశ్వరీదేవిని తమ కులదేవతగా పూజిస్తారు. ఆ కుటుంబీకులు గర్భగుడిలోకెళ్ళి స్వయంగా దేవిని పూజించుకోవచ్చు. కాశీనుంచి బ్రాహ్మణులు, అమ్మవారు వచ్చిన సొరంగమార్గం ఇంకా వుందంటారు. కానీ అందులోకి ప్రవేశం లేదు. నందవరీక బ్రాహ్మణులకేకాక తొగట వీర క్షత్రియలకుకూడా చౌడేశ్వరీదేవి కులదేవత.
అమ్మవారు ముందు చాలా ఉగ్రరూపంలో వుండేది. ఆ రూపాన్ని ప్రజలు చూడలేకపోయేవారు. భక్తులు ఆ తల్లి ఉగ్రరూపంచూడలేరని, ఆ దేవి విగ్రహంలాంటిదే ఇంకొకటి తయారుచేయించి ప్రతిష్టించారు. అయితే ఈ విగ్రహం అసలు విగ్రహమంత భయంకరంగా వుండదు. అసలు విగ్రహం ఇప్పుడు అమ్మవారువున్న స్ధానానికి సరిగ్గా దిగువ భూగర్భంలో వున్నది. అక్కడికి వెళ్ళే మార్గం వున్నదికానీ ఎవరికీ ప్రవేశంలేదు. ఆలయం ముందు సొరంగ మార్గం వున్నది. పది మెట్లు దిగి వెళ్తే అక్కడ అమ్మవారి పాదాలు వున్నాయి. ఆ మార్గంనుంచే అమ్మవారు, మిగతా బ్రాహ్మణులు, కాశీనుంచి ఇక్కడికి వచ్చారంటారు.
అమ్మవారు వీర చౌడేశ్వరీదేవి. వీరత్వానికి తగ్గట్లే రూపం వుంటుంది. ఈ తల్లిని సేవించినవారికి అన్నిరకాల భయాందోళనలు దూరమయి ధైర్యసాహసాలతో విలసిల్లుతారని ప్రతీతి. ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలచిన ఆ దేవి తోజోవంతమైన రూపం చూసినవారి మనసులోని అన్ని భయాందోళనలూ పటాపంచలవుతాయి. ధైర్యసాహసాలేకాదు సకల సౌభాగ్యాలూ ప్రసాదించే తల్లి అనటానికి సంకేతమా అన్నట్లు అమ్మవారి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరిణె వుంటాయి. ఆలయం ప్రక్కనే ఒక చెట్టు వున్నది. విశాలంగా విస్తరించిన ఈ వృక్షం ఆకులు మన గోరింట చెట్టు ఆకులులాగా ఇంకా చిన్నగా వుంటాయి. చిన్న చిన్న తెల్ల పూలతో ఆకర్షణీయంగా వుండే ఈ చెట్టు కరివె. ఈ వృక్షం కూడా అమ్మవారితోబాటు కాశీనుంచి తరలివచ్చిందని భక్తుల విశ్వాసం. అందుకే అచంచల భక్తితో భక్తులు ఈ వృక్షానికి కూడా పూజలు చేస్తారు. అమ్మవారిముందు శ్రీ చక్రం వున్నది. భక్తులు అక్కడ కుంకుమ పూజ చేయవచ్చు. వీర చౌడేశ్వరీదేవి దర్శనం చేసుకున్నారుకదా. ఆ దేవి మనకందరికీ సకల సౌభాగ్యాలూ సమకూర్చి, అనుకోకుండా ఎదురయ్యే ఆపదలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించేలా ఆశీర్వదించమని ప్రార్ధిద్దాం.


Read More

జైనాథ్, అదిలాబాద్ జిల్లా, తెలంగాణా స్టేట్జైనాథ్ ఆలయం
జైనాథ్, అదిలాబాద్ జిల్లా, తెలంగాణా స్టేట్

జైనాథ్ టెంపుల్ తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలో వుంది. ఉత్తర తెలంగాణాలో అదిలాబాద్ లో ఉన్నఈ ఆలయం పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది. అదిలాబాద్ జిల్లాలో చుట్టు పక్కల దర్శనీయ స్థలాలు చాలా వున్నాయి. వాటిలో ఈ ఆలయం ఒకటి.
ఆలయ ముఖద్వారం ఆలయంలోపలి స్తంభాలపై శిల్పాలు: జైనాధ్ ఆలయం అదిలాబాద్ కు 21 కిలోమీటర్ల దూరంలో జైనాధ్ గ్రామంలో వుంది. హైదరాబాదు నుండి కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్ మీదుగా 315 కిలోమీటర్ల దూరం లో వుంది . ఆలయ మూలవిరాట్టు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి. చాలా మహిమాన్విత ఆలయం ఇది. భక్తులకు ఆ నారాయణుడు తన కృపావీక్షణాలతో అలరారుతుంటాడు. అక్కడ ఉన్న శిలాశాసనాలను బట్టి, ఆలయ గోడలపై చెక్కిన దాదాపు 20 శ్లోకాలను బట్టి ఈ ఆలయం పల్లవ రాజులచే కట్టబడింది అని ఆలయ చరిత్ర చేబుతోంది. క్రీ.శ.4 నుండి 9వ శతాబ్దం నాటి వరకు పల్లవ సామ్రాజ్యం అని చెప్పచ్చు. పల్లవులు దక్షిణ భారతావనిని దాదాపు 500 ఏళ్ళు పరిపాలించారు. వారు పరాక్రమ వీరులే కాదు వారిలో ఉన్న కళానైపుణ్యం కూడా గొప్పది, హస్త కళలలో, శిల్పకళలలోను సిద్ధహస్తులు. రాతిని చెక్కి అందమైన శిల్పాలుగా మార్చే కళ లో ప్రసిద్ధులు. వారి కాలంలో అనేక ఆలయాలు చెక్కబడి అందమైన శిల్పసౌందర్యంతో అలరారే అధ్భుతమైన కళాఖండాలు ఉన్నాయి. వాటిలో ఈ జైనాధం ఆలయం ఒకటి. ఈ ఆలయం జైన్ సంప్రదాయంతో అలరారుతుండేదని ఆలయ శిల్ప కళని బట్టి తెలుస్తుంది. అందుకే ఆలయానికి జైనథ్ అని పేరు వచ్చిందని కూడా చెప్పచ్చు. ప్రకృతి సిద్ధంగా లభించే నల్ల రాతితో ఈ ఆలయం నిర్మితమైంది. చాలా పురాతనమైన ఆలయం ఇది.
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు: స్వామివారి బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో శుద్ధ అష్టమి నుండి బహుళ సప్తమి వరకు జరుగుతుంటాయి ప్రత్యేక పూజలు, జాతరలు కార్తీక మాసంలో జరుగుతుంటాయి. ఆలయం భక్తుల రాకతో, యాత్రికులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం చాల ప్రసిద్ధి చెందింది.
రవి కిరణాలు సోకే నారాయణుడి పాదాలు: ప్రతి ఏటా ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగష్టు, మాసాలలోనూ దసరా అనంతరం వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఉదయం లేలేత లక్ష్మీనారాయణుని పాదాలు ఉదయ కిరణాలు తాకుతుంటాయి. ఈ అధ్భుతదృశ్యం చూడటాని కి భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తుంటారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
ఆలయ విశిష్ఠత : సంతాన సాఫల్యత, కోరిన కోర్కలు తీర్చే దేవుడని భక్తుల నమ్మకం. అంతే కాదు ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ నారాయణ స్వామి అని, నారయణ మూర్తి అని, శ్రీ, లక్ష్మి ఇలాటి పేర్లతో పిలవబడుతుంటారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల టూరిస్ట్ లను ఆకర్షిస్తుంది ఈ గ్రామం చిన్నది. జైనాధ్ మండల పరిధిలో 52 గ్రామాలున్నాయి. వాటిల్లో 29 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. దాదాపు స్త్రీ, పురుషులు సమానంగా ఉన్న ఈ గ్రామాల మండల జనాభా దాదాపు 50,000 లోపే వున్నారు. జైనధ్ గ్రామంలో మాత్రం జనాభా 5,000 లోపే (2001) నాటి లెక్కల ప్రకారం. ప్రభుత్వాలు పూనుకుని ఈ ఆలయంకి రాకపోకలు పెంచి, రహదారి, ఆలయం పరిసరాలు, వసతి గృహాలు ఇత్యాది వన్నీ సమకూర్చితే ఇంకా అభివృద్ధి చెందుతుంది. . అందరికీ ఈ ఆలయం గురించి తెలుస్తుంది. జైనధ్ ఆలయం పర్యాటక కేంద్రంగా మారి చరిత్రలో అద్భుతమైన ఆలయంగా మారుతుంది.Read More

పుష్కరం వివరణ:జలమే సమస్త జగతికి ఆధారము. సృష్టిలోని చరాచర ప్రాణికోటికి జలమే ఆధారభూతమైనది. జలం లేకుంటే ప్రాణికోటి మనుగడే కష్టమైపోతుంది. జలావిర్భావం తర్వాతనే ప్రాణి కోటి ఆవిర్భవించింది. అట్టి జలాన్ని దేవతగా భావించి, పూజించి తరిస్తున్నదీ మానవజాతి. ఇది మన హిందువులకు అనాదిగా వస్తున్న సంప్రదాయము, సదాచారము. నదీస్నానాలు, కోనేటిస్నానాలు, సముద్రస్నానాలు, మాఘస్నానాలు, మంగళస్నానాలు మొదలగు ఎలా అయితే ఎప్పటి నుంచో వస్తున్న మన ఆచారాలో ఈ పుష్కర స్నానం కూడా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. 12 ఏళ్ళకొకసారి వచ్చే నదీపుష్కరాలు మన హిందువులకేంతో పవిత్ర మయినవి.

పుష్కరం వివరణ:
పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు. ఈ పుష్కరాలు మన దేశంలోని ముఖ్య నదులన్నిటికీ వస్తాయి. వీటికి పుష్కరం అనే పేరు ఎందుకొచ్చిదో తెలిపే కథలు పురాణాల్లో, ఉపనిషత్తులలో ఉన్నాయి! పుష్కరుడు ఒక బ్రహ్మ లోక వాసి. అతడు శివుని గురించి తపస్సు చేసాడు. శివుడు తపస్సుకి మెచ్చి వరం కోరుకోమన్నాడు. అప్పుడు పుష్కరుడు శివునిలో శాశ్వత స్థానాన్ని కోరుకున్నాడు. పుష్కరుడు, శివుని అష్టముర్తులలోని జలసిద్ధిని వేడగా, పుష్కరునికి పుష్కర మూర్తిత్వాన్నిప్రసాదించాడు. అంతట పుష్కరడు పుష్కరమూర్తిగా మారి శివుని చెంత చేరాడు.


దేవేంద్రుడు గౌతమ మహర్షిచే శాపగ్రస్థుడై “విరూపి”యైనాడు. అతడు తన వికృత రూపాన్ని భరించలేక తరుణోపాయాన్నిప్రసాదించమని తన గురువు బృహస్పతిని వేడుకొన్నాడు. తన శిష్యుని కోరికను మన్నించి బ్రహ్మలోకం చేరి ఆయన దర్శనంచేసుకొని ఇంద్రునికి శాప విమోచనం కోరాడు. అయినా అతడి విరూపం పోలేదు. అప్పుడు బ్రహ్మ మందాకిని నదీతీరంలో ఒక దివ్య సరస్సును సృష్టించి తన కమండలం లో పుష్కర జలం ప్రోక్షించి దేవేంద్రుణ్ణి స్నానం చేయమన్నాడు.దేవేంద్రుడు అందులో స్నానం చేయగా పూర్వరూపాన్ని పొందాడు. విరూపంపోయి, స్వరూపాన్నిపొందిన దేవేంద్రుడు, దేవ గురువు బృహస్పతులిద్దరూ ఆకాశగంగ కన్నా అత్యంత ప్రభావశాలియైన పుష్కర స్నాన మహత్యానికి ఆశ్చర్యపోయారు. ఇది ఈనోటా ఆనోటా అన్ని లోకాలకు వ్యాపించింది.

ఆకాశగంగని మించిన ఉత్తమమైన పుష్కర తీర్థ సమ్మేళనానికి మిగతా నదులున్నీఎదురు చూడసాగాయి. గంగ, గౌతమీ నదులతో కలిసి అన్ని నదులు బ్రహ్మను ప్రార్ధించాయి. అదే సమయాన తన కనులారాగాంచిన పుష్కర తీర్థ మహిమను, గురు బృహస్పతి తనకు ఆ భాగ్యాన్ని కల్గించమని ప్రార్ధించాడు. కాని పుష్కరుడు వారి కోర్కెను ముందు అంగీకరించలేదు. అయినా సమస్త నదుల ప్రార్ధనకు, గురుని ప్రార్ధనకు పుష్కరుని మనసు కరిగి గ్రహబలం పుష్టికై పుష్కర సమయం లో మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు బ్రహ్మచే నియమింపబడిన నదులలో మాత్రమే తాను ప్రవేశిస్తానని పుష్కరుడు ఒప్పుకొన్నాడు.
రాశికొక్క సంవత్సరం చొప్పున 12 రాశులకు, 12 సంవత్సరములకొకసారి ఆయా నదీ పుష్కరములు వచ్చుట వాడుకగా మారింది. దేవ గురువు యొక్క సింహరాశి ప్రవేశం, అలా గోదావరి యొక్క పుణ్యకాలంగా పరిగణలో కి వచ్చింది. అదే గోదావరి పుష్కరమయింది. గోదావరి జన్మస్థానం నాసిక్ మహారాష్ట్రలో ఉంది. పంచభూతములలో జలము అధిక శ్రేష్ఠమైనది. అది దివి నుండి భువికి భగీరధునిచే తేబడిన గంగ - మహా గొప్పది. అయినా గోహత్య దోష నివారణకై గౌతమ మహర్షిచే కొనిరాబడిన గంగవలె గోదావరి కూడా ప్రాచుర్యంలో అగ్రస్థానంలో ఉంది. స్మృ తులు గోదావరిలో స్నానం చేసిన తరువాతనే గంగలో స్నానం చేయాలని అంటున్నాయి. ఈ విధంగా గురుడు సింహరాశిలో ప్రవేశించగానే మూడు కోట్ల యాభై లక్షల తీర్థములతో కూడి పుష్కరుడు గోదావరి నదిని ఆశ్రయిస్తాడు. అలా ఆయన ప్రవేశించిన సంవత్సరములో మొదటి పన్నెండు దినములు, చివరి పన్నెండు దినములు ఆశ్రయించి ఉంటాడు.

మొదటి పన్నెండు దినములను ఆది పుష్కరములుగా, చివరి పన్నెండు దినములను అంత్య పుష్కరములుగా వ్యవహరించటం, ఉత్సవం జరపటం మనకు అనాదిగా వస్తున్న ఆచారము. ఒకసారి ఒక నదికి పుష్కరం వచ్చిన తరువాత మరల, పన్నెండేళ్ళకే ఆ నదికి పుష్కరాలు వస్తాయి. ఈ ఏడాది గోదావరికి పుష్కరాలు వచ్చాయి. నాసిక్ లో పుట్టి ప్రవహించే గోదావరి మనకు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో పారుతూ ఉండటం వలన ఈ నదికి పుష్కరాలు జరుగుతాయి. అది 2015 సంవత్సరం అధిక ఆషాఢ బహుళ త్రయోదశి మంగళవారం అనగా 14 జూలై 2015 నాటి ఉదయం 6గం. 25ని. లకు గురువు సింహరాశిలో ప్రవేశించే దినం. అదే పుష్కర సమయం, పుష్కర ప్రారంభం.

ఈ పుష్కర సమయములో సూర్యుడు ఉదయించక ముందే లేచి నదిని స్మరిస్తూ స్నానం చేయాలి. దీనివలన పాపాలు పోతాయని నమ్మకం. ఇంకా నదిని స్తుతిస్తూ, భజనలు చేస్తూ మంగళ హారతులిస్తారు. ఈ సమయములో దేవుళ్ళందరూ ఆ నదిలో ఉంటారని గాఢంగా విశ్వసిస్తారు. పుష్కరాల కాలంలో నదీమతల్లికి హారతి యివ్వటం అంటే సకల దేవతలకు హారతులిచ్చినట్లే!! ఈ నమ్మకంతో భక్తులంతా తమ శక్తిననుసరించి హరతులిచ్చి, పుణ్యప్రదులౌతారు. పాప ప్రక్షాళనం చేసుకొన్న తృప్తి ననుభవించి తమ జీవితాలు ధన్యమైనాయనే మహదానందంతో శేషజీవితాన్ని గడుపుతారు

జీవులకు మూడు కర్మల ద్వారా ముక్తి లభిస్తుందట!!

1. రేవానదీ తీరాన తపస్సు చేస్తే ముక్తి.

2. గంగాతీరాన తనువును వదిలితే ముక్తి.

3. కురుక్షేత్రంలో దానం చేస్తే ముక్తి.
ఈ మూడింటి ఫలము పొందాలంటే పుష్కర సమయంలో పవిత్ర గోదావరి లో స్నానం చేస్తే ఫలితం లభిస్తుందని వేదం చెపుతోంది.

ఇట్టి ఘనమైన దివ్యమైన పుష్కర స్నానాన్ని ఈ ఏడు వస్తున్న గోదావరి పుష్కరాల్లో మనమంతా, మనకు దగ్గరలో ఉన్న గోదావరిని చేరి అందులో పుణ్యస్నానమాడి పాపాలను పోగొట్టుకొని తగినంత పుణ్యాన్ని మూటగట్టుకుందాం. మరిక ఆలస్యం ఎందుకు? అందరమూ మూడు మునకలు వేసి యోగ్యులైన బ్రాహ్మణుల పర్యవేక్షణలో స్నానాలు, జప హోమ, తర్పణాదులు, దాన ధర్మాలను చేసి పితృదేవతలను సంతోషింప చేసి మనలను తరింపజేసుకొందాం.

పుష్కర సమయంలో చేయవలసిన దానాలు:

పుష్కర సమయం దానాలు

మొదటిరోజు బంగారం, వెండి, ధాన్యం (బియ్య౦), భూదానం మొదలగునవి.

రెండో రోజు వస్త్రం, ఉప్పు, రత్నం (పగడాలు, కెంపు, ముత్యాలు మొదలగునవి.)

మూడవరోజు బెల్లం, అశ్వం, పండ్లు మొదలగునవి.

నాలుగవ రోజు నెయ్యి, నూనె, పాలు, తేనె.

ఐదవ రోజు బియ్యం, ఆవు, హలం మొదలగునవి.

ఆరవ రోజు మందులు, కర్పూరం, గంధం మొదలగునవి.

ఏడవ రోజు గృహదానం, పీట, మంచం, కందమూలములు (దుంపలు: కంద, పెండలం, అరటి మొదలగునవి).

ఎనిమిదవ రోజు గంధం, కందమూలములు, పువ్వులు.

తొమ్మిదవ రోజు పిండదానం, కన్యాదానం, కంబళి (రగ్గు).

పదవ రోజు కూరగాయలు, సాలగ్రామం, పుస్తకం.

పదకొండవ రోజు గజదానం.

పన్నెండవ రోజు నువ్వులు.
పుష్కర స్నాన విశిష్ఠత:

గంగానది వంటి పవిత్ర నదిలో ప్రతి రోజుస్నానం చేసిన ఫలితం పుష్కరాల సమయంలో గోదావరి నది లో ఒక్కసారి స్నానం చేయటం వల కలుగుతుందని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. మనం రోజూ ఉదయం చేసిన స్నానం వల్ల సాయంత్రం వరకు ఎంత ఉత్సాహంగా ఉంటామో, అలాగే ఒక్కసారి చేసిన ఈ పుష్కర స్నానం వల్ల 12 సంవత్సరాలపాటు మనలోని నాడీ మండలము చురుకుగా పని చేస్తుంది. గోదావరి పుష్కరాలలో భాగమైన ఆది పుష్కరాలు 14-జులై –2015 నుండి 25-జులై-2015 వరకు ఉంటాయి. అంత్య పుష్కరాలు 31-జులై –2016 నుండి 11-ఆగస్టు-2016 వరకు ఉంటాయి.

పుష్కర సమయం లో ముఖ్యంగా మూడు పనులను చేయాలని పెద్దలు సూచించారు. అవి:

1. స్నానము

2. దానము

3. శ్రాద్ధము

పుష్కర స్నాన విధానము:

ఏ తీర్థ స్నానానికైనా మొదట సంకల్పము చెప్పుకొని స్నానం చేయాలి. లేక పొతే తగినంత ఫలం ఉండదు.

నదీ స్నానం చేసే ముందే ఇంటిలో ఒకసారి స్నానం చేయాలి. వేరే ఊరి నుండి వచ్చేవారు యాత్రకు వస్తే ఒకరోజు ఉపవాసం చేసి ఆ తరువాత రోజు పితృ శ్రాద్ధ కర్మలు చేయాలి. పుష్కరస్నానం చేసే ముందు తీరంలోని మట్టిని తీసుకొని నదిలోని నీళ్ళలోకి వేయాలి. ఇలా చేయకపోతే స్నానం చేసేవారి పుణ్యాన్ని “కృత్య” అనే శక్తి హరిస్తుంది (తినేస్తుంది).

“కృత్య”: శివుని మూడో కంటి మంటలోనుండి ఉద్భవించిన శక్తి .

తరువాత నదిలోకి ప్రవేశించి ఈ క్రింది శ్లోకం చదవాలి:

“పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకభయంకరి

మృత్తికాంతే మయాదత్తా మహారార్ధం ప్రకల్పయ.”

ఈ మంత్రము చదువుకొని మట్టిని నదిలోకి వేసి మూడు సార్లు బ్రొటనవేలితో నీళ్ళు తీసుకొని తలపై చల్లుకోవాలి (గోవిందా అని మూడు సార్లు దేవుణ్ణి తల్చుకొని చల్లుకోవాలి). తరువాత గోదావరికి నమస్కరించి, ఆచమనం చేసి, (ఆచమనం అంటే –కుడిచేతిలోకి నీళ్ళు తీసుకొని దేవుడి పేరు చెప్పి త్రాగాలి). తదుపరి ఇలా మనం సంకల్పం చెప్పుకోవాలి.
సంకల్పం :

“అస్యాం మహానద్యాం సమస్త పాప క్షయార్ధం

సింహగతే దేవగురౌ సార్ధత్రికోటి

తీర్ధసహిత తీర్ధరాజ సమాగమాఖ్య మహాపర్వణి పుణ్యకాలే

అఖండ గౌతమీ స్నాన మహం కరిష్యే .”

అని చెప్పి మూడు సార్లు నీటిలో మునక వేసి స్నానం చేయాలి.

పై మంత్రము చెప్పలేనివారు ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు: “అమ్మా గోదావరి ఈ పవిత్ర నదిలో స్నానం చేస్తున్నాను అని తమ పేరు, గోత్రం, దేశం, కాలం” చెప్పుకొని స్నానం చేయాలి. తరువాత గురుడికి, పుష్కరుడికి, సూర్యుడికి ముక్కోటి దేవతలకు, సప్త ఋషులకు, గోదావరి నదికి అర్ఘ్యం ఇవ్వాలి (అర్ఘ్యం అనగా రెండు దోసిళ్ళలోకి నీళ్ళు తీసుకొని తూర్పు దిశగా నిలబడి పైన చెప్పినవారందరకు ఆ నీటిని చూపించి నదిలో విడిచిపెట్టాలి). తరువాత పితృ దేవతలను స్మరించి వారికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. తిరిగి మళ్ళీ నదిలో మూడు సార్లు మునక వేసి స్నానం చేయాలి. ఇలా స్నానం చేసి పవిత్రమయిన తరువాత

“ఆచరిత వ్రత కల్పోక్త సకల ఫలావ్యాప్తర్ధం గౌతమీ పూజాం కరిష్యే“ అని సంకల్పం చెప్పి షోడశోపచారాలతో గోదావరీ మాతకు పూజలు చేయాలి .

స్నానం చేస్తున్నప్పుడు పరిపూర్ణ ఫలితాన్ని పొందటానికి శంకరాచార్యుల వారు “పుష్కరాష్టకం “లో చెప్పిన మరొక శ్లోకం కూడా చదువుకోవటం ఉత్తమోత్తమం .

“శ్రీ యాయుతం త్రిదేహ తాప పాప రాశి నాశకం

మునీంద్ర సిద్ధ సాధ్య దేవదాన వైరభిష్టుతం

తతే అస్తి యజ్ఞ పర్వతస్య ముక్తిదం సుఖాకరం

నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం సశాంకరం “ .

పై శ్లోకాన్ని చద వటం వలన పుష్కరుని యొక్క సర్వ దేవతల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి .

పుష్కర స్నాన నియమాలు :

1. ఇంట్లో స్నానం చేయకుండా, నేరుగా నదిలో చేసే వారు నదికి తూర్పు ముఖంగా నిలబడి స్నానం చేయాలి.

2. అభ్యంగస్నానం (తలంటు), తలకు నూనె రాసుకోవటం వంటివి చేయకూడదు.

3. సబ్బులు, షాంపూలు వాడరాదు.

4. కేవలం ఒళ్ళు తడిసే వరకు మూడు మునకలు వేయాలి.

5. నిద్రపోయి వచ్చిన బట్టలతో స్నానం చేయకూడదు.

6. ఒకే వస్త్రంతో స్నానం చేస్తే ఐశ్వర్యం పోతుంది. అందుకే పంచె మీద ఉత్తరీయం (చిన్న టవల్ ) చుట్టుకొని స్నానం చేస్తే మంచిది .

7. తెల్లటి వస్త్రంతో స్నానం చేయాలి (ఎరుపు రంగు వాడరాదు).

8. స్నానం చేశాక తడి వస్త్రాన్ని క్రింద పడవేయకూడదు.

9. నది మధ్యలోకి, లోతుగా ఉన్న చోటుకు వెళ్లి స్నానం చేయవద్దు.

10. స్నానం చేసిన వస్త్రాలను నదిలో పిండకూడదు.

11. నదిలో ప్లాస్టిక్ కవర్లను వేస్తే మహాపాపం. నదిలో కాని తీరంలో కాని ఉమ్మివేసినచో వికలాంగులవుతారని పోతన గారు చెప్పారు. కావున తగు జాగ్రత్త తీసుకోగలరు.

12. స్వచ్చమైన నీటిని మాత్రమే త్రాగండి.

13. మాసిన, చిరిగిన బట్టలతో స్నానం చేయకూడదు.

14. అర్ధరాత్రి 12 గం. లకు స్నానం చేయకూడదు.

15. అల్పాహారం, భోజనం వంటివి చేసి స్నానం చేయకూడదు (కానీ వృద్దులు, పిల్లలు, వ్యాధి గ్రస్తులు అల్పాహారం తిని పుష్కర స్నానం చేయవచ్చునని శాస్త్రాలు చెప్తున్నాయి).

పుష్కర స్నానం వలన గ్రహ బాధలు తొలగిపోతాయి. “బ్రహ్మపురాణం “ ప్రకారం దైవనది అయిన గోదావరిలో స్నానం చేస్తే , సమస్త పాపాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాక ఇందులో స్నానం చేసిన వారికి దీర్ఘాయువు లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి .

ఈ సమయంలో దేవతర్పణాలు, ఋషి తర్పణాలు, పితృ తర్పణాలు వంటివి ఇస్తే వారి యొక్క ఋణవిముక్తులవుతారు.

జలుబు, జ్వరం, ఆస్తమా వాటి సమస్యలున్నవారు నదీ స్నానం చేయకూడదు. వారు పుష్కర స్నానం చేసిన వారి చేత కొంచెము పుష్కర జలము తెప్పించుకొని, ఆ నీటిని చేతిలో పోసుకొని, “ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః “ అని తల్చుకొని తలపై చల్లుకోవాలి. దీనీవల్ల పుష్కర స్నాన ఫలితం లభిస్తుందని పెద్దలు సూచిస్తున్నారు. ఈ పుష్కరాల కాలంలో ఒక్క రూపాయి దానం ఇస్తే కోటి రూపాయిలు దానం ఇచ్చినట్లే .ఒక్కసారి మంత్రం జపిస్తే కోటిసార్లు జపించినట్లే. గోదావరిలో స్నానం చేస్తే ప్రపంచంలోని అన్ని నదులలో స్నానం చేసినట్లే అవుతుందని పురాణాలు తెల్పుతున్నాయి .మన కలుషాన్ని కడిగి వేసే పవిత్ర నదులకు, మనవల్ల కాలుష్యం రాకుండా చూసుకొనే బాధ్యత మనదే. అప్పుడే ఆ నదీ దేవతల అనుగ్రహం మన మీద ఉంటుంది. పన్నెండేళ్ళకు ఒక్కసారి వచ్చే అరుదైన ఘట్టం ఈ గోదావరి పుష్కరాలు. కాబట్టి ఇంతటి విశిష్టత కలిగిన ఈ పుష్కర కాలాన్ని వినియోగించుకొని స్వర్గలోక ప్రాప్తి కోసం మార్గం వేసుకుంటారని ఆశిస్తున్నాను .
Read More

శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి :--శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి :--
=============================
తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం దగ్గర అందమైన ప్రకృతి
సౌందర్యాన్ని కూడా ఆస్వాదించాలంటే వెలుతురుండగా వెళ్ళండి.

--> శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిచ్చే అపురూపమయిన ఆలయం ఇది. విష్ణుదేవుడు ఈ రూపంలో పూజలందుకోవటం బహుశా ఇంకెక్కడా లేదేమో. ఆలయం చిన్నదేకానీ, జగన్మోహినీ కేశవస్వామి శిల్పం మాత్రం అద్భుతం.
--> భోళా శంకరుడు వరాలివ్వటం, శ్రీ మహావిష్ణువు ఆ వరాలవల్ల వచ్చే ఉత్పాతాలనుంచి అందరినీ కాపాడటం .. మనం చదువుకున్న కధలే కదండీ. అలాంటి అవతారమే మోహినీ రూపం. ఈ మోహినీ భస్మాసురుల కధ అందరికీ తెలిసి వుండవచ్చుగానీ, మోహినీ శంకరుల కధ తెలుసా? అదే ర్యాలి ఆవిర్భావానికి కారణం అంటారు కొందరు. మోహినిని చూసిన శంకరుడు మాయామోహంలోపడి ఆవిడని వెంబడించాడు. శంకరుణ్ణి తప్పించుకుంటూ మోహిని ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆవిడ తలలోనుంచి ఒక పువ్వు ఇక్కడరాలి పడిందిట. దానిని వాసన చూసిన శివుడుకి మాయ వీడిపోయ ఎదురుగా విష్ణు భగవానుడు కనబడ్డాడు. మోహిని తలలోంచి పువ్వు రాలి పడ్డదిగనుక ఆ స్ధలం పేరు రాలి, క్రమంగా ర్యాలి అయిందంటారు. ఆ కధకి నిదర్శనంగానే శ్రీ మహావిష్ణు విగ్రహం ముందునుంచి పురుష రూపం, వెనుకనుంచి మోహినీ రూపంతో వున్నదంటారు.

--> ఇంకో కద ప్రకారం, 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలిస్తూండేవాళ్ళు. అప్పుడు ఇక్కడంతా దట్టమైన అరణ్యాలు వుండేవి. చోళ రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు. కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన రాజు ఒక చెట్టుకింద పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనబడి, తన విగ్రహం ఆ ప్రాంతాల్లో వుందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు. ఆ విగ్రహాన్ని కనుగొనటానికి ఒక చెక్క రధాన్ని ఆ ప్రాంతంలో లాగుకుని వెళ్తుంటే ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో అక్కడ తవ్విస్తే విగ్రహం కనబడుతుందని చెప్పాడు. విక్రమదేవుడు భగవత అదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని కట్టించాడు. ఇక్కడ రధ శీల రాలి పడిపోయిందిగనుక రాలి, ర్యాలి అన్న పేరు వచ్చింది.

--> ఏ ఆలయంలోనైనా గర్భ గుడిలో మనం సాధారణంగా విగ్రహానికి వెనుక పక్కకి వెళ్ళం. ఇక్కడ కూడా అదే అలవాటుగా ముందునుంచి దణ్ణం పెట్టుకుని వచ్చేయకండి. విగ్రహం వెనుకపక్కకి వెళ్ళి పద్మినీజాతి స్త్రీని వెనుకవైపునుంచి చూస్తే ఎలా వుంటుందో చూడండి. ఐదు అడుగుల ఎత్తైన సాలిగ్రామ శిల ఇది. విగ్రహం ముందునుంచీ చూస్తే కేశవస్వామి, వెనుక మోహినీ రూపం.
--> మకరతోరణంమీద దశావతారాలు, నారద, తుంబురులు, ఆదిశేషు, పొన్నచెట్టు, గోవర్ధనగిరి, మహర్షులు, అన్నీ ఆవిగ్రహం చుట్టూ వున్నాయి. ఆ విగ్రహంయొక్క గోళ్ళు కూడా చాలా సజీవంగా కనిపిస్తాయి. వెనుకవైపునుంచి చూస్తే పద్మినీజాతి స్త్రీ అలంకరణ. శిల్పం మొత్తం ప్రతి అణువూ అద్భుతంగా, అన్ని అలంకరణలూ స్పష్టంగా తెలిసేటట్లు మలచబడ్డది.

--> ఇక్కడ ఇంకొక విశేషం....విగ్రహం పాదాల దగ్గరవున్న చిన్న గుంటనుంచి నీరు ఎంత తీసినా వస్తూంటుంది. ఈ నీరు భక్తుల తలలమీద జల్లుతూ వుంటారు. స్వయంభూనో, శిల్పి చాతుర్యమో, ఏదయినాగానీ ఆ దేవదేవుని అవతారమూర్తిని చూసి అద్భుతమని చేతులు జోడించవలసినదే.
--> ఈ క్షేత్రంలోని ఇంకొక విశిష్టత విష్ణ్వాలయం ఎదురుగావున్న ఈశ్వరాలయం ఇక్కడ ఈశ్వరుడు శ్రీ ఉమా కమండలేశ్వరస్వామి. పూర్వం ఇక్కడ త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడు తపస్సు చేశాడుట. ఆ సమయంలో ఆయన తన కమండలంపై ఉమతో కూడిన ఈశ్వరుని ప్రతిష్టించాడుట. అందుకే ఈ ఆలయం ఉమా కమండలేశ్వరాలయంగా ప్రసిధ్ధికెక్కింది.
-->ఇక్కడ ఇంకొక విశేషం ఈశ్వరుడుకి అభిషేకం చేసిన నీరు బయటకిగానీ కిందకిగానీ పోవటానికి మార్గంలేదుట. మోహినీమూర్తినిచూసి మోహించిన శివుని శరీర వేడికి పైన అభిషేకం చేసిన గంగ హరించుకుపోతుందంటారు.

---->తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమకి ముఖద్వారం అని చెప్పదగ్గ రావులపాలెంకి 6 కి. మీ. ల దూరంలో ఆత్రేయపురం మండలంలో వున్న ఈ గ్రామానికి రాజమండ్రినుండి బస్సులున్నాయి. రావులపాలెంనుంచి ఆటోలోకూడా వెళ్ళవచ్చు. -------------------------
Read More

లక్ష్మి నృసింహాష్టకం :--లక్ష్మి నృసింహాష్టకం :--
-------------------------------
శ్రీ మదకలఙ్క పరిపూర్ణ శశికోటి, శ్రీధరమనోహర సటాపటల కాంత !
పాలయ కృపాలయ భవాంభుధి నిమగ్నం, దైత్యపరకాల నరసింహ నరసింహ ||


పాదకమలావనిత పాతజనానాం, పాతక దవానాల ప్తత్రత్త్రి వర కేతో |
భావనపరాయణ భవార్తిహం మాం, పాహి కృపయైవ నరసింహ నరసింహ | |

తుఞ్గ్నఖపజిత్కి దలితాసురవరాసృక్, పఙ్కనవకుఙుకమ విపఙ్కల మహోరః |
పణ్డితనిధాన కమలాలయ నమస్తే, పఙ్కజనిషణ్ణ! నరసింహ నరసింహ | |

మౌలిఘ విభూషణమివామరవరాణాం, యోగిహృదయేషు చ శిరస్సు నిగమానాం |
రాజదరవిందరుచిరం పదయుగం తే, దేహి మమమూర్డ్న నరసింహ నరసింహ | |

వారిజవిలోచన మదంతిమ దశాయాం, క్లేశవివశీకృత సమస్త కరుణాయాం |
ఏహి రమయా సహ శరణ్య విహగానాం, నాధ మధిరుహ్య నరసింహ నరసింహ | |

హాటకకిరీట వరహార వనమాలా, తారరశనా మకరకుణ్డ్లమణీంద్రై |
భూషితమశేషనిలయం తవ వపుర్మే, చేతసి చకాస్తు నరసింహ !నరసింహ | |

ఇందు రవి పావక విలోచన రమయా, మందిర మహాభుజ లసద్వర వరాఙ్గ |
సుందర చిరాయ రమతాం త్వయి మనోమే, నందిత సురేశ నరసింహ నరసింహ | |

మాధవ ముకుంద మధుసూధన మురారే, వామన నృసింహ శరణం భవ నతానాం|
కామద ఘృణిన్ నిఖిలకారణ మమేయం, కాల మమరేశ !నరసింహ నరసింహ | |
Read More

సంగమ గోదావరి :--సంగమ గోదావరి :--
===============
యానాం, మురమళ్ళ, అంతర్వేదిల గురించి ముచ్చటించుకుందాము.
--> యానాం : ఆంధ్ర ప్రదేశ్ లోని ఫ్రెంచ్ కాలనీ యానాం. చుట్టూ తూర్పు గోదావరి జిల్లా ... మధ్యలో యానాం ..
--> మన దేశంలో వున్న మూడు ఫ్రెంచ్ కాలనీల్లో ఇది ఒకటి.. 30 స్క్వేర్ కిలో మీటర్ల విస్తీర్ణంలో వున్న ఈ ఫ్రెంచ్ కాలనీలో బీచ్, చిన్న పిల్లల పార్కు,, వెంకటేశ్వర స్వామి కోవెల, పోచమ్మ కోవెల వగైరా దర్శనీయ ప్రదేశాలున్నాయి.
...ఇక్కడ గోదావరి పాయ గౌతమి, బంగాళాఖాతంలో కలుస్తుంది. కాలనీ లోకి వెళ్ళి రావటానికి ఆటోలు దొరుకుతాయి. మన వాహనాలలో వెళ్ళాలంటే కొంత రుసుము చెల్లించాల్సి వుంటుంది.

--> శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్ధానం, మురమళ్ళ వృధ్ధ గోదావరీ తటంలో వున్న క్షేత్రం మురమళ్ళ. ఇక్కడ స్వామి శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరేశ్వరస్వామి. పురాణ కధల ప్రకారం దక్షుడు యజ్ఞం చేయటం, దానికి పరమశివుణ్ణి ఆహ్వానించకపోవటం, సతీదేవి పుట్టింట్లో జరిగే యజ్ఞం చూడాలనే ఆకాంక్షతో వెళ్ళటం, అక్కడ శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేక యోగాగ్నిలో భస్మమవటం అందరికీ తెలిసిందే. సతీదేవి భస్మమవటంతో కోపించిన శివుడు వీరభద్రుడుని సృష్టించి దక్షయజ్ఞ వినాశనానికి పంపుతాడు. ఆయననే ఇక్కడ వీరేశ్వరుడంటారు. ఆయన మహా భయంకర రూపందాల్చి దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తాడు. తర్వాత దక్షుడు పశ్చాత్తాపపడటంతో ఆయనకి మేక తల అతికించి ఆ యజ్ఞాన్ని పరిపూర్తి చేస్తారు. కానీ సతీ దహనంవల్ల వీరేశ్వరుడు ఎంతకీ శాంతించడు. ఆ భయంకర రూపాన్ని చూసి భయకంపితులైన మునులు, దేవతలు విష్ణుమూర్తిని వీరేశ్వరుడిని శాంతింపచేయమని ప్రార్ధిస్తారు. విష్ణుమూర్తి నరసింహావతారంలో వీరేశ్వరుడ్ని శాంతింపచేయబోతాడు......................కానీ వీరేశ్వరుడు శాంతించడు సరికదా నరసింహస్వామి నడుం పట్టుకుని వదలడు. దానితో నరసింహస్వామి తన నరసింహావతార లీలను అక్కడే వదిలి బ్రహ్మలోకానికి వెళ్ళి అందరూ కలిసి ఆది పరాశక్తిని ప్రార్ధిస్తారు. ఆవిడ ప్రత్యక్షమై విషయం తెలుసుకుని, తన షోడశ కళలలోని ఒక కళ భద్రకాళిని వీరభద్రుని శాంతింపచెయ్యటానికి భూలోకానికి పంపింది. భద్రకాళి అమ్మవారు ఎంత ప్రయత్నించినా వీరభద్రుడు శాంతించలేదు. అప్పుడావిడ శరభ అశ్శరభ అంటూ పక్కనే వున్న తటాకంలో మనిగి కన్యరూపందాల్చి తటాకమునుండి బయటకువచ్చి వీరేశ్వరుని చూసింది.. కన్యరూపంలోవున్న భద్రకాళిని చూసి వీరేశ్వరుడు శాంతించాడు.

----> మహామునులందరూ గౌతమీ తటంలో ఆశ్రమాలు ఏర్పరుచుకుని నివసిస్తున్న ప్రదేశంలో. దానిని మునిమండలి అనేవారు. మునులందరూ ఆ మునిమండలిలో వీరేశ్వరస్వామికి, భద్రకాళికి గాంధర్వ పధ్ధతిన వివాహం జరిపి స్వామిని శాంతింపచేశారు. అప్పటినుంచి ఆ క్షేత్రంలో స్వామికి నిత్యం గాంధర్వ పధ్ధతిలో కళ్యాణం జరిపిస్తున్నారు. ఈ మునిమండలే కాలక్రమేణా మురమళ్ళగా నామాంతరం చెందింది. ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణానికి ఇంకొక విశేషం వున్నది. తమ సంతానానికి వివాహం ఆలస్యమవుతున్నవారు ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తే త్వరలో వారి సంతానం వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులు అలా చేయించే కళ్యాణాలే నిత్యం జరుగుతూంటాయి. అంతేకాదు. స్వామివారి నిత్య కళ్యాణానికి భక్తులేకాక అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్టుడు, గౌతముడు, వ్యాసుడు మొదలగు ఋషీశ్వరులనేకులు ప్రతి నిత్యం విచ్చేస్తారని పురాణ కధనం. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి మహిమ, క్షేత్ర మహిమల దృష్ట్యా అవకాశంవున్నవారు తప్పక దర్శించవలసిన ఆలయం ఇది.


--> "అంతర్వేది" : గోదావరి పాయ వశిష్ట గోదావరి, సాగర సంగమం చేసే ప్రదేశం ఇది. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. క్షేత్ర పాలకుడు శ్రీ నీలకంఠేశ్వరస్వామి. ఇక్కడ బ్రహ్మదేవుడు నదికీ, సముద్రానికీ మధ్య వేదిక నెలకొల్పి, యజ్ఞం చేశాడనీ, అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చిందంటారు.
Read Moreఉద్యోగప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేకం"

>>>>>>>>>>>>>>>>>>>>>>>>


ఉద్యోగంలో లేని వాళ్ళు,ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు,ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు,ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు,ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు,తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి బాలకాండమునందు మొదటిసర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 11 సార్లు పఠించాలి.


నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |

రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||

ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |

నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||

న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |

నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||

న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |

న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||

న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |

నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||

నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |

అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||

గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |

అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||

రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |

చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||

దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |

రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |

యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||

ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |

సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||


చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తనసోదరులను కలిసికొని, జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితోగూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టేను.


శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరును సంతోషముతో పొంగిపోవుచు, ఆయన పాలనలో సుఖఃసౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తితత్పరులై ధర్మమార్గమున ప్రవర్తించుదురు, ఆరోగ్యభాగ్యములతో హాయిగానుందురు, కఱువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు.


రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును, స్త్రీలు పాతివ్రత్యధర్మములను పాటించుచు నిత్యసుమంగళులై వర్థిల్లుచు ఉందురు. అగ్నిప్రమాదములు గాని, జలప్రమాద(మరణ)ములు గాని, వాయు భయములుగాని లేకుండును. జ్వరాదిబాధలు, అట్లే ఆకలిదప్పుల బాధలు, చోరభయములు మచ్చుకైనను ఉండవు - (ఆధ్యాత్మిక - ఆధిదైవిక - ఆధి భౌతిక బాధలు లేకుండును). రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడిపంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగమునందువలె ఎల్లవేళల సుఖశాంతులటో వర్థిల్లుచుందురు.


అనేకములైన అశ్వమేథాదిక్రతువులను, సువర్ణ్క యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్లకొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమొనర్చి, వాసికెక్కును.


రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్థిపఱచును. నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును.


ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమొనర్చును, సర్వపాపములను రూపుమాపును, పుణ్యసాధనము, వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలై పోవును, ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారిపుత్త్రపౌత్త్రులకును, పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML