
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 5 June 2015
విదురుడు మహాత్ముడు
విదురుడు మహాత్ముడు
ధర్మగతి చాలా లోతైనది. " ధర్మము ఏది అధర్మమేది " అనేదాన్ని సామాన్య బుద్ధి నిర్ణయింపజాలదు. ధర్మాధర్మాల తత్త్వాన్ని స్వయంగా భగవంతుడే ఎరుగును. ఇంకా భగవత్స్వరూపాన్ని ధర్మం పేరుతో పిలుస్తారు. అన్నింటి స్థితి ధర్మముపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ధర్మంలోనే అంతా ప్రతిష్టించబడి ఉంటుంది. కాబట్టి ధర్మాన్నే పరమతత్త్వంగా పేర్కొంటారు.
భావనాపరమైన భేధదృష్టితో చూసినట్లయితే ధర్మానికి మూడు రూపాలుంటాయి. అవి ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికములు. ధర్మం యొక్క ఆధ్యాత్మిక స్వరూపమే స్వయంగా భాగవంతుడు. తన లోకంలో ఉంటూ పుణ్యాత్ములను పాపాత్ములగు కర్మఫలాన్ని నిర్ణయింపబడే ఆధిదైవిక స్వరూపము ధర్మరాజు లేక యమధర్మరాజు. ఆయనను మనం వ్యావహారిక ధర్మానికి సంభంధించిన అధిష్ఠాన దేవతగా పేర్కొంటాం. ధర్మముయొక్క ఆధిభౌతిక స్వరూపమగు సామాజిక వ్యవస్థ; శాస్త్రాలు, శాస్త్రతత్త్వాన్ని దర్శించిన ఋషులద్వారా నిర్మితమౌతుంది. అది దేశ, కాల, పాత్ర, శక్తి వయోభేధంలో వివిధవిధాలుగా ఉంటుంది. ఈ వ్యవస్థను భంగపరిచే వారికి తగిన దండన విధించేది ధర్మదేవత. ధర్మదేవతకే "యమధర్మరాజు "అనే మరో పేరుకూడా ఉంది. ఆయన ఎంత జాగ్రత్త వహించాల్సి ఉందో ఏకొద్ది పొరపాటు జరిగినా స్వయంగా ఏవిధమైన శిక్ష అనుభవించాల్సి వస్తుందో అనే విషయంలో మనకు తెలిసింది చాలా తక్కువే!
అవును, భూమికి నైరృతికోణంలో ధర్మరాజు యొక్క 'సయంమనీపురి' ఉంది దీనిలో అనేక యొజనాల విస్తీర్ణంతో కూడిన అతి సుందరమైన భవనములు ఉన్నవి. ఈ భవనంలో ధర్మరాజు, అతని మంత్రులు, ధర్మవేత్తలగు సభాసదులు నివసించెదరు. ఆయన సభాసదులలో ఋషులు, మహర్షులు, దేవతలు అన్ని విధాలైనవారు నివశించుచుండేవారు. మానవుల పాప పుణ్యములను లెక్కలు గట్టే చిత్రగుప్తుడు కూడా ఉంటాడు. కాలమ్‌ను, దిశ ఆకాశము, వాయువు, అగ్ని, సూర్యుడు మొదలైన అనేకమంది దూతలు మనుష్యులద్వారా ఏకాంతముగా జరిగే కార్మలను సైతం చూస్తూ ఆసమాచారాన్ని వెంటనే ధర్మరాజు వద్దకు చేరవేస్తుంటారు. ఆయన సభలో నాలుగు ద్వారాలుంటాయి. మూడు ద్వారాల గుండా పుణ్యాత్ములు ప్రవేశించెదరు. నాల్గవ(దక్షిణ) ద్వారం గుండా పాపాత్ములు ప్రవేశించెదరు. ఈ ద్వారం గుండా పాపాత్ములు ప్రవేశించడానికి నానా కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. ఇంకా వారు వైతరణిని కూడా దాటవలసి వస్తుంది. ఆ మార్గం గుండా తీసుకు వచ్చే యమ దూతలు మహాభయంకరంగా ఉంటారు. కుంభీపాకం, రౌరవనరకం,అసిపత్రవనం మొదలైనవి కూడా ఆదిశగా వచ్చేటప్పుడు ఎదురౌతాయి. ఈ మార్గం గుండా ప్రయాణించే వారికి యమ ధర్మరాజు భయానకంగా కనిపించుటయే ఈ ద్వారం యొక్క ప్రత్యేకత. సహజంగా ఆయన స్వరుపం సౌమ్యమైనదే.
ఈ విధంగా యమధర్మరాజు భగవమ్తుని ఒక స్వరూపమే! కానీ ధర్మజ్ఞులైన పన్నెండుగురు మహాత్ములలో ఆయన ప్రముఖునిగా పరిగణించబడతాడు. అనగా ఆయన భగవంతుని పరమ భక్తుడే కాకుండా ఆయన రహస్యాలోను తెలిసిన మహాజ్ఞాని కూడా! ఆయన తన దూతలకు భగవతత్త్వ రహస్యాలను ఎరుకపరిచాడు. ఇంకా ఎవర్ని ఏయే మార్గాలగుండా తీసుకురావాలి. ఎవరెవరితో ఎలాంటి వ్యవహారాన్ని నెరపాలి అన్నది తన దూతలను పదేపదే భోధపరుస్తూనే ఉంటాడు. ఆయన మనోవాక్కాయ కర్మద్వారా భగవద్భక్తుడై ఉండికూడా తన దూతలకు కూడా ఈ విషయాన్ని పదే పదే ఉపదేశిస్తూ ఉంటాడు. ఆయన ఒక సారి "దూతలారా! ఎవరి నాలుక భగవంతుని పవిత్ర నామస్మరణ లీలాదులు గానం చేయదో, ఎవరి చిత్తం భగవచ్ఛరణ కమలాలను స్మరించదో, ఎవరి శిరస్సు భగవంతుడి ముందు, ఆయన భక్తుల ముందు ఒక్కసారైనావంచదో ఎవరు తమ కర్తవ్యపాలన ద్వారా భగవంతుని ఆరాధించరో ఎవరు ఆయన సత్స్వరూపం యెడల విముఖులో అటువంటి వారినే మీరు భయంకర మార్గము గుండా తీసుకొని రమ్ము! అని చెప్పాడు. యమధర్మరాజు కేవలము నరకానికి చేరిన తర్వాతనే యమధర్మరాజు పాపపుణ్యములిచ్చునని కాదు. నిజమునకు ఈ లోకంలోనే ఈ జన్మలోనే ఇక్కడి మనుషులనే నిమిత్తులను చేసి ఫలితాలను ఇస్తుంటాడు.
పూర్వం మాంఢవ్యుడనే మహాతపశ్శాలియైన ఋషిఉండేవాడు. ఆయన మహా ధర్మజ్ఞుడు, ప్రభావశాలి యైన పుణ్యాత్ముడు, మహా మునీశ్వరుడు. ఆయన తన చేతులను పైకెత్తి తపస్సులో లీనమై ఉన్నాడు. ఒకరోజు కొంతమంది బందిపోటు దొంగలు ధనాన్ని కొల్లగొట్టి మాండవ్యఋష్యాశ్రమం మీదగా వెళ్ళారు. ఆ సమయంలో రాజభటులు వారిని వెంబడించారు. అప్పుడు ఆధనాన్ని ఋష్యాశ్రమంలో పాతి పెట్టి వెళ్ళి పోయారు. రాజ భటులు వచ్చి మునీశ్వరుడిని "ఓ మునీశ్వరా ఆ బందిపోటు దొంగలు ఎటు వెళ్ళినారు? " అని ప్రశ్నించారు. కానీ తన మౌనవ్రతం కారణంగా ఏవిధమని సమాధానము ఇవ్వలేదు. రాజా భాటులు ఆశ్రమం సమీపంలోనే బందిపోటు దొంగలను పట్టుకొన్నారు. ధనం కూడా అక్కడే లభించినది. ఈయన తపస్వి కాదు, బందిపోటు దొంగే అయి వుంటాడని అందుకే తెలిసినా కానీ చెప్పలేదని" - అని ఆ మునిపై సందేహం కలిగినది. " ఆందువల్ల అతనిని కూడా భంధించి తిసుకు పోదాం "ఆని అనుకొన్నారు. వారు మాండవ్యుడను బందించి ఆ బందిపోటు దొంగలతోనే ఆయనను రాజుగారి సమక్షంలో ప్రవేశపెట్టారు.
అక్కడ కూడా ఆయన జవాజు చెప్పక పోవడంతో రాజుగారు బందిపోటుగానే భావించి వారితో పాటు ఉరిశిక్ష ఖరారు చేశారు. మాండవ్యఋషిని రాతిశూలం ఎక్కించినా, ఉరికంబం ఆయన శరీరాన్ని ఛేధించలేకపోయింది. ఆయన బహుదినాలు ఉరి కంబం పైనే కూర్చొని తపస్సుచేస్తూ ఉండి పోయాడు. ఈ విషయం ఇతర ఋషులకు తెలియగానే పక్షుల రూపంలో మాండవ్యముని వద్దకు రాసాగారు. "స్వామీ! తమరు ఏపాపం చేస్తే ఈ ఫలం లభించినదో చెప్పం"డంటూ ప్రశ్నించసాగారు. మాండవ్యుడు కూడా ఏపాపానికి ఈ ఫలితం లభీంచినదో అన్న ఆలోచనలో పడ్డాడు. రాజు గారికి కూడా కొద్దిరోజులలోనే ఉరి కంబం ఎక్కించిన ఒక బందిపోటు మరణించలేదు అతడు ఇప్పటికీ సజీవమ్గా ఉన్నాడు అనే వార్త తెలిసినది. ఆయనకు ఋషే అయి ఉంటాడనే విషయం అర్దమైంది. వెంటనే రాజు ఆయనను పరి పరి విధాలుగా ప్రార్ధించి రాతి సూలం నుండి క్రిందకు దింపించెను. అయితే ఉరి కంబంనకు సంభంధించిన తుది చీల (ములికి) మాత్రం ఆయన శరీరంలో ఉండిపోయింది. అది ఊడి రాలేదు. అందుకనే ఆయనకు "ఆణిమాండవ్యుడ"నే పేరు వచ్చినది.
మాండవ్యఋషి ఒకరోజున యమధర్మరాజు సభలో ఉపస్థితుడై ఉండెను. ఆయన - "ధర్మరాజా నేను ఏ పాపం చేశాను? ఏ ఫలితంగా ఉరి కంభం ఎక్కవలసిన పరిస్థితి వచ్చినది? దీనికి నీవు సరైన సమాధానం ఇవ్వని పక్షంలో నీవు చేసుకొన్న ఈ కర్మను అనుభవించవలసి ఉంటుంది." అన్నాడు అప్పుడు ఆయమధర్మ రాజు "ఓ తపోనిధీ! మీరు బాల్యంలో ఒక వాడియగు చువ్వతో కొన్ని మిడుతలను వేధించి ఎగరేశినారు." ఆపాప ఫలితమే మీరు ఉరికంభం ఎక్కవలసి వచ్చినది." అని సమాధనం ఇచ్చాడు. ఇఅంకా ఆయన "చిన్న పాపమైనా చిన్నదిగా ఉండదు. పాపం ఎప్పుడూ పెద్దదిగా ఉంటుంది" అని సమాధానమిచ్చాడు. అప్పుడు మాండవ్యముని "యమధర్మ రాజా! నేను అప్పుడు బాలుడనే పాపపుణ్యములకు సంభంధించిన కొద్దిపాటి జ్ఞానం కూడా నాకు లేదే అంతటి చిన్న పాపానికి ఇంతటి పెద్దశిక్ష విధీంచి బ్రాహ్మణుని ఉరికంభంఎక్కించడమా? ఇది ఎంతమాత్రం ఉచిత నేరంకాదు. ఇందు మూలంగా నేను నిన్ను శపిస్తున్నాను. " నీవు మర్త్యలోకంలో వంద సంవత్సరములు శూద్రుడవై జన్మించి ఉండెదవుగాక! " అని పలికెను. యమ ధర్మరాజు ఋషిశాపాన్ని ఆనందముగా స్వీకరించాడు.
ఆ రోజుల్లో ఈ భూమండలం మీద రాక్షసుల సంఖ్య పెచ్చు పెరిగి పోయింది. క్షత్రియుల రూపంలో జన్మించి వారంతా భూమండలాన్ని కల్లోల పరిచారు. వారందరినీ అణచి వేయడానికి దేవతలంతా తమ అంశలతో అవతార మెత్తసాగారు. స్వయంగా శ్రీ కృష్ణభగవానుడు కూడా ఈ ధరాతలం మీద అవతరించాడు. అలంటి సమయంలో ధర్మం అవతరించాల్సిన ఆవశ్యకత ఉండనే ఉన్నప్పటికీ మాండవ్యముని శాపం ఒక నిమిత్తమైంది. దేవతలలో శరీర నిర్మాణ శక్తి ఉంటుంది. వారు ఒకేసారి అనేక రూపాల్లో అనేక ప్రదేశాలలో అవతరించి అనేక యజ్ఞాలలో పాల్గొనగలరు. యమధర్మరాజు కూడా తాను రెండు రూపాల్లో అవతరించాడు. ఆయన రెండు రూపాల్లో ఒకటి విదురుడు కాగా రెండవది యుధిష్టురుడు. విదురుని జనన సందర్భంలో ఇరువురి సమానత స్పష్టమౌతుంది.
సత్యవతి వేదవ్యాసుడితో "వత్సా! నీవంటి తపశ్శాలియైన మహాత్ముడు ఉండి కూడా మన కురువంశం అంతరించే స్థితికి వచ్చింది. భీష్ముడు బ్రహ్మచారి. విచిత్రవీర్యుడు గతించాడు. ఇప్పుడు మన వంశం ఎలాముందుకు సాగుతుంది? నీవు తపో శక్తితో మన వంశాన్ని నిలబెట్ట"మని ప్రార్దించెను. వ్యాసుడు తన మాతయొక్క ఆంతర్యాన్ని గ్రహించి ఇలా అన్నాడు - అంబిక, అంబాలిక వివస్త్రలై నా సమక్షమునుండి వెడలిన పక్షంలో నా దృక్శక్తిద్వారా వారికి సంతాన ప్రప్తి కలుగుతుంది." సత్యవతి రారిద్దరినీ వంతులవారీగా వ్యాసభగవానుడి సమక్షానికి పంపినది. కానీ వారిద్దరూ సంకోచంతో వ్యాసమహర్షి వద్దకు వెళ్లారు. ఒకామె కళ్ళు మూసుకుంది, మరోకామె తెల్లబోయినది (వివర్ణ అయింది). వ్యాసుడు వారిని చూచి ఇట్లు వచించెను. అంబిక ద్వారా కలిగే కుమారుడు అంధుడౌతాడు, అంబాలిక ద్వారా కలిగే కుమారుడు పాండు వర్ణంతో ఉంటాడు. వారిలో ఒక్కడు దృతరాష్ట్రుడు మరొకడు పాండురాజుగా ఉదయించారు. వారి వంశజులే దుర్యోదన యుధిష్ఠిరాదులు. సత్యవతి ఇంతటితో సంతృప్తి పడలేదు. ఆమెను మళ్ళీ అంబికను పిలచి ఒక సర్వగుణ సంపన్నుడైన పుత్రుణ్ణీ కనమని కోరింది. అంబిక ఆమె సమక్షంలో సరే అన్నది కానీ ఆమెకు మళ్ళీ వ్యాసుని వద్దకు వెళ్లే ధైర్యం చాలలేదు. ఆమె పరమ సౌందర్య రాశియగు తన దాశిని వ్యాసుని వద్దకు పంపినది ఆ దాశి సంకోచరహితముగా వ్యాసుని వద్దకు వెళ్లినది. అప్పుడు ఆయన యొక్క కృపాదృష్టితో ఆమెకు గర్భం నిలబడింది. వ్యాసుడు ఆనాటి నుండి ఆమెయొక్క దాసీత్వంను తొలగిపోయేలా వరాన్ని ప్రసాదించాడు. 'నీ గర్భం నుండి మహా తేజస్సుగల పుత్రుడుదయిస్తాడు అని పలికెను.' వ్యాసభగవానుడి యొక్కమాటలు వృధా కాలాలవు గదా! సమయం ఆసన్నమైనది. యమధర్మరాజు ఈ దాసీ గర్భం నుండి విదురునిగా ఉదయించెను.
ధర్మాత్ముడైన విదురుడు మనుష్యునిగా జన్మించిన తన దేవతాజ్ఞానాన్ని మాత్రం వీడలేదు సరిగదా! అలా అని తన దేవతా స్వరూపాన్ని ఎన్నడూ ప్రకటించుకోలేదు. ఆయన సర్వదా మనుష్య ధర్మాన్నే పాటించుకుంటూ వచ్చాడు. బాల్యం నుండే అతడు గంభీరుడు. వ్యాసభగవానుడు, భీష్మపితామహుడు ఆదిగాగల గురుజనుల సేవలో తరించుచున్నాడు. ఏమీ తెలియనట్లే మౌనముద్రనుదాల్చేవాడు. ఆనయ నిరంతరం భగవద్భజనలో నిమగ్నుడై యుంటూ అవకాశం లభించినప్పుడల్లా ధ్యానమగ్నుడయ్యేవాడు. ఆయన జీవితంలో ఎప్పుడూ బహిర్ముఖత అనేది వెల్లడయ్యేది కాదు. ఆయన సేవాభావానికి, సదాచారానికి అందరూ ప్రసన్నులయ్యేవారు. అంధుడైనప్పటికీ తన అగ్రజుడైన ధృతరాష్ట్రుడికి విదురుడే నేత్రాలుగా ఉండేవాడు. దృతరాష్ట్రుడు ఏపనీ విదురుని సలహా తీసుకోకుండా చేసేవాడు కాదు. భీష్మపితామహుడు పాండురాజుకు, దృతరాష్ట్రుడికి అపార సంపదలను ఇచ్చెను. భీష్ముడు విదురుడిని ధనసంపత్తిని తీసుకోవలసిందని కోరినప్పుడు ఆయన దానిని స్వీకరించలేదు. ఆయన దృష్టిలో ధనానికి విలువలేదు. ఈ ప్రపంచంలో ఈ క్షణంలో ఉండి మరుక్షణంలో మాయమయ్యే అసత్యపదార్థాలను స్వీకరించి వాటి చింతనతో తమ సమయాన్ని ఎవరు గడుపుతారు? వీటికోసం భగవచ్చింతనకు ఎవరు దూరమౌతారు? అని విచారించి ఆయన ధనసంపత్తికి దూరంగానే ఉండసాగాడు.
భీష్మ పితామహుడు పాండురాజుకి, దృతరాష్ట్రుడికి వివాహం జరిపించగానే వివాహానికి విదురుని వంతుకూడా వచ్చినది. ఆరోజుల్లో మధురలో దేవకుని ప్రభావం అధికంగా ఉండేది. అతని వద్ద ఒక సదాచార సంపన్నురాలైన పారశవీ స్త్రీ దాసిగా ఉండేది. ఆమెకు సర్వగున సంపన్నురాలైన ఒక కుమార్తె ఉంది. ఆమెతో భీష్ముడు విదరుని వివాహం జరిపించినాడు. విదురుడు తన ధర్మపత్నితో గార్హస్థ్య ధర్మాన్ని నిర్వహిస్తూ భగవచ్చింతన కొనసాగించాడు.
ఒక విధంగా ఆయన ధృతరాష్ట్రుని మంత్రిగానే మెలిగాడు. ఆయన మంత్రిత్వంలో రాజ్య వ్యవహారాలు నడచినంతకాలం దుర్యోదన, దుశ్శాసన, కర్ణాదులకు ప్రాధాన్యత లభించలేదు. స్వయంగా ధర్మమూర్తి యొక్క మంత్రిత్వంలో రాచకార్య నిర్వహనేలా జరుగుతుందో వేరే చెప్పాల్సిన అవసరం ఉండదు కదా! ఆ రోజుల్లో అక్కడ సుఖశాంతులు వర్థిల్లాయి. పాండురాజు నివశించే ప్రతిచోట ఆయనకు కావలసిన సామాగ్రి లభ్యమవుతూండేది. ఎలాంటి ప్రజలకైనా ఎలాంటి నష్టమూ ఉండేదికాదు. సాక్షాత్తు ధర్మమూర్తి చేతుల మీదగా రాజ్యపాలన జరుగుతుంటే కష్టాలు ఎందుకుంటాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment