గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 5 May 2015

ఉత్తరమునకు తల ఉంచి ఎందుకు పడుకో కూడదు?


ఉత్తరమునకు తల ఉంచి ఎందుకు పడుకో కూడదు?

ఉత్తరమునకు తల ఉంచి పడుకుంటే ఇక ఏమయినా ఉందా! అలా పడుకుంటే దయ్యములు వచ్చి మనల్ని పట్టేసుకుంటాయి, మనల్ని పీల్చి పిప్పి చేస్తాయి. లేదంటే తిన్నగా చావే వస్తుంది అని కొందరు, అబ్బే అవి అన్నీ మూఢనమ్మకములు అని కొందరు, అనేకమయిన సమాధానములు వినిపిస్తాయి కదా! మరి నిజం ఏంటి?
భూమికి కూడా అయస్కాంత శక్తి ఉన్నది(గురుత్వాకర్షణ దీనికి రుజువు).
మనం చిన్నప్పుడు అయస్కాంత తత్త్వం గురించి చదువుకున్నాం కదా! ఒక అయస్కాంతాన్ని వ్రేలాడదీస్తే అది ఉత్తర దక్షిణ ద్రువముల వైపుగా విశ్రాంతి స్థానమునకు చేరుతుంది. అంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఉత్తర దక్షిణ దృవములకు ఉంటుంది.
మనకు ఈరోజు ఉన్న అధునాతనమయిన విజ్ఞాన శాస్త్రము ప్రకారం మానవుని దేహం కూడా తనదయిన ఒక అయస్కాంత పరిధిని కలిగి ఉంటుంది. దీనికి కారణం నిరంతరం మన దేహంలో నిర్విరామం గా ప్రవహిస్తూ ఉండే రక్తం అని చెప్తారు. కనుక మనం ఉత్తరం వైపునకు తల పెట్టి పడుకున్నట్లయితే మన శరీరంలోని అయస్కాంత పరిధి భూమి యొక్క అయస్కాంత పరిధితో సమాంతరంగా ఉంటుంది. అలా ఉండటం వలన మన దేహంలో నిరంతరం ప్రవహించే రక్తం వలన కలిగే రక్తపీడనంలో మార్పులు సంభవిస్తాయి. దాని కారణంగా రక్తమును నిరంతరం మన శరీరంలో పంపు చేసే గుండె ఆ మార్పులను తట్టుకోవటానికి మరింత బలంగా పనిచేయవలసి వస్తుంది.
మరో విషయం ఏంటంటే మన రక్తంలో కొంత ఐరన్ ఉంటుంది. భూమికి ఉన్న అయస్కాంత శక్తి కారణంగా మన దేహంలోని ఇనుము కూడా రక్త ప్రసరణ కార్యక్రమంలో అవరోధంగా ఉంటుంది. దీనివలన తలనొప్పులు, ఆల్జిమర్, పార్కిన్సన్ వ్యాధులతో పాటు మెదడుకు సంబంధించిన రుగ్మతలు కూడా కలిగే అవకాశం ఉంటుంది.
అబ్బో అన్నీ ఇలానే చెప్తారు! మేం ఎప్పటి నుండో ఇలానే పడుకునే అలవాటు ఉంది మాకు ఏమీ తేడా లేదు. అని ఎవరైనా అనుకోవచ్చు. ఇలా ఒకరోజు పడుకుంటేనే ఇవన్నీ జరుగుతాయని కాదు. ఇలా పడుకోవటం ఒక అలవాటుగా మారితే మన ఆరోగ్యంలో అనేకమయిన మార్పులు వస్తాయి అనే మనకు అటువైపు తల పెట్టి పడుకోవద్దు అని చెప్తారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML