గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 2 June 2015

పిఠాపురం కుక్కుటేశ్వరస్వామిపిఠాపురం కుక్కుటేశ్వరస్వామి

అహంకారంతో విర్రవీగిన దక్షుడు తను జరుపుతున్న యాగానికి అల్లుడైన ఈశ్వరుడిని ఆహ్వానించలేదు. అయినా ఈశ్వరుడి సతీమణి, దక్షుడి కుమార్తె దాక్షాయణి తండ్రి చేసిన తప్పును తెలిపి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించింది.

శక్తి స్వరూపిణి దాక్షాయణి చేసిన నీతిబోధలు దక్షుడికి రుచించలేదు. దాంతో దక్షాయణి విరక్తి చెందింది. దక్షుడి అహంకారాన్ని అణచడానికి యాగం జరగకూడదని హోమాగ్నిలో దూకింది దాక్షాయణి అగ్నికి ఆహుతి అయిపోయింది.

ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. దక్షుడు చేయబూనిన యాగాన్ని నాశనం చేశాడు. దాక్షాయణి కళేబరాన్ని భుజంపై వేసుకుని రుద్రతాండవం ఆడాడు. అఖిలాండం దద్దరిల్లింది.

భీతి చెందిన దేవతలు పరంధామున్ని సహాయం కొరకు ఆశ్రయించారు. ఈశ్వరుని క్రోధాన్ని తగ్గించి మామూలు స్ధితికి తీసుకురమ్మని వేడుకొన్నారు. పరంధాముడు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చక్రాయుధం ఈశ్వరుని భుజంపై నిర్జీవంగా వున్న దాక్షాయణి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. దాంతో ఈశ్వరుడు తిరిగి మామూలు స్ధితికి చేరుకుని తప్పిదాన్ని తెలుసుకున్నాడు.

"ఉమామహేశ్వరి శరీరన్లోని అవయవాలు ఎక్కడేక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలలో శక్తిపీథం, ఈ రాజ్యానికి రాజధానిని గయాసురుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను పరమవిష్ణుభక్తుడు, ప్రపంచంలో తన దేహం మాత్రమే పవిత్రమైనదై వుండాలని వరం కోరి విష్ణువుని స్మరించి భక్తితో తపస్సు చేశాడు. విష్ణువు ఆ వరాన్ని ప్రసాదించాడు.

గయాసురుడిని తాకిన గాలి సోకితేనే ఎన్ని పాపాలు చేసిన వారైనా పవిత్రులై పాపవిమోచనం పొందేవారు. ఎన్నో దానాలను, మశ్వమేధ యాగాలను ఆచరించిన గయాసురుడికి ఇంద్రలోకాన్ని పరిపాలించే అర్హత లభించింది.

ఇది ఇలాగే సాగితే గయాసురుడు తనకు పోటేఅగా తయారైపోతాడేమోనన్న భయంతో ఇంద్రుడు త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. "స్వామి! గయాసురుడి పరిపాలనలో రాక్షసుల అహంకారంతో దేవతలు, మునులు, బ్రాహ్మణులు ఎన్నో కష్టాలను, అన్యాయాలను సహిస్తున్నారు. యాగాలను నాశనం చేస్తున్నారు. ఎటు చూసినా అన్యాయం, అవినీతి పెరిగిపోయాయి. మేఘాలు వర్షించలేదు. ప్రకృతి క్షోభిస్తోంది. కరువు తాండవమాడుతోంది. పరిస్ధితి మారాలంటే మళ్ళీ నేనే ముల్లోకాలకూ అధిపతి కావాలి. మునులు, దేవతలు ఏ అడ్డంకులూ లేక యాగములనాచరించి సుఖంగా జీవించేలా వరమను ప్రసాదించమని కోరాడు ఇంద్రుడు.

త్రిమూర్తులు దేవేంద్రుడి కోరిక మేరకు వరమునొసంగినారు. అయితే ముల్లోకాలకూ దేవేంద్రుడు అధిపతి కావాలంటే బ్రాహ్మణుల వేషం ధరించి గయాసురుడిని కలుసుకున్నారు.

గయాసురుడు వారిని ఎంతో ప్రేమగా ఆదరించి ఆహ్వానించాడు. ఎటువంటి సాయం కావాలన్న చేయడానికి సిద్ధమేనన్నాడు.

బ్రాహ్మణుల వేషంలో వచ్చిన త్రిమూర్తులు "గయాసురా! భూలోకంలో వర్షాలు లేవు. అందుకని ఒక పవిత్రమైన ప్రదేశంలో యాగం చేయాలి. ముల్లోకాలలో అంతటి పవిత్రమైనది నీ దేహం మాత్రమే కదా. ఈ యాగమును నీ పవిత్రమైన దేహముపై జరపడానికి అనుమతినివ్వు" అన్నారు.

బ్రాహ్మణుల కోరిక తెలిసి సంతోషంగా సమ్మతించాడు గయాసురుడు. బ్రాహ్మణులు యాగము జరపడానికి గల నిబంధనలూ తెలిపారు. "ఏడురోజులు జరిగే ఈ యాగం ముగిసేదాకా మీరు కదలకూడదు. ఒకవేళ ఏదైనా కారణానికి కదిలితే మేం నిన్ను సణరించాల్సి వస్తుంది. గయాసురుడు ఏమాత్రం ఆలోచించక ఒప్పుకున్నాడు. ఏడురోజుల లెక్కకోసం ఏడవ రోజు ఉదయం కోడి కూతతో యాగం ముగిసేలా ఒప్పందం పెట్టుకున్నాడు.

మాట ఇచ్చిన ప్రకారం గయాసురుడు తన శరీరాన్ని పెంచి దానిపై యాగం జరిగేలా కదలకుండా ఉండిపోయాడు. అసురుడి శిరస్సు భాగం వద్ద విష్ణువు, పాదాల వద్ద మహేశ్వరుడు, నాభి వద్ద బ్రహ్మ యాగం మొదలుపెట్టారు.

గయాసురుడికి యోగ విద్యలో వున్న నైపుణ్యం వల్ల కదలకుండా ఏడురోజులూ వుండగలిగాడు. కోడి కూతను లెక్కపెట్టుకుని కదలకుండా వున్నాడు గయాసురుడు. 6 రోజులు గడిచిపోయాయి. యాగం నిర్విఘ్నంగaాజరిగింది. ఏడవరోజు యాగం పూర్తయిందంటే త్రిమూర్తులు తనకిచ్చిన మాట నెరవేరదని గుర్తుచేశాడు ఇంద్రుడు. ఏడవరోజు ముగిసేలోపే ఈశ్వరుడు కోడిరూపం దాల్చి కూత వేశాడు. గయాసురుడు యాగం ముగిసిపోయిందని లేచి నిలబడ్డాడు. యాగం అర్ధాంతరంగా ఆగిపోయింది.

త్రిమూర్తులు రౌద్రంగా మారారు. యాగం నిల్చిపోవడానికి కారణమైన గయాసురుడిని సణరించడానికి ఆవేశంతో అరవడం మొదలు పెట్టారు. యాగం చేయడానికి అనుమతి కోరి వచ్చిన బ్రాహ్మణుల ఇంతటి ఆవేశం చూసిన గయాసురుడికి అనుమానం వచ్చింది. వెంటనే విష్ణువును స్మరించగా జరిగిన యధార్ధం తెలిసింది.

దానవులలో ఉత్తమ భక్తుడైన గయాసురుడు సంతసించాడు. ప్రతి ఒక్కరికి మృత్యువు తధ్యం. అది ఎవరిచేత్తో చావడం కంటే త్రిమూర్తుల చేత సణరించబడడం మోక్షమర్గమని తెలుసుకుని సంతోషంగా కన్నుమూశాడు. తన శరీరభాగాలున్న చోటు భక్తులు తమ తల్లిదండ్రులకు, పెద్దవారికి శ్రాద్ధకర్మల నాచరించి ముక్తిని కలిగించే క్షేత్రాలుగా చేయమని వేడుకున్నాడు గయాసురుడు.

త్రిమూర్తులు అతని కోరిక మన్నించి ఆ వరమును ప్రసాదించారు. గయాసురుడు శిరస్సు వున్న చోటు గయ, మంగళగౌరి వుండే శక్తి పీఠంగానూ, నాభి వున్నచోట జిజాపూర్‌ గిరిజాదేవి పీఠంగాను, పాదాలున్న చోటు పిఠాపురం బృహుతికాశక్తి పీఠంగా ప్రసిద్ధిగాంచేలా వరమునొసనినారు త్రిమూర్తులు.

మూడు గయాక్షేత్రాలలో పాదగయ పిఠాపురంలో ఈశ్వరుడు గయాసురుడిని సణారం చేయడానికి కోడిరూపం దాల్చిన చోటు అని పురాణాలు చెబుతున్నాయి. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఒక పెద్ద కొలను... గయాసురుడి పాదం వున్నచోటు కొలను ఏర్పడిందట.

దీనికి పడమటిదిక్కున ఉన్న గోపురద్వారం నుండి లోపలి ప్రవేశిస్తే బృహూతికాదేవి దర్శనం అమ్మవారి ఎడమ, పైచేత అమృతకలశం, కుడిచేతికి జపమాల, కుడి కింద చెయ్యి అభయహస్తం, ఎడమ కింద చెయ్యి తొడపైన పెట్టుకున్న అందమైన విగ్రహం. తర్వాత గర్భగుడి. గయాసురుడి కోరిక మేరకు లింగరూపంలో ఈశ్వరుడు కుక్కుటేశ్వర స్వామి కొలువై వున్నాడు. తూర్పువైపున చూస్తున్నట్టున్న స్వయంభువు లింగం.

నాగచత్రంతో కొలువైన ఆస్వామి ముందు భక్తితో మొక్కితే ఈ భూమిని కాపాడడం కోసం తన దేహాన్ని పెంచి చోటిచ్చిన గయాసురుడు మన మనసుల్లో కొలువై వుంటాడు. గర్భగుడికి ఎదుట ప్రత్యేకమైన మండపంలో ఈ నంది గంటలతో అలంకరించినట్టుగా చెక్కిన రాతి శిల్పం. ఏ క్షణమైనా లేచి నిల్చోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెక్కిన శిల్పం.

ఈ నంది వద్ద నిలబడి ఆ కుక్కుటేశ్వరస్వామిని దర్శించి భక్తితో కళ్లు మూసుకుంటే ఏదో భక్తి భావన మనలో ప్రసరింపచేసినట్టు అనిపించే ఆ భగవంతుని సాన్నిధ్యం ప్రతిఒక్కరూ అనుభవించాల్సిందేనని అనిపిస్తుంది.

గర్భగుడికి కుడివైపున దిగంబర వినాయకుడు కొలువైయ్యాడు. దిగంబరంగా వున్న ఈ వినాయకుడు చిన్న మూషిక వాహనం పై వున్నట్టున్న విగ్రహం.

ప్రాకారంలోని నైఋతి మూలలో దత్తాత్రేయ స్వామికి ఒక ప్రత్యేకమైన సన్నిధి వుంది. దత్తాత్రేయ స్వామి విగ్రహం ఎంతో అద్భుతంగా వుంటుంది. గర్భగుడికి వెనుకవైపున్న గోడపై లింగము కోడి శిల్పాలు దర్శన్మిస్తాయి.

సీతారాములు, సంకరాచార్యులు, కాశివిస్వనాధస్వామి, అన్నపూర్ణ, సుబ్రహ్మణ్యస్వామి మొదలగు విగ్రహాలు ఆలయానికి పడమటి ప్రాకారంలో ఉన్నాయి.

అసురుడైనా భూలోక రక్షణకోసం తన పవిత్రమైన దేహం పై యాగం చేసుకోమని అనుమతించాడు. అతడి పవిత్రతను ప్రపంచానికి తెలియజేయడానికి బ్రాహ్మణ వేషంలో త్రిమూర్తులు అతన్ని శరణుకోరి వెళ్ల్లారు. తమ చివరి క్షణాలలో కూడా గయాసరుడు ఆ క్షేత్రంలో భక్తితో శ్రాద్ధకర్మలు చేసిన పితృదేవతలుకు మొక్షప్రాప్తి లభించేలా వరమునివ్వమని కోరి దేవతామూర్తులకెల్లా గొప్పవాడయ్యాడు.

పాదగయా అనబడే పిఠాపురం పితృదేవతలకు ముక్తినిచ్చే పుణ్యక్షేత్రం. తల్లిదండ్రులను గౌరవించి, వారి తదనంతరం కూడ వారిని స్మరించే సంప్రదాయమున్న భారతదేశం లోని ప్రతి ఒక్కరూ చూడాల్సిన పుణ్యక్షేత్రాన్ని దర్శించి మోక్షం పొందుదాం.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML