గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 4 June 2015

ద్వాదశ రాశులు - అనారోగ్యాలు - జాగ్రత్తలుద్వాదశ రాశులు - అనారోగ్యాలు - జాగ్రత్తలు

సాధరణంగా అనారోగ్యాలు పన్నెండు రాశుల వారికి వేరు వేరు విధంగా వుంటాయి. అవి రాకముందే కొన్ని రకాలైన జాగ్రత్తలు పాటించి ప్రయోజనం పొంవచ్చు. అసలు ఏయే రాశుల వారికి ఎలాంటి అనారోగ్యాలు సూచింపబడుతున్నాయి. జోతిష్యశాస్త్ర రీత్యా! అలాగే వారు ఎలాంటి ఆహరం తీసుకొని, ఎలాంటి మందులు వాడి చక్కని ఫలితాలు పొందవచ్చు అన్నది చూద్దామా ?

ప్రతి వ్యక్తి, వ్యాధి నిరోధక శక్తి పెంచు కోవడం అత్యవసరం. తనకు గల లోపాలను తన రాశి బట్టి జన్మకుండలిని బట్టీ, గ్రహస్థితిని బట్టీ, గోచార ఫలితాలను బట్టీ... లగ్న, షష్టి, అష్టమ భావాలను బట్టీ సంపూర్ణంగా గ్రహించి వాటిని పరిష్కరించు కునే అవకాశాలు అధికం చేసుకోవాలి. అలా రాబోయే లోపాలను, సమస్యలను, ఇబ్బందు లను... ఆయా సమయాలను గుర్తించి చెప్పెది జోతిశ్యాస్త్రం. చక్కని ఉపాయాలను, పరిష్కా రాలను, పరిహాలను, జాగ్రత్తలను మంచి జ్యో తిష్కుని ద్వారా తెలుసుకొని అవి ఆచరించి సత్పలితాలను సాధించడం శ్రేయస్కరం ఆనందవరం.
మేషాది మీన రాశులతో జన్మించిన వారికి ఈ రకమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం వుంది అనీ చెప్పటం జరిగింది కానీ అన్నిరకా లు అందరికీ వస్తాయి అనీ, వచ్చి తీరుతాయి అనీ చెప్పటం లేదని సూచన. చాలా మంది ఇది చదివి అమ్మో.. మేం ఫలానా రాశి... అంటే మాకు ఈ అనారోగ్యాలు కచ్చితంగా వస్తాయి అని దయచేసి కంగారుపడి మాకు కాల్స్‌ చేయవద్దు. ఒక మంచి విద్యను అభ్య సించిన అందరూ ఒకే రకమైన ఉన్నత ఉద్యో గాలు చెయ్యనట్లే... ఒక రాశిలో పుట్టినంత వూత్రన అందరికీ ఈ ఇబ్బందులు రావు, రా వాలని లేదు. కానీ అవకాశం వుంది, ఎప్పు డంటే జన్మకుండలిలో గ్రహస్థితి సరిగా లేన పుడు. అలాగే వ్యాధి నిరోధకశక్తిని అందరూ పెంచుకోవాలి.

హోమియో ద్వారా సూచించిన మందులు (మీమీ రాశులకి) కూడా వాడమని, వాడి తీ రాలని కాదు అర్థం, అయా రాశుల వారి త త్వానికి ఆయా హోమియో మందులు సరిపో తాయని సూచన మాత్రమే.విజ్ఞులు అయిన పాఠకులు ఈ వ్యాసం లోని అంశాలను గ్రహించి వారికి తగిన జాగ్రత్తలు పాటించి అనారోగ్యాలను దూరం చేసుకునే విధంగా జ్యోతిశ్శాస్త్ర ప్రయోజనాన్ని అర్థం చేసుకోగలరి మా భావన. ఇందులోని అనా రోగ్యాలు అన్నీ మాకే వస్తాయని ఖంగారు పడద్దు. కేవలం ఆయో రాశులవారి కే వచ్చే అవకాశం వుంది అన్నదే మా పరిశీలన.

మేషం: సాధారణంగా ఈ శాశి వారికి తల, ఉదరం (కడుపు), పైత్యం, నత్తి మూత్రపిండాలు, అగ్ని ద్వారా ఇబ్బందులు, కురుపులు (వ్రణాలు), చర్మమునకు సంబంధించిన విచిత్రమైన అనారోగ్యాలు, జ్వరాలు కలిగే అవకాశాలు మెండు. అంతేకాక అండవ్యాధులు, ఉష్ణంతో కూడిన కఫము, రక్త సంబంధ వ్యాధులు హెచ్చు.

జాగ్రత్తలు:
1. ధ్యానం చేస్తూ ఉండాలి
2. చల్లని పువ్వుల వాడకం మంచిది (పూల సువాసన)
3. పసుపు + తేనే పరిగడుపున తీసుకోవాలి
4. ఆహరంలో కందిపప్పు ఎక్కువగా వుండాలి.

వృషభం: కంఠం (గొంతు), హృదయం, స్వరపేటిక, మలసంబంధ వ్యాధులు, అపస్మారక సంబంధ వ్యాధ్యులు, కఫము, టాన్సిల్స్‌, ఢిప్తీరియా, పయోరియా
(పళ్ళకి సంబంధించిప వ్యాధి), గుహ్యవయవాలు, గొంతు, నాభి ప్రదేశాలు కూడా ఆరోగ్యవంతంగా రక్షించుకోవాలి మూత్ర వాధ్యులు, రక్తక్షీణత, ఉబ్బువ్యాధి కలిగే అవకాశాలున్నాయి.

జాగ్రత్తలు:
1. ధ్యానం (మెడిటేషన్‌)
2. వ్యాయామాలు
3. నేట్రంసల్ఫ్‌ (హోమియోమందు)
వాడటం మంచిది.

మిధునం: విశ్రాంతి లేకపోవుట, ఊపిరి తిత్తులు, మనోవ్యాధి, ప్రాణవాయువు (ఆక్సీ జన్‌ లోపాలు). నరాల వ్యాధి, న్యుమోనియా, క్షయ, ఫ్లూ, అండవ్యాధులు, మానసిక రోగాలు, చెముడు, తలనొప్పి, ఉన్మాదం మొదలైనవి.

జాగ్రత్తలు:
1. పౌష్ఠికాహారం తీసుకోవడం
2. గాలి వెలుతురు వున్న గృహ నివాసం
3. క్రీడలు, వ్యాయామం తప్పని సరి
4. కాలీమూరు (హోమియో మందు) వాడాలి. అంతేకాకుండా శరీరారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే మొలకలు వచ్చిన పెసలు తినడం చాలా చాల మంచిది.

కర్కాటం: రొమ్ము, జీర్ణకోశం, హృదయ నాళాలు, నీరు పట్టడం, నంజు కేన్సర్‌, హిస్టీరియా, కఫం, కీళ్ళనొప్పులు, శోష, గొంతులో బాధ, మానసిక, శారీరక బలహీనతలు, కంటికి సంబంధించిన అనారోగ్యాలు, అజీర్ణం, వరిజీజం, వచ్చే అవకాశం వుంది.

జాగ్రత్తలు:
1. ఎక్కువ ఆలోచనలు మానాలి.
2. యోగాసనాలు
3. తమను గురించి ఇతరులు ఏమను
కుంటున్నారో అనే అనుమానాలు విడనాడితే మంచిది.
4. మెడిటేషన్‌ మంచిది.
5. కార్క్‌ఫ్లోరు ( హోమియో మందు) మంచిది.

సింహం:
వీపు, వెన్నెముక, హృదయం, హృదయ దౌర్బల్యం, గుండెదడ, నడుమునెప్పి, కడుపునెప్పి, పండ్లనెప్పి, ముఖవ్యాధి మొదలైనవి కలిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. తమ మనుసలోని భావాలు బహిరంగ పరచడం
2. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం
3. తమ పనులు తామే నిర్వహించు
కోవడం
4. మేగ్‌ఫాస్‌ (హోమియో మందు మంచిది)
కన్య:
పొట్ట, నాభి ప్రదేశం, వెన్నెముక క్రిందిభాగం, అజీర్ణం, విరోచనాలు, అతిసారం, జీర్ణకోశ వ్యాధులు కలిగే అవకాశం వుంది.
జాగ్రత్తలు:
1. సమాయానికి మితాహారం
2. వ్యాయమం, మొలకలు వచ్చిన పెసలు
3. ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గింపు
4. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవటం
5. కాలీసల్ఫ్‌ వాడం మంచిది
తుల:
ఆందోళన, మూత్రపిండములకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మూత్ర సమస్యలు, శోష, కీళ్ళవాతం, పైత్యం, శిరోవ్యాధులు, మలబద్ధకం, రక్తహీణత కలిగే అవకాశాలు వున్నాయి.
జాగ్రత్తలు:
1. బొబ్బర్లు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి
2. యోగా, వ్యాయామం తప్పని సరి
3 అందరూ మీరు చెప్పినట్లే వినాలి అనే ధోరణి వదిలేయండి.
4. నేత్రం షాను వీరి లోపాలను సమరిస్తుంది.
వృశ్చికం:
తొడలు, అంటువ్యాధులు, చర్మవ్యాధులు, దురద, సుఖవ్యాధులు, భగందరము, హృదయమునకు సంబంధించి వ్యాధులు, కఫము మొదలైనవి కలిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. కందిపప్పు, పసుపు ఆహారంలో వాడాలి
2. చల్లని వాతావరణం మంచిది
3. ఇతరులలో తప్పు పట్టడం మాని ప్రేమానురాగాలను పెంచుకుంటూ.. తప్పు చేయని వారు లోకంలో ఉండరని గుర్తించి సర్దుకోవడం అవసరం.
4. కాల్కేగుల్ఫ్‌ వాడితే మంచిది ( హోమియో)
ధనుస్సు:
ప్రమాదాలకు గురికావడం, తొడలు, పిరుదులు, నరములు వీటికి సంబంధించిన అనారోగ్యములు, గాయాలు, రక్తదోషము అనారోగ్యము, చర్మవ్యాధులు, స్థూల శరీరం వలన కలిగే ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం.. మొదలైనవి కలిగే అవకాశం వుంది.
జాగ్రత్తలు:
1. వ్యాయామం, ప్రాణాయామం
2. తగిన మోతాదులో ఆహరం
3. మొలకలొచ్చిన శనిగలు, అపక్వాహారం
4. ఎక్కువ బాధ్యతలు తలపైనే వేసుకోకుండా మానసిక ప్రశాంతి కోసం రెండుసార్లు ధ్యానం చేయటం మంచిది.
5. ‘సైలీషియా’ మంచి ఫలితాన్నిస్తుంది (హోమియో)
మకరం:
అజీర్ణం, రక్తదోషాలు, కీళ్ళనొప్పులు, చర్మవ్యాధులు, జలుబు, ఉన్నదరోగాలు, వాతసంబంధ అనారోగ్యాలు, మలమూత్ర వ్యాధులు, చలి, చెవుడు, వెన్నెముక వ్యాధి, కెన్సెర్‌, పక్షవాతం మొదలైనవి వానికి అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. వంటికి నువ్వుల నూనె పట్టించుకోవటం
2. నువ్వుపొడి ఆహారంలో వాడకం
3. ప్రాణయామం, సూర్య నమస్కారాలు
4. అపక్వాహారం తీసుకోవట
5. ‘కాల్కేషాసు వాడకం మంచిది (హోమియో)

కుంభం:
నంజువ్యాధి, కంటి జబ్బు, నరాల జబ్బు, రక్తప్రసారదోషాలు, గుండెజబ్బు, బెణుకు నొప్పులు, కాళ్ళు, సీల మండల వ్యాధులు, అంటువ్యాధులు, జలోదరం, మలేరియా, నిద్రలేమి, రక్తపోటు మొదలైన అనారోగ్యాలకు అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. మకరరాశి వలె వీరు కూడా నువ్వుల నూనె మసాజ్‌, ఆహారంలో నువ్వులపొడి వాడటం, సూర్య నమస్కారాలు చెయ్యటం చేయాలి.
2. నేత్రం మూరు వాడడం మంచిది
3. ప్రతిపనిలోను చురుకుదనం అలవర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చుకోగలరు.
మీనం:
భాహాద్రేకం, బలహీనత, కీళ్ళజబ్బులు, పాదములు, కాలివేళ్ళు నీరు పట్టడం, మద్యపానాదుల వల్ల వచ్చే అనారోగ్యం, కణతులు, మలకోశం, ఆమకోశం మొదలైన వానికి సంబంధించిన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. మొలకలు వచ్చిన శనిగలు, మితహారం
2. పసుపు ఆహారంలో తీకుకోవటం
3. కవితా రచన భావోద్రేకాలను అదుపు చేస్తుంది
4. ఫెర్రంపాసు (హోమియో) వీరికి తగినది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML