గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 5 May 2015

చెట్టు బుడిపే -గుంటిఆంజనేయ స్వామి

చెట్టు బుడిపే -గుంటిఆంజనేయ స్వామి
గుంటూరుజిల్లా వినుకొండ పట్టణం లో వెలసిన ఆంజనేయస్వామిని గుంటి ఆంజనేయస్వామి అంటారు .వినుకొండ ప్రజల ఇలవేల్పు ఈ స్వామి .చాలాపురాతన ఆలయం గా దీన్ని భావిస్తారు .విష్ణు కుండిన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడే ఈ ఆలయం ఉందని చెబుతారు .కాలక్రమం లో ఆలయం శిధైలమింది .1600లో గుంటి భాస్కరుడు అనే ఆయన ఆలయ జీర్ణోద్ధారణ చేశాడు .అప్పటినుంచి గుంటి ఆంజ నేయస్వామిగా ప్రసిద్ధుడైనాడు .ఒక కొండ కింద ఈ ఆలయం ఉంది .
ఈ స్వామిని ‘’టపా ఆంజ నేయ స్వామి ‘’అనీ పిలుస్తారు .విష్ణు కుండిన రాజుల కాలం లో ఈ దేవాలయాన్ని టపాలు చేరవేయటానికిఉపయోగించేవారని తెలుస్తోంది అందుకే ఆ పేరొచ్చింది .మరోకధనమూ ఉంది .శ్రీరాముడికి సీతాదేవికి వార్తల టపా ఆంజనేయుడు మోసుకు వేల్లాడుకనుక ఆ ప్రయాణం ఇక్కడి నుంచే మొదలు పెట్టాడుకనుక కూడ టపా ఆంజనేయుడు అయ్యాడు .స్వామికి రెండుప్రక్కలా వేప చెట్లు ఉండటం ఇక్కడి ప్రత్యేకత .దేవాలయం లేదు .ఒక ఆరామం గా ఈ ప్రదేశం కనిపిస్తుంది .ఒక వేప చెట్టు మీద కోతి ఆకారం లో బొబ్బ కనిపిస్తుంది .అందుకే స్వామిని ‘’ బెట్టా౦జ నేయ స్వామి ‘’అనీ అంటారు .వినుకొండకు సంస్కృతం లో ‘’శ్రుత గిరి ‘’అనిపేరు. అదే విన్న కొండగా మారి తర్వాత వినుకొండ అయింది .ఇక్కడే రావణాసురుడు సీతాదేవిని అపహరించినట్లు జటాయువు చెప్పగా శ్రీరాముడు విన్నాడ ట.వార్త విన్న ప్రదేశం కనుక విన్నకొండ లేక వినుకొండ అయింది .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML