గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 5 May 2015

హిందూ వివాహ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అరుంధతి దర్శనం. మనం ఆ నక్షత్రాన్ని ఎందుకు చూడాలి? ఆ నక్షత్ర విశిష్టత ఏమిటి?

అరుంధతి సప్తఋషులలో ఒకరైన వసిష్టమహర్షి యొక్క భార్య. వారిది అన్యోన్యమైన దాంపత్యం. ఆమె మహా పతివ్రత. తన పాతివ్రత్య మహిమ వల్ల సప్తర్షులతో పాటు నక్షత్ర మండలంలో తానూ స్థానాన్ని పొందగలిగింది. వారి అన్యోన్యత కు సాక్షిగా ఆమె నక్షత్రరూపములో తన భర్త వసిష్ఠ నక్షత్రమునకు దగ్గరగా ఉంటుంది.
సహజంగా రెండు నక్షత్రములు దగ్గరగా ఉన్నప్పుడు ఒక నక్షత్రము స్థిరం గా ఉండి రెండొవ నక్షత్రము దాని చుట్టూ తిరుగుతుంది. కాని వసిష్ఠ, అరుంధతి నక్షత్రములు రెండూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతాయి. అది భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధంచేసుకుని, ఒకరికి తగినట్లు మరొకరు మెలగాలనే చక్కని సందేశం. అటువంటి ఆదర్శ దంపతులను ఉదాహరణ గా పెళ్లి అవ్వగానే నూతన దంపతులకు చూపించటం ఒక అధ్బుతమైన ఆచారం.

అందులోనూ వరుడు వధువుకు స్వయం గా చూపించుటలో తానూ స్వతంత్రించి ఆమెతో అలా మసలుకునే పరిస్థితి ని కలిగిస్తాను అని చెప్పటం మన ఆచారంగా ఉంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML