గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 2 June 2015

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 226-వ్యాస రాయ ప్రతిష్టిత ప్రాణ రాయ హనుమాన్ దేవాలయం – బొమ్మ ఘట్ట -బళ్ళారిదర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 226-వ్యాస రాయ ప్రతిష్టిత ప్రాణ రాయ హనుమాన్ దేవాలయం – బొమ్మ ఘట్ట -బళ్ళారి

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

226-వ్యాస రాయ ప్రతిష్టిత ప్రాణ రాయ హనుమాన్ దేవాలయం – బొమ్మ ఘట్ట -బళ్ళారి

కర్నాటక లో బళ్ళారి జిల్లా బొమ్మ ఘట్ట అనే చిన్న గ్రామం లో వ్యాస రాయలు ప్రతిష్టించిన ప్రాణ రాయ హనుమాన్ మహా మహిమాన్వితమైనది .ఈ స్వామినే ‘’హులికుంట రాయ ‘’అనీ ఆప్యాయంగా పిలుస్తారు .ఇక్కడ జరిగే రధోత్సవం కన్నుల పండువుగా ఉండటం ప్రత్యేకత .ఈ ఆలయానికి ఒక స్థానిక కధనం ఉంది .

వింత ఆవు

ఒకప్పుడు ఒక పసువులకాపరి తన ఆవులను అడవి లోకి తీసుకొని వెళ్లి మేపేవాడు .అప్పుడు ఒక వింత ఆవు అతనికి కనిపించి మందలో కలిసి పోయింది .అన్ని ఆవులు మేసే చోటకాకుండా అది వేరే చోట మేత మేసేది .దీన్ని గమనించాడు కాపరి .మిగిలిన అవులకంటే పాలు కూడా తక్కువే ఇచ్చేది .కోపం వచ్చి కర్రతో కొట్టాడు గోవు దేవత అనే విచక్షణ కూడా మర్చిపోయి .తర్వాత పశ్చాత్తాప పడ్డాడు .అంతలో ఆ ఆవులో గొప్ప వెలుగు గోచరించింది .అది దివ్య ధేనువు అని అర్ధమైంది .ఆ రోజు రాత్రి కలలో అతనికి ప్రాణ దేవర( ఆంజనేయుడు ) ) కనిపించి గోవు ద్వారా తాను చేస్తున్న లీలయే ఇదంతా అని చెప్పాడు .ఆవు ఎక్కడ నిలబడి పాలు కురిపిస్తోందో అక్కడికి వెళ్లి గమనించమని కూడా చెప్పాడు .

మర్నాడు ఉదయం గ్రామ పెద్దలందరికీ జరిగిన సంగతి వివరించి చెప్పాడు .ప్రాణ దేవర తమ గ్రామం లో స్థిరపడటానికి ఇష్టం గా ఉన్నాడని గ్రామస్తులు చాలా సంతోషించారు .అందరూ ఆ పొద దగ్గరకు వెళ్ళారు .ఈ వింత ఆవు అక్కడ గంటలకొద్దీ నిలబడి పోవటం గమనించి ఆశ్చర్య పోయారు .అక్కడ ఉన్న పొద ,గట్రా తొలగించి చూశారు .అక్కడ శిలా రూపం లో’’ ప్రాణ దేవర ‘’కనిపించాడు .

ప్రాణదేవర హనుమాన్

ప్రాణ దేవర స్వామి కుడి చేయి పైకెత్తి రావణాసురుని మర్దిస్తున్న రీతిలో నే కాక భక్తులందరికీ ఆశీస్సులు అందజేస్తున్నట్లుగా కూడా ఉంటుంది .పైకి ఎత్తిన లాంగూలం (తోక )ధైర్య సాహసాలను ప్రబోది౦చేదిగా ఉంటుంది .భీమునిలాగా గదాయుదాన్ని ధరించి ఉంటాడు స్వామి .సిగ ముడి మధ్వాచార్య సిగముడిని పోలి ఉండటం విశేషం .శిల పైభాగం లోఉన్న సూర్య చంద్రులు శ్రీ జనమేజయుని తో సంబంధాన్ని తెలియ జేస్తుందని అంటారు .స్వామికాళ్ళకింద దుస్ట స్వభావానికి ప్రతీక అయిన రాక్షసుడు మర్దింప బడుతూ ఉంటాడు .అంటే స్వామి దుస్ట శిక్షణ చేస్తాడని భావం .ఇంతకాలం పూజా పునస్కారాలకు నోచుకోకుండా స్వామి అక్కడ అక్కడ పడి ఉన్నాడంటే ఆయనకు తగిన ప్రదేశం లభించక పోవటమే అని అందరూ భావి౦చారు .

స్వామి కోరుకొన్న చోటనే ప్రతిష్ట .

మర్నాడు ఉదయం గ్రామస్తులంతా శ్రీ ప్రాణ దేవర శిలా విగ్రహాన్ని గ్రామం లోకి తీసుకొని వెళ్లి ప్రతిష్ట చేయాలని నిర్ణయించారు ఒక రధం లో స్వామిని పూల హారాలతో ముంచేసి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు కాని రధం అక్కడి నుండి అయిదు వందల అడుగులు ప్రయాణం చేసిన తర్వాత ఆగిపోయి అందరినీ ఆశ్చర్య పరచింది ఎంత ప్రయత్నించినా వారి ప్రయత్నాలు విఫలమైనాయి . ఆ రాత్రి వారందరూ అక్కడే నిద్రించారు. అందులో ఒక మంచిమనిషి కలలో స్వామి కనిపించి తనను రధం ఆగిన చోటు వద్దే ప్రతిష్ట చేయమని కోరాడు .

స్వామి మనోభీష్టం మేరకు అక్కడే ప్రాణ దేవర హనుమాన్ మూర్తిని రంగ రంగ వైభవం గా ప్రతిష్టించారు .నిత్య ధూప దీప నైవేద్యాలను ఆ రోజునుండే ప్రారంభించారు .అర్చకస్వామిగా ‘’హులియప్పన్ ‘’నియమింప బడ్డారు . ‘’ హులి పూదే’’అనే పొద వద్ద లభించిన విగ్రహం కనుక ఈ క్షేత్ర స్వామి అయిన ప్రాణ దేవర కు ‘’హులి కుంటేశ స్వామి ‘’లేక ‘’హులికుంట రాయ ‘’అని పేరు వచ్చింది .

వ్యాస రాయల పునః ప్రతిష్ట

వ్యాసరాయలు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ స్వామి విశేషాలు తెలుసుకొని ఈ క్షేత్రం లో చాతుర్మాస్య దీక్ష నిర్వహించారు .వ్యాసరాయల వారి ఆధ్వర్యం లో గర్భ గుడి నిర్మాణం ,ప్రాణ ప్రతిష్ట జరిగాయి .వ్యాసరాయలవారు ప్రాణ దేవర హనుమాన్ మూర్తిని తమ దివ్య హస్తాలతో పునః ప్రతిష్ట చేశారు .ఆలయానికి తూర్పు వైపు ఒక పుష్కరిణిని గ్రామప్రజలు త్రవ్వించే ప్రయత్నం చేశారు .పుష్కరిణికోసం మట్టి తవ్వుతుంటే’’పెద్ద నిధి’’ బయట పడింది .దీన్ని ఉపయోగించి పుష్కరిణి ని తీర్చి దిద్దారు .వడిరాజ స్వామి ఈ పుష్కరిణి ప్రాంతానికి ఒకప్పుడు నడిచివచ్చినప్పుడు అక్కడ పుష్కరిణిలో రుద్ర మూర్తి దొరికింది దాన్ని పుష్కరిణి ఒడ్డున ప్రతిష్టించి శ్రీ గంగాధర ‘’అని పేరుపెట్టారు .

శ్రీ రామ చంద్ర మూర్తి దేవాలయం

1807లో మంత్రాలయ రాఘ వేంద్ర స్వామి వారసులు శ్రీ సుభోదేంద్ర తీర్ధ స్వామి శ్రీ నంజన్ గూడు శ్రీ రామ శాస్త్రి దేవర అందజేసిన శ్రీసీతా రామ లక్ష్మణ హనుమాన్ గరుడ విగ్రహాలను ప్రతిష్టించి శ్రీ రామాలయం న్నిర్మించారు .తర్వాత నవ గ్రహ ప్రతిష్టను సుసమీంద్ర తీర్దులవారు నిర్వహించారు .మధ్వాచార్య మతానికి చెందిన ఎందరో ప్రముఖులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు .అంటే ఈక్షేత్ర ప్రసిద్ధి ఎంతటిదో తెలుస్తుంది . ప్రతి ఎదాదిజరిగే రదోత్సవానికి వేలాది మంది భక్తులు దేశం నలుమూలనుండి వచ్చి దర్శించి తరిస్తారు .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML