ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 2 June 2015

పృధ్వీరాజ్ చౌహాన్ పేరు తెలియని దేశభక్తుడు ఉండడని నా అభిప్రాయం

పృధ్వీరాజ్ చౌహాన్ పేరు తెలియని దేశభక్తుడు ఉండడని నా అభిప్రాయం. అత్యంత ప్రతిభాశాలి అయిన మహావీరుడు ఆయన. నిజానికి ఆయన మాత్రమే కాక రాజపుత్ర వంశస్థులంతా మన దేశ రక్షణ కోసం గొప్ప త్యాగాలు చేసారు.
అయితే అతి నిజాయితీ, అతి ఔదార్యం కారణంగా 14 సార్లు ఓడిపోయిన శత్రువుకు ప్రాణభిక్ష పెట్టి, కేవలం ఒకే ఒక్కసారి అదే శత్రువు చేతిలో ఓడిపోయిన పాపానికి ప్రాణాలు కోల్పోయిన అభాగ్య వీరుడు.
బంధించి ఆఫ్ఘన్ కు తీసుకెళ్ళిన గజనీ కొంతకాలం తర్వాత అతన్ని అక్కడ వధించాడంటారు. అయితే నిజానికి గజనీ పృధ్వీరాజ్ కు కళ్ళు పీకించి బందీగా ఉంచాడని, శబ్ద భేది విద్యలో అద్భుతమైన ప్రతిభ గల పృధ్వీరాజ్ ని ఒక వేడుకలో తన విద్య ప్రదర్శించమని గజనీ అడగ్గా, తన మంత్రి సాయంతో పృధ్వీరాజ్ బాణం వేసి గజనీని చంపాడని ప్రచారంలో ఉంది.
ఇక ఈ ఫోటో లో విశేషం ఏమిటంటే ఇక్కడ కన్పించే సమాధి ఆప్ఘనిస్తాన్ లోని అలనాటి ఆ మహా వీరుడు """" పృధ్వీరాజ్ చౌహాన్ ది"""".
జౌహార్ పృధ్వీరాజ్ మహారాజ్.




No comments:

Powered By Blogger | Template Created By Lord HTML