గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 5 June 2015

శుక మహర్షి

శుక మహర్షిపరమ పావనులగు భారత దేశ మహర్షులకు విశిష్ఠ స్థానం శుక మహర్షులదే. అతడు వ్యాస మహర్షి యొక్క తపఃఫలము, యోగీశ్వరుడు. అవదూత. శుక మహర్షిని పోలిన తత్వజ్ఞుడు ముల్లోకముల యందు మరొక డుండడు అనునది అతిశయోక్తి కాదు.
శకుని జన్మ వృత్తాంతము :- ఒకప్పుడు వేద వ్యాస మహర్షి సంతానా పేక్షితుడయి మేరు పర్వతాగ్రమున "కుల కర్ణికారము" అనెడి వనములో ఘోరతపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యెను. అదే కులకర్ణికా వనమున పరమేశ్వరుడు పార్వతీ సమేతుడయి విల్;ఆసముగా కాలము గడుపుతుండెను. వ్యాస మహర్షి తపమునకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి మునీంద్రా "నీ శక్తి సామర్ధ్యములకు భక్తి తాత్పర్యములకు ఎంతగానో ఎంతగానో ఆనందించితిని. నీకేమి కావాలెనో కోరుకొనుము"అనెను. అందుకు ప్రతిగా వ్యాసుల వారు "పరమశివా జలపవనాంబరవనుధానల సమవీర్యుడు సుపుత్రుని నాకు ఒసంగుము" అని ప్రార్థించెను. శివుడు అనుగ్రహించి అదృశ్యమయ్యెను.

ఒక నాడు వేదవ్యాసుల వారు అగ్ని కార్య పరుడయి అరణిని పుచ్చుకొని మధించుచుండగా "ఘృతీచీ" అను ఒక అప్సరస ఆయనకు గోచర మయ్యెను. అంతట వ్యాసుల వారు కామవశుడయ్యెను. మరి కోరుకున్న వర ప్రభావం - వ్యాసుల వారు చలించుట చూచి శాపం యిస్తా డేమో అని భయపడి ఆమె చిలక రూపం ధరిమ్చెను. వ్యాసుడెంత ధైర్యము అవలంభించినను అతడు ఘృతాచి మీద ఉన్న కామవశము చేత వ్యాసుల వారికి వీర్య స్థలనము అరణి యందు పడి పోయినది. ఆయన అరణిని మధించుచుండగా అరణి నుండి తండ్రి పోలికలతో కూడి దివ్య తేజస్సు కలిగి ఒక పుత్రుడు ఉదయించెను. వేద వ్యాసుల వారికి ఘృతాచి చిలుకుతుండగా వీర్యస్థలనము అయినది కావున ఆ బాలునికి చిలక రూపము కూడా కొంత వచ్చినది. "శ్రీ శుకుడు" అని నామ ధేయము చేశారు. శివానుగ్రహం అలా తీరింది.

ఆకాశ గంగ సాకారముగా వచ్చి మంగల స్నానం చేయించినది. ఆకాశము నుండి కృష్ణజనము, దండ, కమండలాలు వచ్చి శ్రీశుకుల వారి ఎదుట పడినవి. పుష్పవర్షము కురిసెను. దేవదుందుభులు మోగించెను. బద్రద్రి దేవతలు సగౌరవంగా వచ్చిరి. పార్వతీ పరమేశ్వరులు వచ్చి శ్రీ శకుల వారికి ఉపనయనము చేసిరి. ఆ సమయములో దేవేంద్రుడు మహోజ్వలముగా ప్రకాశించు కమండలము యిచ్చిరి. దేవతలు ఆశకుల వారికి ఎన్నటికీ మాయని దివ్యవస్త్రములిచ్చిరి.

బాల్యము : తండ్రి మాదిరిగానే శ్రీ శకుల వారికి పుట్టగానే వేదములు వచ్చెను. శకుల వారికి తండ్రి అనుమతితో బృహస్పతిని గురువుగా చేసుకొని వేద వేదాంగములు, ధర్మశాస్త్రము రాజ నీతి మున్నగు వన్నియు నేర్చుకొనెను. బ్రహ్మ చర్యము మహా నిష్టగా నడుప సాగెను. దేవతలందరు అతనిని మంత్రనీయుడుగా పూజింప సాగిరి. కొంత కాలము తర్వాత ఆయన గురువు యొక్క ఆదేశముతో తండ్రి యొక్క ఆశ్రమము చేరిరి. కొంత కాలము శ్రీ శుకుడు పిల్లలతో క్రీడా సక్తుడయి కాలక్షేపం చేయుట తండ్రి గమనించి పిల్లవాడు సమయము వృధా చేయుచున్నాడని గ్రహించి అతనికి సాంఖ్యయోగ శాస్త్రములు ఉపదేశిమ్చినారు. ఇవి తెలుసుకొన్న శ్రీ శకుల వారికి బ్రహ్మ చర్య గార్హస్థ్య, వాన ప్రస్థాన ఆశ్రమము యందు ఎందునూ బుద్ధిపడుట లేదు. ఆయన తండ్రిని తండ్రీ "నాకు మోక్షమార్గముపదేశింపిము" అని అడిగెను. వత్సానీవు జనక నరేంద్రుని కడకు పోయి యీ విషయము తెలుసుకొనుము అని పంపెను. శ్రీ శుకుడు తండ్రి ఆజ్ఞను అనుసరించి మేరువు మొదలగు అనేక పర్వతములు దాటి, విదేహ దేశమునందు గల మిధిలా నగరమునకు చేరి జనక మహారాజు యొక్క ప్రాకారద్వారమున నిలచి ద్వారా పాలకుల ద్వారా జనక మహారాజుకు తన రాకను తెలియచేసెను. అంతట జనక మహారాజు శ్రీ శకుని గౌరవంగా తన సౌధమునకు తీసుకొనిపోయి పూజించెను. అంతేగాక అతని అతని రాక లోని ఆంతర్యమును అడిగి తెలుసుకొనెను. మా తండ్రిగారు పంపగా మోక్షమార్గము గూర్చి తెలుసుకొనుటకై ఇచటకు వచ్చినని తెలిపెను. జనక సంవాదము : విప్రునకు కర్తవ్యమేది? అతడు మోక్ష మార్గము ఎట్లువడయ గలడు ఈ ప్రశ్నలకు సమాధానం యిమ్ము అని అడుగగా జనక మహారాజు - బ్రహ్మణుడు ఉపవీతుడై వేదాద్యయనం చేసివివాహమాడి సంతానవంతుడయి ఆద్వరములొనరించి దేవ పితృపూజ్యుడై వాన ప్రస్థములు చేరి సన్యాస స్వీకారము ద్వారా బ్రహ్మశ్రమపదము నందవలెను. లోకోచ్ఛే కర్మ వ్యాకులత వాటిల్ల కుండా చతురాశ్రమ ధర్మములు నడుప వలెను అని తెలిపి అతనికి పూర్తి మోక్ష మార్గము తెలిపెను. మోక్ష మార్గము తెలుసుకొన్న శకుల వారు జనకుని కడ శెలవు తీసుకొని వేద వ్యాసుల వారి ఆశ్రమము చేరిరి. ఆయన "పీవరి" అను ఆమెను వివాహ మాడి సంతానము పొందెనని దేవీ భాగవతంలో ఉన్నది. శ్రీ శకుల వారు తండ్రిని చేరి తండ్రి ద్వారాకాలావయవ నిరూపణము చతుర్యుగ ధర్మములు, బ్రహ్మము తద్విజ్ఞానము, వర్గ ధర్మములు దాన గుణ ప్రశస్తము, మైత్రీగుణ లాభము మున్నగు విషయములు తెలుసుకొనెను. ఇంద్రియ నిగ్రహము, అరిషడ్వర్గములు నియంత్రించుట ద్వారా బ్రహ్మవిద్యా ప్రాప్తి పొందవచ్చును అని తెలుసుకొనెను. తండ్రి మరియు జనకుని ద్వారా తెలుసుకొనిన విషయాల వలన అవధూత ముక్తి అయ్యి బ్రహ్మర్షిగణసమ్మానితుడై ఒప్పాకెను. శ్రీ శకుల వారు భూభాగమందెచటనైనను ఆవు పాలు పితుకుటకు ఎంత సమయము పట్టునో అంతసమయము మాత్రమే ఉండెదరు. మోక్ష గామి అయిన శ్రీ శకుల వారిని లౌకిక ప్రపంచంలో వున్ననూ ఎటువంటి భాంధవ్యాలకు లోనవకుండా బ్రహ్మనందమును పొందినారు. పరీక్షిత్ మహారాజుకు సప్తాహక్రమంలో భాగవత శాస్త్రం ఉపదేశించి మోక్షమార్గం తెలియ జేసి అనుగ్రహించారు. విష్ణుసేవా బుద్ధితో భాగవతం వినిన మోక్షార్దిక మోక్షము తప్పక లభించును. పరీక్షిత్ కు శ్రీ శకుల వారి ద్య్వారా మోక్షము ప్రాప్తి చెందుటయే గాక- అప్పటి నుండి బఃఆగవత సప్తాహక్రమం కూడా వెలుగొందినది. శ్రీ శకుల తండ్రి ఆశ్రమముననే ఉంటూ సుమంత్దులతో కలసి వేదాధ్యయనము చేయసాగెను. శ్రీశకుల వారి ఆశ్రమమునకు నారదుల వారు వచ్చిఅనేక మోక్ష విషయములను తెలియ జేసెను. శ్రీశకులవారు యోగమార్గమున బ్రహ్మ పదం పొందవలెననె కోరికతో ప్రకృతిలోని మృగ పక్షి, శైల, సరసీతరువులను పిలచి నా తండ్రి నన్ను పిలచినపుడు మీరు "ఓ" అనండని చెప్పి ఉత్తరాభిముఖంగా పోవుచుండ అది తెలిసిన వ్యాసుల వారు "శుకా" అని పిలిఉచిరి అందుకు ప్రతిగా సకల జంగమస్థావరములు "ఓ" అని పలికెను. అంతట శివుడు ప్రత్యక్షమయి వ్యాసా నీ వడిగిన రీతిన నీకు పుత్రుడను ఇచ్చితిని. అతడు నా ప్రభావమున నీ తపఃఫలంబున బ్రహ్మ తేజోమయుడయి పరమగతినొందెను, కావున నీవు ఖేధమడి వీడి మోదము పొందుము అనిపంపెను. వ్యాసుడు పుత్రుని మహోన్నతికి ఆనందించి ఆశ్రమం చేరెను.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML