ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 2 June 2015

కులం ., గోత్రం : (నిర్వచనం)కులం ., గోత్రం : (నిర్వచనం)

కొందరు హైందవేతరులు నేటి కుల వ్యవస్థని హైందవుల లోపంగా చూపిస్తున్నారు
ఇంకొందరు కులాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం కుల వ్యవస్థను వాడుకోవటం జరుగుతుంది
ఇంకొందరు అగ్రవర్ణస్తులు కుల వివక్షత చూపుతు అంతర్గత కలహాలకు కారకులవుతున్నారు
అసలు ఈ కులం అనే పదానికి అర్థం ఏమిటీ ..??


కులం :
"సంతన్యతే అనయాసంతతీః"
"కుల్యతే బంధువర్గో నే నేతి కులః"
"కోలతీ సంఘీ భవతీతి కులం"

అనగా ఒకే వంశమునకు చెందిన బంధువర్గ సమూహమును
"కులం" అంటారు

ఉదాహరణ: రఘుకులం., సూర్యకులం., చంద్రకులం., నందకులం., భృగుకులం.,
అలా మొదలగు కులములు వెదకాలం నుండి ఉన్నాయి .., కాని ఆ కులాలకు నేటి కులాలకి ఎలాంటి పొంతన లేదు..,,

గోత్రం :
"గో" అనగా వంశము
"త్ర" అనగా రక్షించువాడు లేదా పాలించువాడు అని అర్థము
అనగా తమ వంశము రక్షించువాడు అని అర్థము
గోత్రం అనగా సంతతీ అనికూడా అర్థము

"ముని బేస్యా పత్యాది వంశే గోత్రా కారాశ్చాష్టాః"
"అసత్యమ్ పుత్ర ప్రభృతీ గోత్రమ్"
"సంతతీ కులా నచ్య జనాస్వర వంశో అవ్య నామహాః సంతావనః"

తమ వంశానికి మూలపురుషులైన మహర్షులు తమ గోత్ర ప్రవర్తకులుగా చెప్పటం జరుగుతుంది

సకల శుభకార్యాల్లో యజ్ఞయాగాదులలో పితృకార్యాల్లో సకల తీర్థాల్లో దేవతార్చనల్లో
మరియు గురువులు ఆచార్యులు స్వాములను కలిసినపుడు గోత్రం చెప్పటం ఆచారమైవుంది

గోత్రం చెప్పటం అనగా
"నేను ఫలానా ఋషి వంశమునకు చెందినవాడను
ఫలానా ఋషి యొక్క సంరక్షణలో ఉన్నాను
ఫలానా సూత్రీయుడను"
అని చెప్పడం

తమ వంశ గౌరవాన్ని కీర్తి ప్రతిష్ఠతలను ఆచార వ్యవహారాలను తమ వంశ సాంప్రదాయాన్ని
తమ జీవన విదానాన్ని తమ బంధువర్గ కలయికను అంతటిని కలిపి
"కుల వ్యవస్థ" గా పరిగణింపవచ్చును

చాతుర్వర్ణ వ్యవస్థ కలిగిన హైందవం లో
వంశము కులము అను వాటికి చాలా ప్రాధాన్యత ఉన్నది
కానీ నేడు వర్ణములను వదిలి కేవలం కుల వ్యవస్థలో జీవించటం కులానికే ప్రధాన్యత ఇవ్వటం జరుగుతుంది
కానీ కులం అనేది మార్గ సూచకం మాత్రమే కాని అదే జీవన విధానం కాదు

మీ..
ఆచార్య..

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML