గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 June 2015

అంటరాని వాళ్ళం కాదు...మేము ఆది హిందువులం ' అని గర్జించిన భాగ్యరెడ్డి. అంబేడ్కర్ కి సమకాలికుడు.అంబేడ్కర్ సాగించిన ఉద్యమాలకు ఆధారం భాగ్యరెడ్డి. మనకు అంబేడ్కర్ తెలుసు..మన తెలంగాణా వీరుడు భాగ్యరెడ్డి తెలియదు..

అంటరాని వాళ్ళం కాదు...మేము ఆది హిందువులం ' అని గర్జించిన భాగ్యరెడ్డి.
అంబేడ్కర్ కి సమకాలికుడు.అంబేడ్కర్ సాగించిన ఉద్యమాలకు ఆధారం భాగ్యరెడ్డి.
మనకు అంబేడ్కర్ తెలుసు..మన తెలంగాణా వీరుడు భాగ్యరెడ్డి తెలియదు..
భాగ్యనగర్ (హైదరాబాద్) లొ చాదర్ఘాట్ వద్ద ఒక పాతబడిన భవనం కనిపిస్తుంది.దానిపైన ఆది హిందూ భవన్ అని వ్రాసి వుంటుంది.బిజి బిజీ గా వుండే ఆ నాలుగు రోడ్ల కూడలి వద్ద ఏర్పాటైన ఆ భవనానికి వెనక 100 సంవత్సరాల సామాజిక చరిత్ర వుందటే చాలా మంది నమ్మరు.
మే 22 ,1888 లో ఒక మ్యాదరి వంశం,మాల కులంలో పుట్టిన భాగ్యరెడ్డి వర్మ." మేము పంచములం కాదు..ఆది హిందువులం " అంటూ ఎలుగెత్తి చాటిన భాగ్యరెడ్డి ని ఆర్యసమాజ్ సంస్థ 'వర్మ ' బిరుదిచ్చి సత్కరించింది..బాబాసాహెబ్ అంబేద్కర్ కంటె ముందుగానే వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నడుంకట్టి ముందు నిలిచాడు భాగ్యరెడ్డి వర్మ..
భగవంతుడి పేరు చెప్పి అంటరాని వారంటూ కొన్నివర్గాలను దూరంగా వుంచి, అమానుషంగా వ్యవహిరించిన వారిని ఎదిరించి. దళిత ప్రజలకు వెలుగు రేఖగా,వేగుచుక్కగా,కారుచీకటిలో కాంతి రేఖగా సామాజికంగా ఉద్యమించిన మహా నాయకుడు భాగ్యరెడ్డి వర్మ. తిరుపతి వెంకటేశ్వరుడే కులదైవంగా భావించిన వెంకటయ్య, రంగమాంబ లకు భాగ్యనగర్లో పుట్టిన వాడు భాగ్య రెడ్డి.చిన్నప్పుడే కులవివక్షత కు గురై క్షోభ అనుభవించి,, ఈ శిక్ష తన తోటి కులస్థులకు రాకూడదని తలచి,బాగా చదువుకున్నాడు.మహాత్మ జ్యోతిబా ఫూలే అడుగుజాడల్లో సామాజిక చైతన్యానికి బాటను వేశాడు.
ఈ దేశ మూల వాసులము,అలాగే ఆది హిందువులం 'మేమేనంటూ ' ఆది హిందూ మహా సభ ను స్థాపించి,వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వారు భాగ్యరెడ్డి.జోగిని వ్యవస్థ ను కాదన్నాడు..బాల్య వివాహాలను నిరసించాడు..వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా 1910 లో నిజామియా బజారులో ఒక పాఠశాలను ప్రారంభించాడు. చదువులెకపోవటం అలాగే అజ్ణానం వల్లనే ఆధిపత్య కులాల దురహంకారం పెరిగిందని భావించి దళితులు చదువుకుని పైకి ఎదగాలన్నాడు.ఆ తరువాత 24 పాఠశాలలుగా అవి విస్తరించాయి.
1906 లో జగన్ మిత్ర మండలి ని మొదలు పెట్టి..మాల జంగములు,మాల దాసరుల చేత హరికథలు చెప్పించిన ఘనత భాగ్యరెడ్డిదే. 1911 లో సవర్ణులతో కూడి సహపంక్తి భోజనాలు చేయించారు.1917 లో కలకత్తాలొ జరిగిన అఖిల భారత హిందూ సంస్మరణ సభలో భాగ్యరెడ్డి చేసిన ప్రసంగం మహాత్మా గాంధీజీ ని ఆకట్టుకున్నది.ఉత్తరభారతంలొ డా.అంబేద్కర్ చేసిన ప్రతి ఉద్యమానికి హైదరాబాద్ లో భాగ్యరెడ్డి చేసిన కార్యక్రమాలు ఆధారమయ్యాయంటే అతిశయోక్తి కాదు.
దాసరులు,జంగములు,మిగతా వెనుకబడిన వర్గాల ఉపకులాల మధ్య సమన్వయం కోసం కృషి చేశాడు.వ్యసనాలకు దూరంగా వుండి,సామాజికంగా చైతన్యం పొందాలని దళితులకు ఉద్బోధించాడు.అంతర్గత సమస్యల పరిష్కారానికి పంచాయతీ పెద్దల వ్యవస్థ ను మొదలుపెట్టాడు. చేతివృత్తులవారిని ప్రొత్సహించడానికి 1925 లో ఒక వస్తు ప్రదర్శన శాలను ప్రారంభించాడు.
1927 నుండి 1931 వరకు జాతీయ నిమ్న వర్గ సభలకు అధ్యక్షత వహించి ఉద్యమించాడు.ఆది హిందువులుగా పిలవాలని తీర్మానించి ఆందోళన చేసారు.1931 లో నిజాం నవాబ్ ఈ ఉద్యమానికి దిగి వచ్చి, జనాభా లెక్కల్లో ఆది హిందూ కాలం ఒకటి ఏర్పాటు చేశాడు.ఆయన ప్రేరణతో కర్నాటక,తమిళనాడు,మహరాష్ట్ర లొ ఉద్యమాలు నడిచాయి..
ఫిబ్రవరి 18 1939 లో ఆయన మరణించారు. ఆయన అప్పట్లో ప్రారంభించిన బాలికల ప్రాథమిక పాఠశాల ఇప్పటికీ నడుస్తున్నది.
ఈయన సేవలకు గుర్తుగా ఆయన స్మృతిచిహ్నాన్ని నిర్మించాలి.డా అంబేద్కర్ కి సమకాలికుడైన భాగ్యరెడ్డి వర్మను అందరు గుర్తుంచుకోవాలి... ఈరొజు అయన జయంతి సందర్భంగా.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML