గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 16 April 2015

ప్రకృతి సిద్దంగా మూడు రకాల కాలమానాలు కనిపిస్తునాయిప్రకృతి సిద్దంగా మూడు రకాల కాలమానాలు కనిపిస్తునాయి
అవి 1) రోజు 2) నెల 3) సంవత్సరం,
వీటికి కారకులు సూర్యుడు , చంద్రుడు .రోజు ప్రమాణం సరాసరిగా 24 గంటలు అనేది అందరికి తెలిసిందే . అంటే సూర్యోదయం నుండి సూర్యోదయం . అమావాస్యకి ,అమావాస్యకి మద్య సరాసరి వ్యవధి 29.530 రోజులు ఇది చంద్రమానం . అలాగే సౌరమానం లో 30 రోజులు మాసము .
రెండు వసంత విషవత్తులు మద్య కాలం ఒక సాయన సంవత్సరము అంటే 365.242199 రోజులు . ఇవన్నీ పూర్ణ సంఖ్యలు కాకుండ భిన్నములు అవడంతో వీటి మద్య పొత్తు చాల కష్టసాద్యం .
1 సంవత్సరం అంటే 12 మాసాలు వుంటాయి . అలాకాక 12 చాంద్రమాసాలు అనుకుంటే మొత్తం లెక్కలన్నీ తేడా వస్తున్నాయ్ . వీటిని లెక్కించటానికి మూడు మార్గములు లేక పద్దతులు వున్నాయి.అవి :
1) చాంద్రమాన పద్ధతి 2) సౌరమానం 3) చాంద్ర , సౌర మన విధానం .


1) చాంద్రమాన పధ్ధతి : ప్రపంచమంతా అన్ని జాతుల వారు మొట్ట మొదట ఉపయోగించిన పధ్ధతి చాంద్రమానం . ఎందుకంటె చంద్ర కళలలో కనిపించినంత బేధము సూర్యునిలో కనిపించక పోవటమే .
ఈ విధంగా 12 చాంద్రమాన మాసాలు సంవత్సరం అనుకుంటే 12x 29.530 = 354 రోజులు . సౌర సంవత్సరం 365.2421 ( 6 1/4 గంటలు ) . దీనికి తేడా 11 1/4 రోజులు అంటే ఏడాదికి 11 1/4 రోజులు చంద్రుడు వెనుక పడిపోయాడు . ఋతువులు అన్ని సూర్యుడుని బట్టి ఏర్పడినవే . మానవుడి జీవన సరళి అంతా ఋతుచక్రం పైనే ఆధారపడి వుంది . అందువల్ల కేవలం చంద్రమానం మాత్రమే అనుసరించలేము .

2) సౌర పంచాంగం : చంద్ర కళల తో సంభంధం లేకుండా సౌరమానము అనుసరించడమే . సంవత్సరం పొడవును నిర్ణయించి దాని ఆధారంగా 12 మాసాలను నిర్ణయించు కోవటం . ఇందులో చంద్రునికి ఏ సంభంధం లేదు . ఇలా చేయటం వల్ల కొన్ని ప్రత్యెక దినాల్లో చేయవలసిన కార్యక్రమాలు,నియమాలు , పూర్వకాలంలో యజ్ఞయాగాది క్రతువులు జరగవు . ఎందుకంటె చంద్రునితో సంభంధం పెట్టుకోలేదు కనుక . కనుకనే దీనికి పూర్తి ప్రాధాన్యత లభించలేదు .

3) చాంద్ర , సౌర పంచాంగం : పై రెండు ఇబ్బందులను అధిగమించటానికి గాను చాంద్ర , సౌరమానాలను సమన్వయ పరచి తాయారు చేసినది ఇపుడు మనము ఉపయోగిస్తున్నది ఈ పంచాంగమే .
ఇందులో చంద్ర కళలను అనుసరించి మాసాలు (నెలలు) వుంటాయి . సూర్య గమనం ఆధారంగా సంవత్సరం వుంటుంది . వీటి మద్య సమన్వయ పరచటానికి అవసరం అయనప్పుడు అధిక మాసాలను , ఒక్కో సారి క్షయ మాసాలు ఏర్పరిచారు .

ఈ క్రింది వివరణతో మీకు సులువుగా అర్ధమవుతుంది :

చాంద్ర సంవత్సరానికి సౌర సంవత్సరానికి గల 11 1/4 రోజుల భేదమును 3 సంవత్సరాలలో 33 3/4 రోజులు అవుతుంది . అందువల్ల ప్రతి 3 సంవత్సరాలకు 1 నెల అధిక మాసం ఏర్పరిచారు . మిగిలిన 3/4 రోజులను 24 సంవత్సరాలు అయ్యేటప్పుటికి 1 నెల అవుతుంది . అపుడు మరొక అధికమాసం ప్రవేశపెడితే అది పూర్తవుతుంది. అధిక మాసం వచ్చిన నేలను అధిక మాసం అని తర్వాత వచ్చిన నేలను నిజ మాసం అని అంటారు .

క్షయ మాసం :
ఇలా అధిక మాసాలు చేర్చుకుంటూ వెళితే కొంత కాలానికి ఒక మాసంలో రెండు సంక్రాంతులు వస్తాయి . అప్పుడు ఆ మాసాన్ని తొలగిస్తారు . దీనినే క్షయ మాసం లేదా లుప్తమాసం అంటారు . ఆ లుప్త మాసాలు కార్తీక , మార్గశిర , పుష్యమాసాలలో వస్తాయి . ఎందుకంటే ఈ మాసాలలో భూమి అండవృత్తపు సమీపబిందువు వద్ద వుండి వేగంగా నడవడంతో సూర్యుడు ఒక్కొక రాశిని త్వరత్వరగా దాటేస్తాడు . కనుక ఈ రెండు నెలలలోనే సంక్రాంతులు వస్తాయి . క్షయ మాసానికి రెండువైపులా చెరో అధిక మాసం వస్తాయి . ఈలుప్త మాసాలు 141 సం.కు ఒక్కొకసారి 19 సంవత్సరాలకు , 122 ఏళ్ళకు వస్తాయి అని భాస్కరాచార్యులు అన్నారు .
ఇది చాంద్ర , సౌర మానాలు మరియు అధిక మాస , లుప్త మాస , క్షయ మాసాల గురించి వివరణ .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML