గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 4 June 2015

కర్మసిద్ధాంతం అంటే‘భాః’ అంటే కాంతి, కాంతి విజ్ఞానానికి, ఆనందానికి, పరమాత్మకు సంకేతం. దానిలో ‘రతి’ (ప్రీతి) గలవారే భారతీయులు. కర్మసిద్ధాంతం అంటే (ఈ జన్మలో కాని, పూర్వజన్మలో కాని) తాను చేసిన పనికి ఫలితం తానే అనుభవించాలి అని కొందరి భావన. కాని చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవించుట సార్వత్రికంగా నియమం కాదు.

అప్పు చేసినవాడు తీర్చలేకపోతే జైలుకుపోవుట కర్మఫలితంగా భావిస్తే... ‘తీర్చుట’ అనే ప్రక్రియ జైలుకు పోకుండా కాపాడుతుంది. అనగా పూర్వం చేసిన కర్మకు అనుభవించుటం ఒక మార్గం అయితే... దానిని నిరోధించుట కొరకు మరో కర్మ చేయుట మరో మార్గం. కావున జాతకంలో ఉన్నది తప్పక అనుభవించాలి అనే విధానం మాత్రం సరియైనది కాదు. బృహజ్జాతక వ్యాఖ్యాత భట్టత్పలుడు ‘‘జాతక ఫలితాన్ని అనుభవించుటే తప్పనిసరి అయితే దానిని తెలుసుకొనుట వ్యర్థం. భావి ఫలితాన్ని ముందుగా తెలుసుకొనుటవల్ల రాబోయే దుఃఖం కోసం ఇప్పటినుండి దుఃఖించడం అనే నష్టాలుండటం వల్ల జాతక ఫలితం తెలుసుకోవడమే నష్టప్రదం అవుతుంది. అయితే శాస్త్ర ప్రయోజనం అదికాదు.

ఒక జాతకంలో శుభఫలితాన్ని తెలుసుకొని దానికి అనుగుణమైన కృషి చేయడం ద్వారా ఫలితాన్ని సంపూర్ణంగా సాధించవచ్చు. వివరంగా చెప్పాలంటే... దానాదికములైన పుణ్యకర్మల ద్వారా శుభఫలితాన్ని పెంచుకోవచ్చు. దుష్టఫలితాన్ని ముందుగా తెలిసికొనుట ద్వారా దానికి వ్యతిరేక దిశలో ప్రయత్నించి దుష్టఫలితాన్ని జయించవచ్చు. లేదా తగ్గించవచ్చు. ఆ దోష ప్రాబల్య శాతాన్ని గమనించి దాన్ని జయించడం శక్యం కాని పక్షంలో చేసుకోవచ్చు’’ అని వివరించాడు.
కర్మ ఫలితం ఉంటుంది. అది దుష్టమైనదైనపుడు దాని నివారణకు చేసే కర్మకూ ఫలితం ఉంటుంది. కర్మను కర్మచేతనే జయించాలి.

పూర్వం చేసిన కర్మను దానివల్ల వచ్చే ఫలితాన్ని అదృస్టమని, దైవికమని పిలుస్తుంటారు. ‘‘విహన్యాద్దుర్బలం దైవం పురుషేణ విపశ్చితా’’ అనే వ్యాసుని వచనం పూర్వకర్మను ప్రస్తుత కర్మచే జయించవచ్చనే అభిప్రాయాన్ని బలపరుస్తుంది. మనమిదివరలో చేసిన కర్మననుసరించి మన జననం సంభవిస్తుంది. మన జననం మనచేతిలో లేదు. కానీ, అప్పటి గ్రహస్థితి పూర్వజన్మకు అనుగుణంగా ఉంటుంది. ఆ గ్రహస్థితి ప్రభావం కాలక్రమంలో దశాక్రమాన్ననుస రించి ఆయా భావనలను ప్రేరేపిస్తుంది.

ప్రేరేపించబడిన భావనకు స్పందించిన వ్యక్తి తన భావాలననుసరించి ప్రవర్తించకుండా శాస్త్రం, సామాజిక న్యాయం, అనుభవం ఆధారంగా చేసుకొని వివేకంతో ప్రవర్తించి మంచిని పెంచుకోవడం, చెడును తొలగించుకోవడం, చేయవలసి ఉంటుంది. దోష ఫలితం సిద్ధించే సమయాన్ని జాతకం తెలుపుతుంది. దానిని ముందుగా గుర్తించడం ద్వారా దానిని జయించే అవకాశాన్ని జాతకం కల్పిస్తుంది. లఘు జాతకంలో ‘‘యదుపచిత కున్య జన్మని శుభం శుభం తన్య కర్మణః పంక్తిం వ్యం జయతి శాస్త్రమేతత్‌ తుమసి ద్రవ్యాణి దీపమేవ’’ అన్నారు వరాహమిహిరుడు. పూర్వజన్మలో చేసిన శుభాశుభ కర్మల యొక్క ఫలానుభవ కాలాలను ఈ శాస్త్రం సూచిస్తుంది. చీకటిలోని వస్తువులను దీపం సహాయముతో గుర్తించినట్లుగా కలుగబోయే శుశాశుభాలను జాతకం ద్వారా గుర్తించి అనుకూల, వ్యతిరేక ప్రక్రియల ద్వారా జీవితాన్ని సుఖవంతం చేసుకొనుటకు ఈ శాస్త్రం సహకరిస్తుంది.

కర్మ 3 విధాలు. ప్రారబ్ధం, సంచితం, ఆగామి ప్రారబ్ధం అంటే... పూర్వ జన్మలో మనం చేసిన కర్మను ఫలితం అనుభవించడం ప్రారంభించింది.

ప్ర - ఆరబ్ధం: ఇంతకు ముందే ఆరంభింపబడింది. దానిని జయించ శక్యం కాదు. విడిచిపెట్టిన బాణం యొక్క మార్గాన్ని మళ్లించడం అంత సులభం కాదు.
సంచితం: సంచిత కర్మ అంటే పూర్వం చేయబడిన నిల్వవున్నది.
ఆగామి అంటే రాబోవుకాలంలో పరిపక్వయ్యేది. మన సత్ప్రవర్తన ద్వారా ఆగామి మంచిగా మలచుకోవచ్చు. మన ప్రతి క్రియల ద్వారా దుష్టమైన సంచిత కర్మను తొలగించుకోవచ్చు. దుష్టదశ వచ్చేవరకు ఆగి దుష్టఫలితాన్ని అనుభవించడం ప్రారంభించిన తరువాత దాన్ని తొలగించుకోవడం అనేది అనారోగ్యం వచ్చాక మందు పుచ్చుకోవడం లాంటిది. జాతకం ద్వారా రాబోయే దుష్ట ఫలితాన్ని ముందుగా గుర్తించి అష్టక వర్గు ద్వారా దాన్ని శాతాన్ని గుర్తించి దుష్ట ఫలితానికి వ్యతిరేకంగా మనం చేయాల్సిన కృషిని అంచనా వేసుకొని ఆధ్యాత్మిక లౌకిక ప్రయత్నం ద్వారా కృషి చేసి దుష్ట ఫలితాన్ని అధిగమించవచ్చు.

ఉదాహరణకి... నిన్న ఒక వ్యక్తిని మనం కొట్టాం. ఈ రోజు అతను మనల్ని కొట్టడానికి పదిమందిని వెంటవేసుకొని వస్తున్నాడు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకొని మనం అతని చేతిలో దెబ్బలు తినటం తప్పనిసరి అని తెలిస్తే... మూడు విధాలుగా అధిగమించవ చ్చు. 1. అతను ఎన్నింటికి వస్తున్నాడో తెలుసుకొని అతను వచ్చే సమయానికి ముందే అతనితో వచ్చే బలగం కన్నా ఎక్కువ బలగంతో వెళ్లి ‘క్షమార్పణ’ చెప్పడం ఒక మార్గం. జాతకంలో ఉన్న దుష్ట ఫలితం యొక్క శాతాన్ని గమనించి దానాదుల ద్వారా దానికన్నా ఎక్కువ పుణ్యాన్ని సంపాదించి గతంలో తాను చేసిన అపరాధాలను క్షమిం చమని ప్రార్థించేటు వంటిది. ఇది ‘దీనిలో సాత్వికత.. ప్రశాంతి వున్నాయి.

2. ఎదుటివాడు 10 మందితో వస్తే అతన్ని జ యించేవిధంగా ఇంకా ఎక్కువ బలగంతో వెళ్లి ఎదిరించడం రెండో మార్గం. జాతకంలో దుష్ట సమయాన్ని గుర్తించి లౌకికమైన దృష్టిని పెంచి దుష్టఫలితాన్ని అధిగమించే ప్రయత్నం చేయ డం ఇలాంటిదే దీనిలో ఉద్రేక ము, కొంత దెబ్బలు తగల డం వంటి నష్టాలు కూడా ఉన్నాయి. 3. అతను వచ్చే సమయానికి అతనికి కనిపిం చకుండా దాక్కోవడం... దీనిలో మానసిక భీతి, ఆందోళన ఉన్నాయి. మనకు జాతకంలో వచ్చే దుష్ట సమయాన్ని గుర్తించి నూతన ప్రయత్నా లు చేయడం. దీనిలో ఆశాంతి, దుఃఖభవన, నిరుత్సాహం ఉంటాయి. ఆ విధంగా చేసి 3 ప్రక్రియ లోనూ ‘‘రాబోయే దుష్ట ఫలితాన్ని ముందుగా గుర్తించగలగడం తప్పనిసరి. దాని కి జాతకం ఒక్కటే మార్గం కాగా కర్మ సిద్ధాం తా నికి అనుగుణంగా జాతకం ద్వారా మన జీవి తాన్ని సుఖమయం చేసుకునే అవకాశాలను జ్యోతిష్యశాస్త్రం అనే కరదీపిక చూపుతోంది.

కనుక మన జీవితంలో రాబోయే చెడు సమ యాన్ని కానీ, నడుస్తున్న చెడు సమయాన్ని కానీ, గుర్తించి (ఏమి చేసినా కలిసి రావడం లేదు, సమస్యలు, చిక్కులు, డిప్రెషన్‌ మొద లైన సమస్యలు... ఏవైనా సరే) జాతకాన్ని వేయించుకొని (మన తలరాతలు మార్చే శక్తి ఈ శాస్త్రానికి లేకపోయినా... ఏ సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకొని ఆపదలు, ఇబ్బందుల నుండి బయటపడే యించే పరిస్థితులను మనకు కల్పిస్తుంది. చీకటిలో టార్చ్‌లా, పడవ కి చుక్కానిలా... మనిషికి మార్గాన్ని నిర్దే శిస్తుంది) దానికి తగిన పరిహారాలు ‘‘జపం, దానం, హోమం, శాంతి, ఓషధులు, రత్నధారణ, మొక్కల పెంపకం, దేవా లయ దర్శనం, మంత్రజపం... మొదలైనవి పాటిస్తూ... వాస్తుపరంగా చిన్నచిన్న మార్పుల్ని చేసుకొని జీవితాన్ని ఆనందంగా మార్చుకోవచ్చు. జ్వరం వస్తే డాక్టర్‌ దగ్గరికి వెళ్లి మందు వేసుకున్నట్లే... ఏదైనా సమస్య వస్తే జ్యోతిష్కుని సంప్రదించి ‘పరిహారాలు’ పాటించి ఉపశమనం పొందవచ్చు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML