గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 19 May 2015

విశ్లేషణ :: జీసస్ బైబుల్ లో ఏమి చెప్పేడు, క్రైస్తవ మిషనరీస్ ఏమి చేస్తున్నాయి ?? క్రైస్తవ మిషనరీస్ ఏ ఒక్కటి కూడా, బైబుల్ కి కట్టుబడి పనిచేయటం లేదా ??

బాబు మీరు ఆసియా వైపు వెళ్తున్నారు కదా?? వద్దు అక్కడికి వద్దు నాయన అక్కడ మనం ప్రచారం వద్దు రా నాయనా!! ఏంటి నేను చెప్పటం లేదు బాబు, బాబు స్వయానా పరిశుద్ద ఆత్మనే వారిని ఆటంకా పరిచి అక్కడ వద్దు అని చెప్పకనే చెప్పింది!ఆ తరువాత ఎక్కడ కూడా ఆ పరిశుద్ద ఆత్మ ఆసియా లో సువార్త చెప్పమని చెప్పలేదు కూడా!(ఈ వాక్యం Acts - అపొ. కార్యములు 16 వ అధ్యాయం 6వ వాక్యం లో ఉంది!ఈ ACT గ్రంధాన్ని ల్యూక్ 61 AD న రాసాడు! దీనికి ముందు రాసిన MATTHEW 24వ అధ్యాయం లో 14 వ వాక్యంలో సువార్త ప్రపంచమంతా ప్రకటించాలి అన్నాడు , ఈ MATTHEW 60 AD న మాథ్యూ రాసాడు) మరి బైబులు దైవ వాక్యం,వాటిని పాటించాలి అనే బుద్ధి హీనులకు నీచులకు తెలియదా ఈ మాట?? ఎందుకు మతప్రచారం అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు?? ప్రస్తుతం క్రిస్టియానిటీ ప్రపంచం మొత్తం ఉండటానికి కారణం ఏ గూటికి ఆ పాట పడటం సేవ తొక్క అని అపద్దలు చెప్పటం మతాన్ని మార్చటం ఇదే వీరి నీచపు తంతు! ఒక మహనీయుడు కెన్యా జాతిపిత గా పిలవబడే జోమో కేన్యాట ఆవేదనగా అన్న మాటలు" బ్రిటిష్ మిషనరీలు మా దేశం వచ్చేసరికి మా చేతుల్లో భూములు ఉండేవి,వాళ్ళ చేతుల్లో బైబులు ఉండేది! కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం వాళ్ళు నేర్పారు,కళ్ళు తెరచి చూసే సరికి వాళ్ళ బైబులు మా చేతుల్లో ఉంది మా భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి!! . హిందువుల్లారా మేల్కొనండి సెక్యులర్ ముసుగులో సనాతన ధర్మాన్ని ముంచెదశగ పయనిస్తున్న మిషనరిలను అడ్డుకోండి!
Read More

* తిరుమల ఏడుకొండల పరమార్థం: *ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
: మిత్రులందరికి శుభ శుభోదయం : వేైశాఖమాస శనిత్రయోదశి & మాసశివరాత్రి :

కంజదళనేత్రా గోవింద హరె కస్తూరితిలక ధర గోవింద హరె
కందర్పజనక హరే గోవింద హరె కమనీయరూప హరే గోవింద హరె
వేంకటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే గోవింద హరె
ముక్తిప్రద శ్రీహరే గోవింద హరె మమకార హర హరే గోవింద హరె
అచ్యావతార హరే గోవింద హరె ఆదిమ పురుష హరే గోవింద హరె
అలమేలుమంగాపతే గోవింద హరె అద్భుత రూప హరే గోవింద హరె


* శనివారం అంటే శ్రీనివాసునికి ప్రీతీకరం ఎందుకు ....?
* ఓంకారం ప్రభవించిన రోజు శనివారం
* శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్దలతో పూజిస్తారో, వారిని పీడించ నని శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామికి వాగ్దానం చేసిన రోజు కుడా శనివారం
* శ్రీ వెంకటేశ్వర స్వామి అరి మహాలక్ష్మిని తన వక్షస్థలాన నిలిపిన రోజు శనివారం
* శ్రీనివాసుని భక్తులు మొట్టమొదటి సారి దర్శించి తరించిన రోజు శనివారం
* ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఇచ్చిన రోజు శనివారం
* శ్రీ శ్రీనివాసుని సుదర్శనం పుట్టిన రోజు శనివారం
* శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారం
* శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహమాడిన రోజు శనివారం
.... అందుకే శ్రీనివాసునికి శనివారం అంటే అంత ప్రీతి.

* తిరుమల ఏడుకొండల పరమార్థం: *
1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి
5. శేషాద్రి 6. వేంకటాద్రి .. 7. నారాయణాద్రి.

ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడఉంటుంది. బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైనఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు,పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.
అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః
ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.

1. వృషభాద్రి - అంటే ఎద్దు : వృశాభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి.
3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)
వాక్కు అంటే - శబ్దం..., శబ్దం అంటే - వేదం.,.. వేదం అంటే - ప్రమాణము
వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

2. వృషాద్రి - అంటే ధర్మం :
ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.

3. గరుడాద్రి - అంటే పక్షి -
ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.
భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ == ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.

4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా
పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటతాడు.

5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు) తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.

6. వేంకటాద్రి - వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి.
వేంకటాచలంలో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు.
Read More

విశ్వకర్మ ఎవరు ?

విశ్వబ్రాహ్మణుల చరిత్ర( ఓపికగా చదవండి..వీలు చూసుకుని..) తప్పులుంటే సూచనలు చేయండి..
విశ్వకర్మ ఎవరు ?
Virat_viswakarma
1.హంసవాహనం గా కలవాడు విరాఠ్ విశ్వకర్మ.
శ్లో|| నభూమి నజలం చైవ నతేజో నచ వాయవ:
నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః
సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణ:
(తా|| భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.
భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ తనంతట తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు.)
గమనిక:(పంచభూతము లు పుట్టక ముందే విశ్వకర్మ ఉన్నటైతే అతని ఆ స్వరూపము ఎలా వచ్చింది ?, సమాధానం : మనము మననము చేసుకొనేందుకు మరియు గుర్తుకు ఆ విధంగా విగ్రహాన్ని రూపొందిచారు)
bhuvana viswakarma
2.ఏనుగు వాహనం గా కలవాడు భువన విశ్వకర్మ
(ఏనుగు నల్లదా తెల్లదా అనేది ముఖ్యము కాదు)
భువన విశ్వకర్మ అంగీరస వంశము లో జన్నించిన ఋషి.
విశ్వకర్మ ధ్వజము
విశ్వకర్మ ధ్వజము
శ్లో|| గగనం నీల వర్ణం చ మారుతం ధూమ్ర వర్ణకం
పావకో రక్త వర్ణం చ సలిలం శుభ్ర వర్ణకం
హరిద్రా వర్ణకం పృధ్వి పఞ్చ భూతాని ఇతి క్రమాత్||
విశ్వకర్మ
విశ్వకర్మ విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొన బడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించ బడినాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా,సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడుగా అన్ని వేదాలలో వర్ణించబడినాడు. సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. కానీ కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొంటాయి. అంతేగాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మ కుమారుడిగా చెప్తాయి. ఇది వేద విరుద్ధం. వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొనాయి. సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు కనుకనే ఈయన భగవంతుడు అని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది. మహాభరతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించింది. ఈతని అర్చామూర్తిని విశ్వకర్మ పురాణము పంచ శీర్షుడుగా వర్ణించింది. సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు. వారు విశ్వకర్మకు జన్మించారు........
వృత్తి చేయుపని
1. కమ్మరి అయోకారుడు - ఇనుము పని
2. సూత్రకారుడు(వడ్రంగి ) వర్ధకుడు - కొయ్య పని
3. కాంస్యకారి (కంచరి) తామ్ర కారుడు - రాగి, కంచు, ఇత్తడి పని
4. స్తపతి ( శిల్పి) శిల్ప కారుడు - రాతి పని
5. స్వర్ణకారి స్వర్ణకారుడు - బంగారు పని
విశ్వబ్రాహ్మణులు (విశ్వకర్మలు) చేయు వృత్తులు
విరాట్ విశ్వకర్మ భగవానుడు (పంచముఖుడు) ఐదు ముఖములు కలవాడు. విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు, ఈ పంచ బ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు (సనగ, సనాతన, అహభౌసన, ప్రత్నస, సుపర్ణస.) విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారు వీరి ద్వారా చేయు శాస్త్రం మరియు వృత్తులు నిర్ధేశింపబడినవి
మూలాఆధారం విశ్వకర్మ ముఖము మహర్షి / గోత్రరిషి శాస్త్రం
1. శివుడు మను సానగ బ్రహ్మర్షి తర్కం అయో శిల్పి - కమ్మరి Blacksmith
2. విష్ణువు మయ సనాతన బ్రహ్మర్షి వ్యాకరణం దారు శిల్పి - వడ్రంగి/సూత్రకారుడు Woodsmith ( Carpentar )
3. బ్రహ్మ త్వష్ట అహభునస బ్రహ్మర్షి ధర్మశాస్త్రం తామ్ర శిల్పి - కాంస్య కారి - కంచరి Bronzesmith
4. ఇంద్ర దైవజ్ఞ ప్రత్నస బ్రహ్మర్షి మీమాంస శిలా శిల్పి – స్తపతి (శిల్పి) Stonesmith
5. సూర్య విశ్వజ్ఞ సుపర్ణస బ్రహ్మర్షి వైధ్యం, జ్యోతిష్యం స్వర్ణ శిల్పి - స్వర్ణకారి Goldsmith
పూర్వం వృత్తి సమాజంలోని ప్రజలకును, ప్రభువులకును ఉపయోగానికి మరియు తమవిజ్ఞానాన్ని తమదైన శైలిలో ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉపయోగపడే విధానం, అవి క్రమేణా జీవనభృతి కొరకు చేపట్టే పనులు. ఈ వృత్తులు, ప్రజల మరియు ప్రభువుల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి. ప్రాచీన విజ్ఞానానికి నిలువుటద్దం ఈ వృత్తులు.
శిల్పముల రకములు
శిల్పం అంటే చెక్కిన లేక పోతపోసిన ప్రతిమ, ఇవి ముఖ్యంగా మూడు విధములుగా చెప్పవచ్చు.
రాళ్ళతో చేసిన శిల్పాలు
ఇవి నల్ల రాళ్ళ తోనూ పాలరాళ్ళతోనూ చేస్తారు. దేవతా మూర్తులను, రాజులు, రాణులు, గురువులు, జంతువులతో కూడిన కథలు, ఇతిహాసాలు, శాసనాలు, మొదలైనవి శిల్పాలలో చోటు చేసుకుంటాయి. శిల్పాలను గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమాశాస్త్రమని నేర్పే విద్యని ప్రతిమావిద్య అని అంటారు. శిల్పాలను చెక్కేవారిని 'స్తపతి' లేదా 'శిల్పి' అంటారు. రాతి యుగంలో లిపి బొమ్మలను చెక్కడంద్వారా ఆరంభమైనది. మనుష్యులు పరిణితి చెందుతున్న దశలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహాలలో ఉన్న రాతిపై చెక్కడం ప్రారంభించారు. అంతే కాకుండా భూమిలోని ఖనిజ సంపద ద్వారా లభ్యమైన రాళ్లు ( వజ్రం, వైఢూర్యం, ముత్యం, పగడం, మొదలగు ) ఆభరణములకు ఇంపుగా పొదగడం ద్వారా నైపుణ్యము సంపాదించిరి.
లోహక్రియ (Metalworking)
లోహక్రియ అనేది విభిన్నమైన లోహాలతో పనిచేయడం. ఇది కొన్ని వస్తువులు తయారుచేయడానికి, అతికించి పెద్ద నిర్మాణాలు కట్టడానికి ఉపయోగిస్తారు. పెద్ద ఓడలు, వంతెనలు మొదలైనవి నిర్మించడం వీరు చేసే అతిక్లిష్టమైన పనులు. ఇందుకోసం భారీ పనిముట్లు అవసరం ఉంటుంది. లోహక్రియ ఒక కళ, అలవాటు, పరిశ్రమ మరియు వ్యాపారం ఇది కంసాలీల పని. లోహసంగ్రహం, విజ్ఞానశాస్త్రం మొదలైన విధాలుగా ప్రాచీనకాలం నుండి నేటివరకు బాగా విస్తరించింది. ఆదిమానవుని కాలంలోనే లోహాలను తన అవసరాలకనుగుణంగా మలిచి వ్యవసాయ పనిముట్లుగా, వేట ఆయుధాలుగా తయారుచేసి ఉపయోగించాడు. బంగారం వంటి ఖరీదైన లోహాలను ఆభరణాలుగా మలిచేవారిని స్వర్ణకారి (బంగారుపనివాడు) (Goldsmith) అంటారు.
కలపతో చేసినవి (Wooden works)
కలపతో ఇండ్లకు కావలసిన ద్వారబంధములు, తలుపులేకాక భవన నిర్మాణాలు, దేవతా మూర్తులను, నగిషీలు (కార్వింగు), వివిద బొమ్మలు, పెద్ద ఓడలు, వంతెనలు మొదలైనవి నిర్మించడం, వ్యవసాయానికి కావలసిన బండ్లు, నాగళ్లు, పనిముట్ల పిడి తయారుచేయడం, మనుష్యులు పరిణితి చెందుతున్న దశలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహలలో కలపను ఉపయోగించడం ప్రారంభించారు.

Read More

ప్రపంచాన్ని నడిపించేది హిందుత్వమే = ఉదాహరణ


Read More

కుంతీ స్తుతికుంతీ స్తుతి

1-186-వచనము
ఇట్లు ద్రోణతనయుం డేసిన ప్రతిక్రియారహితం బయిన బ్రహ్మశిరం బనియెడి దివ్యాస్త్రంబు వైష్ణవతేజంబున నిరర్థకం బయ్యె; నిజ మాయావిలసనమున సకలలోక సర్గస్థితి సంహారంబు లాచరించు నట్టి హరికి ధరణీసుర బాణ నివారణంబు విచిత్రంబు గాదు; తత్సమయంబున సంతసించి, పాండవ పాంచాలీ సహితయై గొంతి గమనోన్ముఖుం డైన హరిం జేర వచ్చి యిట్లనియె.


అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం తిరుగు లేనిది అయినప్పటికీ, వైష్ణవ తేజస్సు ముందు వ్యర్థం అయిపోయింది. ఒక బ్రాహ్మణ యువకుడి బాణాన్ని నివారించటం అన్నది, తన మాయా ప్రభావంతో నిఖిల జగత్తును నిర్మించి, భరించి, హరించే పరమాత్ముడికి విచిత్రమైన విషయమేమీ కాదు. అప్పుడు ఎంతో సంతోషంతో కుంతీ దేవి కోడలు ద్రౌపది, కొడుకులు పాండవులతో వచ్చి ద్వారకకు ప్రయాణం అవుతున్న శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా స్తుతించింది-

1-186-vachanamu
iTlu drONatanayuM DEsina pratikriyaarahitaM bayina brahmashiraM baniyeDi divyaastraMbu vaiShNavatEjaMbuna nirarthakaM bayye; nija maayaavilasanamuna sakalalOka sargasthiti saMhaaraMbu laachariMchu naTTi hariki dharaNeesura baaNa nivaaraNaMbu vichitraMbu gaadu; tatsamayaMbuna saMtasiMchi, paaMDava paaMchaalee sahitayai goMti gamanOnmukhuM Daina hariM jEra vachchi yiTlaniye.

ఇట్లు = ఈ విధముగ; ద్రోణతనయుండు = అశ్వత్థామ {ద్రోణతనయుడు - ద్రోణుని కొడుకు, అశ్వత్థామ}; ఏసిన = వేసిన; ప్రతిక్రియా = ఎదురు చేయటకు; రహితంబు = వీలు లేనట్టిది; అయిన = అయినటువంటి; బ్రహ్మశిరంబు = బ్రహ్మశిరము; అనియెడి = అనెడి; దివ్య = దివ్యమైన; అస్త్రంబు = అస్త్రము; వైష్ణవ = విష్ణువు యొక్క; తేజంబున = ప్రభావము వలన; నిరర్థకంబు = నిష్ప్రయోజనము; అయ్యెన్ = అయినది; నిజ = తన; మాయా = మాయ యొక్క; విలసనమున = విలాసము వలన; సకల = సమస్త; లోక = లోకముల యొక్క; సర్గ = సృష్టి; స్థితి = పాలన; సంహారంబులు = సంహారములు; ఆచరించున్ = ఆచరించే వాడు; అట్టి = అయిన; హరి = హరి; కిన్ = కి; ధరణీసుర = బ్రాహ్మణుని {ధరణీసుర - భూమికి దేవత, బ్రాహ్మణుని}; బాణ = బాణమును; నివారణంబు = ఆపుట; విచిత్రంబున్ = విచిత్రమేమి; కాదు = కాదు; తత్ = ఆ; సమయంబున = సమయములో; సంతసించి = సంతోషించి; పాండవ = పాండవులతోను {పాండురాజు సంతానము – పాండవులు, 1ధర్మరాజు, 2భీష్ముడు, 3అర్జునుడు, 4నకులుడు, 5సహదేవుడు}; పాంచాలీ = పాంచాల రాకుమారి (ద్రౌపది) తోను; సహిత = కూడినది; ఐ = అయ్యి; గొంతి = కుంతి; గమన = వెళ్ళుటకు; ఉన్ముఖుండు = సిద్ధపడినవాడు; ఐన = అయినట్టి; హరిన్ = కృష్ణుని {హరి - సర్వ దుఃఖములను హరించు వాడు}; చేరన్ = చేరువకు; వచ్చి = వచ్చి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
Read More

విశ్లేషణ = ఇది నిజమేనా ?? బైబుల్ లో ఇలా దారుణంగా రాసి ఉందా ????

ద్వితియోపదేశకాండము 13 లో 12 నుంచి 17 వాక్యాలలో యహోవా నీకు ఇచ్చిన పట్టణాలలో ఎవరన్నా వచ్చి మీకు తెలియని దేవతలని పూజించమని చెప్పిన ఎడల వారిని కత్తి తో నరికి చంపి వారి పట్టణమును , పశువులను , వారి సొమ్ములను వీధిలో చేర్చి పూర్తిగా కాల్చి వేయాలి !! ఆ పట్టణము తిరిగి నిర్మిపకుండా ఉండేట్లు దిబ్బ లాగా చేసేయాలి ! ఈ ఆజ్ఞ్యలు అన్ని యహోవా మోసెస్ కి చెప్తే అయన ఇస్రాయలు ప్రజలకి చెప్తున్నాడు !  ఈ అధ్యాయం లో చెప్పినట్టే ఇతర దేవతలని పూజించేవారిని క్రూసేడుల పేరుతో చంపటం పట్టణాలని ద్వంశం చేసి వారి చరిత్రని నాశనం చేయటం లాంటి క్రూరత్వం తో ప్రజలని భయబ్రాంతులకి గురి చేసి వ్యాప్తి చెందేల చేసారు !! అంతే కానీ ఈయన(యహోవా)మాయలు , రాక్షస బలులు చూసి కాదు !!! వీరి యొక్క రాక్షసత్వానికి ప్రపంచం మొత్తం తల వంచింది ఒక్క భారత దేశం తప్ప! ఇక్కడ కూడా బాగానే శ్రమించారు , చరిత్రని నాశనం చేసారు , వ్యవస్థని బ్రష్టు పట్టించారు .
Read More

విశ్వమంతటి విశ్వాసం- జ్యోతిషంవిశ్వమంతటి విశ్వాసం
జ్యోతిషం

అర్థార్జనే సహాయః పురుషాణా మాపదార్ణవే పోతః
యాత్రాసమయే మంత్రీ జాతకమపహాయ
నాస్త్యపరః
- జాతక సారావళి
జ్యోతిశ్శాస్త్రం ధన సంపాదన వ్యవహారాల్లో
ఉపకరిస్తుంది. ఆపదల సముద్రంలో
చిక్కుకున్నప్పుడు ఓడలా ఒడ్డుకు
చేరుస్తుంది. యాత్రలకు వెళ్లేటప్పుడు
మంత్రిలా తగిన సలహాలిస్తుంది. జ్యోతిషం
భారతదేశానికి మాత్రమే పరిమితమైన శాస్త్రం కాదు.
ఇది ఏదో ఒక మతానికి మాత్రమే పరిమితమైనది కూడా
కాదు. ప్రాక్పశ్చిమ దేశాలలో వివిధ మతాలకు చెందిన
పండితులు ఎవరి పద్ధతుల్లో వారు జ్యోతిషాన్ని
అధ్యయనం చేశారు, అభివృద్ధి చేశారు. జాతక రచన
చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పురాణ
పురుషులకు జాతకాలు ఉన్నాయి. దేశ దేశాలను
ఏలిన చక్రవర్తులకు, మహారాజులకు జాతకాలు
ఉన్నాయి. మన దేశాన్ని ఏలిన మొఘల్ చక్రవర్తులు,
బ్రిటిష్ పాలకులు సైతం జ్యోతిషాన్ని ఆదరించిన
దాఖలాలు ఉన్నాయి. జహంగీరు ఆస్థానంలో జగన్నాథ
సమ్రాట్, కృష్ణ దైవజ్ఞ అనే జ్యోతిష సిద్ధాంతులు
ఉండేవారు.
షాజహాన్ కొడుకు షుజా ప్రాపకంలో పనిచేసిన
బలభద్రుడనే జ్యోతిషుడు హోరారత్నం అనే
జ్యోతిష గ్రంథాన్ని రాశాడు. బ్రిటిష్ చక్రవర్తి ఐదో
జార్జి తన భారతదేశ పట్టాభిషేకం కోసం తొలుత 1911
నవంబర్ 9న గురువారం
ప్రయాణమవుదామనుకున్నా, ఆరోజు తండ్రి
పుట్టినరోజు కావడంతో తల్లి ఆజ్ఞ మేరకు
ప్రయాణాన్ని విరమించుకున్నాడు. మరుసటి రోజు
శుక్రవారం నావికులకు అనుకూలమైన రోజు
కానందున జ్యోతిషుల సూచన మేరకు నవంబర్
11న అభిజిర్లగ్నంలో బయలుదేరాడు. డిసెంబర్ 12న
మంగళవారం అభిజర్లగ్న ముహూర్తాన ఢిల్లీలో
పట్టాభిషిక్తుడయ్యాడు. జ్యోతిషంపై
ప్రపంచవ్యాప్తంగా గల విశ్వాసానికి ఇవి కొన్ని
ఉదాహరణలు.
జ్యోతిష శాస్త్రాన్ని ప్రాచీనులు ప్రధానంగా రెండు
భాగాలుగా విభజించారు. ఒకటి సిద్ధాంత భాగం
(అస్ట్రానమీ), రెండు జాతక భాగం (అస్ట్రాలజీ).
అస్ట్రానమీనే ఖగోళశాస్త్రం అంటున్నాం. ఆధునిక
కాలంలో ఖగోళశాస్త్రం బాగా అభివృద్ధి చెందింది.
గ్రహాంతర పరిశోధనలు ఊపందుకున్నాయి.
గ్రహగతులను తెలుసుకోవడానికి సిద్ధాంత భాగం
ఉపయోగపడుతుంది. గ్రహగతుల ఆధారంగానే కాల
విభజన, భూత భవిష్యత్ వర్తమాన ఫలితాలను జాతక
విభాగం విపులీకరిస్తుంది. ఈ ఫలితాలను
తెలుసుకోవడానికి ‘భ చక్రం’ అని పిలుచుకొనే
రాశిచక్రమే కీలకం. మేషం నుంచి మీనం వరకు
పన్నెండు రాశులుగా విభజించుకున్న ఈ చక్రంలో
ఒక్కొక్క రాశికి నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి. రాశుల
లక్షణాల గురించి వచ్చేవారం...
- పన్యాలజగన్నాథ దాసు
Read More

సరి కొత్త పుస్తకము వెల్లడి . ఏసుక్రీస్తు వివాహితుడా ????


Read More

విశ్లేషణ = ఇది నిజమేనా ?? బైబుల్ లో ఇలా దారుణంగా రాసి ఉందా ????

ద్వితియోపదేశకాండము 20 లో 17 వ వాక్యములో హీత్తీ యులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివీ్వ యులు యెబూసీయులను వీరి విషయం లో మాత్రం ఊపిరిగల ఒక్కరిని కూడా బతక నివ్వకూడదు ! 18 వ వాక్యములో నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయ వలెను. , అంటే వీరిని ఎలా చంపాలి వారిని ఎలా నిర్మూలించాలి అన్నది సాక్షాత్తు దేవుడు అనబడే యహోవా చెప్పాడంట ఇంతకూ ఎందుకు చంపమంటున్నారో తెల్సా?? వీరు యహోవని కాకుండా అన్యదేవతలని పూజించటమే ! మనోడికి తనని కాకుండా ఇంకోరిని ముక్కితే , ఇలా జనాలని సంపె బదులు తనే సర్వాంతర్యామి అని విశ్వరూపం చూపలేక పోయాడా?? పోనీ వారి మనస్సులో అన్యదేవాతలు పూజించకుండా ఈయన మహిమ చూపలేక పోయాడా??
Read More

విష్ణు బ్రహ్మ ల శంకర స్తుతివిష్ణు బ్రహ్మ ల శంకర స్తుతి

నమో నిష్కల రూపాయ – నమో నిష్కల తేజసే
నమస్సకల నాథాయ – నమస్తే సకలాత్మనే ||
నమః ప్రణవ వాచ్యాయ - నమః ప్రణవ లింగినే
నమః స్సృష్ట్యాది కర్ర్తేచ – నమః పంచముఖాయతే ||
పంచ బ్రహ్మ స్వరూపాయ – పంచకృత్యాయతే నమః
ఆత్మనే బ్రహ్మణే తుభ్య – మానంత గుణ శక్తియే ||
సకలాకల రూపాయ – శంభవే గురవే నమః
ఇతి స్తుత్వాగురుంపద్యై – ర్ర్బమ్హ విష్ణు శ్చనెమతుః ||


శంకరా! నిరాకారుడవైన నీకు నమస్కారం . తేజో రూపుడవైన నీకు నమస్కారం . సాకరుడవైన నీకు నమస్కారం . ఓంకార వాచ్యుడవైన నీకు నమస్కారం . ఓంకారం నీకు చిహ్నం . సృష్ట్యాది పంచకృత్యములను ఆచరించు ఐదు ముఖములు గల నీకు నమస్కారం . పంచకృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడవైన నీకు నమస్కారం .ఆత్మరూపుడు , పరబ్రహ్మ స్వరూపుడు , అనంత కళ్యానగుణ శక్తి యుతుడైన నీకు నమస్కారం . సాకార , నిరాకార రూపుడైన శివగురువునకు నమస్కారం.
Read More

స్వదేశి వారు సిగ్గు పడేలా, పరదేశీయుల పనులు


Read More

అభీష్ట సిద్దికి శ్రీ ఆంజనేయ ప్రదక్షిణములు చేయు విధానములు, నియమములుఅభీష్ట సిద్దికి శ్రీ ఆంజనేయ ప్రదక్షిణములు చేయు విధానములు, నియమములు

భూత, ప్రేత, పిశాచాది బాధలు తొలగుటకు, రోగములు, ఎట్టి కష్టములైన తొలగుటకు, అభీష్ట సిద్దికి శ్రీఆంజనేయ ప్రదక్షిణములు సుప్రసిధ్దములు. అనేకులు ఆ ప్రదక్షిణములవలన కృతకృత్యులగుచున్నారు. ప్రదక్షిణములకు నియమములు ముఖ్యములు. దేవాలయమునందుకాని, లేదా హనుమంతుని యంత్రమును చేయించుకొని దాని చుట్టూ ఇంటివద్దనైనా ప్రదక్షిణములు చేయవచ్చును. గణనమునకై పసుపుకొమ్ములే వాడుట శ్రేయము. మిరియములు ఉగ్రవిషయములు కాన పసుపుకొమ్ములే వాడుట మంచిది. పుష్పాదికమును, వక్కలను లెక్కకు తీసికొనవచ్చును.
పఠించు శ్లోకములుః

శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్

ఆంజనేయం మహావీరం – బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభం శాంతం – రామదూతం నమా మ్యహమ్ ||

మర్కటేశ మహోత్సాహ – సర్వశోక వినాశన
శత్రూ న్సంహర మాం రక్ష – శ్రియం దాపయే మే ప్రభో ||

అని పఠించుచు ప్రదక్షిణములు చేయవలెను. భక్తి శ్రధ్ధలతో చేతులు జోడించుకొని గణనమున కుపకరించు పుష్పాదికమును చేతియం దుంచుకొని వినమ్రులై పరుగులిడక ప్రదక్షిణములు చేయవలెను. మధ్యలో మాటాడరాదు. స్నానాదికము నిర్వహించి శుచులై చేయవలెను. నూట ఎనిమిది కాని, శక్తి లేని వారందు సగము కాని, ఇంకను శక్తిహీను లందు సగమైన చేయవచ్చును. అట్లు శక్తి ననుసరించి నలుబదిఐదు దినములుగాని, ఇరువదియొక్క దినములుకాని, అభీష్టము ప్రబలమగుచో బహుదినములు, బహునియమములు తప్పక పాటింపనగును. అభీష్టమల్పమగుచో కొద్దికాలము చేయవచ్చును. అభీష్టము కలవారు స్వయముగా ప్రదక్షిణములు చేయనగును. వా రశక్తులైనచో తమకొరకై అన్యులచేతనయినా చేయింపవచ్చును. ప్రదక్షిణములు చేయుట ఇంటి యందైనచో దీపారాధన చేసికొని చేయవలెను. దేవాలయమందైన దీపారాధన చేసికొని లేదా దేవునికడ నున్న దీపారాధనయందు తైలము వేసి నమస్కరించుకొని ఆరంభించనగును. నిత్యము శిరస్నానము కర్తవ్యము.

ప్రదక్షిణములు పూర్తియైన పిదప

“మయాకృతై రేభిః ప్రదక్షిణైః శ్రీసువర్చలాసమేత హనుమాన్
సుప్రీత స్సుప్రసన్నో వరదో భూత్వా మమాభీష్టసిద్దిం దదాతు”

అని జలమును విడువవలెను.

దేవాలయమునందు చేయనివారు స్వామి యంత్రమును అశ్వత్థమూలమునకాని, కదళీమూలమునకాని, ఉసిరి లేదా తులసి చెట్టు మొదటనయినాకాని, లేక తమ ఇంట పరిశుధ్ద ప్రదేశమునకాని యంత్రము నుంచి ప్రదక్షిణము చేయనగును. ప్రదక్షిణములు చేయు కాలమున బ్రహ్మచర్యము, నేలపడక, నిత్యము దేవపూజ, మౌనవ్రతం, ఒంటిపూట భోజనము, కోపము వీడుత, దైవము యెడ అచంచల భక్తి యున్నగునవి ముఖ్య నియమములు. ఇంద్రియ వికారముల కవకాశమీయక మృదువైనవి, కొద్దిమాత్రము వేడికలవి, బాగుగా వండినవి యగు సాత్విక పదార్థములను లఘువుగా భుజింపనగును. భక్తిలోపము తగదు. శక్తివంచన కూడదు. అశక్తులు యధాశక్తి నియమములు పాటించి స్వామి యనుగ్రహమునకు పాత్రులు గావచ్చును. దక్షిణాభిముఖుడైన హనుంతుడు శక్తిమంతుడుగా పెద్దలు చెప్పుదురు. అట్టి స్వామి నారాధించి నిర్వహించుట సద్యఃఫల మీయవచ్చు.
Read More

శ్రీ రామార్పణమస్తు

జయ హనుమంత జ్ఞాన గునవండిత జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుతనామ
ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన
కాంచనవర్ణ విరాజిత వేష కుండలమండిత కుంచితకేశ //శ్రీ//
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకీపతి ముద్రిక దోడ్కొని జాలాది లంఘిచి లంక జేరుకొని
సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి
భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన //శ్రీ//
సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని
సహస్ర రీతుల నిను గోనియడగా కాగల కార్యము నీపై నిడగ
వానరసేనతో వారధి దాటి లంకెశునితొ తలపడి పోరి
హోరుహోరున పోరు సాగిన అసురసేనల వరుసను గూల్చిన //శ్రీ//
లక్ష్మణ మూర్చతో రాముడడలగా సంజీవి దెచ్చిన ప్రాణప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని రామబాణము జరిపించెను రావణ సంహారము
ఎదురు లేని ఆ లంకాపురమున ఏలికగా విభీశణు జేసిన //శ్రీ//
సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందశ్రువులే అయోధ్యాపురి పొంగిపొరలే
సీతారాముల సుందర మందిరం శ్రీకాంతువదం నీ హృదయం
రామచరిత కర్ణ మృతాగాన రామనామ రాసా మృతపాన //శ్రీ//
దుర్గమ మగు ఏ కార్యమైన సుగామమే యగు నీ కృపజాలిన
కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న
రామద్వారపు కాపరివైన నీ కట్టడి మీరా బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాకినీ ధాకిని భయపడిపారు నీ నామజపము విని //శ్రీ//
ధ్వజ విరాజా వజ్ర శరీరా భుజబల తేజా గదాధర
ఈశ్వరామ్స సంభూత పవిత్రా కేసరీ పుత్రా పావన గాత్ర
సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశెషులు
యమ కుబేర దిగ్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల //శ్రీ//
"సోదర భరత సమానా" యని శ్రీ రాముడు ఎన్నికగొన్న హనుమా
సాధుల పాలిట ఇంద్రుడ వన్నా అసురుల పాలిట కాలుదవన్నా
అష్ట సిద్ధి నవనిధులకు దాతగా జనకిమాట దీవించెనుగ
రామ రాసా మృత పానము జేసిన మృత్యుంజ యుడవై వెలసిన //శ్రీ//
నీ నామ భంజన శ్రీ రామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన
ఎచ్చ తుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుత తెలుసు
ఇతర చింతనలు మనసున మోతలు స్ధిరముగా మారుతి సేవలు సుఖములు
ఎందేన్డున శ్రీ రామ కీర్తన అందందున హనుమాన నర్తన //శ్రీ//
శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగుసుమా
భక్తిమీర గానము చేయగా ముక్తి కలుగు గౌరీసులు సాక్షిగా
తులసిదాస హనుమాన చాలీసా తెలుగునా సులుగువ నలుగురు పాడగా
పలికిన సీతారాముని పలుకున దొషములున్న మన్నింపు మన్న //శ్రీ//
మంగళ హారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత /
నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంట శ్రీ హనుమంత //
ఓం శాంతి శాంతి శాంతి
శ్రీ రామార్పణమస్తు
Read More

Thursday, 7 May 2015

బద్ధ పద్మాసనం ....బద్ధ పద్మాసనం ....
(Baddha Padmasana, Bound lotus pose) ....

పద్మాసన స్థితిలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచుకుని రెండు చేతులు తొడలమీద ఉంచుకోవాలి.


ఇప్పుడు కుడిచేతిని వెనుకకు మడిచి కుడిచేతి వేళ్లతో ఎడమ తొడ మీద ఉన్న కుడికాలి బొటన వేలిని పట్టుకోవాలి.

అలాగే ఎడమ చేతిని వెనుకకు మడిచి కుడిచేతి మీదుగా ఎడమ చేతి వేళ్లతో కుడి తొడపై ఉన్న ఎడమ కాలి తబొటనవేలిని పట్టుకోవాలి.

ఈ స్థితిలో శ్వాస సాధారణంగా తీసుకోవాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి యథాస్థితికి రావాలి.

ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.

ఉపయోగాలు:... ఛాతీ విశాలంగా మారుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

* పద్మాసనంలో ఉండే ఫలితాలు అన్నీ ఇందులోనూ ఉంటాయి.

* భుజాలకు, చేతులకు, మోకాళ్లకు బలం చేకూరుతుంది.

* వెన్నెముక నిటారుగా ఉండడానికి ఇది తోడ్పడుతుంది.

* ప్రాణవాయువు చక్కగా ప్రసరించి ధ్యానానికి తోడ్పడుతుంది.

* నడుము సన్నబడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.

* ఇంద్రియ నిగ్రహం పెరిగి ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
Read More

ఘనంగా శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆఖండ జోతి "నిర్వికల్ప జీవ సమాధి"ఘనంగా శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆఖండ జోతి "నిర్వికల్ప జీవ సమాధి" ఆరాధనోత్సవం 2015...
.
భోలోకము యందు మానవులు అధర్మ ప్రవర్తులై , పాపభీతి లేని వారై కడు మాయలతో మోసాలతో పలు పాపకార్యములు చేయుచుండగా భూదేవికి పాపభారము పెరిగి శ్రీ మహావిష్ణువుని మొరపెత్తుకొనెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు, బ్రహ్మా విష్ణు మహేశ్వరులతో సమయాలోచించి బ్రహ్మదేవుడు అన్నజయ్యగా, మహేశ్వరుడు సిద్దయ్యగా, శ్రీ మహావిష్ణువు వీరబ్రహ్మెంద్రస్వామిగా జన్మించి ప్రజాకోటి యందలి అజ్ఞ్యానoధకారములను పారాద్రోలుచూ కాలజ్ఞ్యానము వివరించుచూ శ్రీ మహావిష్ణువు వీరబ్రహ్మెంద్రస్వామిగా భవిష్యత్తు కాలజ్ఞ్యానమును ప్రజలకు అందజేసి, వారి సకలాభీష్టములను నెరవేరు విధముగా పంచాక్షరి మహామంత్రమును ఉపదేశించి మాతా శ్రీగోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు గా వేలుగొందేను.

ఈ కలియుగమున ఎవరైతే ఈ పంచాక్షరి మహామంత్రమును జపిస్తారో వారు ఈ కలియుగమున కలుగు ఘోర విపత్తుల నుండి రక్షింపబడతారు

"ఓం హ్రీం క్లీం శివాయ వీరబ్రహ్మణీ నమః "
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన కలిమాయ నుండి మనల్ని కాపాడును. శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానమును వినినవారికి సర్వపాపహరణం. శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర పారాయణము అష్టైశ్వర్య ప్రదాయిని.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దము లో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది , సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి.

కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మాండపురంలో క్రీస్తు శకం 1608న కాలజ్ఞానంలోని మరుగు వ్యాఖ్యల ఆధారంగా కార్తీక శుద్ధ ద్వాదశినాడు పరిపూర్ణాచార్యులు, ప్రకృతాంబలకు వీరప్ప శ్హయ్య జన్మించారు. ఆయన జన్మించగానే తండ్రిని కోల్పో య్యారు. తల్లి ప్రకృతాంబ తన కుమారుడ్ని సమీపంలో ఉన్న అత్రి మహామునికి అప్పజెప్పి ప్రాణాలు వది లింది. పాపాగ్ని పీఠానికి చెందిన యనమదల వీరభోజయ్యస్వామి ఆయన భార్య వీరపాపమాం బలకు సంతానం లేకపోవడంతో అత్రి మహాము నిని వేడుకోగా తన వద్ద వున్న బాలుడిని తీసుకొని పోయి పెంచుకోమని చెప్పాడట. వీరప్పయ్యకు 5వ ఏట విద్యాభ్యాసం జరిగింది. 14వ యేట వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కర్నూలు జిల్లా, బనగానపల్లె(హరిహరపురం)కు చేరి తపస్సు చేయడం ప్రారంభించారు. బనగానపల్లెలో మోతూబరి అయినటువంటి గరిమిరెడ్డి అచ్చమ్మగారింట గోవుల కాపరిగా చేరాడు. అక్కడే ఆవులను కాస్తూ సమీపంలోనే రవల కొండలో వున్న గుహలో కూర్చొని తాటాకుల మీద భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కాలజ్ఞానం గ్రంధంగా రాశారని తెలుస్తోంది.

ఈ ప్రపంచంలో కలియుగంలో 5 వేల ఎళ్లు దాటిన తర్వాత జరగబోయే వింతలను గురించి వీరబ్రహ్మంగారు తెలిపారు. అప్పటిలో బనగానపల్లె నవాబుకు తన మహిమలను చూపారు. అనంతరం కడప జిల్లా, బద్వేలు తాలూకలోని మైదుకూరు నియోజకవర్గంలో వున్న కందిమల్లాయపల్లెకు(ప్రస్తుతం బ్రహ్మంగారిమఠం) చేరి అక్కడి గ్రామ పెద్దల సహకారంతో ఒక కుటీరాన్ని నిర్మించుకొని గ్రామ రైతాంగానికి నాగలి, కర్రు, మొదలైన వస్తువులు చేసి ఆదర్శ కార్మికుడైయ్యారు. రాత్రి వేళ్లల్లో స్ధానిక సమీప గ్రామాల ప్రజలకు వేదాంతం భోదిస్తూ భవిష్యత్తు కాలజ్ఞానం వినిపించేవాడు. శిశ్యులు దూదేకుల కులానికి చెందిన వారు దళితులు వున్నారు. దళితులు, దూదేకుల కులాలకు చెందిన వారు కూడా ఆయన శిశ్యులుగా చేర్చుకోవడం చెప్పుకోదగ్గ విషయం.

కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్ద కొమ్మెర్ల గ్రామానికి చెందిన శివకోటయ్య ఆచారి కుమార్తె గోవింద మాంబను వివాహమాడారు. మైదుకూరు నియోజకవర్గం ముడుమాల(సిద్దయ్య గారిమఠం)కు చెందిన దూదేకుల సిద్దయ్యను శిశ్యునిగా చేసుకొని పర్యటన కొనసాగించారు. కడప నవాబుకు తన మహిమలను చూపించి హిందూ, మహమ్మదీయుల ఐక్యతకు కృషి చేశారు. కంది మల్లాయపల్లెకు చెందిన దళితులు కక్కయ్యను తన శిశ్యునిగా చేర్చుకున్నారు. అనంతరం కాలజ్ఞానాన్ని దేశం నలుమూలల ప్రచారం చేసి సంఘ సంస్కర్తగా ఖ్యాతిని పొందారు. 16వ శతాబ్దంలో వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ట వహించి కలియుగ దైవంగా వెలుగొందారు. 1993లో కందిమల్లాయపల్లెలో సజీవ సమాధి అయ్యారు. భౌతికంగా మన మధ్య లేనప్పటికీ సజీవ సమాధి అయిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి అయిన స్థలం నేడు బ్రహ్మంగారిమఠంగా ఒక పుణ్యక్షేత్రంగా వెలుగుతోంది.

బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞానంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు ..........

1) శ్రీ వీరభోగవసంతరాయల వారు 'విశ్వావసు' నామ సంవత్సరం (1965-1966) లో జన్మించి అశ్వత్ధామ, దత్తాత్రేయుల వారు, శ్రీ సనారీ విశ్వేశ్వర స్వామివారు,శ్రీ ఆచార్య నాగార్జునుల వారు, శ్రీ స్వర్ణ అమరలింగేశ్వర స్వామివారు, తదితర సిథ్థపురుషుల వద్ద సమస్త విద్యలు నేర్చి ఆ తరువాత పరమశివుడిని ప్రార్ధించి వారిచే 'దేవదత్త' మనే గుఱ్ఱమును, 'శుక' మనే చిలుకను, 'రత్నసారు' అనే ఖడ్గమును, కార్ముకము అనే విల్లును, అక్షయ తూణీరములును, పాశుపత అస్త్రమును (22-11-2007 నాడు), ఆశీస్సులను పొంది, తేది.09-09-2009 నాటినుండి బహిరంగంగా దుష్టశిక్షణ శిష్టరక్షణ ప్రారంభించుటకు నిర్ణయించుకున్నారు. ఈ తేది నుండి గ్రహముల ఆగ్రహానుగ్రహములు సమస్తం శ్రీ వీరభోగ వసంతరాయలవారి అధీనంలో ఉంటాయి. బ్రహ్మ వ్రాసిన వ్రాత అంతమై, ప్రజలు వారు చేసే పాప పుణ్యాలనుబట్టి పూర్వజన్మ ఫలితాలతో సహా ఈ జన్మఫలితాలు ఎప్పటికప్పుడు అనుభవంలోకి వస్తాయి.

2.ప్రమాధి నామ సం||(1999-2000) నుండి కరువుకాటకాలు, అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు విజృంభిస్తాయి.

3.తేది 13.04.2000 నాడు శ్రీ వీరభోగ వసంతరాయలు వారు విజయవాడలో ఇన్ద్రకీలాద్రిపై యున్న కనకదుర్గ దేవాలయాన్ని దర్శించారు. (బహుశా ఆ సం.లోనే వివాహము అయివుంటుంది).

4. అంతర్గత విస్ఫోటనములవల్లగానీ, తీవ్రవాదుల దాడులవల్లగానీ హైదరాబాదుకు, అణుసంస్ధలకు/రక్షణ సంస్ధలకు ప్రమాదము. ఏ అణుదాడి/అణుప్రేలుడు (అంతర్గత) ఐనా కర్కాటక మకర సంక్రమణముల మధ్య జరుగుతుంది. (2002 నుండి జరిగిన సంఘటనలు గమనార్హం). చావగా మిగిలిన వాళ్ళు రేగడి మట్టిలో చింతపండు కలుపుకుని బ్రతుక వలసి వస్తుంది, ఆచార్యా నాగార్జునుల వారు, ఆయన శిష్యుడు మందులు ఇచ్చి కాపాడుతారు.

5.సం.1987 నుండీ ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. రాబోయే సునామీ వల్ల దక్షిణేశ్వరమునుండి (కలకత్తా) శ్రీలంక దాకా సముద్రము 80 మైళ్ళు వెనుకకు వెళ్ళుతుంది. తద్వారా, కోణార్క వద్ద సూర్యుని రధసారధి అయిన అనూరుని దేవాలయం, విశాఖపట్నం వద్ద వైశాఖేశ్వరుని దేవాలయం, మోటుపల్లి వద్ద భద్రకాళీ సమేత వీరభద్ర దేవాలయం, శ్రీహరికోట వద్ద విగ్రహరూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల దేవాలయం, మొదలగు ఎన్నో దేవాలయాలు బైటపడతాయి.

6. తేది 09-04-2005 నుండే శ్రీ వీరభోగవసంతరాయలవారు సశరీరంగా దర్శనమిస్తున్నారు. తేది.04/10/2006 న మరియూ 04/09/2009 న శ్రీ స్వామివారు మహానంది సందర్శించారు. 09-09-09 కి ముందు శ్రీ వీరభోగవసంతరాయలవారు మాచర్లలోని చెన్నకేశవస్వామి దేవాలయము, యాగంటి, శ్రీకాళహస్తి, కుంభకోణం దేవాలయములు రోజుకు మూడుసార్లు దర్శించారు. ఇప్పుడు రోజుకు ఒక్కసారి మాత్రమే దర్శిస్తున్నారు. ఏ రోజున వారి సందర్శన ఆగుతుందో ఆ రోజున ఆయా దేవాలయములు దెబ్బతింటాయి లేదా కూలిపోతాయి.

7.కృష్ణా గోదావరి నదులమధ్య రక్తం ఏఱులై పారుతుంది (ప్రత్యేక రాష్ట్రం కోసం, నీటికోసం, మతకల్లోలాలవల్ల).

8.తేది.26-12-2011 న శ్రీ వీరభోగవసంతరాయలవారు సాధారణ పరిపాలకులుగా పట్టాభిషిక్తులౌతారు.

9.మూడవ ప్రపంచ యుధ్ధం 2046లో గాని, ఆ తర్వాత వచ్చే మకర సంక్రాంతి రోజు (గురు గ్రహము కుంభరాశిలో ఉండగా) అంతమవుతుంది కాబట్టి 2012లో కలియుగాంతం అవుతుందని అనుకోవటం అర్ధరహితం. 'నందన' నామ సంవత్సరం(2012-13)లో భయంకర ఉత్పాతములవల్ల లక్షలాది జనం నశిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు. భగవంతుని రాక ఊహించి, గ్రహములు, ఋతువులు గతి తప్పబోతుండటం గమనించి, మాయన్ కేలండర్ వ్రాసినవారు పంచాంగ గణితమును అక్కడితో ఆపివుంటారు.(మాయన్ కేలండర్ వ్రాసినవారు మయబ్రహ్మ వారసులని ప్రతీతి).

10)హస్త(12/09 నుండి 09/11 వరకు), చిత్త(09/11 నుండి 05/12 వరకు), స్వాతి నక్షత్ర 'శని' సంచారంవల్ల అతివృష్టి, అనావృష్టి సంభవిస్తుంది. ప్రళయాలవల్ల కోట్లాది మంది మరణిస్తారు.

11) కంచి, శృంగేరి, పుష్పగిరిలలో అనేక వింతలు పుట్టును. ఆ పీఠములకు గడ్డు కాలం. పీఠాధిపత్యములు విశ్వబ్రాహ్మణులకు తిరిగి చేరును.

12. శ్రీశైలములో పరుసువేధి (ఇనుము మొదలగువాటిని బంగారంగా మార్చునది) దొరికి బ్రహ్మంగారి మఠం చేరుతుంది.

13. ఉదయగిరి పర్వతము మీద సంజీవని దొరుకుతుంది.

14) నందన(2012-2013)లో శ్రీశైల మల్లిఖార్జునుని గుడిలో పొగ, మంటలు వచ్చును. శ్రీశైల మల్లిఖార్జునుడు సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడును. శ్రీశైల భ్రమరాంబ గుడిలోకి ఒక మొసలి వచ్చి 8 దినములుండి మేకపోతువలె అరచి మాయమగును. శివుని కంట నీరు కారును. బసవేశ్వరుడు ఱంకెవేసి కాలుదువ్వును. పుట్లకంబము మీద ప్రతిమ మాట్లాడును. కాలభైరవుడు మంత్రములు చదువును.

15) విజయ నామ సంవత్సరము(2013-14)లో కోట్లమంది మరణిస్తారు.

16. శ్రీస్వామివారి సైన్యంకోసం లక్షలాది గుఱ్ఱాలు యాగంటి గుహలనుండి వస్తాయి.

17. కంచి కామాక్షమ్మ ఉగ్రము వల్ల దక్షిణదేశము దొరలు, ప్రజలు నష్టమౌదురు. రామేశ్వరము వద్ద భయంకరమైన యుధ్ధం.

18.గుళ్ళలో దేవుళ్ళకు మూర్తిమంతములు వచ్చి ఊరూరా నాట్యమాడును. కంచి కామాక్షి గిఱ్ఱున తిరుగును. బిళం కామాక్షమ్మ కండలు కక్కును. గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడును. వినాయకుడు వలవలా ఏడ్చును. దేవతలు సాక్షాత్కారముగ ప్రజలతో మాట్లాడెదరు.

19. వినాయకుడు ఊరూరా తిరిగి వేదమంత్రములు చదువును.

20) తామే వీరభోగవసంతరాయలమని చాలామంది దొంగ సాధువులు వస్తారు.

21.సూర్యనంది భూకంపంలో నేలమట్టమౌతుంది.

22) యాగంటి, శ్రీశైలం, కుంభకోణంలలో గోవధ, మతకలహాలు, వేలాదిమంది బలి.

23) క్రోధి నామ సం.(2024-25)లో భారతదేశానికి యుధ్ధం. ఢిల్లీ పై బాంబుల వర్షం. దేశ రాజథాని ఢిల్లీనుండి ఆనెగొందికి మారుతుంది. అదే సంవత్సరం లో నెల్లూరు నీటమయమౌతుంది.

24) కాశీ విశ్వనాథుని దేవాలయము 40 రోజులు మూతపడుతుంది. శ్రీ కాళహస్తి, కుమారస్వామి, తిరుమల దేవాలయములు వారం రోజులు మూతపడుతయి. 120 దివ్య దేవాలయములు హిందూయేతర శక్తులచే ధ్వంసము చేయబడుతాయి. ఆ తర్వాత తిరుమల వన్యమృగములకు ఆలవాలమౌతుంది. తిరుమల వేంకటేశ్వర, కాళహస్తి, విజయవాడ కనకదుర్గ మూలవిరాట్ విగ్రహాలు కందిమల్లాయపల్లె చేరుతాయి.
25) కృష్ణానది వరదలతో అనకట్టలు, 14 నగరాలు కొట్టుకుపోతాయి. కృష్ణ నీరు కనకదుర్గ ముక్కుపోగు అంటుతుంది.

26) భారతదేశ ఆర్ధిక రాజధానిగా కందిమల్లాయపల్లె విలసిల్లుతుంది.

27. కంచికి పడమట కామధేనువు జన్మిస్తుంది.

28. నవనారసింహ క్షేత్రాలు, యాగంటి, ఆలంపూర్, బెల్లంకొండ, శ్రీశైలంలలో ఉన్న మహానిధులను తీస్తారు.

29. బాపల పంచాంగములు తలక్రిందులవును. వారు చెప్పే భవిష్యత్తు జరుగక పోవును.

30. ఆఱు విచిత్ర వ్యాధులు లక్షలాది మందిని కబళిస్తాయి.

31. కావేరీ తీరం వెంబడి కలహాలతో లక్షలాదిమంది మరణం.

32. భయంకరమైన తుఫానులు, వరదలవల్ల పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లలో కోట్లాదిమంది దుర్మరణం. భూకంపంవల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది.

33. ఒక వైశాఖ అమావాస్య నాడు విచిత్ర వ్యాదులతో అనేకమంది హతమౌతారు (బహుశా జీవ, రసాయన ఆయుధముల వల్ల కావచ్చు)

34. మక్కా మసీదు లో ఒక పంది ఉద్భవమై, ముస్లిములచే తరుమబడుచూ చివరికి విజయవాడ చేరుతుంది. అప్పుడు జరిగే కలహాలవల్ల లక్షలాది మంది మరణిస్తారు.

35.'శని' సంచారం - మీనరాశిలో ఉండగా మ్లేఛ్ఛులకు హాని, వృషభరాశిలొ ఉండగా ఈశాన్య దిశ నుండి వచ్చే విషపుగాలి వల్ల మరణాలు, మిధున రాశిలొ ఉండగా పాపులలో ఎక్కువమంది మరణిస్తారు (తేది.29-03-2025 నుండి 10 సంవత్సరములు పైబడి).

36. ఒక తోక చుక్క వల్ల భూభ్రమణములో మార్పువస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్టు కన్పిస్తాడు. తేది.02-08-2027 (సూర్యగ్రహణం) నాడు, సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు. ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణు మూర్తి దర్శనమిస్తాడు. ఇంకో తోక చుక్క 33 రోజులు కన్పిస్తుంది.

37) తేది.15-03-2035 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తమ విశ్వరూపం చూపిస్తారు. తేది.30/03/2035 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తన సైన్యంతొ మహాసంగ్రామానికి బయలుదేరుతారు. ఆనంద(2034-35), రాక్షస(2035-36) నామ సంవత్సరములలో పశ్చిమ దేశాలలో కోట్లాదిమంది హతమౌతారు, ఈ సమయంలోనే కలియుగధర్మం నాశనమౌతుంది.

38. దాదాపు 400 సంవత్సరముల క్రితం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిచే బనగానపల్లెలో చింతచెట్టు క్రింద భద్రపరచబడ్డ కాలజ్ఞాన తాళప్రతులు తేది.7/8-06-2036 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారిచే తీయబడి బహిరంగపరచ బడతాయి. ఆనాటి నుండి, వ్యక్తిగత, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానములో వ్రాయబడినట్లు యధాతధంగా జరుగుతాయి.

39) ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్దంవలన పింగళ (2037-2038), కాళయుక్తి (2038-39) మరియు రౌద్రి(2040-41) లలో కోట్లాదిమంది హతమౌతారు.

40) కులాంతర, మతాంతర వివాహాలు సర్వసామాన్యం అవుతాయి.

41) ఉత్తరాయణమందు ఉత్తరభారత దేశస్తులు దక్షిణ భారతావనికి తరలివస్తారు. అప్పుడు జరిగే కలహాలవల్ల కోట్లాదిమంది హతం.

42) తేది.24-05-2039 నుండి 21-06-2039 మధ్యలో వచ్చే భయంకర భూకంపంవల్ల అద్దంకి నేల మట్టమౌతుంది.

43) క్రీ.శ.2040లో 40 రోజులపాటు కాశీ వద్ద గంగానదిలో నీరు ఉండదు.

44) పండ్రెండు రోజులు గోదావరిలో చుక్కనీరు ఉండదు. 13వరోజున భయంకరమైన వరదలు వస్తాయి.

45) తేది.15/16-02-2041(రౌద్రి,మాఘ పౌర్ణమి)నాడు ఒక్కసారిగా ఏడు కోట్లమంది దుర్మరణం పాలౌతారు.

46) తేది 26/27-11-2044(రక్తాక్షి,మార్గశిర శుధ్ధ సప్తమి)నాడు, చెన్నపట్నం (మద్రాసు) లో, ఏడేండ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు, మూడు కాళ్ళు, నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజున మరణించబోయేముందు, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారికి కలి పురుషుడికి మధ్య జరగబోయే మహాయుధ్ధం (ది ఆర్మగెడ్డాన్) గురించి ప్రకటన చేసి మరణిస్తాడు. ఈ యుధ్ధం 19-01-2045 నుండి 16-02-2045 మధ్య మొదలౌతుంది. యుధ్ధాలు పరిసమాప్తి క్రీ.శ. 2060 తో అవుతాయి. ప్రళయాలు క్రీ.శ.2066 దాక కొనసాగుతాయి.

47. అమెరికాలో ఒక నగరం భూకంపంతో నేలమట్టమౌతుంది. ఆ విపత్తునుండి ఐదు కుటుంబాలు మాత్రమే బ్రతికి బట్టకడతాయి. ఇండో-మయా సంస్కృతి తిరిగి పునరుజ్జీవనమౌతుంది.

48. గోపురము కూలి కుంభుని (కుంభకోణం) రూపు మారుతుంది.

49. శైవులు వైష్ణవుల మధ్య కలహాలు. బ్రతుకు దుర్భరమై 1,11,000 మంది బ్రహ్మంగారి జీవ సమాధి వద్ద గండకత్తెరలతో తలలు తెగకోసుకుని ఆత్మాహుతి చేసుకుంటారు. ఏఱులై పాఱిన ఆ రక్తం బ్రహ్మంగారి జీవసమాధిని తాకుతుంది. జీవసమాధిని పగులగొట్టుకుని బైటకు వచ్చిన బ్రహ్మంగారు వారిని కాపాడుతారు.

50) అమావాస్యనాడు, ఉదయగిరి పర్వతముమీద, చక్రాంకితుడైన శ్రీమహావిష్ణువు దర్శనమిస్తాడు. సుదర్శన చక్రమును చూసి ప్రజలు ఆ రోజు చంద్రగ్రహణమని భ్రమపడతారు.

51) క్షిపణి, అణుదాడిలో హంపి (కర్నాటక) దెబ్బతింటుంది.

52) మాయాజంగాలు (రోబోట్ సైనికులు) వస్తారు.

53) వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమాణముగల మనుషులు పుడతారు.

54)ఊరూర పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి.

55) వాలి,సుగ్రీవుల ఖజానా వెలికి తీస్తారు. హనుమద్రామాయణము వెలుగులోకి వస్తుంది.

56) నాస్తికత్వము ప్రబలుతుంది. వావివరుసలు మరచి ప్రవర్తిస్తారు. ఒకరియాలు మరొకరి పాలగును.

57) ఐదేండ్ల నాగయ్య వేదాలు చదువుతాడు. ఇంకొక బాలుడు ప్రజలకు భవిష్యత్తు చెబుతాడు.

58) భారతదేశం ముక్కలౌతుంది. వింధ్య పర్వతముల నుండి సేతువు (రామేశ్వరము) మధ్య ప్రదేశము, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారి సహాధ్యాయి మరియు దళపతియైన ఒక వీరుని పరిపాలనలో ఉంటుంది (సామంత రాజ్యముగా).
59) వేంకటేశ్వరుని కుడిభుజము అదురును, విగ్రహము పగుళ్ళిస్తుంది, తిరుమలలో భూకంపము వస్తుంది. తిరుమలకు వెళ్ళే రహదారులన్నీ మూసుకు పోతాయి.

60) పుష్యమాసములో మ్లేఛ్ఛదేశాలకు హాని.

61) తేది.26-08-2054(భావ,శ్రావణ,బహుళ అష్టమి) నాడు, నదీనదములు పొంగి పల్లెలు, పట్నాలు దెబ్బతింటాయి.

62) జులై-ఆగష్టు,2055 మధ్య ఒక ఆదివారమునాడు, తిరునల్వేలి వద్ద పండుగ జరుగుతూండగా, అకస్మాత్తుగ వరదలొచ్చి వేలకొద్దీ జనం దుర్మరణం పాలౌతారు.

63) ధాత(2056-57)నామ సంవత్సరము వచ్చేప్పటికి వైశ్యులలో 25 గోత్రాలవారు మాత్రమే మిగులుతారు.

64) తేది.03-02-2058(ఈశ్వర,మాఘ,శు.దశమి) నాటికి అన్ని దేశాలు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత రాయలవారి వశమౌతాయి. ఆ తేది నుండి సమస్త భూమండలాన్నీ శ్రీశ్రీశ్రీ స్వామివారు 108 సంవత్సరములు పరిపాలిస్తారు. శ్రీవారి వారసులు వెయ్యి ఏండ్లు పరిపాలిస్తారు.

65) బహుధాన్య(2058-59)లో 25 పట్టణాలలో రక్తపాతం. అంతర్గత కలహాలు, విపత్తులు.

66) పార్ధివ(2065-66)లో కర్నూలుకు ఉత్తరాన ఒక దేవాలయములో వున్న వేపచెట్టుకు నెల రోజులు పూజ చేస్తారు. ఆ తర్వాత ఆ చెట్టునుండి వచ్చే విషపు గాలివల్ల వేలాదిమంది మరణిస్తారు.

67) నైతిక విలువలు మృగ్యమౌతాయి. విశృంఖలత పెరుగుతుంది.

68.)గోల్కొండ వద్ద గోవిందాపురములో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది.

69) బ్రాహ్మణులు సేవకా వృత్తితో జీవిస్తారు.

70) విశ్వబ్రాహ్మణులతో వచ్చిన ఒక వ్యాజ్యములో బ్రాహ్మణులు ఓడిపోతారు.

71) వన్యజీవులు ఊళ్ళ మీద పడి భీభత్సం సృష్టిస్తాయి.

72) రెండు బంగారు హంసలు ఊరూరా తిరుగుతాయి. వాటిని పట్టుకోవాలని చూసిన వారు అంధులౌతారు.

73) ఏనుగంత సైజులో ఉన్న ఎఱ్ఱ చీమలు భూమిమీద తిరుగుతాయి.

74) పంది కడుపున ఏనుగు జన్మిస్తుంది.

75) కొండపగిలి నిలువ నీడ లేక కనకదుర్గ కందిమల్లాయపల్లె చేరుతుంది.

76) అంగడిలో సరస్వతిని అమ్ముతారు.

77) సముద్రములు కలుషితమై జలచరములు చాలామటుకు నశిస్తాయి.

78) అహోబిళములోనున్న ఉక్కు స్తంభమునకు సన్నజాజులు పూస్తాయి.

79) పరుశురాములవారి లేక ఆచార్య నాగార్జునులవారి లేక సనారీవారి లేక సిధ్ధపురుషుల లేక పై అందరి శిష్యుడైన వ్యక్తి ఈ దేశ అప్పులు తీర్చి, నదీనదములను అనుసంధానము చేసి సస్యశ్యామలము చేస్తాడు.

80) మూడవ ప్రపంచయుధ్ధం ముగిసేనాటికి ఏడు ఊర్లకు ఒక ఊరు మిగులుతుంది.

81) తేది.09-04-2005(ఉగాది,పార్ధివ)నుండే శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారు తుది తీర్పులు ఇవ్వడం మొదలుబెట్టినారు. అవశ్య మనుభోక్తవ్యమ్ కృతంకర్మశుభాశుభం.

82) కాలజ్ఞాన గోవిందవాక్యము 19 ప్రకారము శ్రీ ఆల్లూరి సీతారామరాజు (శ్రీ అల్లూరి శ్రీరామ రాజు)బ్రిటీషువారిచే చంపబడలేదు. అదృశ్యుడైనట్లు మాత్రమే వుంది.
Read More

చతుర్ముఖ లింగం క్షేత్రం ... పశుపతినాథ్ ఆలయం .....చతుర్ముఖ లింగం క్షేత్రం ... పశుపతినాథ్ ఆలయం .....

ఈ ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు, శివుడు తన స్వరూపంలో చూడలని కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగి పోయి ఇక్కడ ఖననం చేయబడింది.శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని త్రవ్వగా శివ లింగం బయట పడింది.

ఇంకో కథ ప్రకారం నేపాల మహత్యం మరియు హిమవత్‌ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తుండగా దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగం గా ఉన్నదని ఇతిహాసం చెబుతారు.


ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన అధారాలు లేవు. గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ.753 సంవత్సరంలో ఈ ఆలయనిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది.. తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని,1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది.
దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి మరియు బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి.నాలుగు ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయబడి ఉంటుంది.పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉన్నది. ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని , ప్రధాన అర్చకుడిని మూల భట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ.దీనిని బట్టి ఈ ఆలయం ప్రాముఖ్యత మరియు ప్రధాన అర్చకుల అధికారాలు విఫులం అవుతాయి. మూల భట్ట(ప్రధాన అర్చకుడు) అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకి తెలియజేస్తుంటాడు. ఈ దేవాలయం తూర్పున వాసికినాథ్ దేవాలయం ఉన్నది.
నేపాల్ దేశ రాజధాని కాఠ్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉన్నది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు.భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉన్నది.

శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ మరియు జంతు బలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశము సంతాప సముద్రములో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు, పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు.

Read More

సిద్ధనాథ్ మహదేవ్ ..... అతి పురాతన శివాలయం .....సిద్ధనాథ్ మహదేవ్ ..... అతి పురాతన శివాలయం .....

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దేశంలోని వాణిజ్య ప్రాంతాల్లో ఒకటిగా వున్న నాభివూర్‌కు ప్రాంతానికి సమీపంలోని నేమవర్ అనే పట్టణనికి దగ్గర నర్మదా తీరంలో వెలసివున్న సిద్ధనాథ్ మహాదేవ్ ఆలయ ప్రాశస్త్యాం తెలుసుకుందాం. ఈ ఆలయం నర్మదా తీరంలోని అతిపురాతనమైన ఈ శివాలయం సిద్ధనాథ్ పేరుతో భక్తులకు సుపరిచితం. . ఈ ఆలయంలోని శివలింగాన్ని సనంద్, సనక్, సనాతన్, సనాత్ కుమార్ అనే నలుగురు సిద్ధ ఋషులు ప్రతిష్టించడం వల్ల ఈ ఆలయాన్ని సిద్ధనాథ్ ఆలయం అనే పేరు వచ్చినట్టు భక్తులు అభిప్రాయపడుతారు.


ఈ శివాలయాన్ని క్రీ.పూ.3094 సంవత్సరంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. ఆరంభంలో ఆలయ ముఖద్వారం తూర్పు దిశగా ఉండేదని, పంచపాండవుల్లో ఒకరైన భీముడు పశ్చిమవైపుకు తిప్పినట్టు చెప్పుకుంటారు.

ప్రతి రోజు ఉదయం.. నదీతీరంలోని ఇసుక మేటలపై అతిపెద్ద పాదముద్రికలు కనిపిస్తుంటాయి. ఇవి నలుగురు సిద్ధ ఋషుల పాద ముద్రలుగా ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తుంటారు. అంతేకాకుండా.. చర్మ వ్యాధులు ఉన్న వారు ఈ ఇసుకలో అంగప్రదక్షిణం చేస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని భక్తులు భావిస్తుంటారు.
Read More

సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అశ్వత్థ నారాయణుడిగా కొలువులందుకుంటున్న మహిమాన్విత క్షేత్రం విదురాశ్వత్థ. దేశంలోనే ఓ విలక్షణమైన పుణ్యక్షేత్రంగా అలరారుతున్న ఈ దివ్యథామం స్వామి లీలా విశేషాలతో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.సర్వదోష నివారణా మహిమాన్విత క్షేత్రం .......

సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అశ్వత్థ నారాయణుడిగా కొలువులందుకుంటున్న మహిమాన్విత క్షేత్రం విదురాశ్వత్థ. దేశంలోనే ఓ విలక్షణమైన పుణ్యక్షేత్రంగా అలరారుతున్న ఈ దివ్యథామం స్వామి లీలా విశేషాలతో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. విదురాశ్వత్థ క్షేత్రం మహిమాన్వితమైనది. అటు చారిత్రకంగానూ, ఇటు పౌరాణికంగానూ విశేషమైన ప్రాశస్త్యాన్ని తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది.

విదురాశ్వత్థ క్షేత్రం ఓ చిన్ని గ్రామం. మహాభారతంలో ధర్మజ్ఞుడ్నిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న విదురుడు ఈ క్షేత్రంలో కొంతకాలం నివసించడంవల్ల ఈ క్షేత్రానికి విదురాశ్వత్థ అనే పేరు వచ్చింది. అలాగే ఆ స్వామి ఇక్కడ ఒక అశ్వత్థ వృక్షం నాటి శ్రీహరి సేవలో తరించడంవల్ల ఈ క్షేత్ర ప్రాశస్త్యం మరింత పెరిగింది.

విదురాశ్వత్థ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ఆలయ ద్వారం కనువిందు చేస్తుంది. ఈ ద్వారం మీద అశ్వత్థ నారాయణస్వామివారి మూర్తి భక్తుల చూపు మరల్చనీయదు. ఈ ఆలయ ప్రాంగణం విశాలమైనది. ఈ ప్రాంగణమంతా నాగ శిలాప్రతిమలతో అదో నాగ లోకాన్ని తలపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయం ముందు వినాయకుని చిన్ని మందిరం ఉంది. అశ్వత్థవృక్షం త్రిమూర్త్యాత్మకమైనది. ఆ వృక్ష రాజంలో త్రిమూర్తులు మమేకమై ఉంటారు. దానిని స్ఫురణకు తెచ్చే విధంగా ఇక్కడ ప్రాకారాల మీద త్రిమూర్తుల మూర్తులను పొందుపరిచారు. గర్భాలయం ముందు భాగంలో పంచలోహ సమన్విత నాగ సర్పం ఉంది. స్వామి ఇక్కడ సర్ప రూపంగా కొలువై ఉండడంవల్ల ఇక్కడ నాగ సర్పాన్ని ఉంచారని చెబుతారు. గర్భాలయంలో ఒక పక్క విఘ్న నాయకుడు వినాయకుడు కొలువుదీరగా, మరోపక్క కుమారస్వామి, పరమేశ్వరులు ఆశీనులయ్యారు. ఈ మూర్తులకు సమీపంలో ఎతె్తైన పీఠం శ్రీ అశ్వత్థ నారాయణస్వామి శిలామూర్తి ఉంది. ఇదే ఆలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి వెనుక భాగంలో అశ్వత్థ వృక్షం కానవస్తుంది.

సాక్షాత్తు విదురుడు నాటిన వృక్ష రాజంగా దీనిని చెబుతారు. అయితే ఈ వృక్షరాజం 2001వ సంవత్సరంలో పక్కకు ఒరిగిపోవడంతో దానిని జాగ్రత్తగా కాపాడడానికి తగు చర్యలు చేపట్టారు. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వృక్షం నీడలో నారాయణ స్వామివారి మూర్తి ఒకటి కానవస్తుంది. ఈ వృక్ష రాజాన్ని దర్శించినంత మాత్రంచేతనే అనంతకోటి పుణ్యఫలాలు సొంతమవుతాయని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయ ప్రాంగణంలో కుడివైపు భాగంలో అభయాంజనేయస్వామివారి మందిరం ఉంది. ఇందులో కొలువుదీరిన ఆంజనేయస్వామివారు సింధూర వర్ణ శోభితంగా దర్శనమిస్తారు. తిరునామధారియైన అభయాంజనేయస్వామి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు.
దీనికి సమీపంలోనే ముడుపుల చెట్టు ఉంది. ఈ ఆలయానికి వచ్చిన కొంతమంది భక్తులు ఇక్కడ ముడుపులు కడతారు. స్వామివారి లీలా విశేషాలకు ఇది తార్కాణంగా నిలిచింది. దీనికి సమీపంలోనే పూర్వకాలం నాటి శివాలయం ఉంది. శివాలయంలో ఉన్న పరమేశ్వర లింగ దర్శనం మాత్రం చేతనే పంచపాతకాలు సైతం మటుమాయమవుతాయంటారు. ఇక్కడ స్వామికి చేసే అర్చనాది కార్యక్రమాలన్నీ విశేష ఫలితాలనిస్తాయంటారు.

ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న మరో ఆలయం శ్రీ నవగ్రహాలయం. నవగ్రహాది దేవతలు కొలువుదీరిన ఈ ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నవగ్రహ దోష నివారణ పూజలు చేయించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామివారి మందిరం ఉంది. ఈ మందిరంలో వెంకటేశ్వరస్వామి తన ఇరు దేవేరులతో కలసి కొలువుదీరాడు.

విదురాశ్వత్థ శ్రీ అశ్వత్థ నారాయణస్వామి క్షేత్రం సర్వదోష నివారణా క్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది. అలాగే వివాహం కానివారు, సంతానం లేనివారు ఇక్కడ ఈ ప్రాంగణంలో నాగదేవత శిల్పాన్ని ప్రతిష్టించి పూజిస్తే, వెంటనే అభీష్ట సిద్ధి కలుగుతుందన్న నమ్మకం భక్తుల్లో ప్రబలంగా ఉంది. ఈ కారణంగానే భక్తులు ప్రతిష్టించిన వేలాది నాగ శిల్పాలు ఇక్కడ ఈ ప్రాంగణంలో దర్శనమిస్తాయి. అలాగే పర్వదినాలు, పండుగలపుడు ఈ ఆలయంలోకి సర్పాలు వచ్చి భక్తులను కటాక్షిస్తాయని భక్తులు చెబుతారు. విదురాశ్వత్థ క్షేత్రం చారిత్రకంగా కూడా ప్రసిద్ధిచెందింది.

దక్షిణ భారత దేశపు జలియన్‌వాలాబాగ్ జరిగిన ప్రదేశంగా దీనిని చెబుతారు. స్వాతంత్య్ర సమరంలో భాగంగా జరిగిన మారణకాండలో ఈ గ్రామానికి చెందిన పది మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడ అశువులు బాశారని ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఉదంతానికి గుర్తుగా ఇక్కడ ఒక స్మారక స్థూపాన్ని కూడా నెలకొల్పారు. కర్ణాటక రాష్ట్రం, చిక్‌బళ్ళాపూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం గౌరిబిదనూర్ పట్టణానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో ఉంది. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి బెంగళూరునుంచి నేరుగా చేరుకోవచ్చు. అలాగే హిందూపురం వరకూ వచ్చి అక్కడ నుంచి గౌరీబిదనూరు మార్గంలో ఉన్న ఈ క్షేత్రాన్ని సులువుగా చేరుకోవచ్చు. విదురాశ్వత్థ క్షేత్రం చిన్న గ్రామం. కేవలం స్వామివారి లీలా విశేషాలతో మాత్రమే ఇది ఖ్యాతికెక్కింది. ఇక్కడ ఈ క్షేత్రంలో బసచేయడానికి ఎలాంటి సదుపాయాలు లేవు. అలాగే భోజన సదుపాయం కూడా ఇక్కడ అంతంత మాత్రంగానే ఉంటుంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని సందర్శించాలనుకునే వారు వారివారి ఏర్పాట్లను చేసుకుని మరీ వెళ్ళాల్సి ఉంటుంది.Read More

Powered By Blogger | Template Created By Lord HTML