గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 5 June 2015

అత్రి మహర్షిఅత్రి మహర్షి

అత్రి మహర్షి సప్త ఋషులలో ఒకరు. ఈయన చాలా గొప్పవారు ఈయన చరితలు గొప్ప విశేషం. ఈయన భార్య మహాసాధ్వి అనసూయ. అత్రి గురించి చెప్పాలంటే అనసూయ ఉండాల్సిందే, అనసూయ గురించి చెప్పాలంటే అత్రి ఉండాల్సిందే. అటువంటి గొప్ప దంపతులు అత్రి,అనసూయలు. ఈయన జీవిత విశేషాలు అన్నింటిలోను అనసూయ వున్నది.

బ్రహ్మ మానసపుత్రుడు అత్రి మహర్షి. సృష్టిని చేయుటలో సహకరించుటకు గాను అత్రి మహర్షిని సహాయముగా బ్రహ్మ సృష్టించెను. ఆయన జన్మించిన వెంటనే "తండ్రీ! నీవు నన్ను ఎందుకు సృష్టించావు అని అడిగెను" నాయనా నీవు నీవు తపస్సు చేసి లోక సంరక్షణార్ధం కొందరిని సృష్టింపవలెను కావున ముందు నీవు అరణ్యములకు పోయి తపస్సు చేయమని పంపివేసెను.

బ్రహ్మ యొక్క ఆదేశానుసారము అత్రి మహర్షి వనములను ఆశ్రయించి తపము చేయసాగెను. అతని తపోదీక్షకు అతనిలో విశేషశక్తి పెరగసాగెను. ఒకనాడు అతని నేత్రగోళము నుండి ఒక దివ్య తేజము ఉదయించెను. ఆ అనంత తేజము భువనాంతరాళములు వ్యాపించెను. ఆ తేజమును భరింపవలెను అని అష్టదిక్కులు ఆహ్వానించి అవి భరించలేక వెడలగక్కెను. అంతటాతేజము సముద్రమున పడెను. ఈ సంగతి బ్రహ్మ దేవునికి తెలిసి అచ్చటకు వచ్చి ఆ తేజమును తానే ధరించెను. దేవతలు వెంటనే సోమమంత్రముతో ప్రార్ధించెను. అంతట బ్రహ్మదేవుడు ఆతేజోంశమునకు పురుషరూపము నొసంగి అత్రి మహామునికి వివాహము అయిన పిమ్మట అతనిని అనసూయయందు ఈ తేజము చంద్రుడై జనించును. ఆతేజోంశమే మరొకటి క్షీరసాగర సమయమున ఉద్భవించి శశాంకుని చేరును అని చెప్పి అంతర్ధానమయ్యెను.

కొంతకాలమునకు దేవహంతీ కర్ణము ప్రజాపతులకు విష్ణుమూర్తి కటాక్షములచే తొమ్మిదిమంది కుమార్తెలు ఒక కుమారుడు కలిగిరి. అందలి ఒకరయిన అనసూయను అత్రి మహర్షికి ఇచ్చి వివాహము చేసెను వారి గృహస్థాశ్రమ జీవనము ఎంతో గొప్పగా ఉన్నది. ఆమె భర్తనే దైవంగా భావించి సేవలు చేయసాగెను. అందుచేత అనసూయ గొప్పదనము అత్రిమహర్షి ప్రభావముగా రోజు రోజుకు పెరగసాగెను. ఒకనాడు బ్రహ్మ విష్ను మహేశ్వరులు అనసూయ మహత్తును పరిక్షింపదలచి అత్రి మహర్షి ఆశ్రమమునకు వచ్చిరి. ఆతిధ్యముకోరిరి. అత్రి మహర్షి ఎంతో ఆనందముగా ఆహ్వానించెను. కానీ త్రిమూర్తులు "మాకు ఒక వ్రతము కలదనియు మాకు వడ్డన చేయు స్త్రీనగ్నముగా వడ్డించవలెను" అని చెప్పిరి. అత్రి మహర్షి అనసూయతో ఈ విషయం చెప్పెను. ఆమె సరే అనెను త్రిమూర్తులు స్నానం చేసి వచ్చి కూర్చుండగా వారిపై అనసూయ మంత్రాక్షతలు, జలము చల్లెను. వారి ముగ్గురు ఆమె మహత్యము వలన చంటిబిడ్డలైరి. ఆమె నగ్నమై వడ్డించి వారికి భోజనము పెట్టి అనంతరము వారిని ఊయలలో వేసి పరుండబెట్టెను. లక్ష్మీ, సరస్వతీ, పార్వతీదేవి తమ భర్తలను వెదుకాడుచూ వచ్చి తమ పతుల స్థితులను తెలుసుకొని అనసూయాదేవితో తమకు పతిభిక్ష పెట్టమని ప్రార్ధించెను. అనసూయ మరలా తన శక్తితో వారిని త్రిమూర్తులుగా చేసి వారి భార్యలకు అప్పగించెను. అంతట త్రిమూర్తులు ఆనందించి అత్రి అనసూయల శక్తి మెచ్చుకొని మా అంశలతో మీకు ముగ్గురు పుత్రులు ఉదయించెదరు అని వరమిచ్చి వెడలిపోయిరి.


ఒకసారి కౌశికపత్నీ శాపప్రభావముగా సూర్యోదయము ఆగిపోయినది. లోకోపద్రము కలిగినది. అప్పుడు బ్రహ్మయొక్క సలహా మేర దేవతలు అనుసూయాదేవిని సహాయ మడిగిరి. అనసూయ కౌశికపత్నీని అంగీకరింప చేసి సూర్యోదయం అగునట్లు చేసెను అంతే కాక కౌశికుని పునర్జీవుణ్ణి చేసెను. కొంతకాలం తర్వాత అత్రిమహర్షి భార్యసహితుడై ఋక్షపర్వతమున నిలచి దేవదేవుని గూరించి శత సవత్సరములు తపస్సుచేసెను. అంతట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రత్యక్షమయ్యిరి. వారిని పూజించి అత్రి వారితో మీమువ్వురిలో ఎవరు అధికులు అని ప్రశ్నించెను. తమకు ఆభేధం లేదని ముగ్గురము సమానమే అని తెలిపి త్వరలోనే మీకు పుత్రోదయము అగునని వరమిచ్చి వెడలెను.

కాల క్రమంలో త్రిమూర్తుల ద్వారా పొందబడిన వరముల ప్రభావముగా అత్రిమహర్షి నేత్ర గోళమునుండి చంద్రుడను, అనసూయ గర్భమునుండి దత్తాత్రేయ, దుర్వాసురుడను జనించిరి. ఆ ముగ్గురు పెరిగి పెద్దవారగుచు తల్లిదండ్రులకు ఎంతో ఆనందమును కలుగ చేయసాగిరి. ఒకసారి అత్రి మహర్షి అనసూయతో నీవు కోరినటుల సత్పుత్రులు కలిగినారు నేనిక తపోజీవనము అభిలషించుచున్నాను. నీవు పుత్రులతో ఉండెదవా? లేక నాతో వచ్చెదవా అని అడుగగా దానికి అనసూయ స్వామీ పిల్లలు ఇంకా బాల్యంలోనే ఉన్నారు వారి పోషణార్ధం పృధుచక్రవర్తి కడకు పోయి కావలసినవి తెండు వారికి యుక్త వయస్సు రాగానే మనము వన వాసము చేయుదము అని తెలిపెను. అందుకు సంతసించి అత్రి మహర్షి అనసూయ కోరికపై పృధుచక్రవర్తి కడకు వెళ్ళెను. పృధుచక్రవర్తి ఆ సమయములో అశ్వమేధయాగం చేయుచూ యాగాశ్వము విడుచుటకు ఉపక్రమించుచూ తన పుత్రునికి తోడుగా అత్రిమహర్షిని వెళ్ళమని ప్రార్ధించెను. అత్రి మహర్షి అంగీకరించి వెళ్ళెను. యింద్రుడు యాగాశ్వమును రెండు మారులు అపహరింప ప్రయత్నింపగా దానికి అత్రి మహర్షి సహాయంతో పృధుపుతృడు అడ్డుకొని యాగమును పూర్తి చేసెను. యాగానంతరము అందరినీ సత్కరించి పృధువు పంపివేసెను. ఆసమయమున అత్రి మహర్షి పృధుచక్రవర్తిని యింద్రునితో సమానము చేసి పొడగసాగెను. దానికి గౌతమ మహర్షికి ఆగ్రహం వచ్చి ఒక మానవుని ఇంతగా కీర్తించడం తగదు అనెను. క్రమముగా ఇరివురికి వాదము ప్రబలెను. వాని సమస్యను సభికులు ఎవ్వరూ తీర్చ లేకపోయినారు అంతట కశ్య మహర్షి లేచి సనత్కుమారుడు తప్ప అన్యులు ఈ చర్చను ఆపలేరుఅని చెప్పగా అత్రిగౌతములు సనత్కుమారుని చేరి ఆయన ద్వారా అత్రి వాక్యమునందు దోషము లేదు అనిపించుకొనిరి. అంతట పృధుచక్రవర్తి అత్రి మహర్షికి అమితమైన ధనకనకవస్తువాహనములను యివ్వగా వాటిని గైకొనిపోయి పిల్లల పోషణ నిమిత్తం అనసూయకు ఇచ్చి వారికి యుక్త వయస్సు రాగానే వానప్రస్థా ఆశ్రమమునకు భార్యా సమేతుడయి వెళ్ళి తపోజీవనం సాగించెను.

ఒకప్పుడు దేవతలకు జంభాది రాక్షసులకు యుద్ధము జరుగుచుండెను. అంతట రాహు అస్త్రసమితిచే సూర్యచంద్రులు వెలుగును కోల్పోయి లోకమంతయు అంధకారములోకి పోయెను అప్పుడు రాక్షసులు విజృభించి దేవతలను నొప్పింపసాగిరి. దేవతలు వేరెదారిలేక అత్రి మహర్షిని సహాయం అడుగగా ఆయన తన దివ్య తపోకటాక్షవీక్షణలచే రాక్షసుల బారి నుండి దేవతలను కాపాడి మరల సూర్య చంద్రులకు పూర్వవైభవము తెచ్చెను.

శ్రీరామ చంద్రుడు వనవాస సమయములో భరతుడు వచ్చి వెళ్లిన పిదప భార్యా సహితుడై అత్రి మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. అత్రి మహర్షి అనసూయ మహత్తును వారికి తెలియ జేసెను. సీతాదేవి అనసూయవలన పతివ్రతా ధర్మములు నేర్చెను, సీత తన వివాహ వృత్తాంతమును అనసూయకు తెలిపెను. సీతకు అనసూయ నూతన వస్త్రాభరణములను యిచ్చెను. ఆనాడు సీతారామలక్ష్మణులు అక్కడ గడిపి మరునాడు వెళ్లెను.

అత్రి మహర్షిచే వ్రాయ బడిన అత్రి సంహిత, అత్రి స్మృతి విశేష ధర్మ గ్రంధములు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML