గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 June 2015

జ్యేష్ఠ పూర్ణిమ. జ్యేష్ఠ అభిషేకాలు అని మనకి ప్రసిద్ధి. తిరుపతిలో కూడా 3 రోజులు ఈ అభిషేకాలు జరుగుతాయి. జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి, పూర్ణిమ మరియు పాడ్యమి రోజులలో జరుగుతాయి.

 జ్యేష్ఠ పూర్ణిమ. జ్యేష్ఠ అభిషేకాలు అని మనకి ప్రసిద్ధి. తిరుపతిలో కూడా 3 రోజులు ఈ అభిషేకాలు జరుగుతాయి. జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి, పూర్ణిమ మరియు పాడ్యమి రోజులలో జరుగుతాయి.
ఆధ్యాత్మిక చైతన్యానికీ, భక్తి ఉద్యమానికీ ప్రధాన కేంద్రం పూరీ జగన్నాథ క్షేత్రం.
ఒర్రిస్సా రాష్ట్రంలోని ఈ పురుషోత్తమ క్షేత్రం అనాదిగా ఎన్నో ప్రత్యేక విశష్టతలు కలబోసుకొని ప్రపంచాకర్షణని సాధిమ్చింది. కృష్ణభక్తి ఉద్యమకర్త చైతన్య మహాప్రభువు సేవించి తరించి ముక్తి పొందిన పవిత్ర ధామమిది.
ఆదిశంకరులు దర్శించి పరవశించి, తన నాలుగు పీఠాల్లో ఒకదాన్ని ఇక్కడే ప్రతిష్ఠించారు.
వ్శిష్టమైన ఉత్కళ కళలకీ, జీవన రీతికీ, ఆధారంగా ఉన్న దైవం పురీ జగన్నాథుడు. యుగయుగాలుగా విభిన్నరీతుల్లో విష్ణువు పూజలందుకుంటున్నట్లు పురాణాలు చెప్తున్నాయి.
కృతయుగాది నుండి నీలమాధవునిగా, నీలాచలంలో వెలసి దేవ, ఋషులచే సేవించబడి, జగన్నాథ, బలభద్ర, సుభద్రా మూర్తులుగా దారు విగ్రహాలతో ఆవిర్భవించి ’దారుబ్రహ్మము"గా సంభావించబడుతున్నాడు నారాయణుడు.
జగన్నాథ ప్రసాదం:
"కాశీగంగ, బృందావన మృత్తిక, జగన్నాథ ప్రసాదం - ఈ మూడూ సాక్షాత్తు గోవింద రూపాలు" అని శ్రీరామకృష్ణ పరమహంస పలికేవారు. ఇది శాస్త్ర వచనం కూడా.
అందుకే పూరీ ప్రసాదానికి ప్రత్యేకత ఉంది. మహాలక్ష్మి అధ్యక్షతన వండబడే దివ్య ప్రసాదమిది - అని ధార్మిక గ్రంథాల మాట.
ఈ ప్రసాదాన్ని జాతి బేధాలు లేకుండా ప్రతివారూ స్వీకరిస్తారు. ఇది మహిమాన్వితమే కాక, దీనితో పితృశ్రాద్ధాదికాలు ఆచరించి ధన్యత పొందవచ్చునని పురాణ వచనం.
ఈ ప్రసాద మహిమను ఆధారం చేసుకొని ఎన్నో పౌరాణిక, చారిత్రక గాథలున్నాయి. ఎటువంటి భేదభావాలు లేకుండా ఎవరి చేతినుండైనా గ్రహించదగిన ఈ ప్రసాద మహిమ బహువిధాలుగా వర్ణించారు. నివేదన వరకు ఖచ్చితమైన నియమాలను పాటించి, నివేదనానంరం జగన్నాథునికి మారు రూపంగ భావించబడి, అందరినీ అనుగ్రహించే ప్రసాదమిది. ఏక్షేత్రంలోనూ లేని ప్రత్యేక్త ఇక్కడి అన్నప్రసాదానికి ఉంది.
"ఇందులో ప్రతి మెతుకూ గోవిందుడే" అన్నారు పరమహంస.
ముమ్మూర్తుల ముచ్చట
ఒకప్పుడు రాధాదేవిని కలిసిన రుక్మిణీ సత్యభామాదులు బృందావనంలోని బాలకృష్ణ లీలలను చెప్పమని కోరారట. రాధారాణి ఆ లీలలను పరవశంతో వర్ణిస్తుంటే, తన్మయులై వింట్న్నారు ద్వారకారాణులు.
అదే సమయంలో ఆ భవనం వైపు చెల్లెలు సుభద్రతో, అన్న బలరామునితో అటు వస్తున్న వాసుదేవుడు ద్వారం వద్దనే నిలబడి రాధా ప్రసంగాన్ని విన్నాడు. వింటూనే ఆ ముగ్గురూ తాదాత్మ్యంతో శిల్పాలవలె నిలబడ్డారు.
ఆ దృశ్యాన్ని చూసిన నారదుడు ఈ ముగ్గురు మూర్తులు నిరంతరం భక్తులను అనుగ్రహించేలా ఆరాధ్యదేవతలై కలకాలం ఉండాలని కోరాడట. ఆ ముచ్చట తీర్చడానికై స్వామి అవతారానంతరం ఈ క్షేత్రాన వెలశాడని ఒక పురాణోక్తి.
ఎన్నో విధాలుగా పురాణాలు బోలెడు కథలు చెప్పినా, వాటన్నిటి సారంగా ఉన్న సమన్వయ సూత్రం ఒక్కటే.
"పరిపూర్ణుడైన వాసుదేవ బ్రహ్మం జగన్నాథుడు, విష్ణ్వంశ రూపుడు సంకర్షణుడు బలభద్రుడు. వైష్ణవీమాయాశక్తి సుభద్ర. వీరితోపాటు జ్ఞానజ్వాలామూర్తిగా ఉన్న సుదర్శనుడు".
ఈ నాలుగు రూపాలు నాలుగు వేదాలకు ప్రతీకలుగా ఉంటూ, జతిని రక్షించే భగవన్మూర్తులుగా ఈ క్షేత్రంలో భాసిస్తున్నాని మహర్షుల మాట.
భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ఒక ప్రముఖ క్షేత్ర తీర్థస్థలం ఈ ప్రాచీన విష్ణుధామం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML