గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 June 2015

ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారం గా తెలుసుకోవచ్చు.మనది కర్మ భూమి ఈ కర్మ భూమిలో అనేక మంది మంచి పనులచే భగవంతుని అనుగ్రహం పొందినారు. అలాంటి కర్మలను మనం చాలా విస్మరిస్తున్నాము. మన జీవన విధానంలో పరుగులు తీస్తే కాని రోజు వెళ్ళని పరిస్థితులు ఏర్పడ్డాయి.


ఈరోజు ప్రపంచంలో మనిషి అనేక సమస్యలతో సతమతమౌతున్నాడు. అడుగడగునా అనేక ఇబ్బందులకు, ఒత్తిళ్ళకు, కష్టాలకు గురి అవుతున్నాడు. డబ్బు ఉన్నవారికి ఆరోగ్యం లేదు, ఈ రెండు ఉన్నా వివాహం కావట్లేదు వివాహమైతే సంతానం కలగకపోవడం, విద్య ఉన్నవారికి ఉద్యోగం లేకపోవడం, వ్యాపారం సరిగా లేకపోవడం ఇవన్ని ఉన్నా న్యాయస్థానాలు, ప్రభుత్వం నుంచి ఇబ్బందులు. వీటిలన్నిటికి అనేక కారణాలు వాటిలో 1. దైవారధన చేయకపోవడం 2.పితృ దేవతలను విస్మరించడం మొదలైనవి. అవి మనం ఆచరించినా ఇంతకుముందు మన వంశములో ఎవరైనా ఈ దోషములు చేసినచో అవి కూడ మనల్ని ఇబ్బంది పెడతాయి.

ఇందులో పితృ కర్మలు అనగా ఆబ్దీకములు(శ్రాద్ధ కర్మలు, తద్దినములు) వదిలిపెట్టడము అంటే చేయకపోవడం వలన మన యొక్క వంశాన్ని, మన పిల్లల్ని, మనల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది.

నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలను ఆచరించే మనవులు తమ పితృ దేవతలను ఉద్దేసించి చేసే కర్మ శ్రాద్ధ కర్మ. శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో ఆచరించ వలసినది. మృతులైన పిత్రాదులను ఉద్దేసించి శాస్త్రోక్తమైన కాలమందును, దేశమందును పక్వాన్నము గాని(భొక్తలకు భోజనము ), యామాన్నము గాని(బియ్యము, పచ్చి కూరలు, పప్పు దినుసులు మొదలగునవి), హిరణ్యము(బంగారము) గాని విధి ప్రకారము బ్రాహ్మణులకు దానము చేయుట శ్రాద్ధమనబడును.

అశ్రద్ధ అనగా నాస్తికత్వ బుద్ధి చే పితృదేవతలు లేరని, అనేవారి పితరులు రక్తము త్రాగుదురు(భోజనము అందక) పితృ దేవతలను ఉద్దేసించి మంత్ర పూర్వకముగా ఇచ్చే వస్తువులు ఏ రూపముగా ఇచ్చినను వారికి చేరును.

మనము శ్రాద్ధ కర్మ చేయునపుడు పితృ దేవతలు వాయురూపమున అతి త్వరగా వచ్చి భోజనము భుజింతురు అందుచే శ్రీ రామ చంద్రుడు శ్రాద్ధము చేయునపుడు సీతా దేవి బ్రాహ్మణుల యందు దశరధాదులను చూసెనని కధ ఉన్నది.

మనం పెట్టే ఈ శ్రాద్ధ కర్మలు మన తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నానమ్మ మొదలైన వారికే కాకుండా మన రక్త సంబంధీకులు, స్నేహితులలో అగ్ని ప్రమాదము, వాహన ప్రమాదము ఇలా అనేక ప్రమాదములలో మరణించిన వారికి ఉపనయనము అవ్వకముందే మరణించిన వారిని కూడా ఈ సంధర్భముగా మనము త్రుప్తి పరుస్తాము అంతే కాక మన ఇంట్లో పని చేసి మరణించిన వారికి కూడా మనము ఈ శ్రాద్ధ కర్మలు ద్వారా తృప్తిపరుస్తాము.

అంతే కాక పిండ ప్రదానములకు ప్రత్యేకించబడిన క్షేత్రములలో ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహించడం వలన(పితృ కర్మ చేయడం వలన) మనిషికి పుష్టి, ఆయువు, వీర్యము, లక్ష్మి ప్రాప్తిస్తాయి.

అపుత్రస్యగతిర్నాస్తి: అంటే వారసులు లేని వారికి ఉత్తమగతులు సంప్రాప్తించబోవని సాధారణంగా నిస్సంతువులు నిరం తరం దుఖిఃస్తుంటారు. సంతానం లేకపోతే ఉత్తమ గతులు సంప్రాప్తించవని భావించడం, ఆ క్ర మంలో నిరంతరం దుఖిఃంచడం వ్యర్థం. సృష్టికి పునరుత్పత్తి అనేది అవసరం కాబట్టి దానిని కొనసాగించడం కోసం తన తదనం తరం వారసులు ఉండాల ని అందరూ భావిస్తుంటారు. వాస్తవానికి వారసులు అంటే సంతానం అని మాత్రమే కాదు. చేసే పని ఏదైనప్పటికీ దానిని అందుకొని కొనసాగించే వారసుడిని పొందాలనేది అపుత్రస్యగతిర్నాస్తిః యొక్క వాస్తవిక అర్థం. అది ఎలా అంటే… ఒక కళాకారుడు తనకున్న ప్రతిభతో సమస్త ప్రేక్షకులను రంజింపజేస్తుంటాడు.

అదేవిధం గా తన తదనంతరం ఎవరైనా తన వారసుడు రంగప్రవేశం చేసి ప్రేక్షకులను రంజింపజే యాలని నిత్యం తపిస్తుంటాడు. ఈ క్రమం లోనే అనేకమంది నూతన కళాకారులకు చే యూతనిస్తాడు. అతడి ముద్రపడిన ఏ కళాకా రుడైనా అతడి వారసుడిగా భవిష్యత్తులో చెలా మణీ అవుతుంటాడు. చరమదశకు చేరుకున్న కళాకారుడు ఆ విధంగా ఎవరినైనా తన వార సుడిగా తీర్చిదిద్దక పోయినట్లయితే అప్పటి వరకు కళామతల్లికి ఒక కళాకారుడిగా చేసిన కృషి అంతా వృధా అవుతుంది. అదేవిధంగా ఒక రాజకీయనాయకుడు తాను జీవించినంత కాలం ఏదో ఒక పార్టీకి నిత్యం సేవలందిస్తుం టాడు. అతడి తరఫున ప్రాతినిథ్యం వహించే ఒక రాజకీయనాయకుడిని ఒక వారసుడిగా పొందాలని కోరుకుంటాడు. అదే క్రమంలో తన చరమదశలో ఎవరినో ఒకరిని తన వార సుడిగా రంగంలోకి దింపుతాడు.

అతడి సాఫ ల్యం కోసం తన మేథస్సును వినియోగిస్తాడు. ఎవరినైతే తన వారసుడిగా భావిస్తాడో అతడి అభ్యున్నతికి పాటుపడతాడు. అతడికి సాఫ ల్యాన్ని అందిస్తాడు. అలా వ్యవహరించకపో యినట్లయితే అప్పటివరకు అతడి శ్రమ వ్యర్ధ మవడమే కాక, అతడి ఆశయాలు నీరుగారి పోతాయి. చిన్నగా మొదలుపెట్టినా చివరికి వటవృక్షంలా మారిన పారిశ్రామికుడు జీవిం చినంత కాలం తన ఆశయసిద్ధి కోసం నిరం తరం శ్రమిస్తుంటాడు. కొన్ని దశాబ్దాలు గడి చేటప్పటికి అతడికీ పదవీవిరమణ చేసే సమ యం ఆసన్నమవుతుంది. మరికొద్ది కాలంలో తాను పదవీవిరమణ చేయాల్సి ఉండగా తన వారసుడి కోసం అన్వేషణ మొదలుపెడతాడు. అప్పటివరకు తాను గడించిన వ్యాపారానుభ వంతో తనకు దీటైన వారసుడిని ఎన్నుకొంటా డు, తుదకు తాను సంతృప్తి చెందిన మనసు తో పదవీవిరమణ చేస్తాడు. ఆ విధంగా తాను సరైన వారసుడిని ఎన్నుకోకపోయినా లేదా తగిన వారసుడు లభించకపోయిన అప్పటి వరకు అతడి శ్రమ అంతా బూడిద పాలవు తుంది.

గురుస్థానంలో ఉండే స్వామీజీ భగవదను గ్రహం వల్ల తాను కనుగొన్న ఆధ్యాత్మిక సత్యా లను ప్రజలకు నిరంతర బోధిస్తుంటాడు. కొం తకాలానికి గొప్ప పీఠాదిపతి కూడా అవుతాడు. అయితే ఆ స్వామీజీ కూడా మానవుడి జీవన సరళికి విభిన్నమైన వాడు కాడు. అతడికీ వృద్ధాప్యం సమీపిస్తుంది. అప్పటివరకు తాను చేసిన జ్ఞానబోధ అక్కడితో ఆగిపోకూడదంటే ఆయన సైతం తన తరువాత తన వారసుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే క్రమంలోనే తగిన శిష్యుడి కోసం అన్వేషి స్తాడు. తన అన్వేషణ సాఫల్యం పొందిన తరు వాత తాను ఎన్నుకున్న వారసుడిని పీఠాదిపతి ని చేస్తాడు. అలా పీఠాదిపతి అయినవాడు సైతం తనను పీఠాదిపతిగా ఎన్నుకున్న స్వామీ జీ అడుగుజాడల్లో నడుస్తాడు. స్వామీజీ జ్ఞాన బోధల్ని నిరంతరం కొనసాగించేందుకు పా టుపడుతుంటాడు. అలా పాటుపడని వారసు డి ని ఎన్నుకున్నా, జ్ఞానశూన్యుడైన శిష్యుడిని తన తదనంతర పీఠాధిపతిగా చేసినా అటు వంటి స్వామీజీ జ్ఞానబోధలు నిర్వీర్యమవుతాయి.

వాస్తవానికి రంగం ఏదైనా తన తదనంతర వారసుడు సరైనవాడు లేకపోయినట్లయితే అ ప్పటివరకు అతడు చేసిన కృషి అంతా వృధా అవుతుంది. కనుక తన కృషి వృధా కాకుండా ఉండేందుకు, తన ఆశయాలు నిరంతరం స జీవంగా ఉండేందుకు కోరుకోవడమే వారసు డిని కోరుకోవడంలో పరమార్ధం. అలా వా రసులు లేకపోయిన ట్లయితే ఉత్తమ గతి సంప్రాప్తించదని పెద్దలు వచించిన దానికి అర్ధం అప్పటి వరకు అతడు చేసిన కృషి వ్యర్ధమవుతుందని చెప్ప డమే ఆ మాటల్లోని అసలైన అర్ధం. అప్పటివ రకు అతడు చేసిన కృషి ఫలించా లనీ, తన ఆ శయాలు, కన్న కలలు నిజం కావాలని ఆశించి ఆ క్రమంలో తగిన కృషి చేస్తూ వారసుడిని పొందడం ద్వారా, అలా పొందిన వారసుడి ద్వారా తన ఆశయాలను, కన్న కలల్ని నిజం చేయడం ద్వారా తన తదనంతరం కూడా సుదీర్ఘకాలం అందరి జ్ఞాపకాల్లో మిగిలిపోవడమే సద్గతికి లేదా ఉత్తమ గతికి అసలైన అర్ధం అని ప్రతి ఒక్కరూ గమనించా ల్సిన విషయం. అలా పొందిన వారసుడే పుత్రుడవుతాడు. అలాంటి వారసుడు లేని ఏ ఒక్కరైనా గతిని తప్పి నిర్వీర్యుడవుతా డనేది అక్షర సత్యం.

మహాలయ పక్ష ప్రారంభం / శ్రాద్ధ పూర్ణిమ పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి. పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు.

మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి.ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమి పై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ద తో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదం గా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపం లో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి, ప్రతి మాసంలోను అమావాస్య, పితరుల పుణ్య తిథి గా భావించబడినా, మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షం లో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు.

శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతం గా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణం లో చెప్పబడింది. ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మ లో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది.

ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారం గా తెలుసుకోవచ్చు.

పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది
ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది
తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు
చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు
పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది.
షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తి కి సమాజం లో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది.
సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.
అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ది, ధనం, బుద్ది ప్రాప్తిస్తాయి
నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారం గా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది
దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది
ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది , కుటుంబం వృద్ది చెందుతుంది
ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అబివృద్ది చెందుతుంది. శ్రాద్ధ కర్త కు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది
త్రయోదశి నాడు శ్రద్ద కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం , బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి
చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.
అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తి కి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి
ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే , పితృ పక్షం లో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు,అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశం లో నిల్చొని అపరాన్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.

పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు.

పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే. వాయనము ఇస్తాము, కూరలు ఇస్తాము, బియ్యము ఇస్తాము అని అంటే కుదరదు. మీరు వుండే ఇంట్లో పెడితేనే చాలా మంచిది.

దేవతలకు చేసే కార్యము కాని, పితృ దేవతలకు చేసే కార్యము కాని రెండూ మీరు వున్న ఇంట్లోనే చేయాలి, అలా చేస్తే అది మీకు మీ ఇంటికి మంచిది.

కర్మ క్షయం కాని జీవుడు మరణించిన వెంటనే ఎక్కడో ఒక చోట పుడతాడు అన్నది నిజమేనా ?? అలాగయితే మనం చేసే పితృకర్మలు వారికి ఎలా చెందుతాయి ?? జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేక ఇక ఆ జన్మతో బంధం ఉండదు కదా.. మరి పితృదేవతగా ఎలా తర్పణాదులు స్వీకరిస్తాడు? పెళ్ళి/పిల్లలు సరిగా లేకపోతే పితరులకు హాని కలుగుతుంది అంటారు కదా..వ్యక్తిగతంగా చేసిన పాప పుణ్యాల వల్ల కర్మలు ఏర్పడినపుడు ఇలా వంశం చేసిన పాపాల వల్ల ఎలా హాని కలుగుతుంది? పిల్లలు లేకపోతే పున్నామ నరక బాధలు తప్పవా?
….ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా వివరంగా చెప్పవలసి ఉంది. కానీ ఒక అవగాహన ఏర్పడినా చాలు అనే ఉద్దేశంతో, కొందరు స్నేహితులు అడిగినదానికి ఇక్కడ సమాధానం ఇస్తున్నాను.

పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.
కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.
ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేసేరు. ఉదాహరణకు..ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు. ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది. ఉదాహరణకు మనం మనీఆర్డరు చేసిన అడ్రసులో ఎవరూ లేకపొతే మనకే తిరిగి వస్తుంది కదా. కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే.
ఈ జన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ, తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది. మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు.
సంప్రదాయ బద్ధంగా పెళ్ళి జరుగనప్పుదు ఇరువైపుల పితరులు (ముందు తరాలు, తరువాతి తరాలు) అధోగతి చెందుతారన్నది నిజం. వారు వ్యక్తిగతంగా పుణ్య చరిత్రులైనప్పటికీ ఈ బాధ తప్పదు. అందుకే మనవారు పెళ్ళిళ్ళలో సంప్రదాయానికి అంత విలువనిస్తారు. గతించిన వారి పుణ్య సాంద్రత మరీ ఎక్కువగా ఉంటే ఏ మహర్షివలననో ఉత్తమగతులు మళ్ళీ పొందే అవకాశం ఉంది కానీ ఖచ్ఛితంగా చెప్పలేము. అందుకే ఇదివరకు ఎవరైనా సంప్రదాయానికి విరుద్ధంగా పెళ్ళి చేసుకుంటే వారితో తలిదండ్రులు, బంధువులు సంబంధాన్ని త్రెంచుకునేవాళ్ళు. అది అభిమానం లేక కాదు. వారు, వారి పితరులు అధోగతిపాలు కాకూడదని మనసులో బాధపడ్డా అలా చేసే వాళ్ళు.
ఆ పైన పిల్లలు కలిగి, వారు పితృకర్మలు సరిగా చేస్తే పున్నామ నరక బాధలు తప్పుతాయనేది వాస్తవం. అందుకే మనవారు వంశం కొనసాగాలని అనుకునేవారు. కానీ మన ప్రయత్న లోపం లేకుండా సంతానం కలగనప్పుడు అంతగా విచారించనక్కర్లేదు. దానికి ప్రత్యామ్నాయంగా… దేవతల కళ్యాణాలు, మరి కొన్ని వ్రతాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం వలన ఇది వరకు జన్మలలో చేసిన ఏ పాపం వలన పిల్లలు లేరో ఆ పాపాలని నాశనం చేసి, వారిని, వారి పితరులను కూడా తరింపజేసుకోవచ్చు. …స్నేహితులకు ధన్యవాదములతో

పిత్రుదోషం కుటుంబమందు ఎదో ఒక్కరికి సంప్రాప్తించును అసలు పితృ దోషం ఎందుకు వస్తుంది అనేది చూద్దాము.

కుటుంబమున ఎవరో ఒకరు అదే అత్తో మామో చిన్ననో పెదనాన్నో అన్నానో తమ్ముడో చెల్లియో అక్కయో వారికి నిర్దేసించ బడిన ఆయుస్సుకు ముందే ఆత్మాహుతి అంటే ఆత్మ హత్య చేసుకోవడమో ఆక్సిడెంట్ వాళ్ళ చనిపోవడమో లేక ఇతర కారణముల వాళ్ళ ముందే చనిపోతే వారి ఆయుస్సు నిర్దేశించబడిన వరకు ప్రేతత్వములో తిరుగుతో వుంటారు. అలాంటి వారికి అపర కర్మ లేదు చాల తంతు అంటే పరిహారడులు చేసి తర్వాత ప్రేత కర్మ చేయవలసి వుంటుంది. అలా చేయకపోతే ఇక్కడే తిరుగుతూ ఆకలి డప్పులకు అలమటిస్తూ మనలను శపిస్తూ తిరుగుతుంటారు.

ఇలా ఒక కుటుంబంలో ఎన్ని మనదో అపమ్రుత్యు వాత పడ్డ వారి లెక్క మనకు తెలీకుండా వుంటుంది. అలాంటి శాపం వల్లే కుటుంబములో ఏదో ఒక పిల్ల వాడికో లేక పిల్లకో పితృ దోషంతో పుడుతుంటారు. ఇక వారి జీవితం అంట కష్ట మయంగానే వుంటుంది. అసలు ఈ పితృ దోషం తెలుసుకోవలసింది ఎటుల అంటే జాతకంలో రాహు కేతువుల మద్య అన్ని గ్రహములు ఇమిడి వుంటారు. అలాంటప్పుడు అది కాల సర్ప దోషం అని జాతక రీత్యా అంటారు. అది పితృ దోషం వాళ్ళ వస్తుంది. ఈ దోష్సం లేకుండా ఇంట్లో పిల్లలు వుండరు.

కాల సర్ప దోష నివారణకు ముఖ్యమైనది పెద్దలు ఇంట్లో పితరులకు తర్పనాదులు మరియు శ్రాద్హ కర్మలు తప్పకుండ వదలకుండా చేయడం వాళ్ళ కొంత తగ్గుతుంది. మరి రాహు ప్రీతి కొరకు దుర్గను కేతు ప్రీతి కొరకు గణేశుని ప్రార్తించ వలసి వుంటుంది. అందుకే మన శాస్త్ర సంప్రదాయములో కలౌ చండి వినయకౌ అని అంటారు. ఈ రెండు దేవతలు త్వరగా ప్రీతిపాత్రులై మనకు మంచి కలుగ చేస్తారు.

పితృ తర్పణము - విధానము :

శ్రీః - శ్రీమతే వేద పురుషాయ నమః

పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు , తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. దీనిని చదివి , బ్రాహ్మణుడు దొరకకున్ననూ , ఎవరికి వారు తర్పణము చేయవచ్చును.

ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ’ పార్వణ శ్రాద్ధం ’ లేక ’ చటక శ్రాద్ధం ’ అంటారు..కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు.

తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు... దర్శ శ్రాద్ధము , ఆమ శ్రాద్ధము , హిరణ్య శ్రాద్ధము.

ఆ పద్దతి ముందుగా ఇచ్చి , తదుపరి తర్పణ విధి వివరించడమయినది..

దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం

పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య |
ఓం భూః ..ఓం భువః...ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| .....ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ |

ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్ప్య || శ్రీగోవింద గోవింద......దేశకాలౌ సంకీర్త్య , .అస్యాం పుణ్య తిథౌ

| ప్రాచీనావీతి |

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం ... ----- గోత్రాణాం. .. ------ , -------- , ------ శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం , ------- , --------- ,-------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,
అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------ గోత్రాణాం , --------, ---------- , --------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,
--------, ------------ , --------------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం , అమావాస్యా పుణ్యకాలే ( సంక్రమణ పుణ్యకాలే ,/ సూర్యోపరాగ పుణ్యకాలే / సోమోపరాగ పుణ్యకాలే / వస్వాది పుణ్యకాలే ) దర్శ శ్రాద్ధం ../ .. ఆమ శ్రాద్ధం హిరణ్య రూపేణ అద్య కరిష్యే | తదంగ తిల తర్పణం చ కరిష్యే |

దక్షిణతో దర్భాన్ నిరస్య | అప ఉపస్పృశ్య |

హిరణ్య శ్రాద్ధం |

అమావాస్యా పుణ్యకాలే అస్మిన్ మయా క్రియమాణే హిరణ్యరూప దర్శ శ్రాద్ధే , ఏక బ్రాహ్మణ సంభవే వర్గ ద్వయ పితృణాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( అనేక బ్రాహ్మణ పక్షే పృథక్ వరణం కుర్యాత్ )
తాంబూలం , హిరణ్యం చ గృహీత్వా ||

|| హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసోః |
అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయఛ్చ మే ||

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం | -------- గోత్రాణాం. .. -------- , --------- , --------- శర్మణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... --------- గోత్రాణాం , --------- , ---------, --------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------- గోత్రాణాం , ---------, -------- , ---------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,

-------- , ---- , --------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం ,దర్శ శ్రాద్ధ ప్రత్యామ్నాయం యద్దేయం అన్నం తత్ ప్రతినిధి హిరణ్యం వర్గ ద్వయ పితృ ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదదే | నమమ | ఓం తత్ సత్ |

ఉపవీతి |

ప్రదక్షిణం |

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

నమస్కారః

ప్రాచీనావీతి | వర్గ ద్వయ పితృభ్యో నమః | స్వామినః మయా కృతేన హిరణ్య రూప దర్శ శ్రాద్ధేన మమ వర్గ ద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసురితి భవంతోను గృహ్ణంతు | ఇతి ప్రార్థ్య |

( యజమానస్య వర్గద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసుః ఇతి బ్రాహ్మణాశీర్వాదః )

తర్పణమ్

దీనికి ఇచ్చిన బొమ్మ చూడుడు ...దర్భలతో కూర్చలు చేసుకొన వచ్చును .

పితృ దేవతల ప్రీతి కొరకు అర్పించే తిలాంజలినే ’ తర్పణం ’ అంటారు..

ముఖ్య గమనిక :

ఇంటి లోపల తిల తర్పణము నిషిద్ధము..ఇంటి బయట ఆవరణలో గానీ , బాల్కనీ లో గాని లేదా తులసి కోట దగ్గరగానీ తర్పణము ఆచరించవచ్చును..

తండ్రి బ్రతికి ఉన్న వారు తర్పణము ఆచరించరాదు..సజీవులు గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి మాత్రమే తర్పణము ఇవ్వాలి.

అమావాశ్య , గ్రహణ కాలము , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలాలు , ఆయనములు , సంక్రమణ కాలములందు తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు ద్వాదశ పితృ దేవతలకు మాత్రము తర్పణం ఇవ్వాలి అనేది కొందరి మతము. అయితే , సాధారణ సంక్రమణము మరియు అమావాశ్యలందు ద్వాదశ పితృ దేవతలకు , మిగిలిన కాలాలలో సర్వే పితృ తర్పణము చెయ్యడము వాడుక లో ఉంది... వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి చేయవచ్చును..

మహాలయ పితృ పక్షమునందు మరియు పుణ్య క్షేత్రములందు సర్వ పితృ దేవతలకూ తర్పణం వదలాలి. మహాలయ పక్షము నందు ఆయా తిథులలో మరణించిన పితృ దేవతలకు ఆయా రోజుల్లో తర్పణం వదలవచ్చు.

తిథులు తెలియని యెడల , అందరికీ అన్ని రోజులూ తర్పణం వదలవచ్చు. అది వీలు కానిచో , కనీసం అమావాశ్య రోజైనా అందరికీ తర్పణం ఇవ్వాలి.. వారి వారి శక్త్యానుసారం చెయ్యవచ్చును.

తర్పణము ఇచ్చునపుడు , మొదట సంబంధము ( మాతుః ... పితుః... మాతులః.. ఇలా ) , తరువాత వారి పేరు , గోత్రము చివర పితృదేవతారూపము ( వసు , రుద్ర , ఆదిత్య.... ఇలా ) చెప్పి వదలవలెను..

ఆడవారు సుమంగళి అయిన ’ దేవి ’ అని , కానిచో ’ కవీ ’ అని చెప్పి ఇవ్వాలి.

మాతృ , పితామహి , ప్రపితామహి...ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదలాలి..

మిగిలినవారికి , వారి వారి సూత్రానుసారముగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి...

ఇతర నియమాలు

తర్పణము ఇచ్చునపుడు కుడి చేతి ఉంగరపు వేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం ధరించాలి.

తర్పణానికి ఉత్తమమైన కాలము సుమారు మధ్యాహ్నము 12 గంటలకు . తర్పణము వదలు నపుడు ప్రాచీనావీతి గా ఉండి జంధ్యమును కుడి భుజం పై వేసుకొని ( అపసవ్యము ) ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని , కుడి చేతిలో నువ్వులు ఉంచుకుని , చూపుడు వేలు , బొటన వేలు మధ్యనుండి ( పితృ తీర్థం లో ) నీరు , తిలలు వదలాలి
తర్పణము ఈ కింది సందర్భాలలో ఆచరించవచ్చు..

అమావాశ్య మరియు సాధారణ సంక్రమణ కాలములందు

గ్రహణ , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలములలో , దక్షిణాయన , ఉత్తరాయణ పుణ్య కాలాలలోను , మహాలయ పితృ పక్షం లోనూ , మరియు తీర్థ క్షేత్రములకు వెళ్ళినపుడు...
ఒకేసారి , ఒకే రోజు రెండు కారణాలవలన రెండు సార్లు తర్పణము ఇవ్వరాదు..ఒకే తర్పణము ఇవ్వాలి..ఉదాహరణకి ,

అమావాశ్య , సంక్రమణము ఒకే రోజు వస్తే , అమావాశ్య తర్పణము మాత్రము ఇవ్వాలి.
దక్షిణాయన / ఉత్తరాయణ పుణ్య కాలాలు అమావాశ్య రోజున వస్తే , ఆయన పుణ్యకాలం లో మాత్రము తర్పణము ఇవ్వాలి..

గ్రహణము , మరియు దక్షిణ / ఉత్తర పుణ్యకాలాలు ఒకరోజే వస్తే , గ్రహణ నిమిత్తం మాత్రం తర్పణం ఇవ్వాలి. ఉత్తరాయణ పుణ్య కాలము , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాలు ఒకే రోజు వస్తే , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాల తర్పణం ఇవ్వాలి..

చంద్ర గ్రహణమైతే గ్రహణ మధ్య కాలము దాటిన తర్వాత , సూర్య గ్రహణమైతే గ్రహణ మధ్య కాలానికన్నా ముందుగాను , తర్పణము ఇవ్వాలి.

సంక్రమణమైతే , పుణ్యకాలంలో ఇవ్వాలి..

విధానము :-

ప్రాగగ్రాన్ దర్భాన్ ఆస్తీర్య | తేషు దక్షిణాగ్రౌ ద్వౌ కూర్చౌ నిధాయ | ( మూడు దర్భలను బొమ్మలో చూపినట్టు , కొనలు తూర్పుకు వచ్చేలా ఒకదానికొకటి సమాంతరం గా పరచాలి... వాటిపైన రెండు కూర్చ లను , దక్షిణానికి కొనలు వచ్చునట్లు పరచాలి.)

కూర్చలను చెయ్యడానికి : రెండేసి దర్భలను తీసుకుని పైనుంచి ( కొనలనుంచి ) ఆరంగుళాలు వదలి మడవాలి, మడిచినచోట ఒక వృత్తం లాగా చేసి, రెండు సార్లు కొనలను దర్భల చుట్టూ తిప్పి వృత్తం లోనించీ అవతలికి తీసుకొని ముడి వెయ్యాలి. తర్వాత ,

ఆచమనము చేసి , పవిత్రము ధరించి , తర్వాత ప్రాణాయామము చేసి , సంకల్పము ఇలా చెప్పాలి

సంకల్పము : ( దేశకాలౌ సంకీర్త్య ) శ్రీ గోవింద గోవింద మహా విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య , అద్య బ్రహ్మణః , ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే ,

వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరత ఖండే , రామ క్షేత్రే , బౌద్దావతారే ,

అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన , ప్రభవాది షష్టి సంవత్సరణాం మధ్యే , శ్రీ ------నామ సంవత్సరే ( సంవత్సరం పేరు ) , -----ఆయనే ( ఆ కాలపు ఆయనము పేరు ) , ........ఋతౌ ( ఋతువు పేరు ) , ..... మాసే ( మాసపు పేరు ) , .....పక్షే (శుక్ల .. లేక కృష్ణ పక్షము) ,....తిథౌ ( ఆనాటి తిథి పేరు )..... వాసరే ( ఆనాటి వారము.. భాను ( ఆది ) / ఇందు ( సోమ ) / భౌమ ( మంగళ ) / సౌమ్య ( బుధ ) / బృహస్పతి ( గురు ) / భార్గవ ( శుక్ర ) / స్థిర ( శని ) ....

విష్ణు నక్షత్ర , విష్ణుయోగ , విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ

ప్రాచీనావీతి ( జంధ్యము అపసవ్యము గా వేసుకొనవలెను..)
అస్మత్ పిత్ర్యాది ద్వాదశ పితౄణాం అక్షయ పుణ్య లోకావాప్త్యర్థం అమావాశ్యాయామ్ / సంక్రమణ పుణ్య కాలే...
( లేక , సూర్యోపరాగ / చంద్రోపరాగ / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచ మహాఽపర పక్షేషు అస్మిన్ పితృ పక్షే సకృన్మహాలయే / గంగా కావేరీ తీరే .....

ఇలా ఏది సందర్భోచితమో దాన్ని చెప్పి )

శ్రాద్ద ప్రతినిధి సద్యః తిల తర్పణమ్ ఆచరిష్యే...
( కింద చెప్పిన విధముగా , తిలోదకాలతో వారి వారి పేరు , గోత్రము , రూపము చెప్పి తర్పణము ఇవ్వాలి..)
మొదట పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.మనకు కుడి వైపున ఉన్న మొదటి కూర్చ లో తండ్రి వైపు పితృ దేవతలను , ఎడమ వైపున ఉన్న రెండో కూర్చలో మాతృ వర్గపు పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.
ప్రథమ కూర్చే ..
|| ఆయాత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే....--------- గోత్రాన్. .. ---------( తండ్రి పేరు ) , .........తాతయ్య పేరు , ........ముత్తాత పేరు శర్మాణః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ , అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహాన్ ,

-------- గోత్రాః , -------- , -----------, ---------దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి |

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

పితృ , పితామహ , ప్రపితామహానాం , మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం |

( మొదటి కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

ద్వితీయ కూర్చే ( రెండవ కూర్చ పై )

|| ఆయాత మాతుః పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే..------ గోత్రాన్ .........( తల్లి యొక్క తండ్రి ) , ..........( తల్లి తాత ), .........( తల్లి ముత్తాత ) శర్మాణః ...వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ | , ,
-------- గోత్రాః ,........( తల్లి యొక్క తల్లి ) , .........( తల్లి యొక్క అవ్వ ) , ...........( తల్లి యొక్క ముత్తవ్వ ) దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి ||
|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||
సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( రెండవ కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

పితృ వర్గము వారికి తర్పణము ఇచ్చునపుడు మొదటి కూర్చ పైనను , మాతృ వర్గము వారికి ఇచ్చేటప్పుడు రెండో కూర్చ పైనను నువ్వులు , నీళ్ళు పితృ తీర్థం లో వదలాలి.

ప్రథమ కూర్చే.. ...పితృ వర్గ తర్పణం |
౧ పితృ తర్పణం (ఒక్కో మంత్రము చెప్పి ఒక్కోసారి , మొత్తం మూడు సార్లు తండ్రి కి ... అలాగే మూడేసి సార్లు ఇవ్వ వలసిన మిగిలిన వారికి )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ||

-------- గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||
------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

------- గోత్రాన్. .. ----------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨.. పితామహ తర్పణం ( మూడు సార్లు తాత కు)

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

--------గోత్రాన్. .. --------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

--------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

-------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౪. మాతృ తర్పణం ( మూడు సార్లు )

------ గోత్రాః , --------- దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతౄః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౫.. పితామహీ తర్పణం

-------- గోత్రాః , ---------దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౬. ప్రపితామహీ తర్పణం
--------- గోత్రాః , ----------- దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )
౭. ద్వితీయ కూర్చే మాతృ వర్గ తర్పణం. ( రెండవ కూర్చ పై )

మాతా మహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్~ఝాస్తేనోవంతు పితరో హవేషు ||

--------గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౮.. మాతుః పితామహ తర్పణం ( మూడు సార్లు )
౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

--------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||
----------గోత్రాన్. .. ------------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

---------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౯. మాతుః ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

--------గోత్రాన్. .. ----------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

--------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

-------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౧౦ మాతామహీ తర్పణం ( మూడు సార్లు )
--------- గోత్రాః , ------ దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౧. మాతుః పితామహీ తర్పణం

--------గోత్రాః , ------- దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ మాతుః పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౨.. మాతుః ప్రపితామహీ తర్పణం
------- గోత్రాః , -------దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ మాతుః ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

ద్వాదశ పితృ దేవతలకు మాత్రమే తర్పణం ఇస్తే , కింది మంత్రం చెప్పి ఒకసారి తిలోదకం ఇవ్వాలి...

జ్ఞాతాఽజ్ఞాత సర్వ కారుణ్య పితౄన్ స్వధా నమః తర్పయామి ||

|| ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ || తృప్యత తృప్యత తృప్యత |

సర్వే కారుణ్య పితృ దేవతలకు ఇస్తే కింది విధం గా , సజీవం గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి ఒక్కొక్క సారి మాత్రము తిలోదకం వదలాలి..

ఆత్మ పత్నీం( భార్య ) ------దేవీదామ్-----గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ సుతమ్ ( పుత్రుడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ జ్యేష్ట భ్రాతరం ( అన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ కనిష్ట భ్రాతరం ( తమ్ముడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ జ్యేష్ట పితృవ్యం ( పెదనాన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( పెద్దమ్మ ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ కనిష్ట పితృవ్యం ( చిన్నాన్న )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( పిన్ని ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ మాతులం ( మేనమామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
( ఇలా మేనమామలు , మేనత్తలు , పెద్దమ్మలు....ఎంతమంది కీర్తి శేషులై ఉంటే అంతమందికీ అదే శ్లోకం చెప్పి , వారి వారి పేర్లతో విడివిడి గా తర్పణం ఇవ్వాలి..)

అస్మద్దుహితరం ( కూతురు )-----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

ఆత్మ భగినీం ( అక్క / చెల్లెలు ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ దౌహిత్రం ( కూతురు కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ భాగినేయకం ( అక్క చెల్లెళ్ళ కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ పితృ భగినీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతృ భగినీం ( తల్లి అక్క/చెల్లెలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జామాతరం ( అల్లుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ భావుకం ( బావ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ స్నుషాం ( కోడలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ శ్వశురం ( పిల్లనిచ్చిన మామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ శ్వశ్రూః ( పిల్లనిచ్చిన అత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ స్యాలకం ( భార్య సోదరులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి
అస్మత్ సఖాయం ( ఆప్తులు / స్నేహితులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మద్గురుం ( గురువు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మదాచార్యం ( ఆచార్యుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

పైన చెప్పిన వారిలో సజీవులుగా ఉన్నవారిని వదలి , మిగిలిన వారికి తర్పణం ఇవ్వాలి.

ఉపవీతి | ప్రదక్షిణం | ( జంధ్యము సవ్యం గా వేసుకొని కింది మంత్రం చెప్పుతూ , పరచిన దర్భల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి )

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

నమోవః పితరో రసాయ నమోవః పితరః శుష్మాయ నమోవః పితరో జీవాయ నమోవః పితరః స్వధాయై నమోవః పితరో మన్యవే నమోవః పితరో ఘోరాయ పితరో నమో వో య ఏతస్మిన్ లోకేస్థ యుష్మాగ్ స్తేఽను యేస్మిన్ లోకే మాం తే ను య ఏతస్మిన్ లోకేస్థ యూ యం తేషాం వసిష్ఠా భూయాస్త యేస్మిన్ లోకేహం తేషాం వసిష్ఠో భూయాసం ||

తనచుట్టూ తాను ప్రదక్షిణం :

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

పాపోఽహం పాప కర్మోఽహం పాపాత్మా పాప సంభవః
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పితృదేవతాః..

|| చతుస్సాగర పర్యంతం ... .... .... అభివాదయే || ( ప్రవర చెప్పి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి )

పిత్రాదిభ్యో నమః |

ప్రాచీనావీతి | ఉద్వాసనం ( అపసవ్యం గా జంధ్యం వేసుకొని కింది మంత్రం చెప్పి కూర్చలను విప్పి పక్కన పెట్టాలి
|| ఉత్తిష్ఠత పితర ప్రేత శూరా యమస్య పంథా మను వేతా పురాణం | ధత్తాదస్మాసు ద్రవిణం యచ్చ భద్రం ప్రణో బ్రూతాత్ భాగధాన్దేవతాసు ||

|| పరేత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
అథా పితౄంథ్సువిదత్రాగ్ం అపీత యమేనయే సధమాదం మదంతి ||

అస్మాత్ కూర్చాత్ మమ పితృ , పితామహ , ప్రపితామహాన్ , మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ యథా స్థానం ప్రతిష్ఠాపయామి |
ద్వితీయ కూర్చాత్ సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ యథా స్థానం ప్రతిష్ఠాపయామి | శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

| కూర్చ ద్వయం విస్రస్య |

నివీతి |( జంధ్యము మాల లాగా వేసుకోవాలి ) తర్వాత , గోత్రాలు , సంబంధాలు తెలియని బంధువుల కొరకు తర్పణం ఇవ్వాలి..

యేషాం న మాతా న పితా న బంధుః నాన్య గోత్రిణః | తే సర్వే తృప్తిమాయాంతు మయోత్సృష్ట్యైః కుశొదకైః || ఇతి తిలోదకం నినీయ |

ఈ కింది శ్లోకము చెప్పి , జంధ్యాన్ని కాని నీటితో తడిపి , ( జంధ్యపు ముడిని ) ఆ నీటిని నేల పైకి పిండాలి..

|| యేకేచాస్మత్ కులే జాతాః అపుత్రా గోత్రిణోమృతాః
తే గృహ్యంతు మయా దత్తం వస్త్ర ( సూత్ర ) నిష్పీడనోదకం ||

దర్భాన్ విసృజ్య || పవిత్రం విసృజ్య || ఉపవీతి | దర్భలను , పవిత్రాన్ని విప్పి తీసెయ్యాలి , జంధ్యాన్ని సవ్యం గా వేసుకోవాలి )

తర్పణము అయ్యాక ,ఇది చెప్పాలి

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో తర్పణ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన | యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||

అనేన మయా అమావాస్యా పుణ్యకాలే / సూర్యోపరాగే / చంద్రోపరాగే / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / పితృ పక్షే సకృన్మహాలయే / తీర్థ క్షేత్రే కృతేన తిల తర్పణేన శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రియతాం ప్రీతో వరదో భవతు||

అని చెప్పి , అరచేతిలో నీళ్ళు వేసుకొని వదలాలి.

మధ్యే మంత్ర , తంత్ర , స్వర , వర్ణ , ధ్యాన , నేమ , లోప దోష పరిహారార్థం నామ త్రయ మంత్ర జపమ్ కరిష్యే |

అచ్యుతాయ నమః | అనంతాయ నమః | గోవిందాయ నమః || ( రెండు సార్లు పలకాలి )

అచ్యుతానంత గోవిందేభ్యో నమః |

|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |

కరోమి యద్యద్ సకలం పరస్మై శ్రీమన్నారాయణేతి సమర్పయామి ||

అని చెప్పి నీరు వదలాలి

శ్రీ కృష్ణార్పణమస్తు

పైన చెప్పినంత విస్తారముగా చేయుటకు సమయము లేనిచో , క్లుప్తముగా కిందివిధముగా చెయ్య వచ్చును..ఇది కేవలం విధి లేని పరిస్థితి లో మాత్రమే...ఎందుకంటే, శ్రాద్ధానికి , తర్పణానికి శ్రద్ధ ముఖ్యము.

ఈ శ్లోకము చెప్పి , మూడు సార్లు తిలోదకాలు ఇవ్వవలెను

|| ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృ మానవాః |

తృప్యంతు పితరః సర్వే మాతృ మాతా మహాదయః |

అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |

ఆ బ్రహ్మ భువనాల్లోకాత్ ఇదమస్తు తిలోదకం ||

ఆచమ్య || బ్రహ్మ యజ్ఞాదికం చరేత్ || యథా శక్తి బ్రాహ్మణాన్ భోజయేత్ || ఓం తత్ సత్

( ఆచమనం చేసి , శక్తి ఉన్నవారు బ్రహ్మ యజ్ఞం చెయ్యాలి ... బ్రాహ్మణులకు భోజనం పెట్టవచ్చు )

ఇతి ఆబ్దిక / దర్శ శ్రాద్ధ విధిః తర్పణ విధిశ్చ

10 comments:

Unknown said...

మీ వివరణ చాలా చాలా బాగుంది. కానీ మహలయపక్షంలో తిదితో సంబందం లేకుండా ఏతిదిలోనైన నిర్వహించవచ్చు అని ఓక ప్రముఖ బ్రహ్మ గారు తెలియచేసారు. అక్కడే మాకు అర్దం కాలేదు. మానాన్నగారు, మాఅమ్మగారు వేరువేరు తిదులలో మరణించారు. ఇంటివద్ద వారితిది ప్రకారం చేస్తాము ప్రతి సంవత్సరం. కాని మహలయపక్షంలో గయాలో ఇద్దరికీ ఓకేతిదిలో మాకు train tickets availability ని బట్టీ ఓకేతిదిలో నిర్వహిస్తునాము. నాకు ఇదే ఆర్దం కాలేదు.

సత్యనారాయణ ఆచార్యులు said...

తిలోదకాలు ఎవరెవరు ఇవ్వాలి చెప్పగలరు

Unknown said...

చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను! చాలా చాలా రుణ పడియున్నా ను.

Unknown said...

👌🙏

Raghavacharyulu said...

సంవత్సరీకముల మూడు దినములు ఏమిటి, వాటి విధి విధానాలు ఏమిటి, తెలుపగలరు

Unknown said...

అదేప్రశ్నకు జవాబు కావాలి

bhanuvaranasi.blogspot.com said...

బాగా వివరణాత్మకంగా ఉంది.. ధన్యవాదములండీ.

kameshdatta said...

చాలా బాగుంది కానీ మా నాన్నగారికి మాత్రమే చేయాలి రేపు అది కొంచెం confused గా ఉంది.

devi prasad, vaddadi said...

కరోనా వలన పితృ కార్యాలు చేయలేకపోయాము. మరల ఎప్పుడు చేయవచ్చు

C v Ramakrishna reddy said...

శ్రీ గురుభ్యోన్నమః. నాన్న గారు 2006లో కాలధర్మం చెందారు..అమ్మగారు 24_01_2022 న కాలధర్మం చెందారు.ఇద్దరూ లేనందున మేము సంవత్సరీకం ఎన్ని రోజులకు (నెలలకు)చేసుకోవాలో తెలియజేస్తారని మనవి

Powered By Blogger | Template Created By Lord HTML