గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 5 June 2015

దుర్గాసప్తశతి పారాయణ విధానముదుర్గాసప్తశతి పారాయణ విధానము
శరన్నవ రాత్రులు (దేవి నవరాత్రులు)తొమ్మిది రోజులూ,దుర్గా సప్తశతిని పారాయణ చేయగల వారికి సమస్త సౌభాగ్య ఆయురారోగ్యములు,అఖండ పుణ్యఫల ప్రాప్తి సిద్దించటం అత్యంత సాధారణమైన అంశం. అయితే ఆ దుర్గా సప్తశతీపారాయణ క్రమము(విదానం)ఏమిటనేది చాలా మందికి కలిగే సందేహం!దుర్గాదేవీ భక్తులకు ఈ శరన్నవరాత్రుల్లో అనన్య మహిమాన్వితమైన సప్తశతీ పారాయణ క్రమం ఇక్కడ ఇవ్వబడింది.ఈ దుర్గా సప్తశతి యొక్క విశిష్టతను గుర్చి ముందుగా తెలుసుకోవాలి.
సప్తశతి విశిష్టత:ఇంద్రాది దేవతలను అష్టకష్టాలపాలు చేసిన అసురులు విర్రవీగటం;దేవతల మొరపై కటాక్షించిన దుర్గాపరమేశ్వరి తిరిగి దేవతలకు స్వర్గలోక సామ్రాజ్యం ఇప్పించడం దుర్గా సప్తశతిలో ప్రధానాంశం.
అయినప్పటికీ-ఇందులో లౌకికమైన కొన్ని కథలు కూడా చేరి ఉన్నాయి.తానెంతో ప్రేమతో,'తనవారు'అని భ్రమసిన భార్యాపుత్రుల చేతనే బయటకు తరమబడిన వైశ్య ప్రముఖుడు 'సమాధి'కథ,శత్రువుల చేత చిక్కి అంతవరకు సమస్త సుఖబోగాలనుభవించిన రాజు'సురధుడు'మన్యాశ్రమం చేరుకున్న వైనం.......తదుపరి-ఆ వైశ్యవరుడు,ఈ రాజప్రముఖుడూ కూడా దేవీ అనుగ్రహం చేత తిరిగి తమ-తమ యథాస్థితులను పొంద గలగడం ..........ఇత్యాది గాథలు దుర్గాదేవి మహిమను అపురూపంగా చూపిస్తున్నవి.
ఒకప్పుడు దేశంలో ఉపద్రవాలు,కరువు,ప్రకృతివైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఋత్విక్కులచేత ఈ దుర్గాసప్తశతి పారాయణ చేయించేవారని శతసంఖ్య పారాయణవల్ల అరిష్టాలు తొలగి అద్బుత ఫలితాలు కలిగాయని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.ఇదికూడా మహర్షులే జగత్తుకు తెలియజేసిన అపూర్వసత్యం.
ఇంతటి విశిష్టత కలిగిన ఈ దుర్గా సప్తశతి యందు 13 అద్యాయాలున్నాయి.నవరాత్రి తొమ్మిదిరోజులలోను ఈ 13 సంఖ్యగల అద్యాయాలను ఎలా పారాయణ చేయాలి.? అనే సంఖస్య సహజంగానే ఎవరికయినా కలుగు తుంది. ఇందుకు 3 విదాలను మేము ఇక్కడ సూచించటం జరిగింది.దేవీ కటాక్షం పొందగోరువారు ఈ 3 విధాలలో ఏది ఎన్నుకున్నా-ఫలితం పొందడంలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు.కనుక భక్తులు తమకు అనుకూలమైన రీతిని ఎంపిక చేసుకోగలరు.మరో అంశం.....ఈ పారాయణ సమయంలో-ఆయా అద్యాయాల్లో దేవతలు,ఇంద్రుడు,మునులు మున్నగు వారి స్తోత్రములు సందర్బానుసారం చేర్చబడి ఉన్నాయి.అవి ఇంకా అద్బుతఫలదాయకమైనవి.
మొదటి విధానము
ఆశ్వయుజ మాసములోని శుక్లపక్షపాస్యమి మొదలు నవమి వరకు తొమ్మిదిరోజులను శరన్నవ రాత్రములు అంటారని మీకు తెలిసినదే!ఈ 9 రోజులు అత్యంత పుణ్యప్రదమైనరోజులు, పారాయణ, నామజపం, దేవీస్తోత్రం, ఉపాసన, అర్చన....ఎవరికి ఏది అనుకూలమైతే అది ఆచరించటం అద్బుత పుణ్యదాయకం.మొదటి రోజు మొదలు తొమ్మిది రోజులూ ప్రతి దినమూ 13 అధ్యాయాములను పారాయణ చేయుట ఒక పద్దతి, పారాయణ కు శ్రద్దభక్తులు అత్యంత అవసరం.13 అద్యాయాలు ప్రతి రోజులు(కూర్చున్న ఆసనం పై నుంచి కదలకుండా) చేయడానికి కనీసం వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఐదారుగంటలకు తక్కువ లేకుండా పట్టవచ్చు, దైవకృప అపారంగా గల వారికి ఇది సాద్యపడవచ్చు......అలా అని మిగిలినవారు నిరుత్సాహం చెందనవసరంలేదు.వారి-వారి ఓపికకు తగ్గట్టు మరో రెండు విదాలను కూడా గమనించండి.
రెండో విధానము
1వరోజు(పాడ్యమి) ఒకేఒక్క ప్రధమాధ్యాయం మాత్రమే
2వరోజు(విదియ) రెండు,మూడు,నాలుగు అద్యాయాలు
3వరోజు(తదియ) ఐదు మొదలు పదమూడు అద్యాయాలను పూర్తిగా
పైన చెప్పినట్లు-తొమ్మిది రోజులూ పుణ్యప్రదమైనవే కనుక మూడేసి రోజులను పారాయణకు ఎంచుకో వచ్చును. నియమం మాత్రం ఒక్కటే "ఏ మూడు రోజులయినా"అన్చెప్పి ఒకటోరోజు చేసి,రెండ్రోజుల తర్వాత కొన్ని అద్యాయాలు,మరో రెండ్రోజులు ఆగి కొన్ని అద్యాయాలు చదువరాదు. పాడ్యమి, విదియ, తదియలు ఎవరికైనా ఇబ్బందుల-ఆటంకాల దృష్ట్యా కుదరనపుడు-చివరి మూడు రోజులను(సప్తమినాడు కాక) దుర్గాష్టమి, మహర్నవమి,విజయదశమిని ఎన్నుకొనవచ్చును.అనగా 10వరోజు అయినప్పటికీ-దసరా పండుగ (విజయదశమి)రోజును కూడా కలుపుకోగలరు.
మూడో విధానము
మొదటిరోజు-మొదటి అద్యాయం
రెండవరోజు-రెండు,మూడు అద్యాయాలు
మూడవరోజు-నాలగవ అద్యాయం
నాల్గువరోజు-ఐదు,ఆరు అద్యాయాలు
ఐదవరోజు-ఏడవ అద్యాయం
ఆరవరోజు-ఎనిమిదో అద్యాయం
ఏడవరోజు-తొమ్మిది,పది అద్యాయాలు
ఎనిమిదవరోజు-పదకొండవ అద్యాయం
తొమ్మిదవరోజు-పన్నెండో అద్యాయం
విజయదశమి రోజు-పదమూడో అద్యాయం
. ఈ ప్రకారం పైన సూచించిన విదాలలో ఏదైనా ఎన్నుకోవచ్చు!అయితే-పారాయణ చేస్తున్నంతకాలం ఈ విషయాలపై శ్రద్ద వహించాలి.:
1.దుర్గాష్టోత్తర శతనామ/సహస్రనామములతో(ఏదినా సరే-ఒకటి)పూజించుట.ధూపదీప నైవేద్యాలు అర్పించుట.
2.పారాయణకు ముందు అక్షతలు చేతులోకి తీసుకొని,తాము కోరుకున్న కోరికను మనస్సులోనే చెప్పుకొనుట.
3.పారాయణం అయిన వెంటనే అష్టోత్తర శత నామస్తోత్రం పఠించుట.పునఃపూజ చేయుట.
4.పానకం/వడపప్పు(పంద్యారాలకు)కొబ్బరి-బెల్లంపొంగలి/దద్యోజనం/వడలు వంటి పదార్థాలలో ఎవరి శక్త్యానుసారం వారు మహానైవేద్యం సమర్పించుట.
5.పూర్ణిమ/శుక్రవారంనాటికి(ఏవైనా అనివార్యమైన ఆటంకాలు ఎదురైనప్పుడు)పారాయణ ముగిసేలా చూసుకొనుట.
6.పారాయణ పరిసమాప్తమైన రోజున,ముత్తైదువను భోజనానికి ఆహ్వానించి,వస్త్రం,ఎర్రనిది దక్షిణ సహితంగా(9 సంఖ్య ఉండేలా)దానం ఇచ్చి పాదనమస్కారం చేయుట.
7.ప్రతి పారాయణ భాగానికి ముందుగా ఈ 3 శ్లోకాలు పఠించుట.
1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే|
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే||
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే|
శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే||
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః|
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః||
దుర్గాసప్తశతీ పారాయణం చేసేవారు ముఖ్యంగా గమనించాల్సింది:ఎటువంటి కోపతాపాలకిగాని , వికారాలకుగాని లోను కారాదు. శుచి శుభ్రతలను పాటించడం అత్యంత కీలకం.
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః
దుర్గా సప్తశతి (మూల శ్లోక స్తోత్ర సహితము)


దుర్గాసప్తశతి ద్వితీయాధ్యాయము


మూల శ్లోక స్తోత్రం


1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే/
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే//
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే/ శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే//
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః//
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః


ద్వితీయాధ్యాయము.
దేవీ మహత్మ్యాన్ని మేధా మహర్షి ఇంకా ఇలా వివరించసాగాడు."సమాధి,సురధులారా!పూర్వకాలమున-దేవతలకు ఇంద్రుడూ,రాక్షసులకు మహిషాసురుడు ప్రతినిధులుగా పరిపాలన సాగిస్తున్న తరుణములో దేవదానవులకు ఘోరయుద్దం సంభవించినది.దేవతలు పలాయనం చిత్తగించి శ్రీహరిని శరణు వేడుకున్నారు. సోమ, సూర్య, అగ్ని, కుబేరాదులు, పదవులుడిగి దైన్యముఖులై దైత్యధాటిని పరిపరివిధాలా నిఒరసిస్తూ శివ-కేశవులకు తమ మొరలు వినిపించారు.వారికి బ్రహ్మ నాయకత్వం వహించాడు.త్రిమూర్తులూ అలోచించి మహిషదానవుని మట్టుబెట్టే ఉపాయాలు వెతకసాగారు.
దానవుల వల్ల దేవతలు పడుతున్న భాదలను విన్న త్రిమూర్తుల ముఖ కమలాలనుండి మూడు తేజఃపుంజాలు వెలువడినవి.అన్నీ ఒకే చోట ప్రసరించి ఆ మహాతేజోరాశి ఒక స్త్రీ ఆకృతిని దాల్చింది.శివుని తేజస్సు ఆమె ముఖాకృతిని పొందింది.యముని తేజస్సు తల వెంట్రుకలు,విష్ణు తేజము చేతులు,చంద్రుని,తేజము స్తనద్వయం,ఇంద్రతేజం నడుము,వరుణ తేజం,తొడలు,భూదేవి తేజం పిరుదులుగా ఆమెకు అమరాయి.ఇంకా. సూర్య అష్టవసువుల తేజస్సుల నుండి చరణ హతాంగుళులూ,కుబేర తేజస్సు నుండి నాసికా భాసిల్లసాగాయి.దంతాలు ప్రజాపతి తేజస్సునుండి,అగ్ని తేజస్సు నుండి త్రినేత్రాలు,సంద్య తేజస్సు నుండి భ్రూయుగళమూ,వాయు తేజం నుండి కర్ణద్వయమూ ఏర్పడ్డాయి.అదే విదంగా సమస్త దేవతల తేజోరూపంగా మహాశక్తి ప్రాదుర్భవించినది.తమ తేజస్సులనుండి అవతరించిన పరాశక్తి స్వరూపిణిని సందర్శించి బృందారక సందోహం చెందింది.తత్సమయంలో మహా దేవుడు తన త్రిశూలం నుండి మరో శూలాన్ని సృష్టించి దేవికి అందించాడు.
సర్వ దేవాత్మకమైన ఆ శక్తి స్వరూపిణి మహాట్టహాసం చేయగా,అది అంత్రాళం అంతటా ఆవరించినది.భూతలాన్ని దద్దరిల్ల చేసింది.ఆ నవ్వుకు తాళం వేస్తున్నారా అన్నట్లుగా దేవతలంతా ఆమెకు జయజయద్వానాలు పలికారు . నారాయణుడు తన సుదర్షన చక్రాన్నుండి మరో సుదర్శనాన్ని సృష్టించి ఇచ్చాడు.వరుణుడు పాశశంఖాలను,అగ్ని శక్త్యాయుదాన్ని, వాయువు ధనుర్బాణతూణీరాలనూ శ్రీదేవికి అర్పించారు.మహేంధ్రుడు వజ్ర, ఐరావత, ఘంటాదులనూ, యముడు దండాన్నీ,ప్రజాపతి అక్షమాలా కమండలాలనూ సమర్పింపగా,భాస్కరుడు శ్రీదేవీ రోమాలలో తన తేజోమయ కిరణాలను ప్రవేశపెట్టాడు,కాలుడు ఖడ్గ నిర్మల చర్మాలను అందించగా,క్షీరసాగరుడు శ్రీదేవికి ఉజ్జ్వల హారాన్ని,శిధిలం కాని దివ్య వస్త్రద్వయాన్నీ,మనోహర చూడామణినీ,కుండల,వలయ,అర్ధ చంద్రాలంకార కేయూరాభరణనూపురాలనీ, కంఠాభరణాణీ, అంగుళీయకాలనూ అర్పించాడు.విశ్వకర్మ నిశిత పరశవునూ,అనేకాస్త్రాలనూ అభేధ్య కవచాన్నీ సమర్పించాడు.సముద్రుడు శిరోపరిభాగ,వక్షస్థలాలలో,కమలహారాదులను అలంకారాలుగా అర్పించాడు.ఇతరేతర దేవతలందరూ వివిధాభరణాలనూ,అస్త్రాదులనూ శ్రీదేవికి అర్పించి,ఆనందించారు.
మహామాయ మహిషునిపై దండెత్తుట.
సమస్త దేవతలు ఆయుదాలతో ఆ మహాదేవీ కరకమలాలన్నీ నిండిపోయాయి.ఒక్కుమ్మడిగా చేకూరిన ఆయుధశక్తితో,ఆమె ద్విగునీకృతమైన ఉత్సాహము చేత మళ్ళీ మళ్ళీ దిక్కులు పిక్కటిల్లేలా హింసించసాగింది. మౌనివరేణ్యులు సంస్తుతి,దేవ బృందాల యొక్క స్తోత్ర పాఠాలతో భూమ్యాకాశాలు అదిరిపడసాగాయి.దేవతలు చేస్తున్న ఈ సంరంభం చూసి,దానవ సమూహం,అప్రమత్తమైంది.మహిషదానవుడు రెట్టించిన క్రోధంతో,ఆ ద్వనులు వినవచ్చిన దిక్కుగా తన సేనా వాహినిని సమాయుత్త పరచాడు.అప్పటికి దేవి మహిషుని పురికి అతి చేరువలో విడిది చేసింది.తమపై దండెత్తినది కేవలం స్త్రీ మాత్రయని,అబలయని,వారికి తోచింది.దానితో వారు మహోత్సాహంగా ఆమెతో తలపడ్డారు.
మహామాయ మహిష సైన్యాలను మట్టుపెట్టుట.
అసంఖ్యాకమైన ఆ సైన్యాలు మహిషాసురునికి అండగా ఉండి,మహాదేవితో యుద్దం చెయ్యసాగాయి.ఆ రాక్షసులు శ్రీదేవిపై తోమర,భిందివాల,శక్తి,ముసల,కరవాల,కుఠార,పట్టిసాదిగాగల మహాయుదాలను ప్రయోగిస్తున్నారు.ఒకడు శక్తిని ప్రయోగిస్తుంటే వేరొకడు పాశాన్ని ప్రయోగిస్తున్నాడు. మరొకడు ఖడ్గాన్ని ప్రయోగించి శ్రీదేవిని గాయ పరచాలనుకుంటున్నాడు. తత్సమయంలోరాక్షసహస్త వినిర్ముక్త శస్త్రాస్త్రాలను అన్నింటిని శ్రీదేవి ప్రత్యస్త్రాలను ప్రయోగించి కనురెప్పపాటు కాలంలో మటుమాయం చేస్తున్నది.అది చూసి మహర్షులు,దేవతలూ,అందరికందరూ ప్రసన్న హృదయాలతో జగన్మాతను స్తుతించసాగారు.మహామాత శస్త్రాస్త్ర ప్రహారాలతో రాక్షసులను చీల్చి చెండాడుతున్న సమయంలో కూడా వదన మండలం ఆహ్లాదంగానే ఉంది.పరదేవతా వాహనమైన మృగరాజు క్రోధోన్మతయై జూలు విదిలించసాగింది.భీకరంగా గర్జిస్తూ రాక్షసులపై లంఘించసాగింది.శ్రీదేవి క్రోదంతో రాక్షస సమూహాలను ఒక్కుమ్మడి నిర్జిస్తూ నిశ్వశించగా-ఆ నిశ్శ్వాసాల నుండి తక్షణమే లక్షలాది ప్రమథగణాలుద్బవిస్తున్నాయి.ఆ గణాలన్నీ సర్వాయుధాలతో రాక్షససంహారం చెయ్యసాగాయి.ఆ మహోరణోత్సవంలో శంఖపటహ మృదంగాదులను మ్రోగిస్తున్నారు. శ్రీమహాదేవి శక్తి గదాఖడ్గ త్రిశూల ప్రహారాలతో అసంఖ్యాకంగా అసుర సేవలను అంతం చేయసాగింది. అసంఖ్యాక సేనావాహినిని ఘంటానాదంతో మోహితులను చేసింది.పాశబందంతో అనేకులను ఆకర్షించి ఖడ్గ ప్రహారంతో రెండుగా ఖండించసాగింది.గదా ప్రహారాలతో మర్దించి రాక్షసులను భూపతనం చేయసాగింది. ముసల ప్రయోగంతో రాక్షసులు రక్తం కక్కుకోసాగారు.శూల ప్రహారాలతో హృదయాలు చీలిపోతున్నాయి.ఆ విదంగా రాక్షసులందరి కందరూ నేల కూలిపోతున్నారు.శ్రీదేవి దనుర్విముక్త శరపరంపరలకు గురయై,అసురులు అసువులు బాయసాగారు.రెండుగా ఖండించబడిన శరీరాలతో,కుత్తుకలెగిరిపోయిన మొండెములతో రణరంగమంతా నిండిపోసాగింది.రక్తం ఏరులై ప్రవహించసాగింది.
శుష్కించిన గడ్డి పుల్లల్ని,ప్రజ్వలితాగ్ని భస్మం చేసే రీతిలో పరాంబిక రాక్షసమూకల్ని సర్వనాశనం చేస్తున్నది.దేవీ వాహనమైన సింహం తన వంతుగా తన ప్రతాపాన్ని సైతం చూపసాగింది.జూలు విదిల్చి,భీకరంగా గర్జిస్తూ,శేషించిన రక్కసి మూకల్ని చీల్చి చెండాడసాగిందా కేసరి.దేవి యొక్క అసమాన అగణిత సేవావాహిని,ధనుజుల దండును పిండి చేస్తున్న దృశ్యం చూసి,దివిజబృందం హృదయం ఆనంద తరంగితమైంది.
(ద్వితీయాద్యాయం సమాప్తం)


దుర్గాసప్తశతి తృతీయాద్యాయము


మూల శ్లోక స్తోత్రం


1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే/
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే//
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే/ శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే//
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః//
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః


దేవీమహాత్మ్యాన్ని సమాధి సురధులకు విశదీకరిస్తూ మేథా ఋషీంద్రుడిలా చెప్పసాగాడు.భక్తులారా! అసంఖ్యాకంగా సంహరింపబడ్డ రాక్షసులను చూసి క్రోధదందహ్యమాన హృదయుడైన చిక్షురుడు జగదాంబతో యుద్దానికి తలపడ్డాడు.మేరు పర్వత శిఖరాగ్రాన్ని మేఘం జరదాలతో కప్పివేసినట్టు-బాణవర్షంతో చిక్షురుడు శ్రీదేవిని అచ్చాదితం చేసి వేశాడు.ఆ కౄర రాక్షసుని బాణ పరంపరను శ్రీదేవి క్షణంలో వ్యర్థం చేసింది.వాని రాథాశ్వాలనూ,సారధినీ,నేలపాలు చేసింది.దానితో ఆగక వాని దనుస్సును ఖండించి నిశిత శరాలతో వేదించసాగింది.దానితో చిక్షురుడు ఖడ్గ వేత్ర చర్మాదులందుకొని శ్రీదేవితో తలపడ్డాడు.నిశిత ఖడ్గంతో దేవీ వాహన మస్తకంపై ఓ వ్రేటు వేసి,ఆపై జగన్మాత వామహస్తాన్ని ఖండించాలనని కరవాలాన్ని ప్రయోగించాడు.కాని,వాడి ప్రయత్నం విఫలమైఅంది.దానితో వాడు నేత్రాలనుండి క్రోదానల జ్వాలలను వెడల గ్రక్కుతూ శూలాన్ని చేబూని దేవికి గురిపెట్టి విసిరాడు.ఆ శూలం ఆకాశంలోకి ఎగిరి జ్వాజ్వాల్యమాన మైన భానుమండల సదృశ్యంగా భాసిల్లసాగింది.తనను వేదీంచవస్తూన్న మహాశక్తి కూడా శూలాస్త్రాన్నే ప్రయోగించింది.ఆ శూలాస్త్రం చిక్షురుడు విడిచిన శూలాన్ని ముక్కలు చేస్తూనే ఆ దురాత్ముణ్ణి కూడా ఖండించి వేసింది.
చామరసంహారం.
అది చూసిన చామరుడు మహాశక్తిపై శక్త్యాయుదాన్ని ప్రయోగించాడు.ఒక్క హుంకారంతోనే జగదాంబ దనిని నేలపాలు చేసింది.దానితో వాడు శూలాస్త్రాన్ని ప్రయోగించగా శ్రీదేవి శర ప్రహారంతో దానిని మద్య మార్గంలోనే రెండు తునియలుగా ఖండించేసింది.ఆ వెనుకనే శ్రీదేవి వాహనం అయిన సింహం చామరునిమీదకు దూకింది.వాడి శిరస్సు చీల్చి సంహరించింది.
ఉదగ్రుడు హతుడగుట.
చామరుని మరణానంతరం ఉదగ్రుడు అనువాడు శ్రీదేవితో తలపడ్డాడు.శిలలతో,వృక్ష శాఖలతో శ్రీదేవి అతడిని కూడా తెగటార్చింది.అనంతరం కరాళ,ఉద్దవ,భాష్కల,తామ్రాసుర,అందకాసుర,ఉగ్రాస్య,ఉగ్రవీరాది దావన వీరులను నిర్జీవులుగా మార్చింది.తన సేనా వాహినికిసారద్యం వహిస్తున్న మహామహులు ఒక్కొక్కరే మట్టి కరిచేసరికి,మహిషాసురుని క్రోదం తారాస్థాయికి చేరుకున్నది.భీకరంగా అరుస్తూ-తానే స్వయంగా దేవితో పోరు సల్ప సిద్దమయ్యాడు.
మహిషాసురమర్దనం.
ఒక సుడిగాలిలా విరుచుకుపడబోయిన ఆదానవాగ్రాణి మహిషరూపుడు గనక కాలిగిట్టలతో,వాడి అయిన కొమ్ములతో దేవిని గాయపరచడానికి ప్రయత్నించబోయాడు.ముందుగా తన కొమ్ముల శక్తిని చూపించడానికి అక్కడున్న రెండు పర్వతాలను ఎగరగొట్టాడు.ఆ దాటికి ఆకాశంలోని మేఘాలన్నీ చిన్నా బిన్నం అయిపోయాయి.వాని నిశ్వాసాలకు పర్వతాలు ఆకాశానికి ఎగిరి తిరిగి భూమి మీద పడుతున్నాయి.క్రోధోన్మతుడై భూనభోంతరాళాలను ఏకంచేస్తూ తన మీదకి దండెత్తి వస్తూన్న మహిషదానవుణ్ణి సంహరించ సంకల్పించింది.శ్రీదేవి ఉత్తరక్షణంలోనే ఆ దురాత్ముణ్ణీ పాశంతో భందించింది.దానితో మహిషుడు ఆ పశురూపాన్ని విడిచి సింహరూపన్ని దాల్చాడు.మహాశక్తి వాని శిరస్సును ఖండించే ప్రయత్నం చేస్తుండగా వాడు మరలా పురుషాకారాన్ని దాల్చి కరవాలంతో ప్రత్యక్షమయ్యాడు.క్షణంలో శ్రీదేవి నిశిత శరప్రయోగంతో ఆ రాక్షసుడి కరవాల చర్మాలను ఖండించివేసింది.దానితో వాడు గజరూపంలో ఎదురయ్యాడు.తొండంతో సింహం మెడను బలంగా చుట్ట్టివేసాడు.అది చూసి అంబ నిశిత ఖడ్గంతో ఒక్క వ్రేటుతో ఆ తొండాన్ని రెండుగా ఖండించి వేసింది.దానితో వాడు మరలా మహిషరూపాన్ని దాల్చి భూతలాన్ని అస్తవ్యస్తం చెయ్యసాగాడు.అది చూసి సహించలేక మహాశక్తి ఎర్రబారిన నేత్రాలతో అనేక పర్యాయాలు మధుపానం చేసింది. దానితో జనని నేత్రగోళాలు ద్విగుణీకృతరుణిమత్వాన్ని సంతరించుకున్నాయి.ఆమె నిర్విరామంగా అట్టహాసం చేస్తూనే ఉంది.బలమదగర్వితుడై మహిషుడు భయంకర ధ్వనులు చేస్తూ కొండలనూ,బండలనూ పెకలించి దేవతల మీదకు విసరసాగాడు.సురాపానంతో ఎర్రవారిన మోముతో చండిక మహిషునితో ఇట్లా పలికినది:"ఓరీ మూఢా!నిలువు!ఈ సురాపానము పూర్తి కానిమ్ము!ఆ వెంటనే నీ రక్తం త్రాగుతాను"అని చండిక మహిషుని ఒక్కసారి క్రిందకి పడద్రోసి,కాలితో వానిగొంతు మీద త్రొక్కిపట్టి శూలంతో గుచ్చింది.అప్పటికే మహిషాసురుడు తన ముఖాన్ని సగం పైకెత్తి యుద్దం చేయ ప్రయత్నించగా దేవి,వాని శిరస్సు ఖండించేసరికి మిగిలిన రాక్షస వీరులందరూ హాహాకారాలు చేస్తూ వెన్నుచూపారు. విజయోత్సాహంతో దేవ దుందుభులు మ్రోగాయి.అంతటా ఆనంద నాట్యాలు సాగాయి.
(తృతీయాద్యాయం సమాప్తం)


దుర్గాసప్తశతి చతుర్థాద్యాయము.


మూల శ్లోక స్తోత్రం


1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే/
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే//
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే/ శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే//
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః//
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః


మేదామహర్షి చెప్తున్న మహిషాసుర సంహారగాదను ఆసాంతం విన్నారు.సమాధి సురధులు.సంహారానంతర విషేషాలను వివరిస్తున్నాడు మేధా ముని మహిషుని సంహారంతో సంప్రీతి మనస్కులైన ఇంద్రాది దేవతలు,దేవిని ఇలా స్తుతించారు. "సర్వ వ్యాపక శక్తివైన ఓ శక్తి స్వరూపిణీ!అంబికా!నీకు మా భక్తి పూర్వక నమస్సులు!నీ సమర్థత వివరించ హరి హర బ్రహ్మాది శక్యము కూడా కాదు.అట్టి పరమేశ్వరి మాకు అశుభములు తొలగించ,అభయప్రదాయిని అగుగాగ!"దేవతలతో పాటు ఋషులంతా అంబను ఇలా స్తుతించారు.
ఓంఋషిరువాచ
శక్రదాయః సురగణా నిహతే-తివీర్యే తస్మి న్దురాత్మని సురారిబలేచ దేవ్యా
తాం తుష్ణువుః ప్రణతినమ్ర శిరోధరాంసా వాగ్బిః ప్రహర్ష పులకోద్గమ చారుదేహః
1 దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా నిః శేష దేవగణషక్తి సమూహ మూర్త్యా
తా మంబికా మఖిల దేవమహర్షి పూజ్యాం భక్త్యా సతాః స్మ విద్ధాతు శుభాని సా నః 2
యస్యాః ప్రభావమతులం భగవా ననన్తో బ్రహ్మా హరశ్చ నహివక్తు మలం బలంచ
సా చణ్డికా- ఖిల జగ త్పరిపాలనాయ నాశాయ చాశుభభయస్య మతిం కరోతు 3
యా శ్రీః స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీః పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్దిః
శ్రద్దా సతాం కులజనప్రభవస్య లజ్జా త్వాం త్వాం నతాః స్మ పరిపాలయ దేవి విశ్వమ్. 4
కిం వర్ణయామ తవరూప మచిన్త్యమేతత్ కించాతి వీర్యమసుర క్షయకారి భూరి
కిం చాహవేషు చరితాని తవాద్బుతాని సర్వేషు దే వ్యసుర దేవగణాదికేషు. 5
హేతుః సమస్తజగతాం త్రిగుణాపి దోషైః న జ్ఞాయసే హరిహరాదిభిరప్యపారా
సర్వాశ్రయాఖిలమిదం జగదంశభూతం అవ్యాకృతాహి పరమా ప్రకృతి స్త్వమాద్యా 6
యస్యాః సమస్తసురతా సముదీరణేన తృప్తిం ప్రయాతి సకలేషు ముఖేషు దేవి
స్వాహాసి వై పితృగణస్య చ తృప్తి హేతుః ఉచ్చార్యసే త్వయత ఏవ జనైః స్వదా చ. 7
యా ముక్తి హేతురవిచిన్త్య మహావ్రతా త్వం అభ్యస్యసే సునియతేన్ద్రియ తత్త్వసారైః
మోక్షార్దిభి ర్మునిభిరస్త సమస్త దోషై ర్విద్యాసిసా భగవతీ పరమా హి దేవీ// 8
(సమస్త లోకాలనూ ఏలే నీ పరాక్రమ శౌర్య దైర్యాదులు మాకు ఊహాతీత విషయాలు.నీ అవతార,మహాత్మాదులను ఎంతని-ఏమని వర్ణించగలం?తల్లీ!మహిషాసుర మర్ధినివై నువ్వు ప్రదర్శించిన వీరోచితలీలలు మా పలుకులకు, బుద్దులకు అతీతమైనవి.సర్వ జగట్తులకు కారణభూతురాలవైన నీ సత్త్వరజస్తమో గుణమయ స్వరూపం హరిహర హిరణ్య గర్బులకే భోధపడకుండా ఉంటే-సామాన్యులమైన మాకు భోదపడుతుందా?యావద్విశ్వమూ నీ అంశయే.ఆ వ్యాకృత,పరమాద్యా ప్రకృతివి నువ్వే.నువ్వు ప్రాదుర్భవించడమంటూ ఉండదు.యాగసమయాలలో దేవతల తృప్తికై ఉచ్చరిమ్చబడు స్వాహా స్వరూపిణివీ,పితరుల తృప్తి కోసం శ్రాద్ద సమయంలో ఉచ్చరిమ్చబడే స్వదామూర్తివీ నువ్వే.అందుకె నిన్ను స్వాహా,స్వధా నామాలతో పిలుస్తుంటారు.నువ్వు మోక్షకారణమైన రమవిద్యాస్వరూపిణివి కావడం వల్లనే మహర్షులు రాగ ద్వేష దూరులై జితేంద్రియములై బ్రహ్మతత్వాన్ని అన్వేషిస్తూ నిన్నాశ్రయిస్తారు. భవనాతీతమైన నువ్వు సర్వత్కృష్టురాలవు.శబ్ద స్వరూపిణీ!రమణీయమైన పదాలతో,పాఠాలతో విశిష్టత్వాన్ని సంతరించుకున్న ఋగ్యజుస్సామవేదాలను ఆశ్రయించి నువ్వు వుంటావు. వేద స్వరూపిణివీ,ఈశ్వరివీ నువ్వే!విశ్వాన్ని పోషించే నిమిత్తం "కృషి"రూపంలో సర్వత్రా నువ్వు వ్యాప్తమై ఉంటావు.విశ్వంలోని దుఃఖాలను పోగొట్టడంలో నువ్వు సర్వసమర్థురాలవు.సర్వ శాస్త్ర సారాన్నీ గ్రహించగల మేథావూ నువ్వే.ఈ అపార సంసార సాగరాన్ని తరింపచేయగల మహాశక్తివి నువ్వే....)అంటూ దేవతా,ఋషిగణాలు పరి పరి విదాలుగా ప్రార్దింప సంతుష్టురాలైన దేవి"అమలారా!మీ విశ్వాసాలు నన్ను ఆనందింపజేసాయి.ఇష్టవరాలు అనుగ్రహి స్తాను.కోరుకోండి"అన్నది.
"జగన్మాతా!లోక కంటకుడిని అంతం చేసి మాకు రక్షణ కల్పించావు.ఇంతకంటే ఇంకెం వరాలు కావాలి? అయినప్పటకీ .నువ్వు వరాలివ్వాలనుకుంటే ,మేము ఆపదలో చిక్కుకున్న వేళలో నీ స్మరణ చేసి తల్లీ!ఈ స్తోత్రంలో నిన్ను స్తుతించిన వారిని దనదాన్య పుత్రాదులతో అనుగ్రహించు"అని అర్దించారు.ఆత్మ కళ్యాణయుక్తమై,జగత్కళ్యాణ సంధాయకమైన దేవతలు కోరిన వరాలు ప్రసాదించి శ్రీదేవి అంతర్ధానమైంది.
(చతుర్ధాద్యాయం సమాప్తం)


దుర్గాసప్తశతి పంచమాధ్యాయము


మూల శ్లోక స్తోత్రం


1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే/
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే//
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే/ శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే//
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః//
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః


దుర్గాసప్తశతి "సమాధీ సురథులారా!విశ్వకళ్యాణాన్ని అభిలషించే జగదంబ దేవతల శరీరాల నుండి ఆవిర్భవించడాన్ని, మహిషాసుర వధా విధానాన్ని వివరించాను.ఇప్పుడు దూమ్రలోచన శుంభ నిశుంభాది రాక్షసులను సంహరిమ్చి ముల్లోక వాసులనూ కాపాడిన కథా విధానాన్ని విశదీకరిస్తాను.సావదానచిత్తులై ఆలకించెదరుగాక!"అని మేథాఋషి పలుకుతున్నాడు.
ఉత్తమ చరితము.
శ్రీదేవి-నిశుంభదూతా సంవాదము
భక్తులారా!పురాతనకాలంలో శుంభుడు,నిశుంభుడు అనే ఇద్దరు రాక్షసులు బలమదగర్వోన్మతులై బలాత్కారంగా మహేంద్రుని ప్రభ్త్వాన్ని స్వాదీనం చేసుకొని యాగభాగాలను గ్రహిమ్చి అనుభవించసాగారు.దానితో వరుణ, కుబేర, యమ, సూర్యచంద్రాదుల అదికారాలను కూడా స్వాదీనం చేసుకొని స్వైరవిహారం చేస్తున్నారు.అగ్ని వాయువులు నిర్వహించేకార్యాలను వారే చెయ్యసాగారు.ఓడిపోయి అవమానింపబడ్డ దేవతలు స్వాదికారాల్ని కోల్పోయి,స్వర్గం నుండి తరిమి వేయబడి క్లేశవారాశిలో మునిగిపోయారు.ఆ దైన్య హైన్యస్థితిలో వారికి పరమేశ్వరి ప్రసాదించిన వరం గుర్తుకు వచ్చింది.వెంటనే వారు మహోత్తుంగ హిమాద్రి శిఖరాన్ని అదిష్టించి,పరాశక్తిని గురించి శ్రద్దాభక్తి విశ్వాసాలతో ప్రార్థించారు.
దేవీ ఊవాచ:
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణాతాః స్మతాం
రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై దాత్ర్యై నమోనమః
జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః
కల్యాణ్యై ప్రణతావృద్ద్యై సిద్ద్యై కుర్మో నమోనమః
నైరృత్యై భూభృతాం లక్ష్మై శర్వాణ్యైతే నమోనమః
దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై
ఖ్యాత్యై తథైవ కృష్ణాయై దూమ్రాయై సతతం నమః
అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్వై నమో నమః
నమో జగత్ప్రితిష్టాయై దేవ్యై కృత్యైనమో నమః
యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయతే శబ్దితా
నమస్తస్యై,నమస్తస్యై,నమస్తస్యై,నమోనమః
యా దేవీ సర్వభూతేషు చాయారూపేణ సంస్థితా
నమస్తస్యై,నమస్తస్యై,నమస్తస్యై,నమోనమః
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై,నమస్తస్యై,నమస్తస్యై,నమోనమః
యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణా సంస్థితా
నమస్తస్యై,నమస్తస్యై,నమస్తస్యై,నమోనమః
యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణా సంస్ఠఃఇతా
నమస్తస్యై,నమస్తస్యై,నమస్తస్యై,నమోనమః
యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణా సంస్థితా
నమస్తస్యై,నమస్తస్యై,నమస్తస్యై,నమోనమః
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై,నమస్తస్యై,నమస్తస్యై,నమోనమః
యా దేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణా సంస్ఠఃఇతా
నమస్తస్యై,నమస్తస్యై,నమస్తస్యై,నమోనమః
ఇన్ద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషుయా
భూతేషు సతతం సత్యైవ్యాప్యై దేవ్యై నమోనమః
చితిరూపేణ యా కృత్స్న మేతధ్వాప్యస్థితా జగత్
నమస్తస్యై,నమస్తస్యై,నమస్తస్యై,నమోనమః
స్తుతాసురైః పూర్వమభీష్టసంశ్రయా-త్తథా సురేన్ద్రేణ దినేషు సేవితా /
కరోతి సా నః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్యభిహన్తు చాపదః //
యా సామ్ప్రతం చోద్దతదై త్యతాపితై రస్మాభిరీశా చ సురైర్న మస్యతే.
("అమ్మా!ప్రభాస్వరూపిణివీ,కళ్యాణమూర్తివీ,మహాదేవియైన నీకు వందనాలు,మూల ప్రకృతివీ, పాలనకర్త్రివీ, భయంకరరూపిణివీ,నిత్యురాలవూ,గౌరివీ,దాత్రురూపినివీ,జ్యోత్స్నా స్వరూపిణివీ,ఆనంద ఇందు స్వరూపురాలవూ అయిన మాతా!మా ప్రణామాలు స్వీకరించు.సంపద్రూపిణివీ,మంగళమయవూ,అలక్ష్మి రూపిణివీ,రాజలక్ష్మీ స్వరూపురాలవూ, మహేశ్వరివీ అయిన నీకు సర్వదా నమస్కారములు.దుర్జేయమైన దుర్గవూ,దుర్గమ్యాన్ని సుగుమం చేసే దేవివీ,సర్వకారకురాలవూ,ప్రతిష్టా స్వరూపిణివీ,కృష్ణ వర్ణ దేహం గల దాఇవీ,దూమ్రవూ,అత్యంత మోహర స్వరుపిఇవీ,భయంకరరూపిణివీ,జగత్ప్రతిష్టా స్వరూపిణివీ,క్రియారూపిణివీ,అయిన తల్లీ!నీకు వినయంగా ప్రణమిల్లుతున్నాను.విష్ణు మాయా స్వరూపంతో ప్రాణులలో ఉండే నీకు వినయాంజలులు.సర్వ ప్రాణులలో చైతన్య స్వరూపంగా ప్రకాశిమ్చే మహాదేవికి నమస్సులు.ప్రాణులలో బుద్ది రూపిణిగా భాసిల్లుతున్న మాతకు వందనాలు. సర్వభూతాలలో నిద్రాస్వరూపిణిగా ప్రకాశిమ్చు మహాశక్తికి నమస్కృతులు."క్షుధ"గా సర్వప్రాణులలో విరాజిల్లే జననికి అనేక వందనాలు.అజ్ఞానందకారంతో సర్వప్రాణుల హృదయాలలోనూ ఆవరించిన జగదాంబకు అంజలులు,శక్తి రూపంలో,వాసనా స్వరూపంలో,క్షమారూపంలో,జ్యోతి స్వరూపంలో, లజ్జారూపంలో, శాంతిరూపంలో, శ్రద్ద,కాంతి, లక్ష్మి, క్లిష్టాక్లిష్ట,స్మృతి, శక్తి,దయ,మాతృ,భ్రాంతి,ఇంద్రియాధిష్టాతృ రూపాలలో భాసిల్లే మాహామాతకు అనేకానేక ప్రణామాలు. ఇంద్రియాలకు అధిష్టాత్యై సర్వజీవులలో అనూహ్య భావంతో తేజరిల్లే జగదాంబకు వందనశతాలు. సమస్తవిశ్వంలోనూ చైతన్య స్వరూపిణియై వ్యాపించిన మహామాతకు ప్రణామాలు.)
ఈ విధంగా దేవతలు స్తుతించిన మీదట పార్వతీ దేవి దేహం నుండి 'కౌశికి'అనే పేరుగల దేవీ దక్తి ప్రాదుర్బవించింది.ఆ అవతారం వల్ల పార్వతి శరీరం నల్లగా మారిపోగా,ఆమె కాళీ అనే నామంతో ప్రసిద్ది చెందింది.
ఇక-కౌశికి భువన మోహన రూపలావణ్యాలను శుంభ నిశుంభ సేవకులైన చండుడు-ముండుడు అనే వాళ్ళు మొదటగా చూశారు.వారు ఆమె సౌందర్యానికి అచ్చెరు వొంది,శుంభ దానవుని వద్ద కేగి అ సుమనోహరాంగి సౌందర్యాన్ని అసాదారణంగా వినిపించారు.పొందితే ఆ లలనారత్నాన్ని పొంది తీరాలన్నారు.
శంభుడికి ఈ వర్ణనలన్ని విన్నాక మతిపోయినంతపనైంది.అంతటి అతిలోక సుందరిని తను వలచి వలపించుకోనెంచి సుగ్రీవుడనే దానవుడ్ని ఆమె వద్దకు దూతగా పంపించాడు.ప్రేమతో తన వద్దకు రమ్మని చెప్పమంటూ ఆదేశించాడు. సుగ్రీవరాయభారం.
తక్షణమే సుగ్రీవుడు హిమాలయాల చెంతకేగి,ఆ కౌశికి ఉన్న తావు కనుగొని మృదుమదుర సంభాషణ ప్రారంభిస్తూ తనను పరిచయం చేసుకొని శుంభ మహాదానవుడు చెప్పిన అక్షరం చెప్పినట్టు పొల్లుపోకుండా ఇలా విన్నవించాడు: "దేవీ!నేను ముల్లోకాలనూ పాలించే ప్రభువును.భువనత్రయం నా సంరక్షణలో ఉంది.అమరులు మదీయాజ్ఞాబద్దులై సంచరిస్తున్నారు.యాగభాగాలన్నింటినీ వేర్వేరు భావాలతో నేనే స్వీకరిస్తున్నాను.జగత్రయంలోని శ్రేష్ఠమైన రత్నాలన్నీ నా సన్నిదిలోనే ఉన్నాయి.హయరాజమైన ఉచ్చైశ్రవము,శ్రేష్ఠగజమైన ఐరావతమూ నా ఆదీనంలోనే ఉన్నాయి.దేవగందర్వులూ,వాసుక్యాది నాగగణము మదియాదీనంలోనే ఉన్నాయి.సృష్టి కూడా మా ఆశ్రయంలోనే వుండాలి.ఓ చంచలాపాంగీ!లలనామణివైన నువ్వు నన్ను గానీ,మహాబలపరాక్రమ సంపన్నుడైన నా తమ్ముణ్ణిగాని వరించు.నన్నాశ్రయించిన నాడు నీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయన్న దృష్టితో నన్ను వరించు"అని పలికాడు.
దూతద్వారా శంభుని సందేశాన్ని విన్న దేవీ గంభీరంగా మందస్మితం చేసింది.ఆ దానవదూతతో"సుగ్రీవా!నువ్వు చెప్పినదంతా సత్యమే.శుంభ నిశుంభులు త్రిలోక సామ్రాజ్యాదీశులు.కాని,శైశవ బుద్ద్యా నేను చేసిన ప్రతిజ్ఞా విషయాలను ఆలకించు.రణరంగంలో నన్ను జయించి నాతో సమానంగా నిలువగలవానినే నేను పతిగా గ్రహిస్తాను.ఎంత మాత్రం ఆలస్యం చెయ్యక శీఘ్రమే వెళ్ళు.శుంభ నిశుంభలలో ఎవరో ఒకరు నన్ను ఓడించి చేపట్టవచ్చునని చెప్పు"అంది. దానికి ఆ దానవదూత "దురాభిమానపూర్ణమైన ఇట్టి ప్రతిజ్ఞలేల?శుంభ నిశంభుల్ని ఎదిరించి నిలువగలిగిన వారు జగత్త్రయంలోనే లేరు.దేవీ!శుంభ నిశుంభుల విషయం అలాఉంచగా,దేవ సైన్యాలన్నీ ఎదురైవచ్చినా మా రాక్షస సేనల ముందు తలలు వంచవలసిందే.అబలవైన నీ విషయం వేరే చెప్పాలా?ఇంద్రాది దేవతలే నిలువ లేక పలాయన మంత్రాలు పఠిస్తుంటే అల్పశక్తురాలవైన నువ్వెం చెయ్యగలవు?వారి సమక్షంలో నిలబడడమే నీకు అసాద్యము . శాంతంగా చెబుతున్నాను.తక్షణం మా ప్రభు సన్నిదికి రాకుంటే,నీకు బలాత్కార యోగం తప్పదు"అన్నాడు.అందుకు దేవి శాంతంగా"సుగ్రీవా!దూతగా వచ్చినవాడవు.నీహద్దుల్ని నీవు అతిక్రమించరాదు.నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పావు.ఇక నేను చెప్పేది విను!మీ ప్రభువుని యధోచితంగా ఏం చేసుకోదల్చుకుంటే అది చేసుకోమను"అంది.
(పంచమ అద్యాయం సమాప్తము)


దుర్గాసప్తశతి షష్ఠాధ్యాయము.


మూల శ్లోక స్తోత్రం


1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే/
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే//
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే/ శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే//
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః//
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః


దేవి పలుకులను సుగ్రీవుడు యథాతథంగా తన ప్రభువైన శుంభునకు విన్నవించాడు.సుగ్రీవరాభారంతో తన మనోరథం తీరనందున,శుంభుడు రాక్షస నాయకుడైన ధూమ్రలోచనుని రప్పించి"దూమ్రా!ఆ సొగసుకత్తె మాటలకు లొంగేదానిలా కన్పించ్లేదు.పైగా యుద్దమంటున్నది.తగిన బుద్ది చెప్పి బలాత్కారంగా అయినా ఆమెను చెరబట్టి లాక్కురా!"అని అనుజ్ఞ ఇచ్చాడు.ధూమ్రాలోచనుడు సైన్యసమేతంగా దేవి వున్న ప్రాంతమును వచ్చి బిగ్గరగా"నువ్వు వెంటనే మా ప్రభువు వద్దకు రాకున్నచో,నీ కేశపాశములు పట్టి ఈడ్చుకుపోయెద"నంటూ పలికాడు.
"సరే!అదీ చూద్దాం!"అన్నది అంబ.ధూమ్రాలోచనుడు"అబలవు!నీకింత తెగింపుతగదు"అంటూనే ఆమె మీదకు లంఘించాడు.తమ నాయకుని బాసటగా దైత్యసైన్యం కదిలింది.అది చూస్తూనే మహామాత క్రోదంతో ఎఱ్ఱవారిన నేత్రాలతో హుంకారం చేసింది.దాని నుండి బయలువెడిన అగ్ని జ్వాలల్లో పడి ధూమ్రాలోచనుడు భస్మీపటలమైపోయాడు.అదే సమయంలో జగదాంబ వాహనమైన సింహం జూలు విదిలిస్తూ అసురసైన్యంలో ప్రవేశించింది.పంజా దెబ్బలతో కొట్టీ,నోటితో కొఱికీ సైన్య సర్వస్వాన్నీ చీల్చి చెండాడింది.వాడి గోళ్ళతో వాళ్ళ ఉదరాలు చీల్చి వేసింది.పంజా దెబ్బలతో వాళ్ళ మస్తకాలను తుత్తునియలు చేసింది.దుష్టరాక్షసుల కంఠ బాహ్వాదిగా గల అంగాలను కొఱికి రుధిర పానం చేస్తూ,స్కంధాగ్రభాగంలో ఒత్తుగా పెరిగిన కేశరవళిని విలాసంగా విదిలిస్తూ యుంది.క్షణాలలో రాక్షస సైన్యసర్వస్వం ఆ మృగేంద్రానికి బలైపోయింది.
వాహనమాత్ర సమేతయైన దేవి,అపార సేనా సమేతంగా తన దూమ్రాలోచన సేనాదిపతిని యమ సందనం చేర్చిన వార్త వింటూనే శుంభుడు మహోక్రోదోన్మత్తుడై పట పట పండ్లు కొరుకుతూ కంపించే పెదవులతో వెంటనే ప్రచండ బలపరాక్రమ సంపన్నులైన చండాముండాసరులను పిలిపించి,"మహావీరులారా!మీరు తక్షణమేవెళ్ళి ఆ దేవిని ఎలాగైనా బందించి తీసుకురండి.అది అసాద్యమైతే శస్త్రాస్తప్రహారంతో లొంగదీసుకొని దాని వాహనమైన సింహాన్ని సంహరించి ,దెబ్బతిన్న ఆ సుందరిని నా సన్నిదిలో ఉంచండి"అని ఆజ్ఞాపించాడు.
(షష్ఠాద్యాయం సమాప్తం)


దుర్గాసప్తశతి సప్తమాద్యాయము


మూల శ్లోక స్తోత్రం


1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే/
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే//
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే/ శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే//
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః//
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః


చండముండాసుర వధ:
తమ శుంభ ప్రభువు అదేశ వ్యాక్యాలను ఆలకిస్తూనే చండముండులనే ఆ ఘోర రాక్షసులు చతురంగ బలాలను వెంటబెట్టుకొని హిమాచల ప్రాంతం చేరి,అక్కడ హేమ శిఖరం పై మృగరాజును అధిష్టించి మందహాసం చేస్తున్న మహాదేవిని దర్శించారు.బలమద గర్వితులైన ఆ దురాత్మలు సేనా సమేతంగా కత్తులు దూసి దేవిని బందించ సన్నద్దులయ్యారు.తనను సమీపించ వస్తూన్న అ దురాత్ములను చూస్తున్న మహామాత నేత్రగోళాల నుండి విస్పులింగచ్చటలు బహిర్గతమౌతున్నాయి.ముడిపడిన బృకుటితో ఉన్న ఆమె కనుల నుండి నిప్పులు రాలుతుండగానే,లలాటమద్యదేశం నుండి భయంకర ముఖంతో,కరవాలపాశాలను దాల్చిన మహాకాళి ప్రాదుర్భవించింది.ఆ భికరమూర్తి లోహనిర్మిత అష్టాయుదాల్ని దరించి గళసీమలో కపాలమాలనూ,కటి దేశంలో పులిచర్మాన్ని దరించి ఉంది.ఆమె ముఖమండలం అత్యంత విశాలంగా ఉంది.నాలుక బయటకు వ్రేలాడుతూ ఉంది.అగ్నిగోళాలవలె జ్వలిస్తున్న కళ్ళు లోతుగా గుంటలు పడివున్నాయి. ఆమె మహా భయంకరంగా గర్జించింది.ఆ గర్జన దిశాంతాలను సైతం ప్రతిద్వనింపజేసింది. ఆ భయంకరమూర్తి రాక్షససేనలపై విరుచుకుపడి గాయపరుస్తూ వారిని భక్షింపసాగింది.పార్శ్వ,అంగరక్షకాదులతో మహావీరపరివేష్టితమై ఘంటాద్య లంకారాలతో తనపైకి వస్తున్న ఓ మహాగజాన్ని చేతితో పట్టుకొని సునాయాసంగా నోట్లో వేసుకుంది.ర్థ సమేతంగా రధికుణ్ణి,అశ్వ సమేతంగా అశ్వికుణ్ణి అవలీలగా వదన గహ్వరంలో పడవేసుకొని నమిలివేయసాగింది.కొందరిని కేశపాశం పట్టీ,మరికొందరి కుత్తుకలు పట్టుకొనీ,కాళ్ళతో అణగద్రొక్కి అనేకుల వక్షఃస్థలాలను బ్రద్దలు కొట్టీ సంహరించి వేస్తున్నది.క్రోదాద్రిక్తురాలై రాక్షసులు ప్రయోగించే శస్త్రాస్త్రాలను మింగేస్తున్నది.కొందరు దానవులు పారిపోయే ప్రయత్నాలు చేశారు.కాని అంతలోనే మహాకాళి ఖడ్గ ప్రహారాలకు బలి అవుతున్నారు.
ఆమె వీరవిహారాన్ని చూసిన చండముండాసురలకు ముచ్చెమటలు పోశాయి.బాణ పరంపరతో ఆమెను కమ్మేసి,చక్ర ప్రయోగంతో ముండాసరుడు కాళికను ఎదుర్కొనబొయ్యాడు.ఆమె హుంకార ద్వనికి ఆ ఆయుదాలన్నీ పూచిక పుల్లల్లా ఎగిరిపోయాయి.
అలా హుంకరిస్తేనే,చండుని కేశాలను పట్టి నిశితమైన తన ఖడ్గంతో,వాని శిరస్సు ఖండించినది దేవి.అతడి మరణము చూసిన ముండుడు మహోద్రేకంతో అంబపైకి లంఘించగా,మహామాత అతడి శిరస్సు కూడా అనాయాసంగానే ఖండించినది.నాటి నుంచే ఆమెకు 'చాముండ'అని లోక విఖ్యాతి కలిగింది.
(సప్తమాద్యాయం సమాప్తం)


దుర్గాసప్తశతి అష్టమాధ్యాయము.


మూల శ్లోక స్తోత్రం


1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే/
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే//
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే/ శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే//
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః//
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః


దుర్గాసప్తశతి సుమేధా మహర్షి దేవీ శౌర్య విజృంభణ గాధలను తెల్పుతూ అన్నాడు.".....ఈప్రకారం చండ ముండాసరులు మరణించటంతో శుంభదానవుడి కోపం రెట్టింపై ఎక్కడెక్కడి దానవ వీరులను సమీకరించి ఆమెపై యుద్దానికి నియోగించాడు.
అది చూసిన కాళిక మహాకుపిత నేత్ర అయి,వింటినారి సారించింది.ఆ ధనుష్టంకారం,ఆమె వాహనమైన సింహగర్జనలు మిళితమై అంబరం అంటాయి.కాళి గర్జనలు విని,అసురసైన్యాలు రోషావేశాన నలు దిక్కులనుంచీ ఆమెను చుట్టుముట్టాయి.దేవతలందరి శక్తులు దేవివైపు సమకూడాయి.కమండల,అక్షమాలాదులు దరించి,హంసనెక్కి బ్రహ్మశక్తి బ్రాహ్మణి ప్రప్రధమంగా రణరంగంలో పదార్పణం చేసింది.త్రిశూలపాణియై వషభారూఢయై,అర్థచంద్రుని మౌళిసీమలో దరించి,సర్పవలయాలంకృత మహేశ్వరీ,శక్తిని చేత దరించి మయూరాధిరూఢురాలైన కౌమారీశక్తి,శంఖ చక్ర గదా ధనస్సులను దరించి గరుడవాహనరూఢయై వైష్ణవీశక్తి,యజ్ఞవరాహమూర్తి శక్తి వారాహీరూపంలోనూ,అదేవిదంగా నారసింహ,గజా రూఢురాలై వజ్రాయుదంతో ఇంద్రశక్తి ప్రవేశించాయి.సమస్త శక్తులతో పరివేష్టింపబడిన పరమ శివదేవుడు చండీదేవితో"మహాదేవీ! శీఘ్రమే ఈ రక్కసులను అంతం చేసి మాకు సుఖ సంతోష శాంతులను ప్రసాదిమ్చు" అన్నాడు . అలా పరమశివుడు పలికే పలుకులు ఆల్కిస్తుండగానే చండిక దివ్య దేహం మహత్తరమైన శక్తి రూపాన్ని దాల్చి నిలిచింది.తద్రూపం అతి భయంకరంగా ఉంది.దానితో బాటు అసంఖ్యాకంగా శైవీగుణాలు అవతరించాయి.అవన్నీ భీకరాట్టహాసాలు చెయ్యసాగాయి.చండిక శరీరం నుండి ప్రాదుర్బవించిన ఆ మహాశక్తి పరమశివుణ్ణి పిలిచి "సదాశివా! నువ్వు వెంటనే శుంభ నిశుంభులను చేరి నా మాటలుగా ఇలా వినిపించు.శివదౌత్యం:శుంభ నిశుంభులారా!బల మద గర్వోన్మత్తులైన రాక్షసాదములారా!దేవతలనుండి మీరు అపహరించిన అధికారాలను తిరిగి వారికి ఒప్పగించి పాతాళం చేరండి.లేదా మదోన్మతులై యుద్దం చేసి తీరాలంటారా!మీ రక్తమాంసాదులను మా శైవీ గణాలు భక్షించి తీరుతాయి "(శివుణ్ణి దూతగా పంపడం వల్ల జననికి" శివదూతి" నామం ప్రఖ్యాతమైంది.)మహేశ్వరి వచనాలను సదాశివుని ద్వారా ఆలకించిన శుంభ నిశుంభులూ,సైన్యాదిపతులూ,క్రోద దంద్యమానులై యుద్దేచ్చతో పరదేవతా సమక్షానికి వచ్చారు. యుద్దం.
వస్తూనే బాణ వర్షం కురిపించసాగారు.మహామాత ఆ రాక్షసులు ప్రయోగించిన బాణ,చక్ర,శూల,కుఠార సమూహాన్ని నిశిత శర ప్రయోగంతోనే దగ్దం చేసింది.మహాకాళి శూల ప్రహారాలతో రాక్షస సేనలను చీల్చి చెండాడుతోది.ఖట్వాంగంతో మర్దించి వేస్తున్నది.బ్రాహ్మణీ శక్తి సర్వే సర్వత్రా వీర విహారం చేస్తూ కమండలు జలాలతో వైరి సైన్యాలను తేజోహీనం చేస్తున్నది.త్రిశూలంతో మహేశ్వరి,చక్రంతో వైష్ణవీ,శక్తితో కార్తికేయీ,రాక్షస సమూహాలను అంతం చేస్తున్నారు. వజ్రాయుధంతో ఇంద్రశక్తి,కోరలతో వారాహీదేవతసింహనాదాలతో నారసింహశక్తి దిశాంతాలను ప్రతిద్వనింపజేస్తూ గోళ్ళతో చీల్చి కొందరినీ,భక్షించి మరికొందరిని మట్టుపెట్టేస్తున్నారు.శివదూతి వికటభయంకరాట్టహాసంతో వైరివీరులను భూపతి పతులను జేస్తూ కబళించి వేస్తున్నది.అనేకోపాయాలతో మాతృగణాలు దానవ సైన్యాలను సంహరిస్తుంటే సేనా నాయకులు పలాయనం చిత్తగిస్తున్నారు.
రక్తబీజ సంహారం
వారలా పారిపోవడం చూసిన రక్తబీజాసురుడనేవాడు క్రోదోన్మత్తుడై యుద్దం చెయ్యసాగాడు.తత్సమయంలో,గాయపడిన వాని శరీరం నుండి కారిన ప్రతి రక్తపు చుక్క నుండి ఒక్కొక్క సైనికుడు పుట్టుకువస్తున్నాడు.రక్తబీజాసురుడు గదా పాణియై ఇంద్రాణీశక్తిని ఎదుర్కొన్నాడు.ఆ మహాశక్తి వానిపై ప్రయోగించిన వజ్రఘాతంతో ఆ బలోన్మత్తుని దేహం నుండి ధారాపాతంగా రక్తం స్రవిస్తుంటే అసంఖ్యాకంగా రాక్షసులు అవతరించారు.వాని ప్రతి రక్తపు చుక్క నుండి వానితో సమానమైన బల పరాక్రమాలు గల వీరులు ఉత్పన్నం కాసాగారు.అలా పుట్టిన వారందరూ ఆయుదాలు దరించి శక్తి సేనలతో పోరాడసాగారు.అనంతరం ఐంద్రీశక్తీ వజ్రప్రయోగంతోనూ,వైష్ణవి చక్రప్రహారంతోనూ,కౌమురీ,వారాహీ,మహేశ్వరీ శక్తులు తమ తమ ఆయుదాలతో రక్తభీజునిపై విజృంభించారు.దేవతలీ వింత దృశ్యం గాంచి భీత చేతస్కులైనారు.,రక్తపు బొట్టు కొక్కరుగా పుట్టుకొస్తున్న దానవులతో రణభూమి క్రిక్కిరిసిపోయింది.
"కాళీ!వినుము!ఈ రక్తబీజుడు సార్ధకనామదేయుడు.ఇతడి రక్తమును ఎప్పటికప్పుడు త్రాగుతూ ఉండకపోతే,స్రవించే ప్రతి రక్తపు బొట్టుబీజమై కొత్త రక్కసులు ఉత్పన్నమవుతారు.అట్లు కాకూడదనుకుంటే,ఇతడి రక్తన్ని త్రాగేస్తూ,రక్షక్షయం చేయడం ద్వారా ఈ దానవ మూకను అరికట్టవచ్చు.!"అంది అశరీరవాణి.తక్షణం చాముండి ఆ సూచనను పాటించింది. వివిద ఆయుద ప్రయోగాలవల్ల రక్తబీజుని శరీరం నుంచి స్రవించే రక్తాన్ని ఎంత మాత్రం వృధాపోనివ్వలేదు. ఫలితం-రక్తబీజుని మరణం.ఆ దానవుడు నేలకూలగానే దేవతలు పుష్పవృష్టిని కురిపించారు . రక్తపానామహోద్రేకాన చండిక ఆనంద తాండవమాడింది.
(అష్టమాద్యాయం సమాప్తం)


దుర్గాసప్తశతి నవమాద్యాయము.


మూల శ్లోక స్తోత్రం


1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే/
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే//
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే/ శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే//
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః//
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః


నిశంభువధ
మేధా మునీంద్రుడు జగన్మాత మహత్మ్యాన్ని కొనసాగిస్తున్నాడు.రక్తబీజుడంతటి వాడు నేల కూలడంతో శుంభ నిశుంభులు కుపితులై ఇక తామే యుద్ద రంగానికి తరలి వెళ్ళారు.దేవీ వారితో తలపడింది.డాల్కత్తులు కోల్పోయాడు నిశుంభుడు.వెంటనే శక్తి ఆయుదం ప్రయోగించాడు.శ్రీమాత చక్రాయుదంతో రెండు ముక్కలు చేసింది.అనంతరం శూలాయుద,గదాయుదాల్ని ప్రయోగించిన నిశుంభుడు,దేవీ ప్రయోగించిన దివ్యాయుదాల వల్ల తుత్తునియలు అయ్యాయి.
అనంతరం ఆ బలోన్మత్త దానవుడు పరశువుతో దండెత్తాడు.నిశిత బాణంతో దేవి వాని పరుశువును ఖండిస్తూనే నేల కూల్చింది.పరాక్రమోపేతుడైన సోదర నిశుంభుడు నేల కూలడం చూసి శంభుని క్రోథం ద్విగుణీకృతమైంది.వాడు ఘోరాట్టహాసం చేస్తూ అంబికను అంతం చేసే సంకల్పంతో మహారథారూఢుడై,వివిధాయుధాలచే అలంకరింపబడిన అష్టబాహువులతో పురోగమిస్తున్నాడు.వాని కాయం మహా విశాలంగా ఆకాశాన్ని ఆవరించి ఉంది.వాని రాకను గమనిస్తూ జగజ్జనని శంఖాన్ని పూరిస్తూనే దునుష్టంకారం చేసింది.ఘంటారావంతో దిశాంతాలను దద్దరిల్ల జేసింది.ఆ ద్వనిశ్రవణ మాత్రం చేతనే రాక్షస సైన్యాలన్నీ నిస్తేజమై పోతున్నాయి.ఆ ద్వనులను విన్న అమ్మ వాహనమైన సింహం తన భయంకర ఘర్జనలతో భూనభోంత రాళాలను,దిశా సర్వస్వాన్ని ప్రతిద్వనింపజేసింది.ఆ సింహగర్జనలతో మత్తేబాల మదం వదిలిపోయింది.
అనంతరం మహాకాళి ఆకాశానికెగిరి భూమండలాన్ని దద్దరిల్లజేసింది.క్షణం వరకూ దశదిశలా వ్యాపించిన దనుష్టంకార సింహగర్జనలు,అన్ని ఆ భయంకర నాదంలో మిళితమై అంతర్నిహితమై పోయాయి.శివదూతి శత్రువులందరికీ అశుభాన్ని కలిగించేటట్లు వికటాట్టహాసం చేసింది.అ వికటాట్టహాసాలకు భయకంపితులైన రాక్షసులను చూసి శుంభదానవుడు క్రోధ తామ్రాక్షుడయ్యాడు.అంత,అంబిక శుంభునితో "శుంభా!నిలు నిలు"అంటూ గర్జిస్తుంటే దేవతలు ఆకాశమార్గంలో నిలచి "జయ జయ"నినాదాలు చేసారు.
శుంభదానవుడు అంబ మీద శక్త్యాయుదాన్ని విసిరాడు.పదునైన దాని శిఖ ప్రజ్వలితాగ్నిలా వుంది.తన వైపునకు వచ్చి పడబొతున్న ఆ శక్తిని దేవి మహోల్కాశక్తితో భిన్నం చేసింది.అది చూసి సహించలేక ఆ కౄరదానవుడు ముల్లోకాలూ ప్రతిద్వనించేలా సింహనాదం చేసాడు.ఆ సింహనాదం ప్రతిద్వనించి తత్పూర్వ నాదసర్వస్వాన్నీ అణిచివేసింది. నిశుంభుడు అపార సేనాపరివేష్టితుడై గదాపాణియై చండికను సంహరించే సంకల్పంతో దెవి మీదకు లంఘించాడు.తన మీదకు విరుచుకుపడుతూ వస్తూన్న శుంభ ప్రయుక్తమైన గదను దేవి ఖడ్గదారతో ఖండించింది.దానితో నిశుంభుడు శూలాస్త్రంతో లంఘించాడు.అలా వస్తూన్న నిశుంభుని హృదయానికి గురిచూసి దేవి శూలాన్ని ప్రయోగించింది.దానితో నిశుంభుని హృదయం నుండి మహాబలశాలియైన మరో రాక్షసుడు లేస్తూ"నిలు నిలు"అన్నాడు.దేవి సవిలాసవదనయై ఆ దురాత్ముని శిరస్సును,ఖడ్గంతో ఖండించి నేలపాలు చేసింది.భయంకర ఘర్జనలు చేస్తూ సింహం రాక్షసుల కుత్తుకలను కొరికి భక్షించసాగింది.మిగిలిన సైన్యాలను కాళీ శివదూతికలు నమిలి మ్రింగివేస్తున్నారు.కౌమారీశక్తీ ప్రయోగానికి దానవులు పలాయనం చిత్తగించారు.పవిత్ర మంత్ర జలాలతో బ్రాహ్మీ శక్తి అనేకులను పారద్రోలింది.త్రిశూలంతో వైరివీరుల వక్షః స్థలాలను విదీర్ణం చేస్తూ స్వైర విహారం చేసింది.తుండాఘాతంతో వారాహీదేవి అనేక మంది రాక్షసులను యమసదనం చేరుస్తూంది.వైష్ణవి చక్ర ప్రయోగంతో అనేకమంది దైత్యుల మస్తకాలను ఖండించింది. అది చూసి,అసంఖ్యాకులు రణ స్థలం నుండి పలాయనం చిత్తగించారు.విశేష సంఖ్యలో రాక్షసులు-కాళి,శివదూతి,సింహాదులు ద్వారా భక్షించబడినారు.
(నవమాద్యాయం సమాప్తం)


దుర్గాసప్తశతి దశమాధ్యాయము


మూల శ్లోక స్తోత్రం


1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే/
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే//
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే/ శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే//
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః//
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః


మేధాఋషి చెప్పుచున్నాడు:
. ప్రాణ సమానుడైన సోదరుని మరణంతో,రెట్టించిన క్రోధావేశాలతో శుంభుడు"దుర్గా!నీవు సామాన్యురాలివి-సుందరాంగివి అనుకున్నాను.నీవు దుర్మార్గురాలివి.ఈ దైవశక్తులన్నీ కూడగట్టుకోకుంటే,నిన్ను ఎంత?చిటికెలో నేలకూల్చేవాడిని " అంటూ భీకరంగా పలికాడు.అంబ పెద్దపెట్టున హసించి "ఓరీ దురాత్మా!నన్ను తెలుసుకొనుట నీ తరమా?ఈ బ్రాహ్మణి,వైష్ణవి,వారాహి తదితర శక్తులన్నీ వేర్వేరు అనుకుంటున్నావా?చూడు!"అంటుండగానే ఆ శక్తులన్నీ అంబికలో లీనమైపోయాయి."నేనే రకరకాల రూపాల్లో యుద్దంచేసాను.ఇప్పుడు నేనొక్కతినే!చేవ ఉంటే సిద్దం కమ్ము "అని రెచ్చగొట్టింది. ఇద్దరికీ పోరు భీకరమైంది.శుంభుడు దేవీ అస్త్రాల్ని ప్రత్యాస్త్రాలతో మార్గంమద్యలోనే ఖండించేస్తున్నాడు . శుంభదానవ ప్రయుక్తమైన అస్త్రాలన్నింటినీ జగన్మాత సునాయాసంగానే ఖండించి వేస్తోంది.ఆ తరువాత రాక్షసరాజు శక్త్యస్త్రాన్ని దరించాడు.శ్రీ మహాదేవి ఆ శక్తిని చక్రాయుదంతో వాని చేతిలో ఉండగానే విచ్చిన్నం చేసింది. ఖడ్గాద్యాయుదాలను కోల్పోయిన ఆ కౄరాసురుడు చండికా సంహారేచ్చతో ముద్గరాయుదాన్ని చేబూనాడు.నిశిత శరంతో దేవి దానిని కూడా ఖండించింది.దానితో వాయు వేగంతో అంబను సమీపించి ఆమె హృదయస్థానంలో ముష్టి ప్రహారం చేసాడు.
శుంభాసుర సంహారం
వెంటనే కుపిత నేత్రియై మహాశక్తితలా ఘాతంతో వానిని నేల కూల్చింది.ఐనా వాడు క్షణంలో లేచి దేవిని ఎత్తిపట్టి అంబర మార్గంలోనికి ఎగిరాడు.నిరాదారయై కూడా దేవి వానితో పోరుతూనే వుంది.ఆకాశంలోనే ఇరువురిమద్యా ముష్టి యుద్దం కొనసాగింది.ఆ దృశ్యం,దేవ,సిద్దాదులందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.విశేషసమయం పోరాడిన తరువాత అంబ శుంభుని పైకెత్తి నేలనేసి బలంగా కొట్టింది.నేల కూలిన శుంభుడు ముష్టిని బందించి దేవి మిదకు లంఘించాడు.తనకు చాలా దగ్గరగా వచ్చిన శుంభాసురుని వక్షస్థలాన్ని మహాశక్తి శూలంతో చీల్చివేసి ప్రాణశూన్యుణ్ణి చేసింది.శుంభుడు నేలకూలాడు.అలా ఆ మహాకాయుడు పడడంతో,సప్తకులాచల ద్వీప పరివృతమైన భూతలమంతా కంపించింది.ఆ దురాత్ముని మరణానికి అందరూ ఆనందించారు.వికార రహితమై విశ్వం శాంతించగా:ఆకాశం నిర్మలమైంది.మేఘాల ఉల్కాపాత రహితాలై అరిష్ట సూచకభవాలను త్యజించాయి.దేవతల ముఖారవిందాలలో ఆనందం తాండవించసాగింది. గందర్వులు మదురగీతాలను ఆలపించారు.
(దశమాద్యాయం సమాప్తం)


దుర్గాసప్తశతి ఏకదశా ధ్యాయము


మూల శ్లోక స్తోత్రం


1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే/
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే//
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే/ శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే//
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః//
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః


దుర్గాసప్తశతి మేధా మహర్షి ఇలా రాక్షస మహారాజు శుంభుని గర్వాపహారగాధ చెప్పి-అనంతరం దేవతాది అష్టదిక్పాలురు దేవిని స్తుతించిన స్తోత్రం గురించి చెప్పసాగాడు."అగ్ని దేవుని ముందిండుకొని,ఇంద్రాది దేవతలు కాత్యాయనీ దేవిని స్తుతించారు.
దేవ్యా హతే తత్ర మహాసురేన్ద్రే సేన్ద్రాః సురావహ్ని పురోగమాస్తాం
కాత్యాయనీం తుష్టువురిష్టలాభా-ద్వికాసివక్త్రాబ్జ వికాసితాశాః
దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద ప్రసీదమాతోర్జగతో-ఖిలస్య
ప్రసీద విశ్వేశ్వరీ పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య
ఆథారభూతా జగత స్త్వమేకా మహీస్వరూపేణ యతః స్థితాసి
అపాంస్వరూప స్థితయాత్వయైతత్ అప్యాయతే కృత్స్నమలజ్ఘ్యవీర్యే
త్వం వైష్ణవీ శక్తి రనన్త వీర్యా విశ్వస్య బీజం పరమాసి మాయా
సమ్మోహితం దేవి సమస్తమేతత్వం వైప్రసన్నా భువిముక్తిహేతుః
విద్యాః సమస్తాస్తవ దేవి భేధాః స్త్రియః సమస్తాః సకలాజగత్సు
త్వయైకయా పూరితమమ్బయైతత్ కాతేస్తుతిః స్తవ్యపరాపరోక్తిః
సర్వభూతా యదా దేవీ భుక్తిముక్తి ప్రదాయినీ
త్వం స్తుతా స్తుతయే కవా భవస్తు పరమోక్తయః
సర్వస్య బుద్దిరూపేణ జనస్య హృది సంస్థితే
స్వర్గాపవర్గదే దేవీ నారాయణి నమో-స్తుతే.
కాలకాష్టాదిరూపేణ పరిణామప్రదాయనీ
విశ్వస్యోపరతౌ శక్తే నారాయణీ నమో-స్తుతే.
లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్దే స్వదేద్రువే
మహారాత్రీ మహామాయే నారాయణి నమో-స్తుతే
మేదే సరస్వతి వరే భూతి బాభ్రవి తామసి
నియతే త్వం ప్రసీదేశే నారాయణీ నమో-స్తుతే.
సర్వ స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయోభ్య స్త్రాహినో దేవీ దుర్గే దేవి నమో-స్తుతే
ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం
పాతు నః సర్వభూతేభ్యః కాత్యాయని నమో-స్తుతే
జ్వాలాకరాళమత్యుగ్రమశేషాసుర సూదనం
త్రిశూలం పాతు నో భీతేర్భద్రకాళి నమో-స్తుతే
దేవి ప్రసీద పరిపాలయ నో-రిభీతే
ర్నిత్యం యథాసుర వధాదధునైవ సద్యః
పాపాని సర్వజగతాం ప్రథమం నయాశు
ఉత్పాతపకజనితాంశ్చ మహోపసర్గాన్
ప్రణతానాం ప్రసీద త్వం దేవి విశ్వార్తిహారిణి
త్రైలోక్యవాసినామీడ్యే లోకానాం వరదా భవ.
ఓం దేవ్యువాచ:
వరదాహం సురగణా వరం యన్మనసేచ్చథ
తం వృణుధ్వం ప్రయచ్చామి జగతాపకారకమ్
నిన్ను స్తుతించే సామర్థ్యం కానీ సమర్ధవంతమైన శబ్దజాలం కాని మా వద్ద లేవు అమ్మా!నారాయణీ!బుద్ది రూపంలో నువ్వు సర్వుల హృదయాలలోనూ భాసిల్లుతూ ఉంటావు.మాతా!స్వరాపవర్గాలను ప్రసాదిమ్చే జననీ!నీకు వందనాలు .కళాకాష్ఠాదిగాగల కాలస్వరూపంతో నువ్వు విశ్వ పరిణామాన్ని నిర్దారిస్తుంటావు.నీ ప్రేరణ వల్లనే అనుక్షణం ఈ విశ్వం పరిణామ పరిగణలను చెందుతూ వుంటుంది.నువ్వు మాత్రమే ఇటువంటి విచిత్ర కార్యాలు చెయ్యగల సమర్థురాలవు. నారాయణీ!నీకు ప్రణామాలు.సమస్త శుభాలకు మూలకారిణివి నువ్వే .కళ్యాణ స్వరూపరాలవూ,సమస్త సిద్దులనూ ప్రసాదిమ్చే దానవూ నువ్వే.శరణాగత త్రాణ బిరుదలాంచనా తీతవూ,గౌరీదేవివీ నువ్వే.అట్టి నీకు నమోవాకాలు. నిత్య స్వరూపులారా!సృష్టిస్థితి సంహారకారిణీ!గుణాశ్రయదాతవూ గుణమణివీ అయిన నారాయణీ దేవీ!నీకు అంజలులు. మాతా!నీవు శరణాగత వత్సలవు.సమస్త దుఃఖ వినాశినివి.నీకివే మా ప్రణతులు.హంసవాహ నారూఢురాలవై కుశకాష్టంతో అభిమంత్రిత జలాలను జల్లే బ్రహ్మరూపిణీ!నీ కివే మా వందనాలు. త్రిశూల, అర్ధ, చంద్ర, నాగవలయాలను దరించి మహావృషభా రూఢవైన మహేశ్వరీదేవీ!నీకివే మా ప్రణామాలు,మయూర కుక్కుట పరివేష్టితమైన మహత్తర శక్తిదారణివైన కౌమరీదేవీ!కార్తికేయ శక్తి స్వరూపిణీ!నారాయణీ!శ్రీదేవీ!నీకు అనేక నమస్కారములు. శంఖ, చక్ర, గదా, శార్గపాణి వైన వైష్ణవీ దేవీ!సుప్రసన్న వదనా!ఇవే నీకు మా వందనాలు.వరహ స్వరూపంతో అత్య్గ్రచక్రాన్ని దరించిన నువ్వే దంతాగ్ర భాగాన భూమిని దరించినావు.హే వారాహీ!శివే!నారాయణీ!నీకు నమస్కారములు.భీకర నారసింహ రూపన్ని దాల్చి రాక్షస సంహార కార్యంలో నిమగ్నురాలవైన నువ్వే జగత్రయాన్నీ సంరక్షించగల నారాయణీదేవివి.నీకు వందనాలు) తనను స్తుతించిన దేవతల పట్ల సంప్రీతురాలై,దేవి వారికి ఈ విదంగా వరాన్ని అనుగ్రహించింది. "దేవతలారా వైవస్వత మన్వంతరంలో 28వ ద్వాపరయుగంలో నేను నందగోపుని గృహంలో యశోదాగర్భంలో ప్రాదుర్భవించి వింద్యాచల నివాసినినై దుష్ట సంహారం చేస్తాను.అనంతరం భయంకర రూపదారిణినై భూమండలం మీద అవతరించిన వైప్రచిత్త నామకాసురులను సంహరిస్తాను.వారిని భక్షించిన నా దంతాలు అరుణారుణాలై దానిమ్మ గింజలవలే ప్రకాశిస్తూంటాయి. స్వర్గంలోని దేవతలూ భూతలమందలి మానవులూ నన్ను"రక్తదంతిక"నామంతో వ్యవహరిస్తారు.అనంతరం నూరు సంవత్సరాల వరకూ అనావృష్టి వల్ల పృద్వి జలశూన్యమై పోతుంది.అప్పుడు సర్వులూ నన్ను స్తుతిస్తారు.ఆ క్షణంలో నేను అయోనిజనై అవతరిస్తాను.నేను సతనేత్రాలతో మహర్షుల్ని కరుణ చూస్తాను.అప్పుడు అందరూ నన్ను "శతాక్షి"అని పిలుస్తారు.అనంతరం"అరుణ"నామక రాక్షసుడు జగత్రయవాసులను వేదిస్తుంటే షట్పద భ్రమర స్వరూపిణినై ఆ రాక్షసుడ్ని అంతం చెయ్యడం వల్ల "భ్రామరీ"నామంతో అందరూ నన్ను పిలుస్తారు.ఈ విదంగా అసురులు వల్ల సంకటాలు ఏర్పడినప్పుడల్లా నేను ఆవిర్భవించి శత్రువుల నంతం చేస్తుంటాను.".
(ఏకాదశాధ్యాయం సమాప్తం)


దుర్గాసప్తశతి ద్వాదశా ధ్యాయము


మూల శ్లోక స్తోత్రం


1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే/
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే//
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే/ శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే//
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః//
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః


సర్వలోక ప్రజానీకానికి శ్రీదేవి వరప్రదానము-మరియు ఫలశ్రుతి
అమ్మవారు చెబుతున్నారు."సంయమన చిత్తంతో ఈ స్తుతుల ద్వారా నన్ను స్తోత్రం చేసిన వారికి భాదలన్నింటినీ పోగొడతాను.మహిషాసుర,మధుకైటభసంహార ఘట్టాలను కీర్తించినా-అష్టమీ,చతుర్ధశీ,నవమీ తిథులలో భక్తిశ్రద్దలతో ఈ గాధలను చదివినా,విన్నా పాపదూరులూ,భయ దూరులూ అవుతారు.బంధు భాందవ వియోగం సంభవించదు.అట్టి వారికి శత్రు,దస్యు,రాజ భయాలుండవు.అగ్ని,జల అస్త్రాదులవల్ల వారికి ఎట్టి ఆపదా కలుగదు.ఈ చరిత్ర పరమ పవిత్రమైనది.శుద్ద హృదయంతో శ్రద్దాభక్తి భావాలతో దీనిని చదివినా,విన్నా మహామారీజనితమైన వివిధమైన ఈతి భాదలూ,ఆధ్యాత్మిక అధిదైవిక,ఆధి భౌతికాలనే తాపత్రయాలు నశిస్తాయి.ఈ గాధ కీర్తించబడే గృహాన్ని నేనెన్నడూ విడనాడను.సదా అక్కడ నివసిస్తాను.
పూజ,జప,హోమ,బలి,యజ్ఞ,దానాది సమయాలలోనూ-మహోత్సవ సమయాలలోను దీనిని పారాయణ చెయ్యాలి. పఠన మాత్రం చేతనే భూతపిశాచ రాక్షసాదులు పలాయనం చిత్తగిస్తాయి.విశేష వర్ణన మేల?దీనిని పారాయణ చేసినవారు నా సాన్నిద్యాన్ని చేరుతారు.దూప,దీప,అర్ఘ్య,పుష్ప గంధాదులతో పూజించి-పశుబలులనిచ్చి,బ్రాహ్మణ భోజన,హోమాభిషేక సామాగ్రి భోజన ద్రవ్యాదుల్ని అర్పిస్తూ ఓ సంవత్సరకాలం నన్ను ఆరాధించే వారికి ప్రసాదించే ఫలితాన్ని కేవలం ఈ గాధను పఠించేవారికి ,అలంకరించేవారికీ అనుగ్రహిస్తాను.
శారదానవరాత్రులలోనూ,నన్ను గురించి చేసే విశేష పూజా సమయాలలోనూ,భక్తితో నా ఈ చరిత్రను వినేవారికి దుఃఖాల నన్నింటినీ దూరం చేసి ధన ధాన్య పుత్రాదులను ప్రసాదిస్తాను.మదీయ మత్మ్య,ప్రాదుర్భావ,రణరంగ సంభందమైన గాదలను విన్నవారికి భయాలు దూరమౌతాయి.అట్టిశ్రోతల వంశాలు అభివృద్ది చెందుతాయి."
ప్రచండ పరాక్రమాన్వితమైన చండికాదేవి ఇలా పలికి అమరులందరూ తిలకిస్తుండగానే అంతర్ధానమైంది.దేవతలు స్వస్థాలకు మరిలిరి.భయరహితులై స్వాధికారాన్ని కైవసం చేసుకున్నారు.తమ తమ యాగ భాగాలను దేవతలు స్వీకరించడంతో రాక్షసులు పాతాళానికి పారిపోయారు.
ఓ సురధ మహారాజా!ఈ రీతిగా భగవతి యగు పరమేశ్వరి నిత్య అయ్యును.జగత్పరిపాలనకై మళ్ళీ మళ్ళీ అవతరించింది.ఆ విశ్వమోహిని ఈ బ్రహ్మాండ మందంతటను లెస్సగా వ్యాపించి ఉంది.కనుకనే ఆమెని' నిత్య' అంటారు. ఆపరమేశ్వరి సంస్తవనీయురాలు.త్రిలోక పూజ్యురాలు.ఆ మహామాతయే మానవులకు మంచికాలము కలిసి వస్తే శ్రీమహాలక్ష్మిగాను -చెడుకాలం వస్తే జ్యేష్టాదేవిగాను ప్రేరేపించగల సమర్ధురాలు.నిజభక్తులకు సద్బుద్ది నొసగి ధర్మ కార్యములందు నిమగ్నులను చేయగలదు"అన్నాడు మేధాముని.
(ద్వాదశాధ్యాయం సమాప్తం)


దుర్గాసప్తశతి త్రయోదశా ధ్యాయము


మూల శ్లోక స్తోత్రం


1.శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే/
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే//
2.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే/
శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే//
3.సర్వబాదా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః//
ఓం నమశ్చండికాంబికాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః


దేవీ అనుగ్రహానికి సురధ,సమాధి తపస్సు
రాజ్యం కోల్పోయిన సురధ మహారాజూ,మోహావేశముల చేత బందీ అయిన వైశ్యప్రముఖుడు సమాధీ....ఇద్దరూ కూడా మేధామహాముని వినిపించిన దేవీ మహాత్మ్యగాధలను శ్రద్ధా భక్తులతో ఆలకించారు.
ఆ మహామునికి నమస్కరించి,తపస్సు కోసం బయల్దేరారు.పవిత్రమైన నదీ తీరన్ని చేరుకొని-జగజ్జనని దర్శించాలన్న మహా సంకల్పంతో యధావిధిగా ఆశీనులై దేవీ సూక్తాన్ని జపిస్తూ ముందుగా మృణ్మయమైన శ్రీదేవీ విగ్రహాన్ని చేసి,పుష్ప,దూప,హోమాదులతో అర్చించారు.
ఒకప్పుడు ఆహారం ఏమీ లేకుండాను,మరొకప్పుడు కందమూల ఫలాదులను స్వీకరించి,ఇంద్రియాలను అదుపులో ఉంచి,తమ చిత్తాన్ని భగవతి చరణారవిందాలయందు లగ్నం చేసి,స్వశరీర రుధిరాన్ని బలిదానం చేసి తపస్సు చెయ్యసాగారు.అలా మూడేళ్ళు గడిచాయి.వారి తపస్సు ఫలించింది.
శ్రీదేవీ సాక్షాత్కారం వరప్రదారం
జగద్దాత్రి చండికాదేవి ప్రసన్నయై ప్రత్యక్షమై "భక్తులారా!మీ తపస్సుకు నేను సంతసించాను.అభీష్ట వరాలను ప్రసాదిస్తాను.కోరుకోండి"అనగా సురథుడు"అమ్మా!జన్మ జన్మాంతర పర్యంతం పోని రాజ్యాధికారాన్ని శత్రురహితమైన రాజ్యాన్ని ప్రసాదించు"అని కోరగా-సమాది ప్రాపంచిక విషయ సర్వస్వ మందూ విరకుడై"అమ్మా!దేహ గేహ పుత్రాదుల యందలి మోహన్ని సర్వనాశనం చేయగల జ్ఞానాన్ని ప్రసాదించు."అని అర్థించాడు.
వారి ప్రార్థనలను మన్నించి పరమేశ్వరి "రాజా!నీ అభీష్టం శీఘ్రమే సిద్దిస్తుంది.రాజ్యం ప్రాప్తిస్తుంది.ఆటంకం లేకుండా రాజ్యభోగాలను అనుభవిస్తావు.దేహ త్యాగానంతరం సూర్యదేవుని ద్వారా జన్మించి 'సావర్ణి'అనే పేరు గల మనువుగా ఖ్యాతి చెందుతావు.సమాధి వైశ్యా!నీవు అవశ్యం ఆత్మజ్ఞానాన్ని పొందగలవు"అంటూ వరాలిచ్చి అంతర్థానమై పోయింది. ఆ విధంగా రాజశ్రేష్టుడైన సురథుడు దేవీ వర ప్రసాదానుసారం అనంతరజన్మలో భాస్కరుని వల్ల ప్రభవించి సావర్ణి మనువుగా విశేషఖ్యాతి చెందాడు.
సావర్ణి ర్షవితా మనుః క్లీం ఓం
(త్రయోదశాధ్యాయం సమాప్తం)

Powered By Blogger | Template Created By Lord HTML