గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 5 June 2015

"ఏపురాణముల ఎంత వెదికినా శ్రీపతిదాసులు చెడరెన్నడును" అని అన్నమయ్య పలుకు.అనన్యాశ్చింతయన్తో మాం యే జనాః పర్యుపాసతే!
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్!!

"ఇతర చింతనలు విడచి, ఎవరు పర్యుపాసన చేస్తారో (ఎడతెగని భగవత్సాన్నిధ్య భావన కలిగినవారు) అటువంటి నిత్య యోగుల యోగక్షేమాలను నేనే వహిస్తాను" అని స్వామిమాట.
అంతేగానీ - ఏదో కావాలని భగవంతుని ప్రార్థించే వారు ఈతరగతికి రారు. వారికి కావల్సిన దానిపైనే చింత ఉంటుంది. కానీ భగవంతునిపై ఉండదు. కనుక దానిని ’అనన్యచింతన" అనరాదు. వారి ఆధ్యాత్మిక సాధన పూర్తి భౌతికబంధంతో కూడినది కనుక ’పర్యుపాసన’ అనలేం. భగవానునితో నిత్యానుబంధాన్ని అనుభవించే తాదాత్మ్య స్థితి లేదు కనుక, ’నిత్యాభియుక్తులు’ కూడా కారు. అటువంటివారే - "ఇంత కొలుచుకుంటున్నా దేవుడు నాకోరిక నెరవేర్చలేదేం?" అని బేరసారాలకు దిగుతారు. వారిని ’వ్యాపారులు’ అని కటువుగానే పేర్కొన్నది భాగవతం.
"నీవాడను - నువ్వే గతి" అని శరణు వేడిన వానికి భగవానుడు అభయాన్ని పలుకుతాడు.
శ్రీకృష్ణావతారంలోనే కాదు - రామావతారంలో కూడా "నీవాడను" అని ఒక్కసారి (మనసునీ, మాటనీ, క్రియనీ ఒక్కటిగా చేసి) శరణు వేడితే, అతడిని అన్నివిధములా కాపాడుతానని అభయదానం చేసేశాడు.
ఈఆప్తవాక్యాన్ని గ్రహిస్తే, మనసుకి కలిగే నిబ్బరం నిరంతర భగవత్ స్పృహని ఏర్పరచి, జీవితాన్ని అభయంగా మలచుతుంది.
నమ్మి చెడినవారు లేరు’ అని రామదాసు పలికిన మాట యథార్థం. తాను నమ్మిన దైవం తనకు యోగక్షేమకారకుడని భావించే భక్తుడు, ప్రతి అనుభవాన్నీ భగవత్ప్రసాదంానే భావిస్తాడు కనుక అతడు ఎన్నటికీ చెడడు.
"ఏపురాణముల ఎంత వెదికినా శ్రీపతిదాసులు చెడరెన్నడును" అని అన్నమయ్య పలుకు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML