ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 23 June 2015

అణుశాస్త్ర పితామహుడు కణాదుడు

అణుశాస్త్ర పితామహుడు కణాదుడు
భారతీయ మహర్షులలో కణాదుడు సుప్రసిద్ధుడు. ఆయన 2600
సంవత్సరాల క్రిందటివాడు. ద్వారకకు సమీపంలో ఉన్న ప్రభాస
క్షేత్రంలో ఆయన జన్మించాడు. అది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
‘కణశాస్త్రం’లో కొత్త విషయాలు కనుగొనడం వల్ల ‘కణాదుడు’
అని పేరు వచ్చిందని అంటారు. ఆయనకు ఉలూకుడు,
కాశ్యపుడు అన్న పేర్లు కూడా ఉన్నాయి. ఈ మహర్షి నాలుగు
విషయాల్లో పరిశోధనలు చేశాడు. అవి
1. అణు సిద్ధాంతం (కణ సిద్ధాంతం).
2. ‘గురుత్వ’ సిద్ధాంతం.
3. జీవపదార్ధ నిర్మాణం.
4.రసవిద్య.
నిజానికి కణాదుడు లేకుండా అణుశాస్త్రం లేదు. గురుత్వ
(ఆకర్షణ) సిద్ధాంతం లేదు. చివరికి రసాయన శాస్త్ర పురోగతి
లేదు. కణాదుడు అణువును గురించి, దాని రూపాన్ని, గుణాన్ని
గురించి ప్రపంచానికి మొట్టమొదట తెలియజేశాడు. ‘వైశేషికం’ అన్న
పుస్తకం ద్వారా తన ఆలోచనలన్నింటినీ ప్రపంచానికి
ప్రకటించాడు.
సృష్టిలో పదార్ధం ఉంది. ఈ పదార్ధం 9 రకాలు. అవి: 1.భూమి,
2.నీరు, 3.అగ్ని, 4.వాయువు, 5.ఆకాశము. 6.కాలము, 7.దిక్కు,
8.ఆత్మ, 9.మనస్సు.
మొదటి ఐదింటినీ పంచ మహాభూతాలనీ, వాటికి వరుసగా గంధము,
రసము, రూపము, స్పర్శ, శబ్దము అనే గుణాలున్నాయని
చెప్పాడు. ప్రతి పదార్ధాన్ని ‘అవయవాలు’ గా విభజించవచ్చని, వాటిని
‘కణములు’ గానూ, పరమాణువులుగానూ విభజించవచ్చనీ
చెప్పాడు. ఆపై పరమాణువు విభజింపబడదనీ, అది శాశ్వతమనీ
వివరించాడు.
అంతేకాదు.. రెండు అణువులు కలిస్తే..’ద్వృణుకం’ అని
మూడు అణువులు కలిస్తే ‘త్రణ్యుకం’ అని పేర్కొన్నాడు.
ఈ అణువులకు 1. నిశ్చలస్థితి, 2 .చలన స్థితి ఉంటాయని
తెలిపాడు. ఆయన సూత్రాలు కేవలం అణువు గురించే కాదు..
‘ఆత్మ’, ‘మనస్సు’ల గురించి కూడా ఉన్నాయి.
కణాదుని పరిశోధనలో ముఖ్యాంశాలు నాలుగు. అవి : 1.
పరమాణువాదం, 2. పరమాణు నిత్యత్వవాదం, 3. షట్ పదార్ధవాదం,
4.సృష్టివాదం..
ఆయన అణుసిద్ధాంతం గ్రీకుల అణు సిద్ధాంతం కన్నా చాలా
పాతదనీ, విశేషమైనదని ప్రఖ్యాత శాస్త్రవేత్త డివీర్. సాల్వీ
అభిప్రాయం. ఒక్క అణుశాస్త్రంలోనే కాక ‘రసవాదం’ లోనూ కొత్త
విషయాలను కనిపెట్టాడు.
ప్రతి జీవిలోనూ ఐదు మూలకాలున్నాయని చెప్పాడు. 1. నీరు,
2.అగ్ని, 3.భూమి, 4. వాయువు, 5.ఆకాశం. వీటినే
పంచభూతాలంటారు.
కణాదుడు న్యూటన్ పుట్టకముందే క్రీస్తు పూర్వం 6వ
శతాబ్దంలోనే ‘గురుత్వ’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీనినే
అంగ్లేయులు ‘గ్రావిటీ’ అని అంటున్నారు. భూమిపై
వస్తువులు పడిపోవడానికి ‘గురుత్వ ఆకర్షణ’యే కారణమన్నాడు
కణాదుడు.
నిస్వార్ధ మహర్షి, మహామేధావి, మహాశాస్త్రవేత్తయైన కణాదుడు నేటి
మహా మహా శాస్త్రవేత్తలకే కాదు, రాబోయే యుగయుగాలకు
ఆదర్శప్రాయుడు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML