గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 2 June 2015

వేదాల్లో పురాణాల్లో లేని కులాలని వారి స్వార్థం కోసం పెంచి పోషించే దొంగలను తరిమి కొట్టండి ! అజ్ఞానులారా అర్ధం చేసుకోండి. మన పూర్వీకుల విజ్ఞానాన్నిబ్రహ్మ తల నుంచి బ్రాహ్మణులు , బాహువుల నుంచి క్షత్రియులు , తొడల నుంచి వైశ్యులు , పాదముల నుంచి శూద్రులు పుట్టారు !! ఇక్కడ వీరు అనుకున్న విధంగానే మత మార్పిడి లేదా కుల వివక్ష చూపే పథకాన్ని పైకి తెస్తారు శూద్రులు కాలి నుంచి పుట్టారు అని , ఇలాంటి మతి లేని వారికి ఒకటే ప్రశ్న మనిషి తల , బాహువులు ,తొడలు , కాళ్ళు వీటిలో ఏవిలేకున్న వాడు సంపూర్ణమైన మనిషి అవ్వగలాడా ?? సరే ఇక్కడ దేవుడు తననుంచే మానవ సృష్టిని చేశాడుఅంటే తనని తను అర్పించుకున్నాడు ! మేధస్సు(తల) ఆలోచిస్తే చేతులు(బాహువులు) కర్మలు చేస్తాయి , తొడలు(ఉరువులు) పైన ఉన్న శరీరం స్థితిగా నిలబడేలా చేస్తాయి (ఆర్థిక స్థితి) పాదాల సహాయం తో .పాదాలు గతిని సూచిస్తాయి అంటే ముందుకు తీసుకు వెళతాయి ! వీటిలో యే ఒక్కదాని సహాయం లేకున్నా కూడా సృష్టి లేదా సమాజం అన్నవాటి ఉనికే ఉండదు ! చెప్పాలి అంటే వర్ణలని కులాలుగా విభజించుకున్నది మానవుడే , ఆయా వృత్తులు చేసే వారు ఆ జాతి గా చెలామణి అయ్యరే తప్ప ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు అన్నవి సనాతన దర్మ గ్రంధాలైన వేద పురాణాల్లో లేనే లేవు !వీటి ద్వారా జనుల మధ్య బేధాలు పెంచి పోషిస్తున్నారే తప్ప వాస్తవానికి హిందూ ధర్మం లో కులాల కుమ్ములాటలు లేనే లేవు సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడు క్షత్రియుడిగా జన్మించాడు!వాల్మీకి అనే శూద్రుడు రామాయణాన్ని లిఖింపచేశాడు ! సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ శూద్రులు అయిన గొల్ల వారి ఇంట్లో పెరిగాడు యశోదమ్మ కి మాతృ ప్రేమని పంచాడు !! సాక్షాత్తు దేవుడే అన్నీ వర్ణాల యంధు జన్మించి అన్నీ వర్ణలని పావనం చేశాడు !!! ఎవరిని ఎవరికి బానిసలుగా చూడమని ఎక్కడ కూడా చెప్పలేదు . మరి తనని తాను అర్పించుకొని మానవ సృష్టిని తన శరీరం నుంచి సృష్టించిన బ్రహ్మ గురించి తెలుసుకోక అజ్ఞానపు మాటలు ఎందుకు ??


జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః

ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే (అనగా శిసువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం).వేదం నేర్చిన వారే విప్రులు,బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం.
అదేవిధంగా "వేద విధులతో సంచరించక,దేవతలను పూజించక,వివేకములు లేక,కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో
పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు. శూద్రులే అగుదురు.

వర్ణాశ్రమా అపి గుణకర్మాచరతో హిభవంతి.అత్రాహ మనుః
శూద్రే బ్రాహ్మణ తామేతి బ్రాహ్మణ శ్చైతి శూద్రతాం
క్షత్రియాజ్ఞాత మేవం తు, విద్యాత్ వైశ్యాత్తథైవచ"
ఇది మను ధర్మ శాస్త్రం 10-65 మంత్రం.
భావం : బ్రాహ్మణ గుణాలు కలిగిన శూద్రుడు బ్రూహ్మణుడే యగును.
శూద్రగుణాలు కలిగిన బ్రాహ్మణుడు శూద్రుడగును. అదేవిధంగా క్షత్రియజాతి,వైశ్యజాతి
కూడా కేవలం గుణ, కర్మాచరణల వలననే యేర్పడును.

వేదాల్లో పురాణాల్లో లేని కులలని వారి స్వార్థం కోసం పెంచి పోషించే దొంగలను తరిమి కొట్టండి !

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML