ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Thursday, 4 June 2015

హిందూ ధర్మం - (వేదంలో విజ్ఞానశాస్త్రం) వేదాల్లో టెలిగ్రాఫీ (తంతి) గురించి :

హిందూ ధర్మం - (వేదంలో విజ్ఞానశాస్త్రం)
వేదాల్లో టెలిగ్రాఫీ (తంతి) గురించి :
అశ్వినీ శక్తుల (రెండు వ్యతిరేక దిశల మధ్య ఉండే) సాయంతో, సైన్యం సమర్ధవంతంగా పని చేయడం కోసం విద్యుత్ యొక్క మంచి కండక్టర్లైన తంతి పరికరాలను అమర్చి వాడుకోండి. కానీ జాగ్రత్తగా ఉపయోగించండి - ఋగ్వేదం 1.119.10
యజుర్వేదం 18-8, 12 మంత్రాల్లో వివిధ రకాల జంతువుల గురించి ఉంది. ఇది జంతుశాస్త్రానికి బీజం వేసింది.
అధర్వణవేదం 10 వ కాండంలో శరీర నిర్మాణ శాస్త్రం గురించి ప్రాధమిక వర్ణన ఉంది.
రెండు మడమల మీద మానవదేహం నిలబడేలా యుక్తితో కూర్చిందెవరు? మాంసంతో మందంగా కప్పిందెవరు? చీలమండలను తయారుచేసిందెవరు? అందమైన వేళ్ళను రూపొందించి, కీళ్ళ ద్వారా కలిపిన తత్వం ఏమిటి? మానవునికి జ్ఞానేంద్రియాలను ప్రసాదించిందెవరు? కాళ్ళకు అరికాళ్ళను అమర్చింది, నడుముకు బలాన్ని ఇచ్చిందెవరు? - అధర్వణవేదం 10-2-1 అంటూ ఈ మంత్రం భగవంతుని వైభవాన్ని ఒక వైపు కీర్తిస్తున్నా, మరొక వైపు దేహనిర్మాణం గురించి ప్రాధమిక అవగాహన కల్పిస్తోంది.
9 ద్వారములతో (9 రంధ్రాలు - 2 ముక్కు రంధ్రాలు, 2 కళ్ళు, 2 చెవులు, 1 నోరు, మూత్రద్వారము, మలద్వారము), దేవతలు నివసించు 8 వృత్తములతో (5 జ్ఞానేంద్రియాలు - కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం; మనసు, బుద్ధి, అహంకారము), బంగారు కాంతితో వెలిగిపోతున్న దివ్యతత్త్వముతో (ఆత్మతో), దాన్ని ఆవరించి ఉన్న దివతేజస్సుతో (భగవంతుని యొక్క కాంతి) అబేధ్యమైన నగరం వలే ఈ శరీరం నిర్మించబడింది - అధర్వణవేదం 10-2-31. ఇందులో కేవలం శరీరం నిర్మాణం గురించే కాక, ఆధ్యాత్మిక తత్వం గురించి కూడా వివరించబడింది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML